4, ఆగస్టు 2015, మంగళవారం

సమస్యాపూరణ - 1751 (భార్య మరణించినంత సంబరము గలగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భార్య మరణించినంత సంబరము గలగె.

24 కామెంట్‌లు:

 1. మౌని యాగమ్ము చేయు సమయమునందు
  భగ్నమొనరింప రఘురామ బాణహతికి
  కూలె తాటక ధరఁ, కౌశికునకు సుంద
  భార్య మరణించినంత సంబరము గలగె.

  రిప్లయితొలగించండి
 2. గురువులకు నమస్సులు.

  నయము లేని రోగమ్ముల నడుమ చేరి
  చెప్ప వీలుకాని సలుపు సెగల నుండి
  తనువు ముగియగ మనసుకు తగ్గె బాధ
  భార్య మరణించినంత సంబరము గలగె

  రిప్లయితొలగించండి
 3. దుస్స సేనుని గుండెను లెస్స జీల్చి
  కురుల రక్తము బూయగ కోరె నాడు
  వాని భీముడు చంపనా వార్త వినెను
  భార్య, మరణించినంత సంబరము గలిగె.

  రిప్లయితొలగించండి

 4. 253 .తే.గీ: భర్త యనగానె భరియించు వాడటంచు
  విచ్చలవిడిగా దిరుగుచు వెతల బెట్టి
  ముప్ప తిప్పలు బెట్టెడి మూర్ఖు రాలు
  భార్య మరణించినంత సంబర పడియె.

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారి పూరణ
  కాలుజారిపడిన నన్ను కాంచినంత
  జాలిపలుకులు పల్కుట చాలునాధ
  భార్యమరణించినంత సంబరముకలిగె
  నీకని తెలుసు నాపుము నీదు నటన

  రిప్లయితొలగించండి
 6. మరణ శయ్యన పడియున్న మందు లేని
  క్యాన్సరనెడు రోగమ్ముచే యాలి పడెడు
  బాధ గాంచుచు యేడ్చెడి భర్త కంత
  భార్యమరణించినంత సంబరము గలిగె.

  రిప్లయితొలగించండి
 7. నరకాసుర వధ - సత్యభామ ( భార్య)

  భీకరంబుగ పోరు సల్పిన మురారి
  యలసి నట్లుగ నటియించ నంతలోనె
  నరకునివధింప సంధించె శరములంత
  భార్య, మరణించినంత సంబరము గలుగు.

  రిప్లయితొలగించండి
 8. సతము నీతికి నిలబడు పతిని గాంచి
  యీసడించుచు చరియించు యిల్లుటాలు
  వక్రమార్గము పయనించి వసుధవీడ
  భార్యమరణించినంత సంబరము గలగె

  రిప్లయితొలగించండి
 9. మౌని వేషాన దనుజుఁడు మగువఁగొనియు
  లంక జేర్చి బాధించ, నా రామమూర్తి
  భార్య, మరణించి నంత సంబరము గలగె
  రాక్షసుండని, ప్రణుతించె ప్రభువుఁ జేరి

  రిప్లయితొలగించండి
 10. చీట్ల పేకాటఁ జూడ మీ చిన్నభార్య
  కట్టు కున్నదాని దెగువ గాంచుడనుచు
  పేక గృహమును మూయించ వెలది, చిన్న
  భార్య మరణించి నంత సంబరము గలగె!

  రిప్లయితొలగించండి
 11. మోడు గామారు జీవిత ముగద ,మనకు
  భార్య మరణించినంత ,సంబరము గలగె
  నాలు బిడ్డలు మనుమలు నంద రార్య !
  యొక్క చోటున నుండంగ జక్క గాను

  రిప్లయితొలగించండి
 12. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  పరమ జారుడు పడతుల బట్టు వాని
  బట్టి శిక్షించు వివరముల్ పతికి దెలుప
  భార్య, మరణించినంత సంబరము గలగె
  పతికి, కూలగ జారుడు మతి చలించి

  రిప్లయితొలగించండి
 13. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. గురుదేవులకు ప్రణామములు సమస్య "భార్య మరణి౦చినంత సంబరము గలగె"అనియుండగా కవిమిత్రులు 'కలిగె','కలుగు'అనిపూరణలు చేసినారు
  'కలగు'అనగా కలత పడు అనుఅర్ధము ధ్వనించును దోసమున్నచో సవరించగలరు
  'కలతపడు'అనుఅర్ధములో నాపూరణ చిత్తగించ మనవి
  కళల దీపావళీ పండుగ దినమున
  కూతు రల్లు౦డ్రతో నిల్లు కొమరు చుండ
  గృహమునకు దీపమై వెల్గు ని౦దిరైన
  భార్య మరణించినంత స౦బరము గలగె

  రిప్లయితొలగించండి
 15. కట్న మిచ్చియు యింటను కలతబెంచి
  సంతసంబును సాకని సాద్వియయ్యు
  నరకయాతన బెట్టుపిన్నమ్మ|”నాన్న
  భార్య మరణించి నంత సంబరము గలిగె”.

  రిప్లయితొలగించండి
 16. కలగు =కలత పడు [అ.క్రి.]చూడుఆచార్య జి.యన్.రెడ్డి గారి పర్యాయపద నిఘంటువు
  1227.పుట 61

  రిప్లయితొలగించండి
 17. కట్నమాశకు పెళ్ళాడ?కాంతరాగ
  తను నపుంసకుడని యెంచి తగడటంచు
  భార్య మరణించి నంత సంబరముగలిగె|
  స్వార్థ చింతనయెంతటి వార్తలౌర?
  2భార్యమరణించినంత సంబరము గలిగె
  ననుటతప్పగు జీవన యానమందు
  వంశ వృద్దికి తోడ్పడు వనితలేక?
  జన్మ లెట్లబ్బు జగతికి జాగృతేది?
  3.కాంత,కనకంబు నున్నచో?శాంతమబ్బు|
  అర్ధనారిగ నీలోననణగి యుండు
  భార్యమరణించి నంత?సంబరముగలిగె
  అన్నవాడికి వంశంబు సున్నయగును|

  రిప్లయితొలగించండి
 18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  పొరపాటు నాదే! నిజానికి నేను ఇవ్వాలనుకున్న సమస్య ‘భార్య మరణించినంత సంబరము గలిగె’. కాని నిన్న ప్రయాణంలో ఒక ఊళ్ళో ఇంటర్ నెట్ సెంటర్ నుండి సమస్యను షెడ్యూల్ చేసినప్పుడు తొందరలో నేను టైపాటును గమనించలేదు. అందువల్ల ‘కలగె/ కలిగె’ రెండువిధాల పూరణలను పరిగణనలోకి తీసుకుంటున్నాను. మీరు చెప్పేదాకా ఆ టైపాటును గమనించలేదు. ధన్యవాదాలు.
  ‘కలగె’ శబ్దంతో మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం. ‘పండుగ దినమందు’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘జాగృతి+ఏది’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  పొరపాటు నాదే! నిజానికి నేను ఇవ్వాలనుకున్న సమస్య ‘భార్య మరణించినంత సంబరము గలిగె’. కాని నిన్న ప్రయాణంలో ఒక ఊళ్ళో ఇంటర్ నెట్ సెంటర్ నుండి సమస్యను షెడ్యూల్ చేసినప్పుడు తొందరలో నేను టైపాటును గమనించలేదు. అందువల్ల ‘కలగె/ కలిగె’ రెండువిధాల పూరణలను పరిగణనలోకి తీసుకుంటున్నాను. మీరు చెప్పేదాకా ఆ టైపాటును గమనించలేదు. ధన్యవాదాలు.
  ‘కలగె’ శబ్దంతో మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం. ‘పండుగ దినమందు’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘జాగృతి+ఏది’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

  రిప్లయితొలగించండి

 19. 253 .తే.గీ: భర్త యనగానె భరియించు వాడటంచు
  విచ్చలవిడిగా దిరుగుచు వెతల బెట్టి
  ముప్ప తిప్పలు బెట్టెడి మూర్ఖు రాలు
  భార్య మరణించినంత సంబర పడియె.

  రిప్లయితొలగించండి
 20. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. పత్ని కేన్సరు తోడను బాధలంద
  నామె బాధలు కనలేక నాత్మకుమిలె
  ముక్తి కలుగంగ వెతనుండి,మోదమంది
  భార్య మరణించినంత సంబరము కలిగె

  సతియె వర్తన చెడుగంది సంచరింప
  చెప్పుకొనలేక మనమున మనమున సిగ్గుపడుచు
  నుండ,నామెప్రమాదాన నొందమిత్తి
  భార్య మరణించి నంత సంబరము గలిగె

  మంచిచెడులను బ్రతుకున నెంచియిడెడు
  భార్య మరణానికెవడేని పడును బాధ
  నంతె కానియు,లోకాన నందెనెపుడు
  భార్య మరణించినంత సంబరము గలిగె

  పతియు తనువీడి పరకాంత బరగియుండ
  సతియె కుములుచు నుండియు చావగోరె
  నపుడె తెలియగ నామెకునట్టి సవతి
  భార్య,మరణించినంత సంబరము గలిగె

  రిప్లయితొలగించండి
 22. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. మిత్రులందఱకు నమస్సులు!

  పరమ గయ్యాళి యైనట్టి పడుచు భార్య
  యొక్క సారిగ సౌమ్యయై, నిక్కముగను,
  మంచి గుణములతో వెల్గె! మగనికి, "గత
  భార్య" మరణించినంత, సంబరము గలిగె!!

  రిప్లయితొలగించండి