8, ఏప్రిల్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 671 (భామకు లేమకున్ సతికి)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్.

42 కామెంట్‌లు:

  1. భామకు సద్దు సేసిన ముద్దు
    లేమకున్ పద్దు రాసిన ముద్దు
    సతి కి అవధుల్లేని ముద్దు
    వారిజనేత్ర కు కనులార ముద్దు
    కంబుకంఠికిన్ కానుక ముద్దు !


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. రాముడనంతసత్వు డభిరామగుణాఢ్యుడు సీత కోరగా
    నా మహితాత్ము లక్ష్మణుని యచ్చట రక్షగనుంచి తానికన్
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
    హైమమృగంబు దెత్తునని యద్భుతరీతిగ బల్కెనప్పుడున్.

    రిప్లయితొలగించండి
  3. ఆమనిలోన నొక్క హృదయంగమమైన వేళ సుందరా
    రామమునొద్ద చేరి ప్రియురాండ్రను కౌగిట జేర్చి నాయకుల్
    ప్రేముడి కాన్ కలిత్తురట వేడుకగా సరసోక్తులాడుచున్
    భామకు, లేమకున్, సతికి, వారిజనేత్రకు, కంబుకంఠికిన్

    రిప్లయితొలగించండి
  4. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    శ్రీ వసంత కిశోర్ గారు అడిగిన యతుల గూర్చి ఈ క్రింది వివరించుచున్నాను:

    6. పంచమీ విభక్తి యతి:
    పంచమీ విభక్తిలో పదముల చివర అన్నన్, అంటెన్ అనునవి చేరునపుడు వీటి ఆద్యచ్చుకే కాక ఆ అచ్చుతో కూడిన హల్లుకు కూడ యతి చెల్లును.
    ఉదా: నిన్ను జెరగొన్న హైహయు
    కన్నన్ దోర్వీర్య మెక్కుడగు భార్గవులీ
    లన్నిర్జించిన రాముని
    కన్నన్ శూరుడు ముజ్జగంబుల గలడే
    (2వ పాదములో అచ్చునకు, 4వ పాదములో హల్లునకు యతి చెల్లినది).

    7. ఫ్లుత యుగ మిశ్రమము:
    కాకుస్వర (శోక భయాదులవలన కలిగిన ధ్వని) ఫ్లుత (దూరాహ్వానము, రోదనము, గానము, సంశయము స్ఫురించునప్పుడు వచ్చు దీర్ఘ స్వరము) యతులకు చెందిన పదాంతాచ్చులు పరస్పరము యతి చెల్లినను, అచ్చులతో కూడిన హల్లులు పరస్పరము యతి చెల్లినను ఫ్లుగయుగ యతి యగును.
    ఉదా: మాయ రవియేల గ్రుంకడొ
    కో యను నిట్లేల దడసెనో యను గ్రుంకం

    8, విశేష యతి:
    జ్ఞకారమునకు క, ఖ, గ, ఘ లు యతి చెల్లవచ్చుననియు ఇట్లు చెల్లుట విశేషయతి యగునని అప్పకవి యొక్కడే చెప్పినాడు.
    ఉదా: జ్ఞానికి కేవల కృప న
    జ్ఞానికి నుపదేశ విధి బ్రకాశము సేయం

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులారా!
    నా పద్యము 1వ పాదములో చివర గణభంగము చోటు చేసుకొనినది. ఆ పాదమును ఇలా సవరించుదాము:

    "ఆమనిలోన నొక్క హృదయంగమమౌ సమయాన సుందరా"

    రిప్లయితొలగించండి
  6. ఆమని నేసినట్టి హరితాంబరమూనిన భూరుహమ్ములున్
    భామినివోలె రమ్యముగ పాతరలాడెడు పిల్లయేరులున్
    కామునివంటివానిజత కల్గిన సీమ పసందుకాదోకో
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్

    రిప్లయితొలగించండి
  7. శ్రీమురళీధరుండటకు శీఘ్రమెచేరెడు యాశ మ్రోయుచున్ (లేక ఆశ మోయుచున్)
    గోమలరాగమెద్దొతమ గుండెలఁదాకుచుశ్వాసలొత్తగాఁ
    స్వామినిఁ బొందుటై, తనర భావజుకేళిని కోర్కులయ్యఁ!బో!
    భామకు, లేమకున్, సతికి, వారిజనేత్రకు, కంబుకంఠికిన్!

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమ:

    శ్రీకృష్ణుడు తనలో తాను యిలా అనుకొంటున్నాడు.

    ఏమని చెప్పుకొందునిక యింతుల బాధలు నేను కృష్ణుడన్,
    మోమున కోపతాపములు ముచ్చట లాడగ మూతి త్రిప్పుటల్
    శ్రీమతి యల్క బూనినది శీఘ్రమె తేవలె పారిజాతముల్
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్.

    రిప్లయితొలగించండి
  9. సోముని చంద్రిమల్ మిగుల సుందరమొప్పగ వెల్గుచున్నవీ
    యామిని వేళలన్, మగని యాగమమెంతయు వేడుకాయె; నా
    శ్యామల మూర్తి పాదముల జక్కగ సేవలు జేయ మోదమా
    భామకు, లేమకున్, సతికి, వారిజనేత్రకు, కంబుకంఠికిన్!

    రిప్లయితొలగించండి
  10. కోమలి చేయి బట్టి పతి కూడెను శయ్యను సంతసంబుతో
    ప్రేమగ పూల నిచ్చె సఖి ప్రేయసి కిచ్చెను పట్టు చీరె, తా
    రామణి హారమిచ్చి దరి రమ్మనె దాలిచి, ముద్దులిచ్చె తా
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్.

    రిప్లయితొలగించండి
  11. 2.
    నీమము దప్పి నిష్ఠురతనిండిన వాక్యములాడుచుండి తా
    నామెకు మైత్రిజూపక యనాదరభావముతోడ సాధ్వియౌ
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
    కామితమందనీక బహుకష్టముగూర్చగరాదు భర్తకున్.

    3.
    ధామము చేరినట్టి పతిదైవము చెంతన నిల్చి మాటలన్
    ప్రేమనుజూపి, నీరమిడి వీవనవీచుచు, ధర్మపత్నియౌ
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
    స్వామిని సేదదీర్చి పరిచర్యలు చేయుట ధర్మమెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  12. 4.
    నామదిదోచినట్టి నిజనాథుడె సర్వశుభప్రదాత, స
    ర్వామరతుల్యుడంచు సుమభాసురభావము గల్గియున్నదౌ
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
    ధీమణి కెల్లకామనలు దీరును చేరును సౌఖ్యసంపదల్.

    రిప్లయితొలగించండి
  13. గ్రామములందు పండితులు గ్రంథములన్ని పఠించి చెప్పుచో
    నీమము తప్పకుండగను నిత్యము జీవిక సాగిపోవు; నీ
    వేమిక చేయగల్గుదువు; యింటిని వీడిన మంచిదౌనె, యే
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్?

    రిప్లయితొలగించండి
  14. గ్రామవాసాన్ని వదలి పట్నాలకు చేరేవారందరకీ అనుభవమే కదా, సత్సంప్రదాయాలను పాటించే వీలు పట్నాల్లో ఎంతమాత్రం వీలుంటుందో...?

    గ్రామములందు పండితులు గ్రంథములన్ని పఠించి చెప్పుచో
    నీమము తప్పకుండగను నిత్యము జీవిక సాగిపోవు; నీ
    వేమిక చేయగల్గుదువు; యింటిని వీడిన మంచిదౌనె, యే
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్?
    యే మగవానికైననిక నెవ్వరి కైనను పట్టణమ్ములన్?

