11, జూన్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 72 (కామిని కుచమధ్యమందు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 16
సమస్య -
"కామిని కుచమధ్యమందు గరుడుం డాడెన్"
కం.
చేమంతి చెట్టు పొంతను
భామామణి నిదురవోవఁ బయ్యెట జాఱన్
రోమావళి పామో యని
కామిని కుచమధ్యమందు గరుడుం డాడెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

13 కామెంట్‌లు:

 1. అయ్యా గురువుగారూ వెంకన్న గారి భావనా పటిమ, పూరణ నిరుపమానాలు.

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !

  01)
  ___________________________________

  ప్రేమగ పతి తెచ్చిచ్చిన !

  కామాక్షి ధరించి మెడను - గరుడ పతకమున్

  గ్రామంబున నడయాడగ

  కామిని కుచ మధ్య మందు - గరుడుం డాడెన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 3. భూమిని నిలుపగ , సినిమా
  'కామిని' చిత్రమ్ము పరచ, కామిని యెదపై
  పామట చరచర జేరగ
  కామిని కుచ మధ్య మందు, గరుడుం డాడెన్!

  రిప్లయితొలగించండి
 4. వసంత కిశోర్ గారూ,
  ఈ మధ్య మీరు చేసిన పూరణలలో దీనిని ఉత్తమమైనదిగా ఎన్నుతున్నాను. చాలా బాగుంది. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. మామిడి పండ్లను పోలెడి
  భామిని కుచముల నడుమున పక్షుల టాటూ
  గోముగ వేయించుకొనిన
  కామిని కుచమధ్యమందు గరుడుం డాడెన్!!

  రిప్లయితొలగించండి
 6. శంకరార్యా ! ధన్యవాదములు !
  మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 7. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. నా పూరణ ...

  తామో శ్రీవైష్ణవులట!
  ప్రేమను సుతునకు గరుడుని పేరిడెను; సుతుం
  డామె యొడిఁ బాలు ద్రాగగ
  కామిని కుచమధ్య మందు గరుడుం డాడెన్.

  రిప్లయితొలగించండి
 9. శంకరార్యా!గరుడుని చంటి వాడిని చేసి ఆడించారు. అద్భుతంగా ఉంది

  రిప్లయితొలగించండి
 10. శంకరార్యా ! సొగసైన పూరణ !
  గరుడుడి నొడిలో కూర్చుండ బెట్టి పాలు కూడా తాగించారు !

  రిప్లయితొలగించండి
 11. గురువుగారూ మాతృత్వము తొణికిస లాడే పూరణ నిచ్చారు.
  అభినందనలు.

  రిప్లయితొలగించండి