21, ఆగస్టు 2015, శుక్రవారం

సమస్యాపూరణ - 1766 (శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు. 

55 కామెంట్‌లు:

 1. సిరులు సంపదల్ లేవన్న చింతయేల
  జ్ఞాన విత్తమ్మునీకున్న లేనిదేమి
  విద్యతో నీవు కలిగితివి ప్రతిభా వి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు.

  రిప్లయితొలగించండి

 2. మానవుని ఉరుకులు పరుగులు పెట్టించి
  హరి నిదుర పోయే "సిరిపాద" సేవన!
  పిచ్చి మానవా పరుగు ఆపుమయ్యా
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు !


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. గురువుగారికి నమస్సులు.
  కానుకన్+ఇడెః కానుకనిడె, కానుక+ఇడెః కనుకయిడె – ఏ సంధి సరియైనది.

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  జిలేబి గారూ,
  మీ భావానికి ఛందోరూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  ప్రయోగావసరాన్ని బట్టి రెండూ సరియైనవే.

  రిప్లయితొలగించండి
 5. సిరులు సంపదలను కోరి శ్రీధవ నిను
  గొల్వ, ఙ్ఙానంబు నొసగుము; కూరిమింత
  జూపు మదియె చాలును నాకు నీదు ప్రసాద
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు.

  రిప్లయితొలగించండి
 6. సిరులు సంపదలను కోరి శ్రీధవ నిను
  గొల్వ, ఙ్ఙానంబు నొసగుము; కూరిమింత
  జూపు మదియె చాలును నాకు నీదు ప్రసాద
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు.

  రిప్లయితొలగించండి
 7. శ్రీగురుభ్యోనమ:

  స్వార్థ మెరుగక జేసిన సాయమందు
  ధర్మ బుద్ధితో చేసిన దానమందు
  జ్ఞాన మార్గము జూపించు చదువులందు
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు.

  రిప్లయితొలగించండి
 8. గురువు గారికి ప్రణామములతో

  విద్యయు వివేక శీలమ్ము వినయ మనెడు
  సద్గుణాలకు సాటియౌ సంపదేది
  పుడమి లోన సాధించలేవు, ప్రతిభా వి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు

  రిప్లయితొలగించండి
 9. గురువు గారికి ప్రణామములతో

  విద్యయు వివేక శీలమ్ము వినయ మనెడు
  సద్గుణాలకు సాటియౌ సంపదేది
  పుడమి లోన సాధించలేవు, ప్రతిభా వి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు

  రిప్లయితొలగించండి
 10. బూసారపు నర్సయ్య గారు ఇలా అన్నారు......

  కవిమిత్రులకు సస్నేహ నమస్సులు.
  మన బ్లాగులో నేను క్రొత్తగా ప్రవేశించాను. నా పద్యాల గుణదోషాలను సమీక్షించి నన్ను ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పటికీ తెలుగు టైపు చేయడంలో ఇబ్బందులవలన ఫోన్‍లో శంకరయ్య గారికి వినిపిస్తే వారు వ్రాసుకొని, టైప్ చేసి బ్లాగులో పెడుతున్నారు. వారికి ధన్యవాదాలు.

  కవులు మెచ్చెడి కవనమ్ము గాదు నాది
  చేయుచుంటిని మీతోడి చెలిమి నిపుడు
  తప్పులున్నచో దిద్దుడీ తమరి చెలిమి
  శేషమే చాలు నెనలేని సిరులు గురియు.

  నా రెండవ పూరణ...
  అతిథి దీవింప నానంద మౌను సుమ్మి
  దేశికుఁడు గాసిఁ బాపును దీవెన లిడి
  తల్లిదండ్రుల దీవెనల్ దరమె పొగడ
  శేషమే చాలు నెనలేని సిరులు గురియు.

