16, అక్టోబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -495 (జ్ఞానము లేనట్టివాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్.
ఈ సమస్యను సూచించిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

 1. పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి పూరణ .....

  ధ్యానమ్మే తగు యోగము,
  మౌనము నియమముగ గలుగు మహితాత్ముండున్
  దీనోద్ధారకు డన్య
  జ్ఞానము లేనట్టి వాడు సద్గురువయ్యెన్

  రిప్లయితొలగించండి
 2. దీనజనావళి కయి తా
  జ్ఞానము దీపము గను నిడి సచ్ఛీలతలన్
  మౌనముగఁ దెల్పి యే య
  జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్.

  రిప్లయితొలగించండి
 3. ఆ 'నారాయణ' గానము
  ధ్యానము ధర్మ ప్రవచనపు ధ్యాసయె గానీ !
  ఈ నర లోకపు లౌకిక
  జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్ !!

  రిప్లయితొలగించండి
 4. ఎందరో మహానుభావులు,అందఱికీ వందనములు ;


  మేను నిడి వైద్య శిక్షకుఁ
  దా నాగతి మాకు నేర్పెఁ దను మర్మములన్
  మానక మరణము పిమ్మట
  జ్ఞానము లేనట్టి వాఁడు సద్గురు వయ్యెన్ !


  శిక్ష = అభ్యాసము

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  సన్యసించి , దీనుల నుద్ధరించు కొఱకు దేశ సంచారియై
  పీఠముల స్థాపించుచూ తన వాదనా పటిమతో అందరినీ
  ఓడిస్తూ , చివరకు కామశాస్త్రంలో పోటీకై గడువు కోరి
  పరకాయ ప్రవేశ విద్య చేత రాజకళేబరము ప్రవేశించిన
  శంకరాచార్య్ల గాథ :

  01)
  _________________________________

  మానావ మానముల విడి
  దీనోద్ధారణ వహించి - తీర్థంగరుడై
  చానను జేరెను ! యిచ్చక
  జ్ఞానము లేనట్టివాఁడు - సద్గురువయ్యెన్ !
  _________________________________
  ఇచ్చకము = కామము

  రిప్లయితొలగించండి
 6. నా పూరణ .....

  పూని గురునిఁ జేరెఁ జదువ
  జ్ఞానము లేనట్టివాఁడు; సద్గురు వయ్యెన్
  వానికి ప్రేమాదరముల
  తో నానాశాస్త్రముల యథోచితబోధన్.

  రిప్లయితొలగించండి
 7. దీనజనావనుడు మురళీ
  గానవిలోలుడువికసిత కంజాక్షునినే
  ధ్యానము సలుపుచు నితర
  జ్ఞానమ్ము లేనట్టివాడె సద్గురుడయ్యెన్

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారి వ్యాఖ్య .....

  కమనీయం గారి పద్యములో 1వ పాదములో గణములు సరిపోవుట లేదు. సవరణ అవసరము.

  రిప్లయితొలగించండి
 9. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....

  వానరుడు రాముగొల్వగ
  ప్రాణుల సృజియించునట్టి పదవిని పొందెన్
  ఆ నామమటుని టనగను
  జ్ఞానములేనట్టివాడు సద్గురువాయెన్

  రిప్లయితొలగించండి
 10. ఏనాటి పుణ్య ఫలమో,
  మానోములుపండెనేమొమాన్యుడు,సాయీ
  గానవదాన్యుడు,చెడువి
  జ్ఞానము లేనట్టి వాఁడు సద్గురు వయ్యెన్!!!

  రిప్లయితొలగించండి
 11. పూనికతో శాస్త్రంబులు,
  ధ్యాన సమాధాన యఙ్ఞ యాగాదులచే
  మేనున "నేన"ను మోహా
  జ్ఞానము లేనట్టి వాఁడు సద్గురు వయ్యెన్!!!

  రిప్లయితొలగించండి
 12. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణలో...
  3వ పాదం చివరి గణంలో "లౌకిక" అని ప్రయోగించారు.. లౌకిక + జ్ఞానము = లౌకికఙ్ఞానము అన్న సంస్కృత సమాసంలో "ఙ్ఞ" కారం ముందు "క" కారం గురువై, భగణం బదులుగా రగణం అయి, గణ భంగం అయ్యే ప్రమాదముంది, గమనించ గలరు.

  రిప్లయితొలగించండి
 13. గన్నవరపు నరసింహ మూర్తి గారూ.. మీ పూరణ వైద్యశాస్త్రోచితంగా ఉండడం ఔచితీవంతంగా ఉంది.
  "దను మర్మములన్" అన్న ప్రస్తావన బావుంది.

  రిప్లయితొలగించండి
 14. ఏనాటి పుణ్య ఫలమో మరి
  ఈ నాటికి మనుజ జన్మ నీ సాయి పధమ్మున్
  జ్ఞానా మృతమును గ్రోలుచు
  జ్ఞానము లేనట్టి వాడు సద్గురు వయ్యెన్ !

  రిప్లయితొలగించండి
 15. "చిత్ర కవిత్వం" అంటే... ఆసక్తి ఉందా?  రండి.! "ప్రతిభా స్వరాల్లో" సంతృప్తి పరిచే పద్యాలను ఆస్వాదించండి..!  మీకిదే సాదర ఆహ్వానం.!

  రిప్లయితొలగించండి
 16. పార్వతీశ్వర శర్మ గారికి ధన్యవాదములు.మిత్రుల పూరణలు వైవిధ్యముగా అందముగా ఉన్నాయి. శ్రీ పీతాంబర మహాశయులకు ,రాజేశ్వరి అక్కయ్య గారికి ప్రత్యేక అభినందనలు !

  రిప్లయితొలగించండి
 17. మన తెలుగు - చంద్రశేఖర్ఆదివారం, అక్టోబర్ 16, 2011 10:25:00 PM

  నానా జాతి సమితులన్
  తానే దరిజేర్చి సలిపె తప్పెట భజనల్
  కానుకలందుచు కననే
  జ్ఞానము లేనట్టివాఁడు “సద్గురు” వయ్యెన్.

  రిప్లయితొలగించండి
 18. తాను, నేను ;

  తాను నేను పదములు ద్రుత ప్రకృతికములు.

  సూత్రము ; తాను, నేను పదముల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు.

  దీర్ఘంబు మీద సాధ్య పూర్ణంబు లేదు అను వ్యాకరణ సూత్రము ననుసరించి 'తాం ', 'నేం ' అని కూడా రావు.

  అందుచే తాను, నేను పదములపై క,చ,ట,త,ప లకు సరళాదేశ సంధి వచ్చి గ,జ,డ,ద,బ లుగా మారితే ద్రుతములు స్వత్వము లు గా ఉండవచ్చు . లేకపోతే అర్ధానుస్వారము రావచ్చును.

  తాను,నేను పదములకు సరళ స్థిరములు ( పరుష సరళములు గాని హల్లులు ) పరంబగునపుడు ద్రుతమునకు లోపము రావచ్చు, లేక స్వత్వముగా మిగిలిపోవచ్చును.

  ఉదాహరణలు

  తాను + పవ్వళించె = (1) తాను బవ్వళించె సరళా దేశ సంధి జరిగి ద్రుతము స్వత్వము గా మిగిలింది.

  (2) తాఁ బవ్వళించె . సరళదేశ సంధి పిమ్మట ద్రుతమునకు అర్ధానుస్వారము వచ్చింది.

  తాం బవ్వళించె, తాన్బవ్వళించె దోషములు.

  నేను + మాయలో = (1) నేను మాయలో . ద్రుతము స్వత్వముగా మిగిలింది

  (2) నే మాయలో . ద్రుతమునకు లోపమయింది


  నేఁ మాయలో, నేం మాయలో, నేన్మాయలో అవి దోషములు.

  రిప్లయితొలగించండి
 19. ' నేనున్నీవు ప్రపంచము
  పూనికతో తరచి చూడ బుద్బుదసమమే,
  ఔ' నన, కాదే కాదను న-
  జ్ఞానము లేనట్టి వాడు సద్గురు వయ్యెన్

  రిప్లయితొలగించండి
 20. (మూర్తిగారు) గురువుగారు,
  ఇంత శ్రద్ధగా మా సందేహాన్ని తీర్చిన మీకు నా కృతజ్ఞతలు వేనవేలు తెలుపుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 21. మందాకిని గారూ నేను కూడా పుస్తకాలు తిరుగ వేసి చెప్పే మాటలే! ఈ వయస్సులో నాకు మిగిలిన మెదడు ధూసర కణములలో తెలుగుని చొప్పించాలనే అభిలాష, క్రొత్త తరము వారు తెలుగు భాషపై మక్కువ చూపిస్తే ఆనందము ! మీకు చక్కని బ్లాగు నడుపుతున్నందులకు అభినందనలు !

  రిప్లయితొలగించండి
 22. శ్రీగురుభ్యోనమ:

  మానసమందున రాముని
  ధ్యానించుచు నిలిపె హనుమ ధన్యుండగుచూ
  ధ్యాన నిమగ్నుడు, ఘనుడ
  జ్ఞానము లేనట్టివాఁడు - సద్గురువయ్యెన్

  రిప్లయితొలగించండి
 23. ఆ నా రాముని మదిలో
  నానా విధముల గొలిచిన నామరస సుధా
  పాన పవనసుతు డన్య
  జ్ఞానము లేనట్టివాఁడు, సద్గురు వయ్యెన్.

  రిప్లయితొలగించండి
 24. గణ దోషమును తెలిపిన శర్మ గారికి ధన్యవాదములు. సవరణతో...

  ఆ 'నారాయణ' గానము
  ధ్యానము ధర్మ ప్రవచనపు ధ్యాసయె గానీ !
  ఈ నర పామర లోక
  జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్ !!

  రిప్లయితొలగించండి
 25. రామనామ రస సుధాపాన పవనసుతు డన్య జ్ఞానము లేనట్టివాఁడు ! సెహభాస్ చంద్రశేఖర్ గారూ !

  రిప్లయితొలగించండి
 26. హనుమఛ్ఛాస్త్రి గారికి విద్యుఛ్ఛక్తి కోత లేకుండా ఉంటే ఇంకా ఎంత బాగుండునో !

  రిప్లయితొలగించండి
 27. కవిమిత్రులు మన్నించాలి.
  కొన్ని కారణాల వల్ల నిన్న బ్లాగును అడపాదడపా చూడడమే కాని మీ పూరణపై వ్యాఖ్యానించలేకపోయాను. ఇప్పుడు ఆ పని పూర్తి చేస్తాను.

  రిప్లయితొలగించండి
 28. **********************************************************************
  పండిత నేమాని వారూ,
  ధ్యానయోగంతో అన్యజ్ఞానశూన్యుడు సద్గురువని చక్కగా పూరించారు. ధన్యవాదాలు.
  **********************************************************************
  మందాకిని గారూ,
  ఏ అజ్ఞానము లేనివాణ్ణి సద్గురువు చేసారు. బాగుంది పూరణ. అభినందనలు.
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కని పూరణ చేసారు. అభినందనలు.
  సవరించిన తర్వాత కూడ రెండవ పాదంలో ‘ధర్మప్రవచనపు’అన్నప్పుడు ‘ర్మ’ గురువై గణదోషం. ‘ధర్మమ్ము జెప్పు’ అంటే సరి!
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ‘రాంభట్ల’ వారి ప్రశంసకు పాత్రమైన మీ పూరణ అత్యుత్తమం అనడం అత్యుక్తి ఎంతమాత్రం కాదు. అద్భుతం! అభినందనలు.
  **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  శంకరాచార్యుల ప్రస్తావనతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
  ‘తీర్థంగరుడై’ టైపాటా? అక్కడ ఉండవలసించి ‘తీర్థంకరుడై/తీర్థంగతుడై’లలో ఏది?
  ‘ఇచ్చకము’నకు కామము అంతగా ప్రసిద్ధికెక్కిన రూఢ్యర్థం కాదు. ‘చానఁ గనె కామశాస్త్ర/జ్ఞానము ...’ లేదా ‘చానను జేరెను కామ/ జ్ఞానము ...’ అంటే ఎలా ఉంటుంది?
  **********************************************************************
  ‘కమనీయం’ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదాన్ని ‘దీనావనుండు మురళీ’ అని మార్చితే గణదోషం పరిహారమౌతుంది.
  **********************************************************************
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 29. శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 30. **********************************************************************
  "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  మీరు ఓపికగా మిత్రుల పూరణలను చదివి గుణదోష విచారణ చేస్తూ (నాకు శ్రమ తగ్గిస్తూ) బ్లాగుకు వన్నె తెస్తున్నందుకు ధన్యవాదాలు. మీ సహకారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
  **********************************************************************
  రాజేశ్వరి అక్కయ్యా,
  చక్కని పూరణ చేసారు. అభినందనలు.
  కాకపోతే 1,2 వ పాదాల్లో గణదోషం. మొదటి పాదం చివర ఉన్న ‘మరి’ తొలగించండి. రెండవపాదం చివర ‘పధమ్మున్’ అన్నచోట ‘సృతిని’ అనండి.
  **********************************************************************
  చంద్రశేఖర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ఇప్పటిదాక మీరు చేసిన సమస్యాపూరణలు ఒకెత్తు, ఈ వ్యాకరణ పాఠం ఒకెత్తు. గురువుకే గురువయ్యే సామర్థ్యం మీకుంది. ధన్యవాదాలు.
  **********************************************************************
  మిస్సన్న గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ‘ఔ ననగా కాదను న ...’ అంటే ఎలా ఉంటుంది?
  **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  రెండవపాదము చివర ‘అగుచూ’ అన్నదానిని ‘అగుచున్’ అంటే సరి!
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 31. గురువుగారికి , నరసింహమూర్తి గారికి మరీ మరీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 32. గురువు గారూ నమస్సులు ,ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 33. మూర్తి గారు నమస్కారం .ధన్యవాదాలు .
  మీ పూరణ రెండవ సారి చదివిన తర్వాత గాని దాని గొప్పతనం అర్థంకాలేదు. మీ ఉహకు నా జోహార్లు .

  రిప్లయితొలగించండి
 34. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ నిన్న సాయంత్రమే చూసాను. నన్నే లక్ష్యంగా చేసుకున్నారని నవ్వుకున్నాను కూడా. పనుల ఒత్తిడి వల్ల నిన్న ఎవరి పూరణలనూ సమీక్షించలేదు. ఈ రోజు ఉదయం అందరి పూరణలను విడివిడిగా పరామర్శిస్తున్నప్పుడు ఒకరి పూరణ చదవడం, మౌజ్ చక్రం సహాయంతో క్రిందికి రావడం వ్యాఖ్య టైపు చేయడం, మళ్ళీ పైకి .. ఇలా సర్కస్ పీటు చేస్తున్న క్రమంలో మీ పూరణ నా దృష్టిలో పడలేదు. మిమ్మల్ని నిరుత్సాహపరచినందుకు మన్నించండి.
  నేను సద్గురువునని ఒప్పుకోను కాని మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 35. ధన్యవాదాలు, డా.మూర్తి మిత్రమా!

  రిప్లయితొలగించండి
 36. ఆర్యా !
  నా పూరణ ఇది ,

  హీనుల మౌఢ్యము గని తా
  మౌనుల వారసుడననుచు మోసము నెఱుపన్
  పూని ధరన్ నిగమాగమ
  జ్ఞానము లేనట్టివాఁడు, "సద్గురు" వయ్యెన్.

  రిప్లయితొలగించండి
 37. మొదటి పాదంలో 'దీనజనావనుడు మురళీ' కి బదులు 'దీనావనుండు,మురళీ'అని సవరిస్తే సరిపోతుందనుకొంటాను. -ధన్యవాదాలు-కమనీయం

  రిప్లయితొలగించండి
 38. దీనుల పాలిటి సఖుడై
  దానము ధర్మములుజేసి ధన్యుండగుచున్
  మానెడు నార్ధిక శాస్త్ర
  జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్

  రిప్లయితొలగించండి
 39. తానెవరో తనదేదో
  కానుచు హృదయమ్మునందు ఘనమగు ప్రీతిన్
  మీనము మేషము జోస్యపు
  జ్ఞానము లేనట్టివాఁడు సద్గురు వయ్యెన్

  రిప్లయితొలగించండి