21, ఏప్రిల్ 2012, శనివారం

శ్లోకానువాదము


తరుణులకాదరణ

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః
|
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాః తత్రాఫలాః క్రియాః
||

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి
అనువాదము


వనితల కెందు నెందు సమభావన తోడ లభించుచుండునో
ఘనమగు గౌరవమ్మచట క్రాలు నిరంతర శాంతిసౌఖ్యముల్
మన మలరంగ నచ్చట నమర్త్యులు నొప్పుదు, రెందు మానినుల్
కనరొ సుఖమ్ము లట్టియెడ కార్యములెల్లను నిష్ఫలమ్ములౌ.

5 కామెంట్‌లు:

  1. స్వేచ్ఛానువాదం :

    _________________________________


    స్త్రీలు పూజింపబడుచోటె - సిరులు వెలయు !
    స్త్రీలు పూజింపబడు చోటె - శ్రేయముండు !
    స్తీలు పూజింపబడు చోటె - స్వేచ్ఛ మెండు !
    స్ర్తీల దూషించు చోటెల్ల - శిక్ష లుండు !
    చేయ తలపెట్టు కార్యముల్ - చేదె యగును !

    _________________________________
    శిక్ష = శాస్తి

    రిప్లయితొలగించండి
  2. బారులు దీరెద రమరులు
    నారిని పూజించుచోట, నానా సుఖముల్
    నారిని అవమానించిన
    దూరముగా తొలగిపోవు, దు:ఖము గలుగున్.

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    . నిజమే స్త్రీలను గౌర వించి , అభిమానించి , ఆదరించి ,పెద్ద పీటవేసిన మన సంస్కృతి శ్లాఘ నీయం .ఆ విలువను కాపాడు కోగలగడం ముదావహం. చాలా మంచి శ్లోకాన్ని అందించిన గురువులకు పాదాభి వందనములు .

    రిప్లయితొలగించండి
  4. నిజమే స్త్రీలను గౌర వించి, అభిమానించి, ఆదరించి, పెద్ద పీటవేసిన మన సంస్కృతి శ్లాఘనీయం. కాని అదే మను స్మృతి స్త్రీలను పిల్లల్ని కనే సాధ నాలుగా మాత్రమే చూసింది. ”తల్లులయ్యేందుకు మాత్రమే స్త్రీలు సృష్టించబడ్డారు” అన్నాడు మనువు. ”తన చిన్నతనంలో తండ్రిచేత, యవ్వ నంలో భర్తచేత, వృద్ధాప్యంలో కుమారునిచేత రక్షింపబడుతుంది గనుక స్త్రీ స్వాతంత్య్రానికి అర్హురాలు కాదు.” మనుస్మృతిలోని ఈ భాగాన్ని ఉటంకించని, దానిని విమర్శించని మహిళలు ఎవరూ వుండరు కూడా. కాబట్టి ఒక రాతను చూసి లేదా రాతలో ఒక కోణాన్ని మాత్రమె చూసి మనువు పట్ల గాని, మనుస్మృతి పట్ల గాని, మన సంస్కృతి పట్ల గాని ఒక గొప్ప అభిప్రాయాన్ని ప్రకటించుకోవడం తొందరపాటు చర్య అనిపించుకొంటుందేమో

    రిప్లయితొలగించండి
  5. vmakumar గారూ,
    శంకరాభరణం బ్లాగును వీక్షించి స్పందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి