25, జూన్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 86 (నిప్పున నొక చేరెఁడంత)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 30
సమస్య -
"నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్"
కం.
కుప్పించి వెలుగు దూఁకిన
గొప్ప ములిదె నాటె నిపుడు; కోమలి త్వరగా
నుప్పుఁ గొనిరమ్ము కాఁతము
నిప్పున; నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్.
[వెలుగు = కంచె; ములిదె = ములు (ముల్లు) + ఇదె]
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

16 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    01)
    _____________________________________

    చప్పున పప్పును పెట్టగ
    నిప్పున !నొక చేరెడంత - నెత్తురు గాఱెన్ !
    గొప్పది యౌ మేకొక్కటి
    గుప్పున నా కాలియందు - గుచ్చు కొనంగా !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  2. నిప్పులు గ్రక్కుచు వెడలగ
    నప్పుడు మన రామరాజు, అగ్ని కణంబై !
    చప్పున గాల్చగ రూథర్;
    నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్!!

    రిప్లయితొలగించండి
  3. శాస్త్రిగారూ, మంచి కల్పన, పద్యం బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. చప్పున కట్టెల పొయ్యిన
    గుప్పున మంటలెగయంగ, గోముగ లాగన్
    ముప్పున కట్టియ గుచ్చుక
    నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గుప్పెడు భస్మముఁ దెమ్మిటు
    నిప్పున,నొక చేరెడంత; నెత్తుఱుఁ గాఱెన్
    చప్పునఁజల్లుట మేలగుఁ
    తప్పును ముప్పును, మరింకఁదామసమేలా!

    డాక్టర్లను పక్కన ఉండగా, నెత్తుఱు కు బూడిద పూస్తే ముప్పు తప్పుతుందని చెప్పుట సాహసమే కాదు, దుస్సాహసం. :)

    రిప్లయితొలగించండి
  7. మందాకిని గారూ,
    నిస్సందేహంగా మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. గప్పున లంకా నగరం
    బప్పట్టున కాలుచుండ నసురుల గృహముల్
    టప్పున ప్రేలుచు పైబడి
    నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్

    రిప్లయితొలగించండి
  9. మిత్రుల పూరణలు చక్కగా యున్నాయి.

    తప్పుడు పలుకులు భూసుత
    దప్పని దాఁ నెన్న కుండ తప్తయు నగుచున్
    నిప్పుల నడువగఁ జూడ్కుల
    నిప్పుల నొక చేరెడంత నెత్తురు గాఱెన్ !

    - గన్నవరపు నరసిం హ మూర్తి

    రిప్లయితొలగించండి
  10. నిప్పులు చెరిగెడి యెండన
    గప్పున బోవంగ నెంచి చెప్పులు లేకన్ !
    చప్పున తగిలెను చెకుముకి
    నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్ !

    రిప్లయితొలగించండి
  11. చప్పున పండును కోసే
    టప్పుడు చూపెట్టు వ్రేలు ఠక్కున దెగె ; ఛీ !
    యిప్పుడె విసురుము చాకును
    నిప్పున ; నొక చేరెడంత నెత్తురు గాఱెన్ !

    రిప్లయితొలగించండి
  12. శంకరార్యా ! ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతిశాస్త్రిసోమవారం, జూన్ 27, 2011 11:40:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    చప్పిడి రొట్టెను గాల్చితి
    నిప్పున, నొకచారెడంత నెత్తురుగారెన్
    గుప్పున కంటకమొక్కటి
    నొప్పించుచు గ్రుచ్చుకొనగ నుదుటన నాకున్

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘చూడ్కుల నిప్పు’ చక్కని ప్రయోగం. బాగుంది. అభినందనలు.

    రాజేశ్వరక్కా,
    చక్కని ఊహతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో యతి తప్పింది. అక్కడ ఏమంటే బాగుంటుంది? ‘చెంగున దూకన్" అందామా?

    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి