19, జూన్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -368 (బొంకినాఁడు హరిశ్చంద్ర)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
బొంకినాఁడు హరిశ్చంద్ర భూవరుండు.

34 కామెంట్‌లు:

  1. మీకు బాకేమి నేలేను ! మీర లెవరు ?
    అనుచు బొంకిన తిరిగొచ్చు నన్ని! యనిన
    వలదు రాజ్యమ్ము సుఖములు వలదనుకొనె
    బొంకి; నాడు హరిశ్చంద్ర భూవరుండు

    రిప్లయితొలగించండి
  2. గొప్ప వారలందరునట కూడినారు
    సత్య నిరతిని పరికింప సాహసించి,
    బొంకి; నాఁడు హరిశ్చంద్ర భూవరుండ
    నితరసాధ్యుడనుచునప్డు నిజముఁగనిరి.

    భూవరుండు+అనితర = భూవరుండనితర

    రిప్లయితొలగించండి
  3. ధర్మ రాజును బొంకక తప్పదనిరి,
    బలిని బొంకగ తగుననె పరమ గురువు!
    " బొంకినాఁడు హరిశ్చంద్ర భూవరుండు "
    అన్న మాటలు విననైతి మెన్న డున్ను.

    రిప్లయితొలగించండి
  4. సంపత్ కుమార్ శాస్త్రి.ఆదివారం, జూన్ 19, 2011 11:55:00 AM

    చేరి రాజ్యమ్ము వీడగ చేసినారు,
    కుత్సితుండైన నక్షత్రకుడును సురలు,
    బొంకి, నాడు హరిస్చంద్ర భూవరుండు,
    పయన మయ్యెను రాజ్యము బాసి, అకట!!.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఉదాత్తమైన పూరణ మీది. అభినందనలు.

    మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీది ఉత్తమమైన పూరణ. అభినందనలు.

    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గురువుగారూ,
    నాఁడు అని అర్ధానుస్వారంతో మీరిచ్చారు సమస్యలో. బొంకినాడు అనే క్రియా పదంలో అది సరిపోతుంది. నేను నాడు = ఆనాడు అని పూరణ చేశాను. అది సమస్యను మార్చినట్టు అవుతుందా? అని ఇప్పుడే అనుమానం వస్తోంది.

    రిప్లయితొలగించండి
  7. శ్రీపతి శాస్త్రిఆదివారం, జూన్ 19, 2011 8:19:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కాడు మీవంటి వాడు యా కఠిన రాజు,
    యగ్న సామగ్రినివ్వగ యాశ జూపి,
    అడుగబోవగ లేదంచు అరచి తాను,
    బొంకినాడు, హరిశ్చంద్ర ! భూవరుండు

    రిప్లయితొలగించండి
  8. శ్రీపతి శాస్త్రిఆదివారం, జూన్ 19, 2011 8:28:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కాడు మీవంటి వాడు యా కఠిన రాజు,
    యజ్ఞ సామగ్రినివ్వగ యాశ జూపి,
    అడుగబోవగ లేదంచు అరచి తాను,
    బొంకినాడు, హరిశ్చంద్ర ! భూవరుండు

    రిప్లయితొలగించండి
  9. మిత్రులందఱి పూరణలు చాలా బాగున్నాయి. హనుమఛ్ఛాస్త్రి గారూ తిరిగొచ్చు అన్నారు, తిరిగి వచ్చు కదా ? మళ్ళీ నాకు దొరికారు,మన్నించండి.


    నిజము నుడువుట కష్టమై నేర్పు గూడి
    సత్య మనుచుచును బలికెద సాక్ష్య మిట్లు
    'బొంకినాఁడు హరిశ్చంద్ర భూవరుండు '
    శంకరార్యులు మెచ్చరె బొంకులాడ !

    రిప్లయితొలగించండి
  10. గూగులు బ్లాగు ద్వారా వ్యాఖ్యలు పోస్ట్ చెయ్య లేక మరో ఆలోచనతో అజ్ఞాతగా పోస్ట్ చెస్తున్నాను. మిస్సన్న గారూ మమ్ములను మీ మనస్సులో పెట్టుకొన్నందులకు కృతజ్ఞతలు. పనివత్తిడి,తక్కువ తీరిక,కంప్యూటరు సహాయ నిరాకరణల కారణములుగా నేను వ్యాఖ్యలు వ్రాయక పోయినా మిత్రుల పూరణలు,గురువర్యుల వ్యాఖ్యలు చదివి ఆనందిస్తూనే యున్నాను. అందఱికీ శుభాకాంక్షలు
    -గన్నవరపు నరసింహ మూర్తి

    రిప్లయితొలగించండి
  11. నీతి నియమము పరులకు నేర్పు వాడె
    బొంకినాఁడు, హరిశ్చంద్ర భూవరుండు
    తనకు నారాధ్యు డంచును దైవముగను
    నమ్ము వాడిటఁ బొంకుల నాడినాడు.

    ఒకానొక సత్యవ్రతుడొకపరి బొంకెనని విన్న మిత్రుని ఆవేదన ఇది. బొంకినాఁడు అనే క్రియాపదమే వాడేవరకు నాకు తృప్తి కలుగలేదు.

    రిప్లయితొలగించండి
  12. మాట నిలుపుట కెటులైన మనసు మార్చి
    భార్య నమ్ముట కేరీతి బేర మాడి
    భోగ భాగ్యాలు విడనాడ భార మవగ
    బొంకినాడు హరిశ్చంద్ర భూవరుండు.

    రిప్లయితొలగించండి
  13. మందాకిని గారూ,
    ‘బొంకినాఁడు’ అనే క్రియాపదంలోను, ఆరోజు అనే అర్థంలో ‘నాఁడ్’ శబ్దంలోను అరసున్నా ఉంటుంది. మీ ప్రయోగంలో దోషం లేదు.
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.

    శ్రీపతి శాస్త్రి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    కాని సంధుల విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ‘వాఁడు + ఆ’ అన్నప్పుడు యడాగమం రాదు. క్రింది బ్రాకెట్లలోని నా సవరణలు చూడండి. లోపాలు తెలుస్తాయి.
    కాడు మీవంటి (మనుజుఁ డా) కఠిన రాజు,
    యజ్ఞ సామగ్రినివ్వగ (నా)శ జూపి,
    అడుగబోవగ లేదంచు (న)రచి తాను,
    బొంకినాడు, హరిశ్చంద్ర ! భూవరుండు

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    గన్నవరపు వారు చెప్పే వరకు మీ పూరణలోని ఆ లోపం నా దృష్టికి రాలేదు. నా సవరణలతో మీ పద్యం ...
    మీకు (ఋణమే)మి నేలేను ! మీర లె(వ్వ
    ర)నుచు బొంకిన తిరి(గి వచ్చునని) యనిన ...

    రిప్లయితొలగించండి
  15. గన్నవరపు నరసింహమూర్తి గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం.
    శాస్త్రి గారి పద్యంలోని దోషం మీరు చెప్పేదాక నేను గమనించలేదు. ధన్యవాదాలు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో ‘మనుచుచును’లో ఒక చు టైపాటు వల్ల ఎక్కువయింది.
    చివరి పాదంలో ‘మెచ్చరె" అనేది ‘మెచ్చరే’ అని దీర్ఘాంతం అయితే ఇంకా చమత్కారంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  16. ఘన వశిష్టు నెదిరి మరి గాధి సుతుఁడు
    బొంకినాఁడు, హరిశ్చంద్ర భూవరుండ
    నన్య సత్యవ్ర తుండని యమలు జూప
    తృప్తిగ తప:ఫలంబులు ధారవోసి.

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరక్కా,
    ఏమిటి? ఈ మధ్య ‘యతి’కి తిలోదకా లిచ్చారా? పద్యం బాగా వ్రాసారు. కాని 2,4 పాదాల్లో యతిమైత్రిని పాటించడం మరిచిపోయారు. నా సవరణ ...
    .. (దార) నమ్ముట కేరీతి బేర మాడి
    భోగ భాగ్యాలు విడనాడ (బోననంగ) ...

    రిప్లయితొలగించండి
  18. చంద్రశేఖర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    మూడవపాదంలో "యమలు జూప" అన్నచోట "యరసి తుదకు" అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  19. ధన్యోస్మి, మాస్టారూ. మీరు దిద్దిన మెరుగు నా ఊహని సరిగ్గా పట్టిచూపింది. అందుకే కొన్ని విద్యలు గురు-శిష్య సాంప్రదాయములోనే నేర్చుకోవాలంటారేమో.
    ఘన వశిష్టు నెదిరి మరి గాధి సుతుఁడు
    బొంకినాఁడు, హరిశ్చంద్ర భూవరుండ
    నన్య సత్యవ్ర తుండని యరసి తుదకు
    తృప్తిగ తప:ఫలంబులు ధారవోసె.

    రిప్లయితొలగించండి
  20. నరసింహ మూర్తి గరూ ! బహుకాల వీక్షణం. నా పాత అలవాటు మరల 'తిరిగొచ్చిన ' విషయం మీరు చెప్పే వరకూ గమనించలేదు.ధన్యవాదములు. ప్రతి రొజూమీలాటి మిత్రులు బ్లాగులొ కనిపిస్తుంటేనే మాకూ ఉత్సాహంగా ఉంటుంది.
    వసంత కిశొర్ గారూ,జిగురు సత్యనారాయణ గారూ,మంద పీతాంబర్ గారూ ఇంకా చాలా మంది మిత్రులు సరిగా క్లాసు లకు హాజరవటం లేదు.మాస్టరు గారూ ! మీరు యేవైనా చర్యలు తీసుకోవాలండీ !
    శంకరార్యా ! పద్యాన్ని సవరణ చేసినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  21. శాస్త్రి గారూ, వారందరూ వేసంకాలం శెలవులు తీసుకున్నట్టున్నారు. డా.మూర్తి గారిని గూగులు గుంట మళ్ళా మోసం చేసిందనిపిస్తోంది. అది వీరి మాట వినటం మానేసింది.
    మిత్ర వర్యా, దానిని కొంచెం మంచి చేసుకోండి మహానుభావా! సహాయం కావాలంటే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  22. గురువర్యా టైపాటు దిద్దినందులకు కృతజ్ఞతలు. మెచ్చరే అని దీర్ఘము నివ్వడము బాగుంది. చంద్రశేఖర్ గారూ, మన గుంటలు మన మాట విననట్లే గూగులు గుంట కూదా ఆట పట్టించి పదే పదే పాసు వర్డు అడిగి విసుగు పుట్టిస్తుంది. మీ సహాయము తప్పక తీసుకొంటాను. హనుమఛ్ఛాస్త్రిగారూ, మిగిలిన టైపాటుల సంగతేలా ఉన్నా మీ పేరు టైపు చేయడము నాకు సరదా. మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  23. అవును తమ్ముడూ ! ఈమధ్య ఎందుకో సరిగా రాయలేక పోతున్నాను .అసలే అంతంత మాత్రం. ఇక ఉన్నది కుడా పోతోంది. నాకే ఏదో లోపం ఉందని పిస్తోంది. కానీ గుర్తు తెలియ టల్లేదు. ప్చ్ ! ఎప్పడికి నేర్చు కుం టానొ ?

    రిప్లయితొలగించండి
  24. అక్కయ్యా ,మీ పద్యాలు చక్కగా ఉన్నాయి. అప్పుడప్పుడు యతులు కుదరక పోతే నష్టము యేమిటి ? మన తప్పులు దిద్దడానికి గురువు గారున్నారు కదా ? యతులు తమ్ముళ్ళకే గాని అక్కయ్యల కక్కఱ లేదని వ్యాకరణములో యెక్కడో చదివి నట్లు గుర్తు.

    రిప్లయితొలగించండి
  25. రాజేశ్వరక్కా,
    ఇప్పుడు క్రొత్తగా నేర్చుకొనే దేముంది? నేర్చుకున్నవి మరిచిపోకుండా ఉంటే అదే గొప్ప మనకు ఈ వయస్సులో. పొరపాట్లు అందరికీ సహజం.

    రిప్లయితొలగించండి
  26. అజ్ఞాత గారూ (గ.న.మూర్తి గారూ, మీరేనా?),
    "యతులు తమ్ముళ్ళకే గాని అక్కయ్యల కక్కఱ లేదని వ్యాకరణములో యెక్కడో చదివి నట్లు గుర్తు." ... ఏం చెప్పారండీ! చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. మూర్తి గారూ ! నాపేరులో టైపాటు చేయకండి.' లి ' ని ' ల ' చేస్తే ఇబ్బందే.. ధన్యవాదములు.

    మాస్టారు గారూ ! నా పూరణ చిన్న సవరణతో..

    'మీకు ఋణమేమి నేలేను ! మీరలెవ్వ ?
    రనుచు బొంకిన వచ్చు నీ రాజ్య లక్ష్మి' !
    యనిన చెప్పెను;"నేనొప్ప నట్టి సిరులు
    బొంకి" నాడు హరిశ్చంద్ర భూవరుండు

    రిప్లయితొలగించండి
  28. మూర్తి మిత్రమా మీ పునరా గమనం కడు సంతోష దాయకం.

    రిప్లయితొలగించండి
  29. చిన్ని తమ్ముల అభిమానానికి ధన్య వాదములు + కృతజ్ఞతలు అక్క

    రిప్లయితొలగించండి
  30. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _________________________________

    భోగ భాగ్యములవి - బొగ్గు వంటి వనెను
    బూది మిగులు తుదకు - భూమి మీద !
    పోరు జేతు గాని - పొందగోరను వాని
    బొంకి ! నాఁడు హరిశ్చంద్ర - భూవరుండు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  31. మూర్తి మహాశయా ! బహుకాల దర్శనం ! సంతోష దాయకం !

    రిప్లయితొలగించండి
  32. వసంత కిశోర్ గారూ,
    సమస్య తేటగీతి పాదం. మీరేమో ఆటవెలది వ్రాసారు.

    రిప్లయితొలగించండి