18, ఆగస్టు 2012, శనివారం

సమస్యాపూరణం - 796 (నరసింహా! నిన్ను నమ్మి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
నరసింహా! నిన్ను నమ్మి నాశన మైతిన్.

14 కామెంట్‌లు:

  1. శ్రీ గురువుగారికి , శ్రీ నేమాని వారికి నమస్కారములతో

    varamula nichcheDi vibhuDavu
    narasiMhA! ninnu parula nAshanamunakai
    varamaDigitini neravEraka
    narasiMhA! ninnu nammi nAshaana maitin'

    రిప్లయితొలగించండి
  2. చాలా యేళ్ళ క్రితం "నరసింహ నాయుడు" అన్న బోర్డు చూసి సినిమాకు వెళితే, లోపల కూర్చున్న తర్వాత అది కమీషనర్ నరసింహనాయుడనే డబ్బింగ్ సినిమా అని తెలిసింది.

    "నరసింహనాయుడ"ని గని
    పరుగెట్టితిని సినిమాకు. వాడసలు కమీ
    ష్నరునరసింహుడట! అకట!
    నరసింహా! నిన్ను నమ్మి నాశన మైతిన్.

    రిప్లయితొలగించండి

  3. అరమరిక లేక గొలిచెద
    నర సింహా ! నిన్ను, నమ్మి నాశన మైతిన్
    గురువని పూ ర్తిగ వానిని
    నేరిని నిల నమ్మ రాదు నీ శుని దప్పన్

    రిప్లయితొలగించండి
  4. కర మలరెను ప్రహ్లాదుడు
    నరసింహా! నిన్ను నమ్మి, నాశనమైతిన్
    హరి యని గనె సాయుజ్యము
    హిరణ్యకశిపుండు, లోక హితకర శౌరీ!

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పూరణలు.....
    (1వ పూరణ)
    (నరసింహుఁడను వాఁడు ఋణము నెగఁగొట్టి పాఱిపోవఁగ, ఋణదాత యాక్రోశించు సందర్భము)

    నరసంహ నామకున కొకఁ
    డిరవుగ ఋణమిడఁగ, వాఁడు నెగఁగొట్టి చనన్;
    నిరసించి యిట్లు పలికెను;
    "నరసింహా! నిన్ను నమ్మి, నాశనమైతిన్!"

    (2వ పూరణ)

    (విగ్రహాలను తస్కరించి అమ్మెడు వ్యాపారి నరసింహస్వామి ప్రతిమ నమ్ముచుండఁగ భటులకుఁ జిక్కి, సర్వస్వముఁ గోలుపోయి, వాపోయిన సందర్భము)

    "మఱుఁగునఁ బ్రతిమల బేరము
    సరగున లాభముల నిడఁగఁ, జక్కఁగ జరిగెన్!
    మఱి నీ ప్రతి మటు లిడకను,
    నరసింహా! నిన్ను నమ్మి, నాశన మైతిన్!"

    రిప్లయితొలగించండి
  6. హరి లేడూ, గిరి లేడూ అని వాదించి చివరకు నర సింహుని రూపంలో నున్న హరిని జూచి నోట మాట రాక హతమై పోతూ హిరణ్య కశిపుడు ఇలా అనుకొని వుంటాడని నా భావన....

    వర పుత్రుడు యశమును గనె
    నరసింహా! నిన్ను నమ్మి, నాశన మైతిన్
    నరసింహా నిను నమ్మక
    హరి గిరి లేడని మదించి హతమౌ చుంటిన్!

    రిప్లయితొలగించండి


  7. నరసిమ్హుడనెడి మిత్రుని
    సరదాసలహాలనువిని సంపద,యెంతో
    కరగన్ నొకడిట్లనియెన్
    నరసిమ్హా నిన్నునమ్మి నాశనమైతిన్

    పురుషప్రయత్న హీనుడు,
    కరము ప్రయోజన రహితుడు ,కామితవాంఛల్
    నెరవేరక ,నిందించెను
    నరసిమ్హా నిన్ను నమ్మి నాశన మైతిన్.

    రిప్లయితొలగించండి
  8. (నరసింహారావను డైరెక్టర్ తో నిర్మాత ఆవేదన)
    సిరికై తీసితిఁ సినిమా
    నరసింహా! నిన్ను నమ్మి,నాశన మైతిన్
    వరదై పైరసి సీడీ
    ల్విరివిగఁబారంగ నష్ట పీడితుడగుచున్!

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పెళ్ళైన నరసింహుణ్ణి ప్రేమించి మోసపోయిన ఒక యువతి మనోవేదన :

    01)
    _______________________________

    నరియడు నీవని తెలియక
    నరి యెరుగక , కపట ప్రేమ - నమ్మిన కతనన్
    నెఱియలువాఱెను బ్రతుకిటు !
    నరసింహా! నిన్ను నమ్మి - నాశన మైతిన్ !
    _______________________________
    నరియడు = నక్క
    నరి = హద్దు

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పెళ్ళైన నరసింహుణ్ణి ప్రేమించి మోసపోయిన
    ఒక యువతి మనోవేదన :

    01అ)
    _______________________________

    నరియడు నీవని తెలియక
    నరి యెరుగక , కపట వలపు - నమ్మిన కతనన్
    నెఱియలువాఱెను బ్రతుకిటు !
    నరసింహా! నిన్ను నమ్మి - నాశన మైతిన్ !
    _______________________________
    నరియడు = నక్క
    నరి = హద్దు

    రిప్లయితొలగించండి
  11. వరప్రసాద్ గారూ,
    పరుల నాశనం కోరేవారు తామే నాశనమౌతారన్న భావంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రవి గారూ,
    సినిమా టైటిల్ni నమ్మి మోసపోయిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    మూడు పాదాలను లఘువులతో, చివరి పాదాన్ని గురువుతో ప్రారంభించారు. అది లక్షణ విరుద్ధం.
    "నేరికి" బదులు "నెరుగక" అందాం.
    *
    పండిత నేమాని వారూ,
    విరుపుతో ఉదాత్తమైన భావాన్ని ఆవిష్కరిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలూ ఉదాత్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    షదేవుడు గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    కాని పైరసీ సీడీల దోషం ఆ డైఎక్టర్ దెలా అవుతుంది?
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారికి నమస్సులు,
    ధన్యవాదములు. నిన్నునమ్మి తరువాత కామ పెట్టానండి.పైరసీకి డైరక్టర్ కు సంబంధము లేదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. ఒక licence-permit raj monopoly industrialist:

    అరయగ నిందిర భక్తుడ
    పొరపాటున గూడ నెపుడు పోరని వాడన్
    కరచితివి నన్ను పీ. వీ.
    నరసింహా! నిన్ను నమ్మి నాశన మైతిన్!

    రిప్లయితొలగించండి
  14. సీతారాం యేచూరి:

    త్వరపడి యిందిర రాజ్యపు
    బరువగు లైసెన్సు కోట పర్మిట్లన్నిన్
    చెరిచితి వోహో పీ. వీ.
    నరసింహా! నిన్ను నమ్మి నాశన
    మైతిన్....🙁

    రిప్లయితొలగించండి