    రిప్లయితొలగించండి
  15. శ్రీమదుమా మహేశ్వరికి, శిష్టజనావన శీలికిన్, కృపా
    ధామకు, శైలపుత్రికి, బుధప్రకర స్తుత సచ్చరిత్రకున్
    కామితదాయికిన్, సుజన కల్పమహీజకు, శంభుపత్నికిన్
    సోమకళావిభూషణికి, సుందరగాత్రికి, విశ్వమాతకున్
    కామసుపూజితాంఘ్రికి, జగత్త్రయపోషిణికిన్, భవానికిన్
    హేమవిభూషణాన్వితకు, నింద్రముఖామరబృంద వంద్యకున్
    సామజయానకున్, నిగమసార సువందిత శుద్ధ కీర్తికిన్
    కోమల మానసాంబుజకు, ఘోరమహాసురలోకహంత్రికిన్
    తామరసాక్ష సేవితకు, ధర్మనిధానకు, చిత్స్వరూపకున్
    ప్రేమరసాఢ్యకున్, నిగమవేద్యకు, సర్వశుభప్రదాత్రికిన్
    భామకు, లేమకున్, సతికి, వారిజనేత్రకు, కంబుకంఠికిన్
    నామసహస్రపూజలు ఘనమ్ముగ సల్పుదు నెమ్మనమ్మునన్

    రిప్లయితొలగించండి
  16. శ్యామల మోహనాంగునికి శంఖము చక్రము బూనువానికిన్,
    స్వామికి రామచంద్రునికి చల్లని చూపుల రాకుమారుకున్;
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్,
    హేమము బోలు వర్ణమున నెల్లర నబ్బురజేయు సీతకున్,
    నామది యందు వేడుకగ నావుడు పెండ్లిని జేసిచూచితిన్.

    రిప్లయితొలగించండి
  17. ఏమిది ప్రేయసీ యలుక లింతగ నీ సఖు పైన న్యాయమే
    కామిని దాసు నేరములు కావటె దండము తోడ చెల్లు నా
    భామిని యంచు మాధవుడు పాదము లంటి నమస్కరించె నా
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్

    రిప్లయితొలగించండి
  18. నేమాని పండితార్యా అమ్మవారికి శుభానామోత్పలమాలిక అద్భుతంగా కూర్చి సమర్పించారు.

    రిప్లయితొలగించండి
  19. రాముని ధర్మ పత్నికిని రాఘవ మూర్తి యశో విభూతికిన్
    భూమిజకు న్నయోధ్యపురపుణ్య లలామ సతీత్వకీర్తికిన్
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
    వేమరు మ్రొక్కెదన్ నుతులివే యని పల్కెద భక్తి మీరగన్.

    రిప్లయితొలగించండి
  20. విభిన్నమైన పూరణలు బ్లాగును చక్కగా అలంకరించాయి.
    అలంకృతమైన కోవెల లో అమ్మవారికి పండితుల వారిచేత సహస్రనామార్చన మానసపూజ అందర్నీ కృతార్థులను గావించింది.
    మిత్రులందరికీ శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. నీమము వీడకుండగను నిర్మల చిత్తము భక్తి మీరగా
    తామర పూవులన్ తనివి తీరగ దేవికి పూజ చేసెదన్ !
    నామన సంతయున్ ముదము రాగిల శాంభవి శూలపాణికిన్ !
    భామకు లేమకున్ సతికి వారిజ నేత్రకు కంబుకంఠి కిన్ !

    రిప్లయితొలగించండి
  22. ఆమని వింతలోయనగ నాదిప్రణాళిక లావహించగా
    భామల కోరికల్ వినగ భాసిలు భూమికి నాకశంబుకున్
    ప్రీతిగ చెంతజేరి మురిపించుచు గారవమంద వేడుకన్
    భామకు లేమకున్ సతికి వారిజ నేత్రకు కంబుకంఠి కిన్ !

    రిప్లయితొలగించండి
  23. సోమ కళావతంసకును సోమఖగాగ్నివినేత్రుపత్నికిన్
    శ్యామల గాత్రకున్ భువన సంచయ పోషకు చారుహాసకున్
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
    నామ సహస్రకున్ ప్రణవ నాదకు సన్నుతులున్నతుల్ సదా..

    రిప్లయితొలగించండి
  24. అవును లక్ష్మీదేవి గారూ అమ్మవారి నామాలతో శంకరాభరణం దివ్య శోభాలీనుతోంది.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ సరస్వత్యై నమః:
    అమ్మా శ్రీమతి లక్శ్మీదేవి గారూ!
    మీ 3వ పద్యములో కొన్ని సవరణలను సూచించుచున్నాను. చూడండి.
    2 వ పాదములో చివరన రాకుమారుకున్ అని అన్నారు. దానికి బదులుగా ధర్మమూర్తికిన్ అనండి. (రాకుమారునికి అనాలి లేదా రాకుమారునకున్ అనాలి.)

    అలాగే ఆఖరి పాదమును ఇలాగ మార్చండి:
    నా మదిలోన పెండిలి యొనర్చి సమాదరరీతి బొంగితిన్.

    అమ్మా శ్రీమతి రాజేశ్వరి గారూ!
    మీ పద్యమును ఇలాగ మార్చండి:
    నేమము వీడకుండగను నిర్మల చిత్తమునందు భక్తితో
    తామరపూలతో వ్రతవిధమ్మున దేవికి పూజ చేసెదన్
    నామనసంతయున్ ముదమునన్ వెలుగొందగ విశ్వమాతకున్
    భామకు, లేమకున్ .. .. ..
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా:
    ఈనాటి సమస్య తొలుత సారము లేనిదేమో అనిపించినా రాను రాను మంచి మంచి పూరణలకు తావునిచ్చినది. సంతోషము.

    1. శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారు : 4 విధాలుగా పూరించేరు.
    (1) రాముడు - బంగరులేడి; (2) భర్త భార్యను కష్టపెట్టకుండా చూచుకొనుట; (3) పతివ్రత లక్షణములు అంద్ (4) పాతివ్రత్య ఫలితము. పద్యాలు, భావములు బాగున్నవి.

    2. శ్రీమదాదిభట్ల వారు: అందమైన పరిసరాలలోని ఆనందమును చక్కగా వర్ణించేరు.
    బాగున్నది.

    3. శ్రీ రామకృష్ణ గారు: గోపికల వ్యవహారమును చక్కగా వర్ణించేరు. బాగున్నది.

    4. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు: సత్యభామ గూర్చి శ్రీకృష్ణుని ఆవేదనను వర్ణించేరు. బాగున్నది.

    5. శ్రీమతి లక్ష్మీదేవి గారు - 3 విధములుగ వర్ణించేరు.
    (1) పతివ్రత విధానమును; (2) గ్రామములో పండితుల ఉనికి పురాణ జ్ఞానము; (3) సీతారామ కళ్యాణము (మనసులో) -- బాగున్నవి.

    6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు శృంగార రసమును చక్కగా పోషించేరు. బాగున్నది.

    7. శ్రీ మిస్సన్న గారు: 2 విధములుగా వర్ణించేరు
    (1) సత్యభామా విలాసము;(2) సీతాస్తవము; బాగున్నవి.

    8. శ్రీమతి రాజేశ్వరిఉ గారు 2 విధములగా వర్ణించేరు.
    (1) దేవీపూజ; (2) ఆమని శోభను గురించి; బాగున్నవి.
    అందరికీ సుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. నా మనసైన నెచ్చెలికి నా సుమ గంధికి నీలవేణికిన్
    నా మధు రోష్ఠికిన్ వలపు నావకు నాకలకంఠి నాతికిన్
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
    ప్రేమ సుధాతరంగిణికి ప్రేయసికి న్నవపారిజాతముల్.

    రిప్లయితొలగించండి
  28. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఏప్రిల్ 08, 2012 11:00:00 PM

    గురువుగారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. ఎంతో శ్రమకోర్చి నేనడిగిన వివరములు సమకూర్చి పెట్టిన
    నేమాని వారికి ధన్యవాద ,వందన శతములు !

    రిప్లయితొలగించండి
  30. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    "జగదేక వీరుని కథ" సినిమాలో అన్నగారు,జయంతి (ఇంద్రకుమారి) ,
    నాగిని(నాగకుమారి),వారుణి(వరుణకుమారి),మరీచి (అగ్నికుమారి)
    లను వివాహమాడిన పిదప , జయంతితో ముచ్చట లాడుతుండగా చూచిన
    నాగకుమారి అలిగి ఒక మూలన చుట్ట చుట్టుకొని పడుకొంటుంది !
    అది గ్రహించిన ఇంద్రకుమారి , అనేక రూపములు పొంద గలిగిన
    మంత్రమును ప్రియుని కుపదేశిస్తుంది !

