26, జూన్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 87 (సుగ్రీవుని యెడమకాలు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 31
సమస్య -
"సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్"
కం.
అగ్రారపు నడివీథిని
నిగ్రహముగ బొమ్మలాట నేర్పుగ నాడన్
విగ్రహము లెత్త మఱచిన
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

34 కామెంట్‌లు:

 1. ఏ గ్రీవుండయితేనేం
  మా గ్రామమునందు కుక్క మహ పిచ్చిదిగా !
  ఉగ్రముతో అదలించగ
  సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ !!

  రిప్లయితొలగించండి
 2. శీఘ్రము డ్రామా కోసము
  సుగ్రీవుని వేషమేసి చురచుర బోవన్
  డిగ్రీ కాలేజి వెనుక
  సుగ్రీవుని యెడమ కాలు శునకము గఱచెన్ !

  రిప్లయితొలగించండి
 3. ఆగ్ర్రా నగరము నందున
  జాగ్రత్తను వీడి మెదల జాతర యందున్
  మా గ్రామపు నిడు మెడ గల
  సుగ్రీవుని యెడమ కాలు శునకము గఱచెన్ !

  రిప్లయితొలగించండి
 4. ఈ సాహితీ యజ్ఞం లో నాకు స్థానం కలుగజేసి పాలు పంచుకునే అదృష్టాన్ని కలుగజేసిన శంకరం మాస్టారు గారికి శత సహస్ర వందనములు..
  ఆరోగ్యకర పోటీనిచ్చుచున్న కవిమిత్రులకు
  కృతజ్ఞతలు.

  బ్లాగు వీక్షకులకు ధన్యవాదములు.
  విషయమెమిటంటే...
  నేను బ్లాగు తరగతి లో ప్రవేశించిన నాడిచ్చిన 208 వ సమస్య నుండి రెండు వారాంతపు సమస్యలు దక్క ఆన్ని సమస్యలు ( కొన్ని పాతవి కూడా),దత్తపదులు,చమత్కార పూరణలు నా శక్తి మేరకు పూరించాను.
  ఇప్పటికిదాదాపు 220 దాటినవి.ఇది స్వోత్కర్ష గా భావించ వలదని మనవి.
  శంకరార్యా !ఇది మీయొక్క ప్రొత్సాహము, ఓపికగా మీరు చేసిన సవరణలు,సూచనల వలన మాత్రమే సాధ్య పడినది.
  మీరు చేస్తున్న ఈ సాహితీ యజ్ఞం నిర్విఘ్నంగా నిరంతరాయంగా కొనసాగాలని నా ఆకాంక్ష.
  నాకు తెలిసినంత వరకు ప్రతి రోజు ఇలా సమస్య నిచ్చే మాధ్యమం యెక్కడా లేదు.ఇది ఒక చరిత్ర సృష్టించ గలదని నాభావన.

  అని యిది, తెనుగు సమస్యల
  గని యిది, మాబోటి వాండ్ల కది యొక నిధియే!
  అనియెద శుభమని, యెపుడా
  గని శక్తి నిడగ నడిగెద గణనాధుని నే!!

  రిప్లయితొలగించండి
 5. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ మీకు ద్విశత అభినందనలు. మిత్రులు శ్రీ పీతాంబర్ గారికి కూడా నా అభినందనలు. ఈ లెఖ్ఖలో మిత్రులు శ్రీ మిస్సన్న గారు, వసంత కిషోర్ గారు కూడా యెన్నడో యీ సంఖ్యను అధిగమించి యుంటారు, వారి వారికి కూడా అనేక అభినందనలు. ఆర్యా! శంకరార్యా ! మీకు శతాభివందనములు.

  రిప్లయితొలగించండి
 6. ఆ గ్రామపు సింహంబా
  సుగ్రీవుని గఱచె నంట శోకము గాదే
  యుగ్రత రభసను నొందక
  శీఘ్రముగా వ్యాక్సి నొసగి చేర్చుడు దరికిన్ !

  ( రేబీస్ సంస్కృత భాష రభస నుండి జనించింది )

  రిప్లయితొలగించండి
 7. హనుమచ్చాస్త్రి గారూ! అభినందనల పరంపర!

  ఉర్విని శంకరు బ్లాగున
  పర్వంబగు పూరణిడగ పండితు కైనన్
  గీర్వాణి యనుగ్రహ మిది
  నిర్విఘ్నము మీకు గాత నిర్మల హృదయా!

  రిప్లయితొలగించండి
 8. అజ్ఞాత మిత్రమా! మీ యూహ కిశోర మహోదయుని విషయంలో నూటికి నూరు పాళ్ళు నిజం. వారు బహుశా పంచ శతాలు దాటించి ఉంటారు. నేను తీరికగా లెక్క చూచుకోవాలి. మాకన్నా ముందునుంచీ శంకరాభరణం లో పాల్గొంటున్న మీరూ ఆకోవ లోనే చేరి ఉంటారు.హనుమచ్చాస్త్రి గారన్నట్లు ఆరోగ్యకరమైన పోటీ నిస్తున్న మీ బోటి మిత్రుల ప్రోత్సాహమూ! గురు కృపా!

  రిప్లయితొలగించండి
 9. మధువన ధ్వంసరచనా సందర్భం లో

  ఆగ్రహమున దధిముఖు పై
  నుగ్రంబుగ వానరములు యురికెను, ఒక వృ-
  క్షాగ్రంబున కపి యఱచెను:
  ' సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ '.

  రిప్లయితొలగించండి
 10. అజ్ఞాత ( నరసింహ మూర్తి ) గారూ ! ధన్యవాదములు.
  మిస్సన్న గారూ! సహృదయంతో మీలాటి పెద్దలు అందించే ఆశీస్సులే మాకు కొండంత బలం. మీకు నా నమస్కారములు.

  అజ్ఞాత గారూ ! ఆగ్రా వెళ్లి , ఆ గ్రామము వెళ్లి మీరు చేసిన పూరణలు బాగున్నాయి. రభస వ్యాధి గురించి చక్కగా తెలిపారు.
  మిస్సన్న గారూ ! కోతి తో అరిపించారు ..కేక..
  నాగరాజు గారూ ! మీ డ్రామా సుగ్రీవుడు బాగున్నాడు.
  చిన్న సవరణ (వేషమేసి కాకుండా )
  సుగ్రీవుని పాత్ర ధారి సూరయ బోవన్.. అంటే బాగుంటుందేమో..

  రిప్లయితొలగించండి
 11. రెండు వందలకుమించి పూరణలు చేసిన శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారికి నా హృదయ పూర్వక అభినందనలు

  కుగ్రామపు వేడుకలో
  నిగ్రహమును వీడి ,కామ నిషలో దిఱుగ
  న్నుగ్రాకృతిదాల్చి,నుఱికి
  సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ '.

  రిప్లయితొలగించండి
 12. వ్యగ్రతఁ నేపరుగిడితిని
  సుగ్రీవుని నాటకమునుఁ సోమయ నాడన్.
  ఉగ్రతఁ గనుచుంటినినేఁ
  సుగ్రీవుని, యెడమకాలు శునకము గఱచెన్

  రిప్లయితొలగించండి
 13. అజ్ఞాత ( నరసింహ మూర్తి )గారూ ! ధన్యవాదములు !
  మిస్సన్నమహాశయా! ధన్యవాదములు !
  నేనెప్పుడూ లెఖ్ఖ చూళ్ళేదు మరి ! ఎన్నైనాయో !
  ఇందులో మనదేముంది ?
  అంతా శంకర కృప ! వాగ్దేవి అనుగ్రహం !
  శంకరార్యా ! ధన్యవాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 14. హనుమచ్ఛాస్త్రి గారికి , పీతాంబర్ గారికి అభినందనలు.
  నేను ఇప్పుడు ౧౨౮ పూరణలు, దత్తపదులు చేశాను. త్వరలో ౨౦౦ చేరుకోవాలని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,

  ఎక్కువ తక్కువ లరయక
  మక్కువతోఁ బూరణముల మాధుర్యమ్మున్
  మిక్కిలిగాఁ జవిచూపితి
  వక్కజముగ మాకు ‘గోలి హనుమచ్ఛాస్త్రీ’!

  రిప్లయితొలగించండి
 16. కవిమిత్రులారా,
  ఇప్పటి వరకు ఎవరెన్ని పూరణలు చేసారో తెలుసుకోవాలన్న ఆలోచన రాలేదు. కాని ఇప్పుడు ఆ గణాంకాలను సిద్ధం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఐతే ఇది తీరికగా ముఖ్యంగా ఓపికతో చేయవలసిన పని. వీలుచూసుకొని చేస్తాను.
  ఐతే ఇక్కడ ఒక సందేహం...
  వసంత కిశోర్ గారు మరికొందరు ఒక సమస్యకే ఒకటికి మించి పూరణలు పంపారు. అయితే నేను పద్యాల లెక్క చూడాలా లేక సమస్యను మాత్రమే పరిగణించాలా? సలహా ఇవ్వండి.

  రిప్లయితొలగించండి
 17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  కాని ‘అయితేనేం, మహపిచ్చిది’ అనే వ్యావహారిక పదాలున్నాయి. పరవాలేదు. మీరు శిష్టవ్యావహారికం లోనే పద్యం వ్రాసారనుకుందాం.

  నాగరాజు రవీందర్ గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  కాని మొదటిపాదంలో ప్రాస తప్పింది. ‘శీఘ్రము’ అన్నచోట ‘వ్యగ్రత’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 18. అజ్ఞాత (నరసింహ మూర్తి?) గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా రభస నుండి రేబిస్ పదం పుట్టిందవే క్రొత్త విషయం తెలిసింది. అభినందనలు, ధన్యవాదాలు.
  మీ మెయిల్ ఐ. డి. పనిచేయక ‘అజ్ఞాత’గా వ్యాఖ్య పెట్టినా చివర మీ పేరుకూడా టైపు చేయండి. తికమకపడుతున్నాము.

  మిస్సన్న గారూ,
  శాస్త్రి గారిని సంబోధించిన పద్యం హృద్యంగా ఉంది. ధన్యవాదాలు.
  రెండవపాదాన్ని ఇలా వ్రాస్తే బాగుంటుందేమో?
  "పర్వంబగు పూరణ లిడు పాండిత్యకళల్"
  మీ పూరణ అలరించింది. అభినందనలు.
  ‘దధిముఖుడు’ ?

  రిప్లయితొలగించండి
 19. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  1)
  _______________________________

  వ్యగ్రుండై వెళ్ళు నపుడు
  అగ్రణియౌ పాత్రధారి - యా శుని తోకన్
  ఉగ్రణియై , తొక్కిన యా
  సుగ్రీవుని యెడమకాలు - శునకము గఱచెన్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 20. మంద పీతాంబర్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘కామనిష’ .. ? అక్కడ ‘మత్తు నెక్కొన’ అందాం.

  మందాకిని గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  ‘సోమయ యాడన్’ అంటే సరి!

  వసంత కిశోర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గురువుగారూ ధన్యవాదములు.
  "పర్వంబగు పూరణ లిడు పాండిత్యకళల్" మీ సూచన చాలా బాగుంది.
  ఇక 'దధిముఖుడు':
  "మధువనాన్ని సుగ్రీవుని మేనమామ యైన దధిముఖుడు అనే మహా వీరుడు సంరక్షిస్తూ ఉంటాడు. వానరులు మధువనాన్ని ధ్వంసం చేస్తూండగా అతడు వారించ బోతే వారందరూ అతన్ని చాలా హింసించారు."
  అని వాల్మీకి రామాయణంలోని సుందరకాండ లో చదివేనండీ.

  రిప్లయితొలగించండి
 22. గురువుగారూ హనుమచ్చాస్త్రి గారిపై మీ పద్యం చాలా బాగుంది.
  మందాకినిగారూ ఆల్ ద బెస్ట్!

  రిప్లయితొలగించండి
 23. గురువు గారూ ధన్యవాదములు. మిస్సన్న గారూ మధువనము కధ నేను భారతము అరణ్య పర్వములో చదివాను. అక్కడ సుగ్రీవుడు లేడు కదా అనే సందేహము నాకు కూడా వచ్చింది. మధువనము కాపలా దారులు సీతను వెదుకుటకు దక్షిన దిశకు వెళ్ళిన వానరులు మహా ఉత్సాహముగా తిరిగి వచ్చి మధువనము ధ్వంసము చేసారు, బహుశా వారు సీత జాడ తెలుసుకొని యుంటారని సుగ్రీవునికి చెబుతారు. హృద్యమైన కధ. గుర్తు చేసి నందులకు కృతజ్ఞతలు.

  గన్నవరపు నరసింహ మూర్తి

  రిప్లయితొలగించండి
 24. గురువు గారూ ధన్యవాదములు. మిస్సన్న గారూ మధువనము కధ నేను భారతము అరణ్య పర్వములో చదివాను. అక్కడ సుగ్రీవుడు లేడు కదా అనే సందేహము నాకు కూడా వచ్చింది. మధువనము కాపలా దారులు సీతను వెదుకుటకు దక్షిణ దిశకు వెళ్ళిన వానరులు మహా ఉత్సాహముగా తిరిగి వచ్చి మధువనము ధ్వంసము చేసారు, బహుశా వారు సీత జాడ తెలుసుకొని యుంటారని సుగ్రీవునికి చెబుతారు. హృద్యమైన కధ. గుర్తు చేసి నందులకు కృతజ్ఞతలు.

  గన్నవరపు నరసిం హ మూర్తి

  రిప్లయితొలగించండి
 25. మూర్తి మిత్రమా! ధన్యవాదాలు!
  మధువనంలో పళ్ళు తినీ, మధువులు ద్రావీ వానరులు మైకంలో పడిపోయి వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఏవేవో పిచ్చి చేష్టలు చేస్తూ ఏమేమో మాట్లాడుతారు. ఆ సందర్భంలో ఒక వానరుడు అలా పిచ్చిగా మాట్లాడేడు అని నా ఊహ.
  అన్వయం కొంచెం ఇబ్బంది పెట్టుంటుంది. క్షంతవ్యుడిని.

  రిప్లయితొలగించండి
 26. మిస్సన్న గారూ,
  వివరణకు ధన్యవాదాలు. ఇంట్లో ‘పూర్వగాథాలహరి’ ఉంది. దాన్ని ఒకసారి తిరగేస్తే సందేహం తీరేది. కాని ఎందుకో గుర్తుకు రాలేదు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 27. గురువు గారూ, మిస్సన్న గారూ, ధన్యవాదాలు.


  నేను ఇప్పుడే గమనించాను .
  128లో 5 పూరణలు కాదు.
  తొందర పడి వ్రాసుకున్నందుకు క్షంతవ్యురాలను.

  రిప్లయితొలగించండి
 28. మాస్టరు గారూ ! కందములో అందముగా ఆశీర్వదించి నందులకు ధన్యవాదములు.నమస్కారములు.అన్ని పద్యములు వ్రాయుటలో నా గొప్పతనమేమి లేదు.అంతామీ బ్లాగు తరగతి మహత్యం.ఎప్పుడో 10 వ తరగతివరకు నేర్చుకున్నతెలుగు తో పద్యం మీద అభిమానంతో అప్పుడప్పుడు చేసిన పూరణలు, వ్రాసిన పద్యాలూ 100 దాక ఉంటాయి. (20 సంవత్సరాలలో) అంతే.. 'శంకరాభరణం' వలన ఈ 5 నెలలలో దాదాపు ప్రతి రోజు నియమంగా అలవాటుగా మారుటవలన రెట్టింపు వ్రాయ గలిగాను.ఎన్నో విషయములు తెలుసుకోన గలుగు చున్నాను.ఈ అవకాశము కల్పించిన మీకు శత సహస్ర వందనములు.

  మందాకిని గారూ !ధన్యవాదములు.మీ కోరిక త్వరలో తీరాలని మా ఆకాంక్ష.

  రిప్లయితొలగించండి
 29. శ్రీపతిశాస్త్రిసోమవారం, జూన్ 27, 2011 11:12:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  నిగ్ర్హహమును కోల్పోవగ
  ఆగ్రహముగ కుక్కయొకటి నరచుచుపారెన్
  విగ్రహముల చాటును గని
  సుగ్రీవుని యెడమకాలు శునకము కొరికెన్

  రిప్లయితొలగించండి
 30. శ్రీపతి శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘నిగ్ర్హహము’ అని ఒక హకారం టైపాటు వల్ల అధికంగా పడ్డది.రెండవపాదాన్ని "నాగ్రహమున కుక్క యొకటి యరచుచు పారెన్" అనండి.

  రిప్లయితొలగించండి
 31. ఆగ్రా నగరపు కోతులు
  నిగ్రహమును వీడి పోర నెన్నికలందున్
  ప్రోగ్రామున జేర పరుగు
  సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్

  రిప్లయితొలగించండి