  రిప్లయితొలగించండి
 11. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణ, యతి దోషాలు. ‘కూరిమింత| నిలుపు మదియె చాలును నాకు నీ ప్రసాద...’ అనండి.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయొలు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  బూసారపు నర్సయ్య గారూ,
  మీకు కవిమిత్రుల ప్రోత్సాహమూ, స్నేహమూ ఎప్పుడూ ఉంటాయి. మీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించండి.
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. వేంకటేశ్వర !నీకునే వేయి మార్లు
  పూజ చేయగా జాలను బూల తోడ
  నీదు నామము స్మరియింతు నిరత మయ్య !
  గారవంబున నీవిచ్చు కరుణ రసపు
  శేషమే చాలు నెనలేని సిరులు గురియు

  రిప్లయితొలగించండి
 13. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 14. భర్త తో పల్కె వామాక్షి,"స్వామి!తమరు
  ద్వారకాధీశు,సహపాఠి,వాసుదేవు
  దర్శనము జెసికొనగ నాతని కృపా వి
  శెషమే చాలు నెనలేని సిరులు గురియు'.

  రిప్లయితొలగించండి
 15. సర్వ భూతంబులను బ్రోచు సహృదయుండు
  నఖిల శుభములనొసఁగు సర్వాత్మకుండు
  పరమ పావనుఁడౌ విష్ణు భక్తి రస వి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు.

  రిప్లయితొలగించండి
 16. మౌని కాతిథ్యమిడు వేళ మాధవుండు
  ద్రౌపదికిడ సాయమ్మటఁ దప్పె ముప్పు
  ప్రభువు దయతోడ నక్షయ పాత్రయందు
  శేషమే చాలు నెనలేని శ్రీలుఁ గురియు!

  రిప్లయితొలగించండి
 17. అవసధములకనియు రోడ్లకనియు ప్రభుత
  రత్నమంటి రైతుల భూమి లాగికొనిన
  శేషమే చాలు నెనలేని సిరులుగురియ
  భూమి మిగులని రైతుకు మూర్చవచ్చు

  రిప్లయితొలగించండి
 18. కలియుగంబున జనులకు గల్పతరువు
  గొలిచినంతనె చాలును కోర్కెదీర్చు
  వేంకటేశుని నిత్యనైవేద్యపు యవ
  శేషమేచాలు నెనలేని శ్రీలు గురియు!!!

  రిప్లయితొలగించండి
 19. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగునన్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా, బాగుంది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  వంటిని అంటి అన్నారు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  టుగాగమం వచ్చి ‘నైవేద్యపు టవశేషము’ అవుతుంది.

  రిప్లయితొలగించండి
 20. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  శ్రావణమ్మున శుక్రవారమ్మునాఁటి
  శుభఘడియలోన మున్నీటిచూలి తోయ
  జాసన కమల కృపా కటాక్ష దృగ్వి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు!

  రిప్లయితొలగించండి
 21. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. ప్రతిభనాశించ గలిగిన పట్టుదలను
  పెట్టుబడులందు నుంచిన పట్టుచేత
  చదువు సంస్కార మెంచెడి పదవి నిడువి
  శేషమే చాలు నేననలేని శ్రీలు గురియు
  2.చదువు,సంపద,హితమైన సద్గుణంబు
  ఫలిత మందించు సత్కీర్తి విలువ లొసగ?
  పరుల మేలెంచు ప్రతిభ నీ వరములగువి
  శేషమేచాలు నేననలేని శ్రీలు గురియు|

  రిప్లయితొలగించండి
 23. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. ఏడు కొండల సామిని యెల్ల వేళ
  చిత్త శుద్ధితో కొలువుము చింతలన్ని
  ప్రిదులు ,నాతని కారుణ్య వీక్షనపు వి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు.

  రిప్లయితొలగించండి
 25. సుకవి మిత్రులు బూసారపు నర్సయ్యగారూ!

  మీ రెండు పూరణములును జాల బాగున్నవి. ప్రతిదినము మీరు చక్కని పూరణల నందించుచున్నారు. అభినందనలు.

  మన బ్లాగులోని మిత్రులందఱును పరస్పర గుణదోషములు తెలుపుకొనుచుఁ జక్కని మైత్రీ భావనతో ముందునకుం గొనసాఁగుచున్నారు. మీరును మాలో నొక్కరే కావున నిరభ్యంతరముగ మీ యభిప్రాయములను మాతోడఁ బంచుకొనుచు నుండఁగలరు. మన మైత్రీ భావము కలకాలము కొనసాఁగుచునే యుండఁగలదు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 26. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సామిని నెల్లవేళ’ అనండి. వీక్షణపు... టైపాటు వల్ల వీక్షనపు... అయింది.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  భూసారపు నర్సయ్య గారు తమ సంతోషాన్ని వ్యక్తం చేసి మీకు ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా నన్ను కోరారు. ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 27. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  భక్తి నర్పింప నుసిరిక ఫలమె నాడు
  దెచ్చె ధారగ శ్రీలను దీనురాలి
  కమిత భక్తి కె తృణమైన కనక మిడగ
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు.

  రిప్లయితొలగించండి
 28. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 29. శేషాద్రి:
  స్వామి తీర్ధము జేరితి మేమి వలయు?
  ఎలమి వరములిచ్చెడివాడు చెలువపు సిరి
  తోడ వరలునిట తెలిసి చూడుడి గిరి
  "శేష"మే చాలు నెనలేని సిరులు గురియు.
  --------------------------------------------------------------------------------


  నడువ వలెను నాదుసినిమా నాలుగు నాళ్ళు
  చీరగట్టి నాభాగ్యము జెరుప నేల
  కత్తిరింపు మారేడు ముక్కలుగ సఖియ! (ఆరు + ఏడు)
  శేషమే చాలు నెనలేని సిరులు గురియు

  రిప్లయితొలగించండి
 30. ‘ఈకదంపుడు’ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా రెండవ పూరణ చదివి నవ్వు ఆపుకోలేకపోయాను (టైఫాయిడ్‌తో బాధపడుతున్నా కూడా). మీకు నా అభినందనలు.
  ‘.....ముక్కలుగ, వస్త్ర| శేషమే చాలు...’ అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 31. సమస్యాపాదాన్ని చూసినప్పుడు నాకు తొలుత తోచిన బావాన్ని , ఇక్కడ నాగరాజు రవీందర్ గారు, గుండు మధుసూదన్ గారు చక్కగా ప్రకటించారు . వారికి నా ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 32. శైలజ గారూ,
  మన్నించండి, అవ శబ్దానికి అంత మంచి అర్ధము లేదు, సమస్య పరిష్కరింపబడినది అన్న విషయాన్ని పక్కనబెడితే నైవేద్యము తో ఆ పదము వాడటం ఉచితమేనా అని సందేహం

  రిప్లయితొలగించండి

 33. నడువ వలెను నాదుసినిమా నాలుగు నాళ్ళు
  చీరగట్టి నాభాగ్యము జెరుప నేల
  కత్తిరింపు మారేడు ముక్కలుగ, వస్త్ర! (ఆరు + ఏడు)
  శేషమే చాలు నెనలేని సిరులు గురియు

  గురువు గారూ,
  ధన్యవాదములు.
  పద్యము మార్చినాను.
  మీకు చెప్పగలవాడను కాదు కానీయండీ , మీరు ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోవాలి
  భవదీయుడు

  రిప్లయితొలగించండి
 34. శుచిగ తానుండి,యింటిని శుచిగ నునిచి
  భర్తయందున ప్రేమయు,భక్తి గలిగి
  శాంత లక్ష్మిగా నోర్పుతో సాగుసతి,వి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు

  శ్రావణంబున గౌరికి,శారదాంబ
  సిరుల దేవికి పూజల సేవనమున
  శుభము లిడుమని వినుతింప,సొంపునిడ
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియ

  నైతికంబైన వర్తన నడచుచుండి
  సత్య శౌచంబు వదలక,శాంతి గలుగ
  జగతికంతకు కోరెడు చటు మనో వి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియ

  రిప్లయితొలగించండి
 35. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణ చివర గణదోషం. సవరించండి.

  రిప్లయితొలగించండి
 36. ఒకడు పల్లకి నెక్కును నొకడు మోయు
  బడయు సుఖమును దుఃఖంబు బడయు నొకడు
  పూర్వ జన్మలో చేసిన పుణ్య ఫలవి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియ!!!

  రిప్లయితొలగించండి
 37. కథయె లేని ధారావాహికముల నెంతొ
  సాగదీయుచు చానెళ్ళు సతుల మతులు
  చెడగ జేయఁగ నెపిసోడు చివర గల స
  శేషమే చాలు నెనలేని సిరులు గురియు.

  రిప్లయితొలగించండి
 38. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 39. గురువుగారూ టీవీ సీరియల్స్ పై మీ పద్యములోని చమత్కారము చాలా బాగున్నది. అభినందనలు.

  17వ తేది నాటి పద్యరచనలో శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారి పద్యమును పరిశీలించినారు. చాలా సంతోషము. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 40. నిన్న నా పూరణ పెట్టాను. బ్లాగులో ప్రకటితమైంది. ఇప్పుడు కనపడటం లేదు. మరి ఎలా తొలగింపబడిందో ఆశ్చర్యంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 41. గురువుగారు చెప్పినట్లు ఊకదంపుడు గారి రెండవ పూరణ అమోఘం!

  రిప్లయితొలగించండి
 42. మిస్సన్న గారూ,
  అప్పుడప్పుడు నేను వ్యాఖ్యలను ఎడిట్ చేస్తూ ఉంటాను. మిత్రులు తమ వ్యాఖ్యను తొలగించినా ‘ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు’ అని ఉంటుంది. కొందరి పూరణలు ఏకారణం వల్లనో ఒక్కటే రెండు మూడు సార్లు ప్రచురితమౌతాయి. వాటి వల్ల వ్యాఖ్యల పేజీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకొని గజిబిజిగా ఉంటుంది. అందువల్ల అటువంటి వాటిని సెలెక్ట్ చేసి ఒక్కసారే ‘తొలగించు’ బటన్ క్లిక్ చేస్తాను. ఒక్కొక్కసారి పొరపాటున ఒకదానికి బదులు మరొకటి క్లిక్ చేసినప్పుడు అది తొలగిపోతుంది. మీ పూరణకూడా అటువంటి పొరపాటు వల్ల తొలగిపోవచ్చు. క్షమించండి.
  దయచేసి మరొక సారి ఆ పూరణను పోస్ట్ వేయవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి

 43. నాగరాజు రవీందర్ గారికి, మిస్సన్న గారికి ధన్యవాదములు.

  గురువు గారూ ! మీ పూరణ చాలా బాగున్నది

  రిప్లయితొలగించండి
 44. అయ్యయ్యో మీరేదో చేసి ఉంటారని కాదు నా ఉద్దేశం గురువుగారూ.
  ఏదో సాంకేతిక కారణం ఉండిఉంటుంది. దయచేసి మరచిపొండి.

  రిప్లయితొలగించండి
 45. అవును మీ పూరణ నిప్పుడే చూశాను. అద్భుతంగా ఉంది గురువుగారూ.

  రిప్లయితొలగించండి
 46. మిస్సన్న గారూ,
  ఇంతకూ నిన్నటి మీ పూరణను మళ్ళీ ప్రకటించండన్న నా విన్నపాన్ని మన్నించలేదు.

  రిప్లయితొలగించండి
 47. మిత్రులందఱకు నమస్సులు!

  నా పూరణమునందుఁ దృతీయ పాదమున...గణభంగమైనది...నేరుగా టైపు చేయుట వలన నేను సరిచూచుకొనకయే ప్రకటించితిని. దానిని....ఈ క్రింది విధముగ సవరించుచుంటిని.

  "...కమల కృపా కటాక్ష..." లోని గణభంగమునకు...
  "...కమల కరుణా కటాక్ష..."యని సవరణము.

  సవరించిన పూరణము:

  శ్రావణమ్మున శుక్రవారమ్మునాఁటి
  శుభఘడియలోన మున్నీటిచూలి, తోయ
  జాసన, కమల కరుణా కటాక్ష దృగ్వి
  శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు!

  పై దోషమునకు నన్ను మన్నింపఁగలరు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి