శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం. ‘ఇష్టంబుగ నేర్చుకొనిన...’ అనండి. ***** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఒదగ’..? అది ‘వ్యాకరణ మొదుగ’కు టైపాటా? ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ సోదరుల పూరణ అన్వయం సందిగ్ధం, కాని పద్యం బాగుంది. వారికి నా అభినందనలు తెలియజేయగలరు. ఇంతకూ వారి పేరు చెప్పలేదు! ***** మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవపాదం చివర గణదోషం. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సృష్టించెడి భార్య పనులు నిష్టయు నియమాలు నిత్య నేర్పరి తనమే దృష్టుంచియు గమ నించగ కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్| [ప్రతిదినముఇల్లాలిఇంటిపనులుఅవధానమేదానితోపోలికలనుకొనగా అవధానముకష్టముగాదన్న కవులయూహ. . . .
క్లిష్టమ్మని యోచించక
రిప్లయితొలగించండినిష్టమ్ముగ వ్యాకరణము నేర్చుకొనినచో
స్పష్టమ్ముగనెవరికినిన్
కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.
నిష్టంబుగ పండితుడై
రిప్లయితొలగించండిక్లిష్టం బైనను ముదముగ కీర్తిని గెలువన్
నష్టము గాదిది మనసుకు
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅష్టావధాని యిట్లనె
"సృష్టించుచు నొప్పునట్లు జెప్పంగవలెన్
స్పష్టంబగు భావమ్ముల
గష్టం బవధానవిద్య" కా దనిరి కవుల్.
ఇష్టముతో పద్యంబులు
రిప్లయితొలగించండిస్పష్టముగా జెప్పనేర్చు సాధకున కిలన్
తుష్టియు పుష్టియు గల్గును
కష్టము యవధానవిద్య కాదనిరి కవుల్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నిష్టంబుగ’...? ‘ఇష్టంబుగ’ అనండి.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
ఇష్టంబుగనేర్చినను
రిప్లయితొలగించండిస్పష్టముగా వచ్చు విద్య సందియమేలా!
సృష్టిన లేదునసాధ్యము
కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్!!!
శిష్టాచారముతోడను
రిప్లయితొలగించండిపుష్టియయిన కావ్యరచనఁ బొందుగ కూర్చన్
కష్టమననొప్పిదమ్మౌ,
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిస్పష్ట ప్రతిభయు నభ్యా
సేష్టిని వ్యుత్పత్తితోడఁ జేర్చియు భావా
క్లిష్టతఁ బద్యాల్ సెప్పన్
గష్టం బవధానవిద్య కాదనిరి కవుల్!
నిష్టయు, ధారణ, భాషా
రిప్లయితొలగించండిస్పష్టత, సమయానుకూల చతురత, ధారా
పుష్టియు, వ్యాకరణమొదగ
కష్టంబవధాన విద్య కాదనిరి కవుల్
రిప్లయితొలగించండిపుష్టిగ శాస్త్ర జ్ఞానము,
శిష్టుల సాంగత్యము, దృఢ చిత్తము, సభలో
గోష్టిని చతురత, ను౦డిన
కష్ట౦ బవధాన విద్య కాదనిరి కవుల్
నిష్టను భారతి దలచుచు
రిప్లయితొలగించండిశిష్టుల సాంగత్యమంది చేయుచు గోష్టుల్
స్పష్టముగ భాషదెలిసిన
కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.
కష్టంబని మది దలచక
రిప్లయితొలగించండియిష్టం బుగ పద్యములను హితము గలుంగన్
స్పష్టముగ జెప్ప గలిగిన
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్
రిప్లయితొలగించండిసతి యనసూయ చారుతమ సద్గుణ రాశి విశేష సాధుశీ
లి ,తపసి యాత్రిమూ ర్తులను లీలగ బాలుర జేసె జె చ్చెర
న్బతి పదసేవ తత్పరత బ్రాణ సమున్శి రమందు నక్కటా
హితము గనంగ బ్రాణ విభు నింతియె పంపెను వేశ్య చెంతకున్
(ఈ పై పద్యము మాతమ్ముడు ,రాయపూర్ నివాసి వ్రాసిన ది . మన బ్లాగు
చూసి కుతుకముతో వ్రా సినది . . మిత్రులు తమ స్పందన తెలియ
జేయగో ర్తా ను , )
ఇష్టత ప్రక్రియపై,సు
రిప్లయితొలగించండిస్పష్టత ఛందస్సుపైన ,చతురత,భాషా
పుష్టి తదాదియు గల్గిన
కష్టంబవధానవిద్యకాదనిరి కవుల్!!!
పుష్టిగ కవిత్వ మబ్బగ
రిప్లయితొలగించండినిష్టయు ,నియమాల పద్య నిధులుండినచో
సృష్టించి,ధార యున్నచొ
కష్టంబవ ధానవిద్య కాదనిరి కవుల్.
క్లిష్టమ్మని వెరువక పరి
రిప్లయితొలగించండిపుష్టిగ వ్యాకరణ శాస్త్ర పూర్వాపరముల్
తుష్టిగ ధారణ కలిగిన
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్
శిష్టులు, తెలుగుకు కైతల
రిప్లయితొలగించండిపుష్టిని కలిగించు మంచి ప్రోడలు, వాణికి
మేష్టా రిష్టులు, వారికి
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్.
స్పష్టత గల్పించుచు సం
రిప్లయితొలగించండిక్లిష్టత తొలగించి పద్యకృతిజేయుచు తా
నిష్టత వాణిని గొలువఁగ
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘ఇష్టంబుగ నేర్చుకొనిన...’ అనండి.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒదగ’..? అది ‘వ్యాకరణ మొదుగ’కు టైపాటా?
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ సోదరుల పూరణ అన్వయం సందిగ్ధం, కాని పద్యం బాగుంది. వారికి నా అభినందనలు తెలియజేయగలరు.
ఇంతకూ వారి పేరు చెప్పలేదు!
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదం చివర గణదోషం.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి ధన్యవాదములతో సవరించిన పద్యం
రిప్లయితొలగించండిశిష్టులు, తెలుగుకు కైతల
పుష్టిని కలిగించు ప్రోడ ముఖవాసినికిన్
మేష్టా రిష్టులు, వారికి
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్.
గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో :
రిప్లయితొలగించండినిష్టయు, ధారణ, భాషా
స్పష్టత, సమయానుకూల చతురత, ధారా
పుష్టియు, వ్యాకరణమొదుగ
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్.
స్పష్టత ఉద్దేశములో
రిప్లయితొలగించండిస్పష్టత ఛందస్సు నందు ప్రక్రియ లోననన్
స్పష్టతగల పండితులకు
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సృష్టించెడి భార్య పనులు
రిప్లయితొలగించండినిష్టయు నియమాలు నిత్య నేర్పరి తనమే
దృష్టుంచియు గమ నించగ
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్|
[ప్రతిదినముఇల్లాలిఇంటిపనులుఅవధానమేదానితోపోలికలనుకొనగా
అవధానముకష్టముగాదన్న కవులయూహ. .
.
.
ఇష్టము తోడను నేర్చిన
రిప్లయితొలగించండికష్టంబవధానవిద్య కాదనిరి కవుల్
దృష్టిని నిలిపి చదువుపై
తుష్టిన సాధన సలిపిన దొరకును జయముల్
సుష్టుగ మేతలు మేయుచు
రిప్లయితొలగించండిపుష్టిగ కోతలను కోసి మూర్ఖుల యెదుటన్
పృష్టములను దూషించుచు
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్
గమనిక: కవులు వేరు, అవధానులు వేరు