2, జూన్ 2011, గురువారం

సమస్యా పూరణం -351 (మగువను బెండ్లాడె మగువ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మగువను బెండ్లాడె మగువ మరు లుదయించన్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

 1. శంకరార్యా! మీరు స్వస్థులయి బ్లాగున పున:ప్రవేశము చేసినందులకు ఆనందముగానున్నది.పనివత్తిడి వలన రెండు రోజుల తరువాత ఈ రోజే బ్లాగు చూచుట జరిగినది.

  మగువా ! నువు నా ప్రాణము
  తగునా? నాప్రేమ కాల దన్నగ నన; ప్రే
  మగ జూచు పరీక్ష గెలువ
  మగువను; బెండ్లాడె మగువ మరులుదయించన్!

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !

  01)
  ___________________________________

  మగువను సుతునిగ బెంచిరి !
  అగజాత పతిని దలంచి - అంబకు పెండ్లిన్
  తెగువగ జేసిన ! యంతట
  మగువను బెండ్లాడె , మగువ - మరు లుదయించన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 3. స్వలింగ వివాహాన్ని కోర్టులు కూడా సమర్థించిన నేటి
  అస్థవ్యస్థ పరిస్థితులలో ఒక మగువ :

  02)
  ___________________________________

  మగువల తక్కువ యేమది ?
  మగవారల యెక్కువేమి ? - మారిన మగువే
  మగవారిని కాదని యొక
  మగువను బెండ్లాడె , మగువ - మరు లుదయించన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 4. మగువల వేషము వేసెడు
  మొగిలయ్యకు, యూరి పడచు భూలక్ష్మికినిన్-
  లగనము జరుగ - జను లనిరి;
  "మగువను బెండ్లాడె మగువ మరు లుదయించన్ !"

  రిప్లయితొలగించండి
 5. ఖగపతి తననే వలచిన
  మగువను బెండ్లాడె; మగువ మరు లుదయించన్
  సిగలో జాజులఁ దాల్చెను
  మొగమున నవ్వులు విరియఁగఁ మోహనుఁ జేరెన్.

  ఖగపతి = గరుత్మంతుని స్వామి= శ్రీహరి

  రిప్లయితొలగించండి
 6. తగ గోపాలుడు ప్రియమగు
  మగువను బెండ్లాడె! మగువ మరులుదయించన్
  నిగమాంత నుతుని చేకొనె!
  వగపుడుగన్ మదిని జాంబ వంతుడు మురిసెన్

  రిప్లయితొలగించండి
 7. సెగ దాకెనేమొ రాగపు,
  నగు మోమునుజూచెనేమొ,నారిని మెచ్చెన్,
  మొగమాట పడక నడిగెను
  మగువను; బెండ్లాడె మగువ మరులుదయించన్!!!

  రిప్లయితొలగించండి
 8. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఉదయాన్నే క్రొత్త పోస్ట్ పెట్టి, నిన్నటి మీ పూరణలను వ్యాఖ్యానిద్దామని కూర్చోగానే "పవర్ కట్!". అప్పుడు పోయిన కరెంటు ఇప్పుడు వచ్చింది. ...

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ధన్యవాదాలు.
  పరీక్షలో తనను గెల్చిన వానిని మగువ పెండ్లాడిన మీ పురణ బాగుంది. అభినందనలు.

  వసంత కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలూ వైవిధ్యంగా అలరించాయి. బాగున్నాయి. అభినందనలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  మందాకిని గారూ,
  మి పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  "ఖగపతి" అనకుండా "ఖగగమనుడు తా వలచిన" అంటే బాగుంటుందేమో?

  రిప్లయితొలగించండి
 9. మిస్సన్న గారూ,
  ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.

  మంద పీతాంబర్ గారూ,
  మీ పురణ చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. నగుమోము తోడ పురుషుడు
  మగువను బెండ్లాడె; మగువ మరు లుదయించన్
  తగుమాట లాడ పురుషుని
  నగుమోము కృశించె నోహొ నగలన్ చీరల్

  రిప్లయితొలగించండి
 11. పగలును పంతము వ్యధలును
  మగవారివి సొత్తులనెడి మాయను బడుచున్
  తగవులు తీరున విధమని
  మగువను బెండ్లాడె మగువ మరులుదయించన్

  రిప్లయితొలగించండి