10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఆహ్వానము

వివాహ మహోత్సవాహ్వానము

స్వస్తిశ్రీ నందన నామ సంవత్సర చైత్ర బహుళ దశమి
తేదీ. 15-4-2012 ఆదివారము రోజున ఉదయము 9-35 గంటలకు
శ్రవణా నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తమున


మా ఏకైక కుమారుడు

చిరంజీవి క్రాంతి కుమార్ M.C.A., (M.Tech.,)

వివాహము

శ్రీ కావేటి సాంబయ్య, విజయ దంపతుల కనిష్ఠ కుమార్తె

చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కల్పన (M.B.A.,) తో

జరుపబడును. కావున తామెల్లరు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించగలరని ప్రార్థన.

వివాహ స్థలము:
శ్రీ పౌడాల వనరాజు గారి గృహమున
ఆరెపల్లి గ్రామము
హన్మకొండ మండలము
వరంగల్ జిల్లా.


విందు:
వివాహానంతరము


భవదీయులు
కంది శంకరయ్య - శాంతి.
______________________________________
శ్రీ తిరుమలగిరి క్రాంతి కుమార్, స్వాతి దంపతుల అభినందనలతో...

16 కామెంట్‌లు:

  1. నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు, శుభాసీస్సులు..

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా!
    సంతోషం,
    కాబోవు వధూవరులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు.

    రిప్లయితొలగించండి
  3. హితులారా! మన శంకరయ్య సఖులెంతే ప్రేమతో పిల్వగా
    సుతు కళ్యాణ మహోత్సవమ్ము కొరకై శుద్ధాంతరంగమ్ము రం
    జితమయ్యెన్ శుభలేఖ చూడగనె యా శ్రీమూర్తులన్ జూచి య
    క్షతలన్ చల్లగ జల్లి పొందమె మదిన్ సంతోషమెంతేనియున్

    రిప్లయితొలగించండి
  4. శుభకార్యము జయమవగా
    సభికులు దంపతులను కడు చల్లగ దీవిం
    చి, భుజించి చనగ మీకును
    శుభములు కలుగు గురువర్య! చూడుమిక సదా!

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! సంతోషం !
    నూతన దంపతులకు శుభాసీస్సులు !

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! సంతోషం !
    నూతన దంపతులకు శుభాశీస్సులు !

    రిప్లయితొలగించండి
  7. ఆది దంపతు లై నట్టి యాది దేవు
    డాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    కంటికిని ఱె ప్ప యట్లయి కాచు గాత !
    ఇవ్వధూవర్ల కారుణ్య మింపు మీఱ

    రిప్లయితొలగించండి
  8. నూతన వధూవరులకు హృదయ పూర్వక శుభా కాంక్షలు. శుభాశీస్సులు

    రిప్లయితొలగించండి
  9. నందను కొఱకని శంకరు
    పొందిక గల భామ తోడ పొందు కుదిర్చెన్
    నందంబగు నా జంటకు
    నందరు నాశీ స్సు లీ య నా శింతు మదిన్

    రిప్లయితొలగించండి
  10. నూతన వధూవరులకు సకల శుభములు భగవంతుడు సమకూర్చు గాక !

    రిప్లయితొలగించండి
  11. మరికాసేపట్లో దంపతులు కాబోతున్న నూత్న వధూవరులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు.
    శ్రీలు గురిపించి, సద్యశశ్శ్రీల నొసగి,
    సుందరంబైన సంతతి నందజేసి,
    యిందిరాధవుడాశీస్సు లిచ్చుగాత,
    క్రాంతి కల్పనలకెపుడు ఘనముగాను.

    రిప్లయితొలగించండి
  12. శంకరాత్మజు డందించు సకలదుడయి
    శంకరాత్మజు కన్నింట జయము సిరులు
    క్రాంతి కికపైన సుఖము సత్సంతతులను
    కల్పనాఖ్యను పత్నిగా గనుటచేత.

    రిప్లయితొలగించండి
  13. ఇది శ్రీ కంది శంకరయ్య గారికి లేఖాముఖంగా విన్నవించికొన్న శుభాకాంక్షితం:

    విద్వన్మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
    నమస్సులతో,

    మీ ఆహ్వానపత్రికకు ధన్యవాదాలు.

    మీ ఇంటిల్లిపాదికీ మా అభినందనలు.

    పూర్వపుణ్యఫలంగా దంపతులు కానున్న

    చి. క్రాంతి కుమార్ – చి. సౌ. కల్పన

    లకు వైవాహిక శుభవేళ కళ్యాణవేదికపై ఈ మా శుభాకాంక్షితాన్ని చదివి వినిపింపవలసినదిగా ప్రార్థన.

    ఓ నవవధూవరులారా!

    ఆదర్శం బగు ప్రేమ మిట్టి దనున ట్లర్ధాంగి కర్ధాంగ మా
    హ్లాదం బొప్పఁగ నిచ్చి విశ్వమున కత్యంతమ్ము దాంపత్యమ
    ర్యాదం జాటిన పార్వతీశ్వరుఁడు మీ కన్యోన్యతాగౌరవా
    హ్లాదోపేతచిరాయురభ్యుదయసౌఖ్యశ్రీలు సంధించుతన్.

    అని.

    సర్వ శుభాకాంక్షాపురస్సరంగా,
    ఏల్చూరి మురళీధరావు, లక్ష్మి

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రుల ఆశీస్సులతో, శుభాకాంక్షలతో మా అబ్బాయి వివాహం ఆనందోత్సాహాతో జరిగింది. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఇంకా పెళ్ళి పనుల వల్ల వ్యస్తుణ్ణై ఉండడంవల్ల వివరంగా వ్యాఖ్యానించలేకపోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి