3, జూన్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -352 (కర్ణు ననిలోనఁ జంపె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కర్ణు ననిలోనఁ జంపె రాఘవుఁడు చెలఁగి.

9 కామెంట్‌లు:

 1. వేన వేల రక్కసులను, వీర కుంభ
  కర్ణు ననిలోనఁ జంపె రాఘవుఁడు, చెలఁగి
  రావణాసురుఁ జంపెను, రమణిఁగాచె.
  జగము లెల్లను మురిసెను సంతసమున.

  రిప్లయితొలగించండి
 2. రామ రావణ యుద్ధ మారంభ మాయె,
  తనదు మదిలోన రుద్రుని దలచి శూర్ప
  కర్ణు; ననిలోన జంపె రాఘవుఁడు, చెలఁగి
  శత్రు మూకల రావణ సహిత ముగను.

  రిప్లయితొలగించండి
 3. ఎదిరి రాక్షసమూక నంగదుడు జంపె
  మేఘనాథుని జంపె సౌమిత్రి కినిసి
  హనుమ జంపె ధూమ్రాక్షుని యలిగి ; కుంభ
  కర్ణుననిలోన జంపె రాఘవుడు చెలగి

  రిప్లయితొలగించండి
 4. పార్థు డటసారథిని నమ్మి భయము విడచి
  కర్ణుననిలోనఁ జంపె; రాఘవుడు చెలఁగి
  రావణుని,యుద్ధముననాడు రౌద్ర రీతి
  జంపినవిధముఁ దానిట చంపనెంచె.

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  ______________________________

  కమల నాభుడు సీతను - గావ నెంచి
  కదలి పోయెను లంకకు - కరుణ జేత
  కదన మందున ప్రతాప - గరిమ చేత
  కర్ణు నని లోన జంపె రా- ఘవుడు చెలగి !
  ______________________________
  కర్ణుడు = కుంభకర్ణుడు

  రిప్లయితొలగించండి
 6. 02)
  ______________________________

  కన్ను మిన్నును గానని - కర్క సుండు
  కదన మందున దినుచుండ - కపుల వరుస
  కపిలు డంతట క్రోధాన - కనలి , కుంభ
  కర్ణు నని లోన జంపె రా- ఘవుడు చెలగి !
  ______________________________

  రిప్లయితొలగించండి
 7. 03)
  ______________________________

  కనలి , కమలాక్షు కరుణచే - కపి రథుండు
  కర్ణు నని లోన జంపె ! రా - ఘవుడు చెలగి
  కదన మందున కడ తేర్చి - కర్కసులగు
  కర్వరుల నెల్ల; బ్రోచెను - కడలి సుతను!
  ______________________________

  రిప్లయితొలగించండి
 8. కవిమిత్రులకు వందనాలు.
  మందాకిని, గోలి హనుమచ్ఛాస్త్రి, నాగరాజు రవీందర్, వసంత కిశోర్ గారల పూరణలు చూసాను. అన్నీ బాగున్నాయి. అందరికీ అభినందనలు. సమయాభావం లల్ల విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. సాయంత్రం వరకు వ్యాఖ్యానిస్తాను.

  రిప్లయితొలగించండి