మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 28
సమస్య -"రండాగమనంబు సేయ రమ్యంబ యగున్"
కం.కుండినపురమున రుక్మిణి
చండికకుం బూజసలుపు సమయంబున కా
యండజవాహనుఁ దోడ్కొని
రం; డాగమనంబు సేయ రమ్యంబ యగున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.
అమెరికా లో చదివి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్నపిల్లల్ని తీసుకు రావడానికి స్టేషన్ కి బండి తీసుకు వెళ్తూ తండ్రి అనుకున్న మాటలు...
రిప్లయితొలగించండిబండిని తోలుకు పోవలె
మెండగు చదువులు చదివి యమెరికా నందున్!
తండా గన పోరియు పో
రండాగమనంబు సేయ రమ్యంబ యగున్!!
చండీయజ్ఞముఁజేయగఁ
రిప్లయితొలగించండిమెండుగ కల్గును శుభమ్ము; మేలము చాలున్
లెండు, తమరికను తప్పక
రండాగమనంబు సేయ రమ్యంబ యగున్
రండు,ఆగమనంబు
పాండురంగ విభుని "నిగమ శర్మ" మిత్రులతో పలికిన పలుకులు:
రిప్లయితొలగించండిదండిగ తెస్తిని సొమ్ములు
దండింపగ నిండు, నాకు దండన లెక్కా?
రండిక పోదము రేయిని
రండాగమనంబు సేయ రమ్యంబ యగున్.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
పాండు రంగ మహత్మ్యం సినిమాలో
మొట్ట మొదటి సారిగా వేశ్య(బి*సరోజాదేవి)ను చూచిన
పుండరీకుడు (అన్నగారు)తన మదిలో !
01)
______________________________
నిండగు తియ్యని పల్కుల
మెండుగ రంజింప జేయు - మీనాక్షి గనెన్ !
దండగ యగునే జన్మము !
రండాగమనంబు సేయ - రమ్యంబ యగున్ !
______________________________
ఒక సైన్యాధిపతి యుద్ధ ప్రారంభంలో తన సైనికులతో :
రిప్లయితొలగించండి02)
______________________________
భండన భీముని మాదిరి
చెండాడుడు శాత్రవులను - చిత్రపు గతులన్ !
దండంబుల చే బూనుడు
రండాగమనంబు సేయ - రమ్యంబ యగున్ !
______________________________
దండిగ పూజలు సేయుచు
రిప్లయితొలగించండిచండీసుని గుడికీ పోయి చంపక ములతోన్ !
మెండుగ భక్తితో మ్రొక్కగ
రండా గమనంబు సేయ రమ్యంబ యగున్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిపోఱిని, పోఱణ్ణి తీసుకురావడ మనే ఊహ ఉత్తమంగా ఉంది. చక్కని పూరణ. అభినందనలు. పోరి = యుద్ధం చేసి, పోరడు = యుద్ధం చేయఁడు అనే అర్థాలు వస్తాయి. అక్కడ శకటరేఫం (ఱ) ఉంటేనే మీ ఊహ సార్థకమౌతుంది.
మందాకిని గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
ఉత్తమమైన పూరణ. మీకు ‘దండిగ’ అభినందనలు.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పురనాగమనం కడుంగడు ఆనందదాయకం. మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు. అన్నట్టు అది ‘దండగ’ కాదు, ‘దండుగ’.
దండి వసంతకిశోరా!
మెండుగఁ బూరణలు సేయు మేటివి, లేకన్
గుండె దిగజాఱెను, మరల
రం, డాగమనంబు సేయ రమ్యంబ యగున్.
రాజేశ్వరక్కా,
రిప్లయితొలగించండిచండీశుని పూజకు రండని చక్కగా పూరించారు. అభినందనలు. కొన్ని చిన్నలోపాలు. బ్రాకెట్లో నా సవరణలతో మీ పద్యం ...
దండిగ పూజలు సే(తుము)
చండీ(శు)ని గుడి(కి) పోయి చంపక ములతోన్ !
మెండుగ భక్తి(ని) మ్రొక్కగ
రండా గమనంబు సేయ రమ్యంబ యగున్.
శంకరార్యా ! .మీ సూచన సవరణలకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిపండంటి బాల్యమందున
రిప్లయితొలగించండిగుండును గొట్టమని చెప్పు క్రూరపు శాస్త్రుల్
రెండవ పెండ్లికి నొప్పుచు
రండాగమనంబు సేయ రమ్యంబ యగున్
రండ = విధవ