24, జూన్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 85 (కమ్మలు మోఁకాళ్ళు దాఁకి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 29
సమస్య -
"కమ్మలు మోకాఁళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్"
కం.
కొమ్మను మదనుం డపుడు జ
వమ్మున నీలోత్పలముల వడి నేయంగా
సొమ్మసిలి మోము వంచినఁ
గమ్మలు మోఁకాళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

15 కామెంట్‌లు:

  1. అమ్మగ మారిన సుందరి
    బొమ్మగ ముద్దొస్తుయున్నబుడతడి పొట్టన్
    'ఉమ్మ'ని ముద్దులు పెట్టగ
    కమ్మలు మోకాఁళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ
    'అమ్మగ మారిన సుందరి' పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. ఝుమ్మను తుమ్మెద వోలెన్
    కమ్మగఁ బాడుచుఁ యశమ్ముఁ ఘనముగ గనె. రా!
    రమ్మని మూఁపున నెత్తగఁ
    కమ్మలు మోకాఁళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్

    అమ్మ తన చిన్న బిడ్డను మూపున నెత్తుకొనగా అమ్మ కమ్మలు బిడ్డ మోకాళ్ళు తాకి ఘల్లుమన్నాయి.

    రిప్లయితొలగించండి
  4. యడాగమం రాదేమోనన్న సందేహంతో చిన్న సవరణ...

    అమ్మగ మారిన సుందరి
    బొమ్మగ ముద్దుల నొలికెడి బుడతడి పొట్టన్!
    'ఉమ్మ'ని ముద్దులు పెట్టగ
    కమ్మలు మోకాఁళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్!!

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ఉదయం మీ పూరణ చూసి తీరిగ్గా ‘ముద్దుల నొలికెడి’ సవరణ చెప్పాలను కున్నాను. కాని చిత్రంగా ఆ సవరణ మీరే చేసారు. సంతోషం!

    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు. ఇలాగే తరచుగా మిత్రుల పూరణలను పరామర్శిస్తూ ఉండండి. వారికి ప్రోత్సాహం ... నాకు ఆనందం!

    మందాకిని గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నిజమే తమ్ముడూ ! ఈ మధ్య బొత్తిగా బుర్ర పనిజేయ టల్లేదు [ అసలుంటే కద ] దీన్నే కాబోలు " చదవేస్తే ఉన్నమతి పోయింది " అంటారు. పైగా ఇప్పుడు ఒక నెల బ్రేకు ఇక ఇంతే సంగతులు.

    రిప్లయితొలగించండి
  7. రమ్మని పిలిచిన పాపడు
    ఇమ్ముగ కౌగిటను బిగియ నెమ్మిక మీరన్ !
    కమ్మని ముద్దుల నీయగ
    కమ్మలు మోకాళ్ళు దాటి ఘలు ఘలు మనియెన్ !

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _________________________________
    ఇమ్ముగ నాడెడు పాపడు
    గమ్మున నరుదెంచి తల్లి - కాళ్ళను చుట్టన్
    ఝుమ్మనె హృదయము తల్లికి !
    కమ్మలు మోకాఁళ్ళు దాఁకి - ఘలుఘలు మనియెన్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరక్కా,
    బాగుంది పూరణ. అభినందనలు.
    ‘పాపడు / నిమ్ముగ’ అంటే రెండవపాదంలో యతి కుదురుతుంది.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఝుమ్మంది హృదయం .."?

    రిప్లయితొలగించండి
  10. ప్చ్ ! లాభం లేదు తమ్ముడూ ! కొన్నాళ్ళు రాయడం మానెయ్యాలి .మీ ఓర్పుకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  11. అక్కయ్యా,
    అంతపని చేయకండి. వృద్ధాప్యంలో బాల్యం తిరిగివస్తుందట. కాబట్టి బాలచాపల్యంతో వృద్ధులం తప్పులు చేస్తుంటాము. అయినా తప్పులు వెదకి సవరించడానికి నేనున్నాను కదా!

    రిప్లయితొలగించండి
  12. గుమ్మయె నృత్యము చేయుచు
    దిమ్మున తలతిరిగి మిగుల తికమక తోడన్
    గమ్మున కూలంబడగా
    కమ్మలు మోకాఁళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్

    రిప్లయితొలగించండి