5, జూన్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -354 (జగను కాప్తమిత్రుఁడు గదా)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
జగను కాప్తమిత్రుఁడు గదా చంద్రబాబు.

8 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    _________________________________

    శత్రువుకు శత్రువే గద - మిత్రు డగును !
    కనుక శత్రువు లిరువురు - కాంగ్రెసునకు !
    మిత్రు లౌగద లోకము - మెచ్చు నటుల
    జగను కాప్తమిత్రుఁడు గదా - చంద్రబాబు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  2. కిశోర్ గారూ ! జగన్,చంద్రబాబులను మీరైతే యీజి గా కలిపేశారు. అభినందనలు.వారిద్దర్నీ కలపటం ఎలాగో అర్ధం కావట్లేదు.

    రిప్లయితొలగించండి
  3. రొచ్చు పాల్టిక్సు కనలేక పిచ్చి బట్టి
    వాగె నిట్ట్తుల , నొక వ్యక్తి వాడ లోన
    జగను కాప్తమిత్రుఁడు గదా చంద్రబాబు
    జయకు, కరుణకు కుదిరెను సఖ్యతయును.

    రిప్లయితొలగించండి
  4. వరప్రసాద్ గారి పూరణ ...

    జగను కాప్త మిత్రుడు గదా చంద్రబాబ
    టన్న కాదు కా దందురే యాప్తులెల్ల;
    ఔను వారిద్ద రొకతాను ముక్కలే య
    టంచు సామాన్య జను లెంతు రెంచి చూచి.

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోరా,
    సెహబాస్! చక్కని పూరణ. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కలపటం ఎలాగో అర్థం కావడం లేదంటూనే ఎంత మంచి పూరణ నిచ్చారు! బాగుంది. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు. కాకుంటే కొన్ని చిన్న చిన్న దోషాలు. మీరు "చమత్కార పద్యాలలో" పోస్ట్ చేసిన పూరణలో ఇక్కడ నేను చేసిన సరణలను గమనించండి.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీరు పూరించిన దత్తపది, సమస్యాపూరణలు 6, 8, 14, 17 లను చూసాను. అన్నీ బాగున్నాయి. అంత వెనక్కి వెళ్ళి అక్కడ వ్యాఖ్యానించలేక పోతున్నాను.
    నేను సిద్ధంచేస్తున్న ఇ-బుక్కులో ఈ పూరణలనూ చేరుస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! ధన్యవాదములు !
    శాస్త్రిగారూ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి