23, ఆగస్టు 2015, ఆదివారం

సమస్యాపూరణ - 1768 (కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.
(28-11-1921 నాడు ప్రొద్దుటూరులో జరిగిన అవధానంలో రాజశేఖర, వేంకటశేష జంటకవులకు ఇచ్చిన సమస్య)

42 కామెంట్‌లు:

  1. చక్కని చుక్కను గాంచితి
    మక్కువ కలుగంగ నాదు మనసునొసగితిన్
    ఠక్కున, మామా తలపై
    కుక్కకు,తలబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  2. కుక్కాయని తిట్టెదవా
    నిక్కము నీ చక్కదనమె నిక్కును పెంచెన్
    మక్కువతో నీపై యీ
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్

    రిప్లయితొలగించండి
  3. చెక్కిన శిల్పము వలెనీ
    చక్కని యందమును గాంచి సంతస మందున్
    ఠక్కున పేరది తులసని
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్

    కుక్క తులసి = ఒకరకపు తులసి

    రిప్లయితొలగించండి
  4. అక్కా నేనిపు డెంతో
    మక్కువ తోడను వివాహ మాడద లచితన్
    చక్కని చుక్కను నిజమిది
    కుక్కకు, తలఁబ్రాలువోయు కుతుకము కలిగెన్.

    రిప్లయితొలగించండి
  5. మక్కువ పేలిటు తలలో
    కుక్కకు,తలబ్రాలు పోయు కుతుకము గలిగెన్
    చిక్కులు విడదీసి సిగను
    అక్కడనక్కడను యనక నణచుము చెలియా!

    రిప్లయితొలగించండి
  6. రాజశేఖర, వేంకటశేష కవుల పూరణ...

    అక్కా! చైద్యున కిడు నట
    చక్కని నిను రుక్మి; యిదియు జగతిం గలదే
    చొక్కపు ముత్యంబులు వెఱి
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  7. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కొద్దిగా అన్వయలోపం ఉన్నట్టుంది.
    ******
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అక్కడను+అనక’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సిగను+అక్కడ’ అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! ‘విడదీసియు సిగ| నక్కడనక్కదను గనుచు నణచుము...’ అందామా?

    రిప్లయితొలగించండి

  8. చక్కని ఎండల వేళను
    పిక్కటిలగ వానకురియ పిల్లలు పాడన్
    'నక్కల కుక్కల పెండ్ల'ని
    కుక్కకు తలబ్రాలు పోయు కుతుకము గలిగెన్

    రిప్లయితొలగించండి

  9. శ్రీగురుభ్యోనమ:

    అక్కడి యాచారంబట
    దుక్కులు జేయంగ భూమి,దోషము తొలగన్
    చక్కగ పెండిలి జేసిరి
    కుక్కకుఁ, దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  10. మక్కువ తో బావ యొకడు
    చక్కన్ని మరదలి తోడ సరసము లాడెన్
    చుక్కా! జడలో పూవులు
    కుక్కకు, దలఁ బ్రాలు వోయ కుతుకము గలిగెన్

    రిప్లయితొలగించండి
  11. మక్కువ తో బావ యొకడు
    చక్కన్ని మరదలి తోడ సరసము లాడెన్
    చుక్కా! జడలో పూవులు
    కుక్కకు, దలఁ బ్రాలు వోయ కుతుకము గలిగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మక్కువ తో బావ యొకడు
      చక్కనగు మరదలి తోడ సరసము లాడెన్
      చుక్కా! జడలో పూవులు
      కుక్కకు, దలఁ బ్రాలు వోయ కుతుకము గలిగెన్

      తొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మి పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చక్కన్ని’ అన్నదాన్ని ‘చక్కనగు’ అనండి.

    రిప్లయితొలగించండి
  13. 'కుక్కును' వంటకు బెట్టెను
    చక్కనిదని 'లవ్వు'జేసె చందూ, ప్రేమన్
    కుక్కాయని పిలుచు చుండును
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ‘కుక్కా యని పిలుచు సతము’ అందామా?

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    కుక్కగ పలువురు బిలిచిన
    మిక్కుటముగ వెంట నంటి మేలొన గూర్చన్
    చక్కని చుక్కకు మనసయి
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  16. మక్కువగ జేయ పెండ్లిని

    కుక్కకు, దలబ్రాలు వోయుకుతుకము గలిగె

    న్జక్కని శునకము తోడన

    మిక్కిలి సంతసము గలుగ మీరా ! వింటే !

    రిప్లయితొలగించండి
  17. భూసారపు నర్సయ్య గారి పూరణ....

    (పెద్దక్క, చిన్నక్కలతో తమ్ముడి సంభాషణ....)
    “అక్కా! మెడ విఱుగె నిటులఁ
    గుక్కకు; తలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్
    చక్కనిదే నా చెలి”.... “చి
    న్నక్కా! నీవైనఁ జెప్పు మక్కకు దీనిన్”

    రిప్లయితొలగించండి
  18. అక్కా సర్దిన బట్టలు
    కుక్కకుఁ, దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్
    ముక్కామల బాబాయికి
    మక్కువతో షష్టిపూర్తి మంటపమందున్!!!

    రిప్లయితొలగించండి
  19. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. కుక్కను బ్రేమగ బెంచిన
    యొక్కతె సంతానలేమి నోర్చక బెండ్లిన్
    మక్కువతో జేయగ నా
    కుక్కకు, తలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్!

    రిప్లయితొలగించండి
  22. ఎక్కడి రాబిన్ కుక్కో ?
    యిక్కడి పద్ధతులు నచ్చి యింతిని మెచ్చెన్
    మక్కువతో పెండ్లాడగ,
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  23. కుక్కుట శాస్త్రికి కూతురు
    కుక్కన బహు మక్కువనుచు కూతురు కివ్వన్
    ప్రక్కన నవ్వుచు వరుడనె
    కుక్కకు దల బ్రాలువోయు కుతుకముగలిగెన్
    .

    రిప్లయితొలగించండి
  24. అక్కరకురాని వరునకు
    మక్కువ నన్నిచ్చి పెండ్లి మా తలిదండ్రుల్
    నిక్కము జేయగ మదిలో
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  25. టక్కునబలికెనువరుడట
    కుక్కకు దలబ్రాలు వోయు కుతుకము గలిగెన్
    అక్కాయనగా”వధువనె
    కుక్కకు భర్తయిన నీవు-కుక్కవె గాదా”.?

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులతో...

    మిక్కిలి చొక్కునఁ జిక్కియుఁ
    గ్రక్కున ముక్కంటి యువిద కర మందంగన్
    జక్క నడుగు దశగళుఁ డను
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్!

    రిప్లయితొలగించండి
  27. మిక్కిలి చక్కని చిన్నది
    మక్కువతోడ పడియుండె మాగృహమందున్
    దక్కును నాతోడని, యా
    కుక్కకు దల బ్రాలు వోయు కుతుకము గలిగెన్

    రిప్లయితొలగించండి
  28. చెక్కిన శిల్పము వలెనీ
    చక్కని యందమును గాంచి సంతస మందున్
    దక్కును తులసను సతియగు
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్

    రిప్లయితొలగించండి
  29. అక్కడ వేసవి వేడికి
    చిక్కులు పడ పెళ్ళిజంట చిన్నది కూలర్
    టక్కున నిడ తగ్గి చిరా-
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  30. చిక్కని పేలను జంపగ
    చొక్కంబగు తైలమొకటి సొంపుగ నిడుమో
    యక్కా!నెత్తిన వానిని
    కుక్కకు-తలబ్రాలు బోయు కుతుకము గలిగెన్

    పిక్కను కరువగ కుక్కయు
    మిక్కిలి బాధను నిటులను,మిగులవ్యంగ్యం
    బక్కజపు పెండ్లి జేతును
    కుక్కకు తలబ్రాలు వోయు కుతుకము కలిగెన్

    చక్కగ కాశీకేగితి
    అక్కజమగు కుక్కనొకటి నావిధి కొలువన్
    కుక్కకు జోడీ గూర్చెద
    కుక్కకు తలబ్రాలు వోయు కుతుకము కలిగెన్

    కుక్కల బెంచెడి వాడొక
    కుక్కకు జతయై పొసగెడు కుక్కను నొండున్
    చక్కని దానిని తెచ్చెన్
    కుక్కకు తలబ్రాలు వోయు కుతుకము గలిగెన్

    రిప్లయితొలగించండి
  31. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అక్కయ్యా,
    సవరించినా అన్వయం లోపం ఉన్నది.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘మిగులన్ వ్యంగ్యం...’ అనండి.

    రిప్లయితొలగించండి
  32. మాస్టరు గారూ ! ధన్యవాదములు.... చిన్న సవరణతో....

    'కుక్కును' వంటకు బెట్టెను
    చక్కనిదని 'లవ్వు'జేసె చందూ, రావే
    కుక్కాయనులే ముద్దుగ
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  33. ఎక్కడనో పెళ్లి జరుగ
    కుక్కలు సామెత నిజమని గోల మొదలిడన్
    గ్రక్కున నందొక్క జ్వరపు
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    రిప్లయితొలగించండి
  34. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సవరణతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ‘ఊకదంపుడు’ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  35. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణలో, రావే కుక్కా అని చందూ ముద్దుగా పిలిచినప్పటికీ, కుక్కుకు తలబ్రాలు అవుతుందేమో కానీ కుక్కకు తలబ్రాలు అవదని అనుమానమండీ.
    అలానే సహదేవుడి గారి పూరణలో రాబిన్ కుక్కుకు అవుతుంది కానీ రాబిన్ కుక్కకు కాదేమోనండీ -

    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  36. తాజా పూరణ:

    ఎక్కుడు దు:ఖము మానుము
    మిక్కిలి దూరమున లేదు మెట్టిన యిల్లే
    యక్కా! కన్నుల నీరిటు
    గుక్కకు తలబ్రాలు వోయు కుతుకము కలిగెన్

    రిప్లయితొలగించండి
  37. ఊకదంపుడు గారూ మీరన్నట్లు రాబిన్ కుక్కు అనే అనాలండీ.కాకపోతే మన పద్ధుతుల మీద విశ్వాసముంచిన వాడు కాటట్టి అక్కడవిశ్వాసానికి మారు పేరయిన ' కుక్క ' అనే ప్రయోగం చేశానండి.

    రిప్లయితొలగించండి
  38. చక్కని శ్రావణమందున
    పెక్కువగా వానకురిసి వెలిసిన గడియన్
    మక్కువతో కులుకుచు ప్రతి
    కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్

    రిప్లయితొలగించండి


  39. ఫక్కున నవ్వితి కవిరాట్!
    పక్కా యిది గాలికబురు పారుడ వినకోయ్
    నిక్కా యేయవలె!నెటుల
    కుక్కకుఁ దలఁ బ్రాలు వోయు కుతుకము కలిగెన్?

    జిలేబి

    రిప్లయితొలగించండి