5, ఆగస్టు 2015, బుధవారం

సమస్యాపూరణ - 1752 (సంజీవని నంగదుండు సరగునఁ దెచ్చెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సంజీవని నంగదుండు సరగునఁ దెచ్చెన్.

26 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. అంజని సుతుడే దెచ్చెను
   సంజీవని, నంగదుండు సరుగున దెచ్చెన్
   వింజామరలన్ నినకుల
   సంజాతుల భక్తితోడ సత్కృతి సల్పన్

   తొలగించండి
 2. అంజని పుత్రుడు దెచ్చెను
  సంజీవని;యంగదుండు సరుగున దెచ్చెన్
  రంజన మొనరింప దలచి
  కంజాతము రామునిపదకంజముల కడన్

  రిప్లయితొలగించండి
 3. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘అంజను’డన్న ప్రయోగం లేదు. ‘అంజనిసుతుఁడే తెచ్చెను...’ అనండి. అలాగే ‘వింజామరలను నినకుల...’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. ‘సంజాయిషి తెలిపి దనుజు...’ అనండి.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. అంజన తనయుడు చేకొనె
  సంజీవని , నంగదుండు సరగునఁ దెచ్చెన్
  సంజాయిషి తెలిపి దనుజు
  రంజింపగ మదిని గోరు రభువు డటంచున్

  రభువు = రాయబారి

  రిప్లయితొలగించండి
 5. వింజామరలను తెమ్మన
  కంజదళాక్షుడు ముదమున గగనమునందే
  అంజన సుతు చేతను గని
  సంజీవని, నంగదుండు సరగునఁ దెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. అంజని సుతుడే దెచ్చెను
  సంజీవని ,నంగదుండు సరగున దెచ్చె
  గంజ దళాక్షుని గొలువగ
  రంజిత కుసుమాల నెన్నొ రాగము తోడన్

  రిప్లయితొలగించండి
 8. అంజని పుత్రుడు కూర్చెను
  సంజీవని, నంగదుండు సరగున దెచ్చెన్
  వింజామర రిపు మూకల
  భంజనుడైనట్టి రాము బడలిక బాపన్

  రిప్లయితొలగించండి
 9. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  నేను సూచించిన సవరణ ‘వింజామరలను నినకుల...’
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. కెంజాయ వేళ నాటక
  రంజనుడై ముదుసలనియె లక్ష్మణుఁ గావ
  న్నంజన సుతుడందించగ
  సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్!

  రిప్లయితొలగించండి
 11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  అంజన సుతుడేగగ గన
  సంజీవని, నంగదుండు సరగునఁ దెచ్చెన్
  రంజింపు వార్త ,రాముని
  కంజలి ఘటియించి, తనదు ఘనకార్యమునన్.

  రిప్లయితొలగించండి
 13. చిట్టీ! మనకీ దుర్భర
  గొట్టంపు బ్రతుకు తొలంగి కోరినవందన్
  చుట్టమ్మీ చదువందును
  గట్టెక్కించగ శ్రమించు గౌరవమబ్బున్

  రిప్లయితొలగించండి
 14. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 15. అ౦జని సూనుడు హనుమయ
  సంజీవని వెదుకలేక శైలము దెచ్చెన్
  కుంజమ్మున గుర్తించుచు
  సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 16. కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. అంజనపుత్రుడు వెంటనె
  సంజీవనినంగ-దుండు సరుగున దెచ్చెన్
  పుంజుకొను లక్ష్మణుండని
  సంజవడు సమయాన రాగ? సరుగున బ్రతికెన్|

  రిప్లయితొలగించండి
 18. కె. ఈశ్వరప్ప గారూ,
  ‘సంజీవనినంగ-దుండు’... వివరించండి.

  రిప్లయితొలగించండి
 19. అంజనిసుతుడరుతేరగ
  సంజీవని కొండ వెసను సౌమిత్రిని వే
  గం జీవునిజేయు కొరకు
  సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్

  అంజనిసుతుడాతడు తా
  పుంజపు రోమాంగదుడయి పొసగను వే
  గం జీవిగ లక్ష్మణుగన
  సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్

  భంజన మందగ లక్ష్మణు
  డుం జీవనమంద వేగ డుంగుచు జని యా
  యంజనిసుత రోమాంగుడు
  సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్

  అంజున లక్ష్మణు మూర్ఛకు
  నంజని సుతుడటులరయక యా మూలికనే
  సంజీవని కొండను తే
  సంజీవని నంగదుండు సరగున దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 20. శ్రీగురువుగారైన కంది శంకరయ్యగారికివందనాలతో
  విన్నపము
  సంజీవనినంగ=సంజీవని ననగల
  దుండు=తుండు=ముక్కఅన్నభావన

  రిప్లయితొలగించండి
 21. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మన్నించాలి... మీ రిచ్చిన వివరణ వలన కూడా పద్యం అవగాహనకు రావడం లేదు.

  రిప్లయితొలగించండి
 22. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులు!

  (వజ్రనాభుని తమ్ముఁడు సునాభుని కూఁతురగు చంద్రవతితో నామె పెంపుడు చిలుక, చంద్రవతి ప్రియుఁడగు గదుని వెదుకం బోయి, చిక్కులం దెచ్చుకొనిన విషయమునుం దెలుపుచు, గదుఁడే తన్ను విడిపించినాఁడని నుడివిన సందర్భము)

  మంజువచన! చంద్రవతి! ని
  రంజనసఖభటులు పంజరమ్మున నిడ, నా
  బంజరమందుం గని, శుక
  సంజీవని! నన్ గదుండు సరగునఁ దెచ్చెన్!!

  (...నంగదుండు...> నన్ గదుండు...)

  రిప్లయితొలగించండి
 23. గుండు మధుసూదన్ గారూ,
  గదుని ప్రస్తావనతో, విలక్షణమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  ఈ వృత్తాంతం తెలిసినదే అనిపిస్తున్నది కాని గుర్తుకు రావడం లేదు.

  రిప్లయితొలగించండి
 24. నమస్కారం శంకరయ్యగారూ!

  ఈ పాత్రలు పింగళి సూరన్నగారి "ప్రభావతీ ప్రద్యుమ్నం"లో మనకు కల్పిస్తాయి. వజ్రనాభుఁడు, సునాభుఁడు, గదుఁడు, చంద్రవతి, నిరంజనసఖభటులు (=శ్రీకృష్ణుని భటులు), చంద్రవతి పెంపుడు చిలుక....ఇవియన్నియును నందులోనివే. వాటిని సందర్భమునకుం దగినట్లుగ నేను వాడుకొంటిని. స్వస్తి.

  రిప్లయితొలగించండి