9, ఆగస్టు 2012, గురువారం

పద్య రచన - 76

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. నా కృతి మనోమందిర కృష్ణ శతకమునుండి:

    శ్రీలాలిత్య కళావిలాస! పరమ ప్రేమాలయా! చిన్మయా!
    లీలా మానుష విగ్రహా! సరసకేళీలోల! గోపాలకా!
    నీ లీలల్ మది విందుజేయుగద తండ్రీ! మాకు నో సత్కృపా
    శాలీ! నీ పద పద్మముల్ తలతు కృష్ణా! మన్మనోమందిరా!

    శ్రీమన్మూర్తి! మునీంద్ర హృత్కమలవర్తీ! దేవకీనందనా!
    ప్రేమానంద సుధాప్రపూర్ణ హృదయా! విశ్వంభరా! గోపికా
    రామా! నీ చరితమ్ము లద్భుతములై రంజింప జేయున్ మమున్
    స్వామీ! నీ పద పద్మముల్ తలతు కృష్ణా! మన్మనోమందిరా!

    శ్రీరాధారమణీ సమేత! కలవంశీ గానమాధుర్య లో
    లా! రాజీవ దళాయతేక్షణ! క్షమాలంకార శోభాన్వితా!
    నీ రూపమ్మును గాంచినన్ గలుగు నెంతే శాంతి సౌభాగ్యముల్
    శౌరీ! నీ పద పద్మముల్ తలతు కృష్ణా! మన్మనోమందిరా!

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ!
    మీ పద్యము 2వ పాదములో యతి వేయలేదు. ఇలా మార్చండి ఆ పాదమును:

    "అష్టమ గర్భునిగ కృష్ణు డవనిన్ వెలసెన్"

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. నీలదేహము మోహనమ్మది నింగిబోలుచు నుండునే!
    బాలకృష్ణుని వేణునాదము పారవశ్యము పెంచునే!
    పాలసంద్రము జేతు నా మది పవ్వళింపవె శ్రీహరీ!
    మ్రోలవాలితి నయ్య శీఘ్రమె మ్రొక్కులందవె నీవిదే!

    రిప్లయితొలగించండి
  5. అమ్మా! లక్ష్మీ దేవి గారు!
    శుభాభినందనలు. బాగున్నది మీ పద్యము. మత్తకోకిల గానముల్ హరి మానసమ్మును దోచుగా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. అష్టమి రోహిణి పొద్దున
    అష్టమ గర్భునిగ కృష్ణుడవనిన్ వెలసెన్
    ఇష్టముగ పూజ సేసిన
    కష్టము లిక మనకు దొలగు కన్నని దయ చేన్.

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారి పద్యము....

    శ్రీశా! మన్మథ తాత! శార్ఙ్గి! మధుజి! చ్ఛ్రీ కౌస్తుభాంకా! హరీ!
    దాశార్హా! జయ! హేమశంఖ! మురజి! ద్బ్రహ్మేంద్ర సంపూజితా!
    కేశా೭నంత! హిరణ్యగర్భ! ధరభృ! త్కృష్ణా! భవోన్మూలకా!
    ధీశాలీ! మధుసూదనా! వరద! హే దేవాధిదేవా నమ: !!

    రిప్లయితొలగించండి
  8. అయ్యా శ్రీ మధుసూదన్ గారూ! అభినందనలు. మీ పద్యము "శ్రీశా......" సంస్కృత పద భూయిష్ఠమై అలరారుచున్నది. అయితే సంబోధనలను తెలుగు వ్యాకరణము ప్రకారముగా చేసేరు. ఛందో నియమములను కూడా తెలుగులో లాగే యతి ప్రాసలను వేసేరు. బాగున్నది.ధరభృత్ అన్నారు - అది ధరాభృత్ అని యుండాలి. మధుజిత్ అని 1వ పాదములోను, మధుసూదన అని 4వ పాదములోను వాడేరు. ఏదో ఒకటే ఉంచి 2వ దానిని మార్చితే బాగుంటుంది. కేశానంత అన్నారు - క (బ్రహ్మ) + ఈశ (శివుడు) + అనంత (విష్ణువు) వెరసి త్రిమూర్త్యాత్మకమని మీ ఉద్దేశము అనుకొంటాను. బాగున్నది. మీ పద్యం ప్రశంసనీయముగా నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. వెన్నల దొంగకు భక్తుల
    వెన్నుగ దన్నుగ నిలచెడు విశ్వంభరుకున్
    కన్నయ్యకు నా ద్రౌపది
    కన్నయ్యకు సకల జగతి కన్నయ్యకు జై.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! చిన్న అందమైన కంద పద్యమును వ్రాసేరు. అభినందనలు. కొన్ని సూచనలు:
    (1) విశ్వంభరుకున్ అనరాదు. విశ్వంభరునకున్ అనాలి. అందుచేత ఆ స్థానములో విశ్వేశునకున్ అని మార్చుదాము.
    (2 జై అనుటకు బదులుగా జే అని మార్చుదాము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

    పండిత నేమానివారికి ధన్యవాదములు! తమవంటి పెద్దల మెప్పును, సద్విమర్శను సహృదయతతో స్వీకరించుచున్నాను. నేను 'ధరభృత్' శబ్దమును 'గిరిధారి' యను నర్థమున ప్రయోగించితిని. చూ."మహీధ్ర శిఖరి క్ష్మాభృ దహార్య ధర పర్వతా:" -అమరం. ఇక 'మధుసూదనా' యనునది ప్రమాదపతితము. చిత్తుప్రతిలో 'గరుడధ్వజా' యని వ్రాసి, యెందువలననో యీ పదము చేర్చితిని. తప్పే. క్షంతవ్యుడను. తమరూహించినట్లు'కేశానంత' శబ్దము, త్రిమూర్త్యాత్మకమైన 'కేశవ' శబ్దమే! ధన్యవాదములతో...

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి సవరించిన పద్యము....

    గుండు మధుసూదన్ గారి పద్యము....

    శ్రీశా! మన్మథ తాత! శార్ఙ్గి! మధుజి! చ్ఛ్రీ కౌస్తుభాంకా! హరీ!
    దాశార్హా! జయ! హేమశంఖ! మురజి! ద్బ్రహ్మేంద్ర సంపూజితా!
    కేశా೭నంత! హిరణ్యగర్భ! ధరభృ! త్కృష్ణా! భవోన్మూలకా!
    ధీశాలీ! గరుడధ్వజా! వరద! హే దేవాధిదేవా నమ: !!

    రిప్లయితొలగించండి
  13. మురళీ గానంబాపిన
    మరిమరి యాతన్మయమ్మెపరపుకురాకన్
    పరిమళపు చిన్ని కృష్ణుని
    దరిజేరిమధుపములవియె ధన్యత నొందెన్

    రిప్లయితొలగించండి
  14. అయ్యా
    సహదేవుడు గారూ!
    మీ పద్యము బాగున్నది. అభినందనలు. మీ పద్యములో చిన్న సవరణలు చేసేను ఇలా:

    మురళీ గానంబాపిన
    మరి మరి యా తన్మయమున మరువక నలరెన్
    పరిమళపు చిన్ని కృష్ణుని
    దరి జేరిన మధుప రాజి ధన్యత నొందెన్

    రిప్లయితొలగించండి
  15. శ్రీ పండిత నేమాని వారికి నమస్కారములు. నా పద్యములోని దోషముల సూచించి తగిన సవరణలను చేసినందులకు ధన్యవాదములు.
    సవరణలతో...
    వెన్నల దొంగకు భక్తుల
    వెన్నుగ దన్నుగ నిలచెడు విశ్వేశునకున్
    కన్నయ్యకు నా ద్రౌపది
    కన్నయ్యకు సకల జగతి కన్నయ్యకు జే.

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులకు వందనములు.తగుసవరణలు చేసినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. నందకిశోరుడా,నవనీతచోరుడా,
    చిలిపిచేష్టలుచేయుచిన్నవాడ,
    ఆశ్రితపోషణా ,అసురసంశోషణా,
    మానినీమన్మథా,మదనగోప,
    రాజ్యాంగవేత్తవై,రాక్షసహారివై,
    రణరంగధీర,విరాట్స్వరూప,
    దీనసమ్రక్షకా,దివ్యతేజోరూప,
    ధర్మసంస్థాపనాదర్శమూర్తి,
    అతినిగూఢగీతాయోగ,మవనిజనుల,
    కెల్లనమృతోపదేశమ్ము,నెలమినిచ్చి,విశ్వగురుపీఠమెక్కిన,విశ్వరూప,
    ఇన్నిభంగులవర్తించునిన్నెతలతు.

    నీ తెలికన్నులందు,నవనీలకనీనికలందు ,మెత్తనౌ
    లేతగులాబిపూపెదవి,లీలగదోచెడి మందహాసమే
    దో తెలియంగరాని మధురోహల రేపి తపింపజేయు మా
    చేతములుల్లసిల్లు తులసీవనమాలి,సరోజవీక్షణా.

    రిప్లయితొలగించండి