28, జూన్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -376 (మీసమ్ములు మొలిచె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్.

20 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  01)
  __________________________________

  కౌసల్య పేరు గాంచెను
  వేసంబులు వేయు వేళ - విజయుని పాత్రన్ !
  వేసంబున నున్న యపుడు
  మీసమ్ములు మొలిచెఁ గనుఁడు - మీననయనకున్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 2. "నా సుతునకు నూనూగుల
  మీసమ్ములు మొలిచెఁ గనుఁడు" మీననయనకున్ :
  కాసింత గర్వ మేర్పడి
  చూసిన ప్రతి వార్కి జెప్పె చోద్యము గా తాన్ !

  రిప్లయితొలగించండి
 3. మీ సము లందము నందున
  వీసమ్మును గాన రారు వెంటనె క్రీమున్
  పూసిన! యన విని, చేసిన
  మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్.

  రిప్లయితొలగించండి
 4. శాస్త్రీజీ ! సుతునకు మీసాలు చక్కగా మొలిపించారు !

  మిస్సన్న మహాశయా ! మీసాల్ని - మీ సములు చేయడంలో
  మీ సము లెవ్వరూ గానరారు గదా !

  రిప్లయితొలగించండి
 5. మీసరి సరివాడయ్యెను
  మీసమ్ములు మొలిచెఁ గనుఁడు! మీననయనకున్
  బాసలు చేసెను పెండిలి
  చేసుకొనెదననుచుఁ, రభస చేయగఁ దగునా!

  సరికి సరి పెరిగాడని, మీ అంత వాడయ్యాడని అనుట వాడుకే కదా!

  రిప్లయితొలగించండి
 6. కిశోర్ జీ ! ధన్యవాదములు. డ్రామా మీన నయన'తార' కు మీసాలు మొలిపించారు. భేష్!
  మిస్సన్న గారూ ! కల్తీ క్రీమును వాదించి మీస్సాలు మోలిపించారు. భలే!
  మందాకిని గారూ ! గడ్డాలనాటి బిడ్డను వర్ణించారు బాగుంది!

  రిప్లయితొలగించండి
 7. గ్రాసము కోసము పలుపలు
  మోసమ్ములు జేయుకంటె ,మోదముమీరన్
  వేసెను మగవేషమ్ములు
  మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్!!!

  రిప్లయితొలగించండి
 8. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, జూన్ 28, 2011 12:48:00 PM

  రాసక్రీడల దేలుచు,
  మూసిన తన కంటి మీద ముద్దిడి, పెదవిన్,
  రాసిన నంటెను కాటుక,
  మీసమ్ములు మొలిచె గనుడు మీననయనకున్

  రిప్లయితొలగించండి
 9. స్థానం వారికి అన్వయిస్తూ :
  హా!సత్యభామగఁనగర
  వాసులుపులకింపఁదెల్లవారగ నాడీ
  వేసము దీయుచుఁ బవలనె:
  మీసమ్ములు మొలిచె గనుడు మీననయనకున్

  రిప్లయితొలగించండి
 10. వసంత కిశోర్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘వేసంబులు వేయు కళను’ అంటే బాగుంటుం దనుకుంటా.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  చక్కని పూరణలు చేయడంలో మీ సము లెవ్వరున్నారు? అద్భుతమైన పూరణ. అభినందనలు.

  మందాకిని గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  ఊకదంపుడు గారూ,
  ఉత్తమమైన పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. గీసెను ఎవడో తుంటరి
  మీసమ్ములు మూతిమీద మీనాక్షికినిన్ !
  ఆ సినిమా పోస్టరులో
  మీసమ్ములు మొలిచె గనుడు మీననయనకున్ !

  రిప్లయితొలగించండి
 13. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జూన్ 28, 2011 7:09:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  వేసము కట్టెద ననుచును
  బాసర జాతరలొ మ్రొక్కి భామామణియే
  బాసను మార్చెను, పెట్టుడు
  మీసమ్ములు మొలచె గనుడు మీననయనకున్

  రిప్లయితొలగించండి
 14. శంకరార్యా ! పసందుగా యుంటుంది !
  చక్కని సవరణకు ధన్యవాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 15. గురువుగారూ బహుధా ధన్యవాదములు.
  హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. లూసీకి డయగ్నోసిస్
  జేసెను డాక్టర్ ; కుషింగు సిండ్రో మనియెన్ !
  దోసము హార్మోను వలన -
  మీసమ్ములు మొలిచె గనుడు మీననయనకున్ !

  ( Cushing Syndrome అనే వ్యాధిలో hirsutism వుంటుంది. అంటే ఆడవాళ్ళకు ముఖం మీద శరీరంపై రోమాలు పెరిగి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి .
  ఈ వ్యాధి harmonal imbalance వలన వస్తుంది. )

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ బహుధా ధన్యవాదములు.
  ఇటువంటి సమస్యకే - గిరి గారి గడుసు పూరణ..: http://poddu.net/?q=node/825

  రిప్లయితొలగించండి
 18. నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

  శ్రీపతి శాస్త్రి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘జాతరలొ’..‘లో’ను ఎప్పుడూ హ్రస్వం చేయరాదు. ‘జాతరను/జాతరకు’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 19. కాసింత జింక పిల్లను
  మోసుకు వచ్చి దినదినము మోహము తోడన్
  గ్రాసము నొసగగ నెలలో
  మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్

  రిప్లయితొలగించండి
 20. సాసరుగొని నాలుకతో
  కూసింతది మనుమరాలు గుట్టుగ నాకన్
  మోసమ్మయె మీగడవౌ
  మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్


  రిప్లయితొలగించండి