12, ఆగస్టు 2012, ఆదివారం

సమస్యాపూరణం - 790 (లే లే నా రాజ యనిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ!
(ఈరోజు సమస్య ఏమివ్వాలా అని ఆలోచిస్తుంటే
పక్కింట్లోంచి ‘ప్రేమ్‌నగర్’ సినిమా పాట వినిపించింది)

25 కామెంట్‌లు:

  1. గోలగ నుండెడు పాటల
    నీలలు వేయుచును 'స్టెప్పు' లేవేయవలెన్
    ఈలా తరములు మారెను
    'లే లే నా రాజ' యనిన లేవఁడు రాణీ!

    రిప్లయితొలగించండి
  2. ఏల దిగాలుగ నుంటివి?
    లీలగ మనుమండు నిదుర లేచుట కనియా?
    బాలుడ! నిదురించిన మే
    లే లే! నా రాజ! యనిన లేవఁడు రాణీ!

    రిప్లయితొలగించండి
  3. రాజు గారి చిన్న భార్య పెద్ద భార్యతో మొరపెట్టుకొంటున్నట్లు (సరదాగా):
    వాలుజడల చింతామణి
    లాలన చేయ నిక మమ్ములన్మరచితివో
    చాలిక చేతులు కాలును
    లే! లే నా రాజ యనిన లేవఁడు రాణీ!

    రిప్లయితొలగించండి
  4. నా పూరణ "The Other" గా పడింది. దయచేసి గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  5. రాలే పువ్వులె మనుజులు
    కాలుని పాశమరుదేర కాదన గలరే?
    కాలముఁ జేసె మన ప్రభువు
    లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ!!

    రిప్లయితొలగించండి
  6. వేళాయె పాఠశాలకు
    నేలాగుర లేవకున్న నేమిటి నిద్రా ?
    యీ లాగు నయిన నెటులనె?
    లేలేనారాజ యనిన లేవడు రాణీ!

    రిప్లయితొలగించండి
  7. లేలే నారాజ! యనుట
    చాలా యపచారమగును జనపతి యెడలన్
    మేలిడు రీతిన్ బలుకుము
    లేలే నా రాజ యనిన లేవడు రాణీ!

    (క్రొత్తగా కాపురమునకు వచ్చిన రాణికి రాజగురువు చేసిన బోధ)

    రిప్లయితొలగించండి
  8. పాలకునికి వంచనతో
    మాలిమిగా మందుబెట్టి మందుని జేయన్
    ఆలించగ రిపు గర్జన
    లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ!

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    (ప్రణయకలహాన నలిఁగి, దొంగనిద్రనటించు రాజును లేప యత్నించు రాణితో, గడుసరియౌఁ బరిచారిక పలికిన సందర్భము)

    "కైలాటకాఁడు రాజును,
    'లేలే నా రాజ' యనిన, లేవఁడు రాణీ!
    కాలి పయి వాఁతఁ బెట్టిన
    మేలౌఁ; గపటంపు నిదుర మేల్కొనుఁ ద్వరఁగన్!"

    రిప్లయితొలగించండి
  10. మనుమడి గురించి కూతురు రాణి తో తల్లి సంభాషణ:
    గోలయని నీ కుమారుని
    మేలని మాయింటవిడువ మీరలు, చదువన్
    నీ లా వేకువ జామున
    లే!లే! నా రాజ యనిన లేవడు రాణీ!

    రిప్లయితొలగించండి
  11. ఏలా వదినా శోకము
    లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ
    కూలెను దశ కంధరుడే
    యాలించక మంచిమాట నకటా నేలన్.

    రిప్లయితొలగించండి
  12. సరదాగా నా కూతురు జాహ్నవి ఇచ్చిన భావంతో:
    వేళకు సమస్య నీయగ
    లీలగ మేళ్కొని గురువులు లే!లే! పాటన్
    మేలౌ రీతి నిటు లొసఁగె
    "లే లే నా రాజ యనిన లేవడు రాణీ!"

    రిప్లయితొలగించండి
  13. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, ఆర్యులందరికీ
    ప్రణామం!

    శ్రీమదాదిశంకరాచార్యుల వారు అమరుకుని మృతదేహాన్ని చూసి భార్యలు విలపిస్తుండగా చూచిన దృశ్యం –

    “లీలావతు లిందఱ మరు
    కేలినిఁ దనియించు ప్రియుఁ డి కేఁడి? యమరు భూ
    పాలకశిఖామణి! జగము
    లేలే నా రాజ! యనిన, లేవఁడు రాణీ!”

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. యేలీల వెదకి జూచిన
    చాలదు యీ మనుజ జన్మ సారూప్యము నన్ !
    కాలగతి నిలఛి పొయిన
    లేలే నారాజ యనిన లేవడు రాణీ !

    రిప్లయితొలగించండి
  15. లీలావినోదమనుకొనొ?
    మేలెంచెనొకీడుఁగనకమేలములాడెన్
    ఫాలాక్షునిబారిబడెన్
    'లే లే నా రాజ' యనిన లేవఁడు రాణీ!

    రిప్లయితొలగించండి
  16. భక్తప్రహ్లాద సినిమాలో
    భర్త మాట మీరలేక కన్నతల్లి యిచ్చిన విషము త్రాగి , రూపు మారి
    నేల మీద పడిపోయిన ప్రహ్లాదకుమారుని జూచి మరణించాడని
    తలచిన హిరణ్యకశిపుడు , దుఃఖ్ఖిస్తున్న లీలావతితో :

    01)
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_________________________________

    పాలను బట్టిన చందము
    బాలకునకు పట్టి నట్టి - పాషాణముచే
    కాలము తీరెను వానికి !
    లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  17. ఆ బాలుని శవము తన కుమారునిదే ననీ, ఆమె తన భార్యయైన
    చంద్రమతీదేవి యనీ గుర్తించిన హరిశ్చంద్రుడు దుఃఖ్ఖించి
    పిమ్మట తెప్పరిల్లి , శోకవివశయైన చంద్రమతి నూరడిస్తూ :

    02)
    _________________________

    బాలున కాయువు దీరెను !
    ఫాలాక్షుని దరమె వీని - బ్రతికింపంగా ?
    బేలా ! శోకము వీడుము !
    లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
    _________________________

    రిప్లయితొలగించండి
  18. ఆ బాలుని శవము తన కుమారునిదేననీ, ఆమె తన భార్యయైన
    చంద్రమతీదేవి యనీ గుర్తించిన హరిశ్చంద్రుడు దుఃఖ్ఖించి
    పిమ్మట తెప్పరిల్లి , శోకవివశయైన చంద్రమతి నూరడిస్తూ :

    03)
    _________________________

    లేలేత ప్రాయ మందున
    లోలాక్షీ ! పాటు నొందె - లోహితు డయ్యో !
    లోలోన కుంది లాభమె ?
    లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
    _________________________

    రిప్లయితొలగించండి
  19. ప్రమాదంలో మరణించిన కుమారుడు రాజును దలచి దుఃఖ్ఖిస్తున్న
    భార్య రాణి నోదార్చుతూ ఆమె భర్త :

    04)
    _________________________

    జాలే లేనిది మృత్యువు !
    చాలింపగ జేసె సుతుని - చక్కని తనువున్ !
    చాలింక నూరడిల్లుము !
    లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
    _________________________

    రిప్లయితొలగించండి
  20. అగ్ని ప్రమాదంలో మరణించిన కుమారుడు రాజును దలచి దుఃఖ్ఖిస్తున్న
    భార్య రాణి నోదార్చుతూ ఆమె భర్త :

    05)
    _________________________

    జ్వాలా మాలికలం బడి
    కాలుటచే జేరె నయ్యొ- కాలుని దరికే !
    కూలెను మన కల లన్నియు !
    లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
    _________________________

    రిప్లయితొలగించండి
  21. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! - అందరికీ అభినందనలు.

    నిన్నటి సమస్య - సినీ సమస్యే కాని వివిధములైన పూరణలు వచ్చినవి. బాగు బాగు.

    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి స్టెప్పులు ఈలలు వేయుటకు తగినది అనిపించినది. చాల బాగున్నది.

    2. అజ్ఞాత గారు : నిద్రిస్తున మనుమడిని గురించి బాగుగ వ్రాసేరు.

    3. శ్రీ చంద్రశేఖర్ గారు: రాజు గారి చిన్న భార్య & పెద్ద భార్యలను ప్రవేశ పెట్టేరు. చాల బాగున్నది.

    4. శ్రీ జిగురు సత్యనారాయణ గారు: కాలుని రాకను సూచించేరు. చాల బాగున్నది.

    5. శ్రీ సుబ్బరావు గారు పాఠశాలకి వెళ్ళే తొందరలో నున్నారు. చాల బాగున్నది. వైవిధ్యమైన భావము.

    6. శ్రీ తుమ్మల శిరీష కుమార్: పాలకునికి చేసిన మందు విందు గురించి వినూత్నముగా వర్ణించేరు. చాల బాగున్నది.

    7. శ్రీ గుండు మధుసూదన్ గారు ప్రణయ కలహము తరువారి ఘట్టమును ఎంచుకొనినారు. వైవిధ్యముతో నున్నది పూరణ. బాగు బాగు.

    8. శ్రీ సహదేవుడు గారు: 2 విధాలుగా పూరించేరు (1) మనుమడు వేకువజామున లేవడని (2) ఈ సమస్యనే విషయమునే ఎంచుకొన్నారు. చాలా బాగున్నాయి.

    9. శ్రీ మిస్సన్న గారు రావణ నిర్యాణము - విభీషణుడు వదినెకి చెప్పిన మాటలను ఉట్టంకించేరు. బాగున్నది.

    10.డా. ఏల్చూరి వారు జగద్గురువులు శ్రీమదాది శంకరులను ప్రస్తావించేరు - పవిత్రమైన భావము.

    11. శ్రీమతి రాజేశ్వరి గారు: సారూప్యము నొందిన వానిని గూర్చి వ్రాసేరు. బాగున్నది.

    12. శ్రీ రామకృష్ణ గారు: ఫాలాక్షుని బరిన పడిన వానిని (మన్మథుడు కాబోలు) వర్ణించేరు. చాల బాగున్నది.

    13. శ్రె వసంత కిశోర్ గారు: చక్కని 5 పద్యములలో వివిధ సినీమాలలో విషయములను వర్ణించేరు అందముగా వర్ణించేరు. బాగు బాగు.

    అందరికీ మళ్ళీ మళ్ళీ అభినందనలు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. చాలిక నీ మొద్దు నిదుర!
    శ్రీలత, మాలతి, ఇషాని, శ్రీకృప, లలితల్
    నీలా లేటుగ లేవరు!
    లే! లే! నా రాజ! యనిన లేవఁడు రాణీ!

    రిప్లయితొలగించండి
  23. కాలగ ముక్కున్ మూతియు
    వాలమ్మును ముడుచు కొనుచు వడిగా నేలన్
    కూలిన రాహులు బాబను
    లే! లే! నా రాజ! యనిన లేవఁడు రాణీ!

    రిప్లయితొలగించండి


  24. లాలించుము నీవా గో
    పాలుని ముదమారగాను బాలకుమారీ !
    కాలేయము కుంటువడెను
    లేలే నా రాజ యనిన లేవఁడు రాణీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి