అయ్యా ! వివాహ వేదికలు యిప్పటి కుర్రాళ్ళ యిష్టం ! కాదనడానికి మనమెవరం ? అంటే మాత్రం వింటారా ?
01) ______________________________
నీటిలోన నొకడు - నింగినం దొకండు గాలిలోన మరియు - కారులోన ! కోరి చేసి కొనిన - కొత్త దంపతులకు వల్ల కాడు లో , వి - వాహ మయ్యె ! ______________________________
నిఖిల జగము శివుని నెలవట, లోకపు
రిప్లయితొలగించండివల్లకాడులో వివాహమయ్యె
జనుల కిచట, నీశుఁ జల్లని కరుణయు
నెల్ల కాలమందు నిలిచియుండు.
'కాడు' గ్రామ మందు కవిత,కృష్ణ ల ప్రేమ
రిప్లయితొలగించండిపెళ్లి కడ్డు పడిరి పెద్ద లంత
స్నేహి తులును పూని చేసిన చర్యల
వల్ల; 'కాడులో' వివాహ మయ్యె !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అయ్యా ! వివాహ వేదికలు యిప్పటి కుర్రాళ్ళ యిష్టం !
కాదనడానికి మనమెవరం ? అంటే మాత్రం వింటారా ?
01)
______________________________
నీటిలోన నొకడు - నింగినం దొకండు
గాలిలోన మరియు - కారులోన !
కోరి చేసి కొనిన - కొత్త దంపతులకు
వల్ల కాడు లో , వి - వాహ మయ్యె !
______________________________
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిలోకపు వల్లకాడులో పెండ్లి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
వసంత కిశోర్ గారూ,
వింత పెళ్ళిళ్ళ విశేషాలతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
సత్య ధర్మ వ్రతుడు సత్య హరిశ్చంద్రు
రిప్లయితొలగించండిడెచటి కేగె ధర్మ రుచుల దెల్ప,
శివుని విల్లు విరువ శ్రీరాము సీతకు,
వల్లకాడులో, వివాహమయ్యె.
రుచుల = కాంతివంతము, ప్రకాశము,
కాటికాపరి తన కన్యక పెండ్లిని
రిప్లయితొలగించండినిజగృహమున సేయ నిశ్చయించి
వరుని వెదకి తేవ పదుగురు మెచ్చగ
వల్లకాడులో వివాహ మయ్యె
వద్దు పెళ్లివద్దు వల్లకాడునవద్దు
రిప్లయితొలగించండితగిన చోటు గాదు తమకు ననిన,
గౌరి శంకరుండు గలచోటదేనన
వల్లకాడులో వివాహ మయ్యె
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిక్రమాలంకార పద్ధతిలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
"ధర్మవ్రతుడు" అన్నప్పుడు "ర్మ" గురువవుతుంది. "ధర్మరతుడు" అంటే సరి.
నాగరాజు రవీందర్ గారూ,
కాటికాపరి కూతురి పెళ్ళి ఘనంగా జరిపించారు. ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండివద్దు వద్దంటూనే వల్లకాడులో పెళ్ళి జరిపించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
ధన్యవాదములు గురువర్యా.
రిప్లయితొలగించండిపల్ల కీలు వద్దు పదిమంది వలదంద్రు
రిప్లయితొలగించండివల్ల భుండు వచ్చు పెళ్లి కేమొ
కొల్ల పెట్టు వాడు అల్లరి చేయగ
వల్ల కాడులొ వివాహ మయ్యే !
శ్రమపడు కార్మికుడొక్కడు
రిప్లయితొలగించండితమ బిడ్డల బాగు కోరి తాపములోర్చెన్
క్రమముగ బరువులు మోయగ
చెమటలు గారినవి మేని శీతలరాత్రిన్.