27, జూన్ 2011, సోమవారం

సమస్యా పూరణం -375 (శంకరునకు గలవు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
శంకరునకు గలవు వంక లెన్నొ!
నిన్న నన్ను "వంకరయ్యా!" అని సంబోధించిన బాల్యమిత్రుడు `గుజరాతి లక్ష్మన్ సా' కు ధన్యవాదాలతో ....

21 కామెంట్‌లు:

  1. బూది వలువ, వాని బుద్ధి మనకందదు
    జడుడు,మెడను పాము,జటల ధారి
    నీరు నెత్తి నుండు, నిటలములో నిప్పు
    శంకరునకు గలవు వంక లెన్నొ!

    రిప్లయితొలగించండి
  2. బూది వలువ, వాని బుద్ధి మనకందదు
    జడుడు, మెడను పాము, జటల ధారి
    నీరు నెత్తి నుండు, నిటలములో నిప్పు
    శంకరునకు గలవు వంక లెన్నొ!

    రిప్లయితొలగించండి
  3. (శంకరార్యా ! మన్నించాలి)

    కోరి కోరి యిచ్చు క్రొత్త సమస్యలు
    తప్పులెన్ను తాను తరచి తరచి
    బ్లాగునందు జేర వదలనే వదలరు
    శంకరునకు గలవు వంక లెన్నొ!

    రిప్లయితొలగించండి
  4. గురువు లందు తగిన గుణసమర్థతలన్ని
    శంకరునకు గలవు. వంక లెన్నొ
    దీర్పఁ గలుగు గొప్ప తెలివిని,నోరిమి
    తోడ, నార్తి, కరుణ తోడ నుంద్రు.

    రిప్లయితొలగించండి
  5. హనుమఛ్ఛాస్త్రి గారు, మందాకిని గారు మనోహరమైన పద్యాలు చెప్పారు. మా చిన్న వాడి పేరు భవానీ శంకర్. గురువు గారికి వంకలు చూపిస్తే తను ఒప్పుకోడు.

    తరుణ చంద్రు డొప్పుఁ దలపైనఁ దానెక్కి
    నాక నదియు గెంతి నాట్య మాడు
    నతివ గూడెఁ దనకు నర్ధ దేహము నందు
    శంకరునకు గలవు వంకలెన్నొ !

    గన్నవరపు నరసింహ మూర్తి.

    రిప్లయితొలగించండి
  6. డా.మూర్తి మిత్రవర్యా! చిన్న టిప్.మీరు "ప్రొఫైల్ను ఎంచుకోండి" అన్న చోట "అజ్ఞాత" కాకుండా, "పేరు/URL" అని select చేసుకోండి. అప్పుడు మీ పేరు టైపు చెయ్యవచ్చు. అట్లా అయితే, "అజ్ఞాత చెప్పారు..." అన్నచోట మీరు టైపు చేసిన పేరు కనిపిస్తుంది. నేను అట్లానే "చంద్రశేఖర్" అని టైపు చేస్తాను, కాబట్టి "చంద్రశేఖర్ చెప్పారు" అని కనిపిస్తుంది, నా పోస్టింగులకు. ఇక, "అజ్ఞాత" గొడవ వుండదు. ప్రయత్నించి చూడండి.

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    1)
    _______________________________

    మూడు కళ్ళు గలిగి - ముక్కంటి యనబడు
    ఎద్దు నెక్కి దిరుగు - వృద్ధు డతడు !
    నెత్తి మీద నీరు - నిప్పేమొ కంటిలో
    వల్లకాటి యందు - పర్యటించు !
    చిత్ర మైన వాడు - చెప్ప తరము గాదు !
    శంకరునకు గలవు - వంక లెన్నొ!
    _______________________________

    రిప్లయితొలగించండి
  8. అందరి పూరణలూ చక్కగా అనిపించాయి.
    మూర్తి గారూ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. సిగన చంద్ర వంక, చిత్తమెడమ వంక ,
    గళమున గరళమ్ము కంటమంట,
    మెడననాగవంక,నడుచుభక్తులవంక
    శంకరునకు గలవు వంకలెన్నొ

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతిశాస్త్రిసోమవారం, జూన్ 27, 2011 8:14:00 PM

    శ్రీ గురుభ్యోనమ:

    నమక చమక సూక్త నామంబులనుచెప్పి
    శంకరునకు, గలవు వంకలెన్నొ
    స్వాదు జలము దెచ్చి స్నపనము గావించి
    శివుని పూజ జేయ శ్రియము కలుగు

    రిప్లయితొలగించండి
  11. బూది పూత లకట ! పుఱ్ఱెలను గళమందు
    సిగను చంద్ర వంక సొగసు గాను
    మసన మందు దిరుగు మహనీయు డందురు
    శంకరు నకు గలవు వంక లెన్నొ !

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    మొదటిపూరణలో ‘జటలధారి’అన్నచోట్ ‘జడలదారి/ జడలసికయు’ అనండి.
    ఇక రెండవపూరణలోని ‘వంకలు’ శంకలు దిర్చేవే కదా! సంతోషం!

    మందాకిని గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. చిఱ్ఱు బుఱ్ఱు లాడు కుఱ్ఱల గనినంత!
    కస్సు బస్సు మనును కదపి నంత !
    విసుగు, కోప మతని వేడుక! మన తిక్క-
    శంకరునకు గలవు వంక లెన్నొ!
    ******************************************
    బూది పూత వాడు! పులి తోలు గలవాడు!
    పాము లాడు వాడు! పరమ కోపి!
    వాని పైన నీకు వలపేల పార్వతీ!
    శంకరునకు గలవు వంక లెన్నొ!

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    శంకరుని గుణాలన్నీ చెప్పి వంకలంటున్నారు :-)
    పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    సుందరమైన పూరణ. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    అబ్బో ... ఎన్నివంకలు చూపించారండీ!?
    అద్భుతమైన పూరణ. అభినందనలు.

    శ్రీపతి శాస్త్రి గారూ,
    మనోహరమైన పూరణ. అభినందనలు.
    ‘శ్రియము గలుగు’ ‘శ్రీలు గలుగు’ అయితే ?

    రాజేశ్వరక్కా,
    ధన్యవాదాలు. మంచి పూరణ ఇచ్చారు. అభినందనలు.
    ‘పుఱ్ఱెలన్ గళమందు’ అంటే మొదటిపాదంలోని గణదోషం తొలగిపోతుంది.

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారూ,
    తిక్క శంకరయ్యను బాగానే పట్టుకున్నారు. బాగుంది. ఇక రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా ! ధన్యవాదములు.
    శంకరులు భోళా శంకరులు.ఎన్ని వంకలుబెట్టినా మావంకే చూస్తారని మా నమ్మకం.

    రిప్లయితొలగించండి
  17. హమ్మయ్య తమ్ముడూ ! ఇప్పడికి సరి పోయింది " అసలు పులి తోలు ధరియింఛి " అని రాసి అనవసరం గా చేరిపాను అదైనా సరి పోనేమో ! ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి