29, జూన్ 2011, బుధవారం

సమస్యా పూరణం -377 (కుత్తుకలు గోయువానికి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కుత్తుకలు గోయువానికి కోటి నుతులు.

17 కామెంట్‌లు:

 1. ధర్మ సంస్థాప నార్థమ్ము ధరణి యందు
  నవతరించుచు శిష్టుల నాదుకొనుచు
  తప్పు దారిన బోయెడు దనుజకోటి
  కుత్తుకలు గోయువానికి కోటి నుతులు!

  రిప్లయితొలగించండి
 2. వేద విహితుల పీడించి, విడక నొరుల
  కెల్ల హానినిఁ జేయుచుఁ; కీడు గాను
  ధాత్రికిని చరియించెడి దనుజ సంతు
  కుత్తుకలుగోయువానికి కోటినుతులు

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  01)
  _____________________________________

  కండ కావర మెక్కువౌ - కరటి వారి
  కామ గర్వాంధ సహితులౌ - కాపురుషుల
  కువలయాక్షుల నేడ్పించు - కూళ జనుల
  కుత్తుకలు గోయువానికి - కోటి నుతులు !
  _____________________________________

  రిప్లయితొలగించండి
 4. అబలలను, నిస్సహాయుల, నార్ష ధర్మ
  నిరతులను, పసివారిని కరుణ మాలి
  కుత్తుకలు గోయువానికి కోటి నుతులు
  భూత దయ వాన్కి నేర్పుత భూత పతియె.

  ( ' దుర్మార్గుడా నీకు కోటి దండాలు. మా జోలికి రాకురా, దేవుడే నీకు మంచి బుద్ధి నివ్వాలి '. అంటాం కదా. ఆ భావం తో నాన్న మాట)

  రిప్లయితొలగించండి
 5. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 29, 2011 10:05:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  దేశ రక్షణ కోసమై క్లేశములకు
  నోర్చి సరిహద్దు లందున నుండువాడు
  ధైర్యసాహసమున శతృదేశ కుటిల
  కుత్తుకలు గోయువానికి కోటి నుతులు

  రిప్లయితొలగించండి
 6. guruvu gaariki వందనములు
  కలియుగములోన కండలు గలిగియున్న,
  నీకు నూరు జనులు జేరి నలుగు బట్టు
  ఖలుల కిచ్చు గూరిమితోడ కానుక,మరి
  కుత్తుకలు గోయు వానికి కోటి నుతులు !

  రిప్లయితొలగించండి
 7. గురువు గారికి నమస్కారములు, మీ కళాసేవకు శతకోటి వందనములు జేయుచూ,భావము భాగుగ లేదని కొద్దిగా మార్చి

  కలియుగాన కలిమి అండ గలిగి యున్న
  కన్య ధన మానములకు ఘాటు బెట్టి
  దిరుగగ ఖలులు, కీర్తించ దనుజకోటి,
  కుత్తుకలు గోయు వానికి కోటి నుతులు!

  రిప్లయితొలగించండి
 8. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, జూన్ 29, 2011 7:31:00 PM

  కన్నవారిని హింసించు కఠిన హృదయు,
  దొడ్డి దారిన పైకము దోచు వారి,
  ద్రోహచింతన కలిగిన దుష్ట జనుల
  కుత్తుకలు గోయువానికి కోటి నుతులు.

  రిప్లయితొలగించండి
 9. గో్లి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘పరిత్రాణాయ సాధూనాం ... ’ శ్లోక భావానికి చక్కని పద్యరూపం ఇచ్చారు. చాలా బాగుంది. అభినందనలు.

  మందాకిని గారూ,
  మీరూ ‘వినాశాయ చ దుష్కృతాం ..’ అంశాన్నే తీసుకొని మంచి పద్యం చెప్పారు.అభినందనలు.

  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. ఇప్పుడు సజ్జనులను కాక దుర్జనులను నుతించే కాలం వచ్చింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. శ్రీపతి శాస్త్రి గారూ,
  ఉత్తమమైన భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
  ‘శతృదేశకుటిల కుత్తుకలు" .. ?
  ‘సాహసమును జూపియు శత్రుసైనికాళి’ అందాం.

  వరప్రసాద్ గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. సవరించిన తర్వాత కూడ భావం కొద్దిగా గందరగోళంగా ఉంది. ‘ఘాటు బెట్టి’..?

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 29, 2011 10:55:00 PM

  గురువుగారికి ననస్కారములు. ఈనాటి నా పూరణ నాకె నచ్చలేదు.3వ పాదంలో యతి కుదరలేదు. భావం సరిపోలెదు.సవరణ చేద్దమనుకొన్నా పదాలు కుదరలేదు. ఇక మీపైననే భారంవేసినాను. చక్కని సవరణ చేసినారు. చాలా చాలా ధన్యవాదములు. --- శ్రీపతిశాస్త్రి

  రిప్లయితొలగించండి
 12. అఖిల జనులకు మాన్యుడే అన్న దాత
  అన్న దాత కన్న నెవరు మిన్న కారు
  నారుబోయు వానికి, పండిన వరి పైరు
  కుత్తుకలు గోయువానికి కోటి నుతులు

  రిప్లయితొలగించండి
 13. వసంత కిశోర్ గారూ,
  మన్నించాలి. మీ పద్యం నా దృష్టికి రాలేదు ఎందుకో. ఇలా ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు జరిగింది.
  మీ పూరణకేం? సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.

  జిగురు సత్యనారాయణ గారూ,
  వైవిధ్యమైన పూరణలు ఇవ్వడంలో మీది అందె వేసిన చేయి. అద్భుతమైన పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. జి యస్ యన్ గారూ ! కర్షకుని పై జేసిన మీ పూరణ ఆకర్షణీయముగా నున్నది.

  రిప్లయితొలగించండి