    ఆ మంత్ర సిద్ధితో అన్నగారు నాలుగు రూపములు ధరించి
    నలుగురినీ ఆనంద వివశుల్ని చేస్తాడు "ఐనదేమో ఐనదీ "
    అనే పాటతో ! అయ్యా ! అదీ సంగతి !

    01)
    ________________________________________________

    తామస పుత్రి కోపమును - తాళగ జాలని వీరు డయ్యెడన్
    తామస మింక జేయకను - తక్కిన భార్యల కింపు గూర్చగాన్
    తా,మరి నాల్గు రూపములు - దాల్చెను,చిత్రము,మంత్ర సిద్ధితోన్
    భామకు ,లేమకున్, సతికి - వారిజ నేత్రకు , కంబుకంఠికిన్
    ప్రేమను బంచెనే;విరిసి - ప్రేయసు లందరు ప్రీతి జెందగాన్ !
    ________________________________________________
    తామసము = పాము,ఆలస్యము
    విరియు = ఉప్పొంగు

    రిప్లయితొలగించండి
  31. భార్యలకు తల వంచే పురుషులు :

    02)
    ________________________________________________

    పామరు లైన వా రకట - భామల మెప్పును పొంద గోరుచున్
    పాములవాని యూపులకు - పాములు యూగెడి భంగి నూగుచున్
    భామకు ,లేమకున్, సతికి - వారిజ నేత్రకు , కంబుకంఠికిన్
    బాముల వెన్నొ యోర్చి తమ - భామల కోర్కెలు దీర్చు కోసమై
    వామను లౌదురే పురుష - వర్యు లదే మిల ? నెంత చిత్రమో !!!
    భామల మీది ప్రేమమును - పార్వతి నాథుని మీద నిల్పినన్
    వేమరు జన్మలెత్తు పని - వీడును; శాశ్వత సౌఖ్య మందెడిన్ !
    ________________________________________________
    పామరుడు = అజ్ఞుఁడు
    బాము = కష్టము
    వామనుడు = పొట్టివాఁడు (స్త్రీల ముందు మోకరిల్లడం )

    రిప్లయితొలగించండి
  32. సమస్యను పూరించిన కవిమిత్రులు......
    సత్య నారాయణ మూర్తి గారికి,
    పండిత నేమాని వారికి,
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి,
    రామకృష్ణ గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    వసంత కిశోర్ గారికి
    ............. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    అందరి పూరణల గుణదోష విచారణ చేస్తున్న శ్రీ పండిత నేమాని వారికి కృతజ్ఞతలు.
    యతి భేదాలను వివరిస్తున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  33. ఈ సమస్యకు గురుతుల్యులు శ్రీ నేమాని వారు చేసిన సహస్రనామార్చన అత్యద్భుతంగా ఉంది. కవిత్వమంటే ఇలాఉండాలనిపించేలా అలనాటి అల్లసాని పెద్దనగారి ఉత్పలమాలికను తలపించింది. ఇంత చక్కని మాలికను అందించిన పండితులవారికి శతాధిక అభివాదములు, ధన్యవాదములు.
    నేమాని పండితార్యుల
    నామార్చనమద్భుతంబు, నరులందరికిన్
    కామిత సుఖఫలదాయక
    మై మోదములందజేసి యఘముల బాపున్.

    మీమాటలు మంత్రములై
    మా మా హృదయాలు దాకి మైమరపించెన్
    నేమాన్యన్వయజాతా!
    శ్రీమాతయె మీకు గూర్చు సిరులు యశంబుల్.

    రిప్లయితొలగించండి
  34. అమిత్ షా ఉవాచ:

    జామున జామునన్ తలచి చాటుగ మాటుగ నక్కిచూచుచున్
    నీమము తోడుతన్ క్షణము నిందలు మోపక కప్పిపుచ్చుచున్
    గోముగ నిచ్చెదన్ వలపు గొప్పగ నేలెడు వంగరాణియౌ
    భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్

    సతి = దుర్గ

    రిప్లయితొలగించండి