11, జూన్ 2011, శనివారం

సమస్యా పూరణం -360 (శాంతి విడిచి కనుఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
శాంతి విడిచి కనుఁడు సౌఖ్యములను.

10 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !

  01)
  ___________________________________

  దొంగ లంద రిపుడు - దొరలై పాలింప
  తిరగ బడిన యంత - తీరు మారు !
  సౌఖ్యము లను బొంద - సామాన్యు లందరూ
  సత్య మెరిగి యాత్మ - సాక్షి గాను
  ఓర్మి విడచి నేడు - ఓటర్లు వెంటనే
  శాంతి విడిచి కనుఁడు - సౌఖ్యము లను !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 2. శాంతి లేక మనకు సౌఖ్యమ్ము లేదని
  త్యాగరాజు జెప్పె బాగు గాను
  కాన మనసు నందు గప్పియున్నట్టి య
  శాంతి విడిచి కనుడు సౌఖ్య ములను.

  రిప్లయితొలగించండి
 3. వసంత కిశోర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "దొరలై" అనేది "దొరలయి" అని ఉంటే గణదోషం తొలగుతుంది.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  త్యాగరాజు వారి "శాంతము లేక సౌఖ్యము లేదు" వింటూ తయారు చేసిన సమస్య ఇది. భలే పట్టుకున్నారే! మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. పేరు మాత్రమేర శాంతి-పెద్ద జగడగొండి,
  ఖర్మ గాలి దానిఁ గట్టు కొనెను
  ధర్మ పరుడు, కడకు మర్మ మెరిగి జెప్పె
  "శాంతి విడిచి కనుఁడు సౌఖ్యములను"

  రిప్లయితొలగించండి
 5. చంద్రశేఖర్ గారూ,
  మీరు నన్నూ, మా ఆవిడనూ దృష్టిలో పెట్టుకొని పద్యం చెప్పినట్లున్నారే!
  పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. "పేరు జూడ శాంతి" అంటే సరి!
  "పేరు జూడ శాంతి పెద్ద జగడగొండి
  ఖర్మగాలి దానిఁ గట్టుకొంటి;
  చంద్రశేఖ రొసఁగెఁ జక్కని సలహాను
  శాంతి విడిచి కనుఁడు సౌఖ్యములను.

  రిప్లయితొలగించండి
 6. అయ్యో, లేదండీ. పాపము శమించుగాక, మాస్టారూ. సవరణకు ధన్యవాదాలు. మీపద్యం అమోఘం. నేను పై పద్యం పోస్టు చేస్తూండగా మా ఆవిడ చూడటం జరిగింది. పడాల్సిన నాలుగు అక్షింతలూ పడ్డాయి. "ఈ రకమైన పద్యాలు వ్రాస్తూ నన్ను సహకరించమని యెలా అడగగలరు?" అని నిగ్గదీసింది. "ఏంచేస్తాం, దొరికిపోయాం" అనుకొన్నాను.

  రిప్లయితొలగించండి
 7. శాంతి వెదకు టేల సన్యాసి కైనను
  ధ్యాస నిలుప కుండ ధ్యాన మందు !
  సత్య శోధ నందు నిత్యము గనుపించ
  శాంతి విడిచి గనుఁడు సౌఖ్యములను !

  రిప్లయితొలగించండి