12, జూన్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 73 (బడబానలపంక్తి మీఁదఁ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 17
సమస్య -
"బడబానలపంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్"
కం.
పడతిరొ! నవమేఘంబులు
వడివడి జడిముసురు పట్టి వలయపువానల్
కడుఁ గొట్టి కురియ గోడలు
బడ, బానల పంక్తిమీఁదఁ బచ్చిక మొలిచెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

9 కామెంట్‌లు:

 1. కడుపులె బానలవంటివి,
  ఉడుపులు గా గడ్డి చుట్టె; ఉత్సవమది' గ్రీ
  నుడె' సందర్భముగా గన
  బడ,బానలపంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  శాస్త్రిగారూ బావుంది !

  01)
  ____________________________________

  పడరతనికి హరి భక్తులు
  వెడగతనికి మును లనినను - విష్ణువు యన్నన్ !
  అడరతనికి ప్రహ్లాదుడు !
  బడబానలపంక్తి మీఁదఁ - బచ్చిక మొలిచెన్ !
  _____________________________________
  వెడగు = వికారము
  అడరు = జన్మించు

  రిప్లయితొలగించండి
 3. బడబాగ్నులు వారిరువురు
  పడ దెప్పుడు , భగ్గుమనును పచ్చిక వేయన్ !
  కడు దూరము సంధి ; యెటుల
  బడబానల పంక్తి మీద బచ్చిక మొలుచున్ !?

  రిప్లయితొలగించండి
 4. తడబడుచునుచెప్పెదవే -
  బడబానలపంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్
  బడబానలమూ,పచ్చిక-
  బడిలోవిశదముగవిన్నపాఠము లివియా!

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ ‘గ్రీన్ డే’ సంబరాల పూరణ బాగుంది. అభినందనలు.

  వసంత కిశోర్ గారూ,
  నిజంగానే బడబానలం మీద పచ్చిక మొలిపించారు. చక్కగా ఉంది. అభినందనలు.
  ‘విష్ణువు + అన్నన్" అన్నప్పుడు యడాగమం రాదు. ‘విష్ణు వటన్నన్/విష్ణు వనంగన్" అంటే సరి!

  నాగరాజు రవీందర్,
  పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరాన్ని విషయంగా మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

  మందాకిని గారూ,
  పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. బడిలోని పాఠాన్ని చక్కగా అప్పజెప్పారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. పడతిరొ నీ యింటను
  కడు మోదము లలరగ నడిరేయి గనన్ !
  పడదిద్దరు సతిపతులన
  బడబానల పంక్తి మీద బచ్చిక మొలచెన్ !

  రిప్లయితొలగించండి
 7. రాజేశ్వరి నేదునూరి గారూ,
  ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. కాని మొదటి రెండు పాదాల్లో గణదోషం, రెండవపాదంలో యతిదోషం ఉన్నాయి. భావం కూడా సందిగ్ధంగా ఉంది. కొద్దిగా వివరణ ఇస్తే సవరించే ప్రయత్నం చేస్తాను.

  రిప్లయితొలగించండి
 8. పడ ద్రోసి కమ్యునిష్టుల
  నడివీధిని కల్కటాను నగవుల తోడన్
  బడబడ నడువగ మమతమ
  బడబానలపంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్

  పచ్చిక = తృణముల (కాంగ్రెసు)

  రిప్లయితొలగించండి