శ్రీగుభ్యోనమ: అనుపమ ప్రేమతొ పెంచెను ముని సుతునిన్ తల్లి ముద్దుమురిపెము తోడన్ తన తండ్రి యాజ్ఞ మీరక తన ప్రాణము గొను సుతునకు స్తన్యము నిచ్చెన్ - శ్రీపతిశాస్త్రి
Hanumachastri garu vandanamulu, suthudu ante koduku ani kada artham. krishnudu puthana koduku kaadu kada. mari puranalo krishnudu puthana krishnudu puthana koduku ane meaning vasthundi kada. Thappu ga artham chesukonte kshaminchagalaru
శ్రీపతి శాస్త్రి గారూ, మంచి పూరణ. అభినందనలు. "అనుపమప్రేమ" అన్నప్పుడు ‘మ’ గురువై గణదోషం వస్తుంది. "అనుపమ మమతను" అందాం.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, పూరణ బాగుంది. అభినందనలు. కాని కొన్ని చిన్నలోపాలు. ముఖ్యమైనది రెండవపాదం మూడవగణం సగణం అవుతున్నది. అక్కడ నలం కాని జగణం కాని ఉండాలి. నా సవరణలతో (బ్రాకెట్లలో) మీ పద్యం ... మనుగడ (యి)క సాధ్యము కా దని తలచిన కం(సరాజు దయవీడి) భువిన్, దను(ము)మనె కృష్ణు నిక, పూ తన, ప్రాణము గొను సుతునికి స్తన్యంబిచ్చెన్.
అరవింద్ గారూ ! పూరణ చేసేముందు నేను కూడా సందిగ్ధంలో పడ్డాను.కాని కన్నవారే కాకుండా (నందునిలా)పెంచినవారూ,విద్యనేర్పినవారూ,ఆకలి తీర్చినవారూ,ప్రాణదానం చేసిన వారూ తల్లిదండ్రులతో సమానమంటారు.పూతన స్తన్యాని ఇవ్వడానికి కృష్ణుణ్ణి ఎత్తుకుందంటే కుమారునిగా భావించినట్లే కదా... అని సమర్ధించుకుని పూరించాను. అలా చేయవచ్చో లేదో మాస్టరు గారిని మార్గ దర్శకము చేయవలసినదిగా కోరుచున్నాను. మీ విశ్లేషణకు ధన్యవాదములు.
గురువుగారికి నమస్కారములు. గురువుగారు చిన్న సందేహం. మన్నించప్రార్థన. *తన ప్రాణముగొను* అన్నచోట *న* లగువు మరియు *సుతునకు స్తన్యం* అన్నచోట *కు* లగువై యూన్నది.క్రింది మత్తేభ పాదంలో *స్తన్యం* ముందు అక్షరం గురువౌతోంది *తనప్రాణంబులు గొన్న బిడ్డకు నిజస్తన్యంబిడెన్ తల్లియున్* ఇది నా డౌటె కాని ఆక్షేపన కాదు. - శ్రీపతి శాస్త్రి
శ్రీపతి శాస్త్రి గారూ, ‘తన’ తెలుగు పదం. ‘ప్రాణము’ సంస్కృతము. ఈ రెండు పదాలు ప్రక్కప్రక్క నున్నప్పుడు ‘న’ పైన ఊనిక రాదు. అప్పుడు ‘న’ లఘువే అవుతుంది. అలాగే ‘సుతునకు’ అన్నప్పుడు ‘కు’ తెలుగు ప్రత్యయం. దాని తర్వాతి సంయుకాక్షరమైన ‘స్త’వల్ల ‘కు’ పైన ఊనిక రానందున అది లఘువే అవుతుంది. రెండు సంస్కృత పదాలు సమాసమైనప్పుడు మాత్రమే రెండవపదం మొదటి అక్షరం సంయుక్తాక్షరమైనప్పుడు మొదటి పదం చివరి అక్షరం గురువవుతుంది. ‘తన ప్రాణము’లో ‘న’ లఘువు. ‘జనప్రాణములు’లో ‘న’ గురువు. ‘సుతునకు స్తన్యము’లో ‘కు’ లఘువు. ‘నిజస్తన్యము’లో ‘జ’ గురువు. ‘పూతన ప్రాణము’ అనేది తెలుగు సమాసమే. అందువల్ల ‘న’ లఘువే. సంస్కృత సమాసమైతే ’పూతనాప్రాణము’ అవుతుంది. "ఈమాట" జాలపత్రిక నుండి నేను స్వీకరించింది *తనప్రాణంబులు గొన్న బిడ్డకు నిజస్తన్యంబిడెన్ తల్లియున్* అన్న మత్తేభపాఠమే. దానినే కందపాదంగా మార్చి ఇచ్చాను. ధన్యవాదాలు.
ఘన యదు నందుని నందను
రిప్లయితొలగించండిగని మది తా జంపనెంచి కంసుని పనుపన్
తన యొడి లో జేరిచి పూ
తన; ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్.
జనకుడు యానతి నీయఁగఁ
రిప్లయితొలగించండితన ప్రాణముఁ గొను పరశువు ధారున్ పెంచెన్,
జననిగఁ, దాఁరేణుకయున్
తన ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్.
sree gurubhyonamaha
రిప్లయితొలగించండిanupama premato penchenu
munisuthunin thalli muddu muripemu thodan
tana tandri yagna meeraka
tana pranamu gonu suthunaku sthanyamu nicchen
Sreepathisastry.
Goli Hanumatchatri garu, Mandakinigari padyalu chala bagunnayi. Mandakini gari spurthito pi padyam vrasinanu. dhanyavadamulu.
రిప్లయితొలగించండిSreepathisastry
శ్రీగుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅనుపమ ప్రేమతొ పెంచెను
ముని సుతునిన్ తల్లి ముద్దుమురిపెము తోడన్
తన తండ్రి యాజ్ఞ మీరక
తన ప్రాణము గొను సుతునకు స్తన్యము నిచ్చెన్ - శ్రీపతిశాస్త్రి
శంకరార్యా,
రిప్లయితొలగించండిఅభివాదములు. ఈనాటి సమస్య చూచుటలో ఆలస్యమైనది. నా భావననే శ్రీ హనుమచ్చాస్త్రి గారు పూరించారు. కాని, నాయొక్క ప్రయత్నము.
హనుమచ్చాస్త్రి గారు,
మీ పూరణలు అన్నియును మనోహరంగా వుంటూ మామ్మనందింప చేస్తున్నవి.
మనుగడ నిక సాధ్యము కా
దని తలచిన కంసుడు నిర్దయయొప్ప భువిన్,
దనుమనె కృష్ణుడినిక, పూ
తన, ప్రాణము గొను సుతునికి స్తన్యంబిచ్చెన్.
" తాగిన మైకంలో తల్లిని కడతేర్చిన తనయుడు " అని మనం అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో చదువుతుంటాం .
రిప్లయితొలగించండిఅక్కటా ! శివశివా !
తనను కడతేర్చునని తెలి
యని తల్లి తన సుతుని కడు నార్తిగ బెంచెన్ !
తనయుని ప్రాణము నిలుపగ
తన ప్రాణము గొను సుతునకు స్తన్యం బిచ్చెన్ !
Hanumachastri garu vandanamulu,
రిప్లయితొలగించండిsuthudu ante koduku ani kada artham. krishnudu puthana koduku kaadu kada. mari puranalo krishnudu puthana krishnudu puthana koduku ane meaning vasthundi kada. Thappu ga artham chesukonte kshaminchagalaru
-Aravind
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ. అభినందనలు.
మందాకిని గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
"జనకుం డానతి నీయఁగఁ
తన ప్రాణముఁ గొనెడి పరశుధారున్ పెంచెన్" అంటే బాగుంటుంది.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ. అభినందనలు.
"అనుపమప్రేమ" అన్నప్పుడు ‘మ’ గురువై గణదోషం వస్తుంది. "అనుపమ మమతను" అందాం.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
పూరణ బాగుంది. అభినందనలు.
కాని కొన్ని చిన్నలోపాలు. ముఖ్యమైనది రెండవపాదం మూడవగణం సగణం అవుతున్నది. అక్కడ నలం కాని జగణం కాని ఉండాలి. నా సవరణలతో (బ్రాకెట్లలో) మీ పద్యం ...
మనుగడ (యి)క సాధ్యము కా
దని తలచిన కం(సరాజు దయవీడి) భువిన్,
దను(ము)మనె కృష్ణు నిక, పూ
తన, ప్రాణము గొను సుతునికి స్తన్యంబిచ్చెన్.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిఉత్తమమైన పూరణ మీది. చాలా బాగుంది. అభినందనలు.
తాగిన మైకంలోనే కాదు, ఆస్తుల కోసం కన్నతల్లిని చంపినవారూ ఉన్నారు.
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీపతి గారూ! సంపత కుమార్ శాస్త్రి గారూ ! ధన్యవాదములు.
అరవింద్ గారూ ! పూరణ చేసేముందు నేను కూడా సందిగ్ధంలో పడ్డాను.కాని కన్నవారే కాకుండా (నందునిలా)పెంచినవారూ,విద్యనేర్పినవారూ,ఆకలి తీర్చినవారూ,ప్రాణదానం చేసిన వారూ తల్లిదండ్రులతో సమానమంటారు.పూతన స్తన్యాని ఇవ్వడానికి కృష్ణుణ్ణి ఎత్తుకుందంటే కుమారునిగా భావించినట్లే కదా... అని సమర్ధించుకుని పూరించాను. అలా చేయవచ్చో లేదో మాస్టరు గారిని మార్గ దర్శకము చేయవలసినదిగా కోరుచున్నాను. మీ విశ్లేషణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశంకరార్యా,
రిప్లయితొలగించండిమీ విష్లేషణకు ధన్యవాదములు. తొందరగా పూరించవలెనన్న ఆత్రం తప్పిదానికి గురిచేసింది. స(వి)వరణ ఇచ్చినందుకు నమోవాకాలు.
గురువుగారికి నమస్కారములు. గురువుగారు చిన్న సందేహం. మన్నించప్రార్థన. *తన ప్రాణముగొను* అన్నచోట *న* లగువు
రిప్లయితొలగించండిమరియు *సుతునకు స్తన్యం* అన్నచోట *కు* లగువై యూన్నది.క్రింది మత్తేభ పాదంలో *స్తన్యం* ముందు అక్షరం గురువౌతోంది
*తనప్రాణంబులు గొన్న బిడ్డకు నిజస్తన్యంబిడెన్ తల్లియున్* ఇది నా డౌటె కాని ఆక్షేపన కాదు. - శ్రీపతి శాస్త్రి
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండి‘తన’ తెలుగు పదం. ‘ప్రాణము’ సంస్కృతము. ఈ రెండు పదాలు ప్రక్కప్రక్క నున్నప్పుడు ‘న’ పైన ఊనిక రాదు. అప్పుడు ‘న’ లఘువే అవుతుంది. అలాగే ‘సుతునకు’ అన్నప్పుడు ‘కు’ తెలుగు ప్రత్యయం. దాని తర్వాతి సంయుకాక్షరమైన ‘స్త’వల్ల ‘కు’ పైన ఊనిక రానందున అది లఘువే అవుతుంది.
రెండు సంస్కృత పదాలు సమాసమైనప్పుడు మాత్రమే రెండవపదం మొదటి అక్షరం సంయుక్తాక్షరమైనప్పుడు మొదటి పదం చివరి అక్షరం గురువవుతుంది.
‘తన ప్రాణము’లో ‘న’ లఘువు. ‘జనప్రాణములు’లో ‘న’ గురువు.
‘సుతునకు స్తన్యము’లో ‘కు’ లఘువు. ‘నిజస్తన్యము’లో ‘జ’ గురువు.
‘పూతన ప్రాణము’ అనేది తెలుగు సమాసమే. అందువల్ల ‘న’ లఘువే. సంస్కృత సమాసమైతే ’పూతనాప్రాణము’ అవుతుంది.
"ఈమాట" జాలపత్రిక నుండి నేను స్వీకరించింది *తనప్రాణంబులు గొన్న బిడ్డకు నిజస్తన్యంబిడెన్ తల్లియున్* అన్న మత్తేభపాఠమే. దానినే కందపాదంగా మార్చి ఇచ్చాను. ధన్యవాదాలు.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిగురువుగారూ,
ధన్యవాదాలండి.
ధన్యవాదములు గురువు గారూ !
రిప్లయితొలగించండిhanumachastri gaaru sandeha nivrutti chesinanduku dhanyavadamulu
రిప్లయితొలగించండి-Aravind
ఘనముగ పాలను గోరుచు
రిప్లయితొలగించండితన ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్
పనిలో నుండిన తల్లియె
కనుగొని ప్లాస్టికునదౌచు కన్నడి ప్రక్కన్