21, అక్టోబర్ 2011, శుక్రవారం

నిషిద్ధాక్షరి - 1

నిషిద్ధాక్షరి - 1

‘ర, మ’ అనే అక్షరాలు ఉపయోగించకుండా
రామునిపై
మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

67 కామెంట్‌లు:

  1. నా పూరణ .....

    శివుని విల్లు దునిచి సీతను పెండ్లాడె
    నయ్య బాస నిలుప నడవి కేగె
    దానవులను జంపె దశకంఠు శిక్షించె
    దినపతికుల దీపకునకు జోత!

    రిప్లయితొలగించండి
  2. మందాకిని గారూ,
    ధన్యవాదాలు.
    చివరి పాదంలో నాకు ఏ లోపమూ కనిపించడం లేదు. దయచేసి మీరు గమనించిన అంశంమేదో చెప్పండి. సవరించుకుంటాను.

    రిప్లయితొలగించండి
  3. ఇన కుల కంధికిన్ శశి, భువీశుడు, క్షోణి జెలంగు విష్ణుడున్
    జనగణ సేవితుండు, క్షితిజా హృదయేశుడు, శక్తిశాలి, కూ
    ల్చెను దనుజావళిన్, జలధి సేతువు గట్టెను, కోతిదండుతో
    జని దశకంఠు జెండె నని సాగిలి యాతని కంజలించెదన్

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. మీ పద్యాలు బ్లాగుకే అలంకారాలు. ధన్యుణ్ణి!

    రిప్లయితొలగించండి
  5. మందాకిని గారూ,
    అక్కడ ‘దిన - కున’ ప్రాసయతి ఉంది.

    రిప్లయితొలగించండి
  6. ఆహా గురువుగారు,
    కట్టె, కొట్టె, తెచ్చె లా కట్టె, ఏగె, కొట్టె అంటూ మూడు ముక్కల్లో రామాయణాన్ని మొత్తం చెప్పేశారు గా. ధన్యవాదాలు.


    నిజమే గురువుగారు,
    నేను ఇలాంటి యతిని మర్చిపోతూనే ఉంటాను.
    అధిక ప్రసంగం చేసినందుకు మన్నించండి.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  7. జానకి నేలుకున్నపతి, సద్గుణ సంపద కల్గి తండ్రికై
    కానన వాసుడై నిలను కష్టత లన్నియు పొందియుండి దా
    పూనిన సత్యసంధతను పోడిగ క్షోణితలంబు నిల్చెనే
    దీనజనావనుండగుచు దీనుల నాతడు కాచునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  8. గురువు గారూ,
    యమకాలంకారప్రయుక్తంగా వ్రాసినాను. సరిచూడగలరు.

    భువిజ హృన్నివాసి, భువిజన దైవంబు
    నినకులోద్భవుండు, ఘనవిభుండు,
    దనుజకులభవుండుదశకంఠునిన్ జంపి
    శాంతి నిలిపెనిక నితాంతగతిని.

    రిప్లయితొలగించండి
  9. గురువు గారికి సవరణలకు , నమస్కారములతో
    --------------
    కోదండ విచ్చెసెను కి
    ష్కిందకు లక్ష్మణుని తోడ క్రీడన వాలిన్
    క్రిందకు గూల్చ దొరకె నా
    నందము సుగ్రీవునకు సునందుని గరముల్|

    రిప్లయితొలగించండి
  10. శిలనిల లలనగ జేసియు
    నెలకూనాతాల్పుకోల నిలువున గూల్చిన్
    జలనిధి కావల గాజని
    ఇలసుత గాపాడినట్టి యినకులు గొల్తున్

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  11. గురువు మన్నించాలి, ర అక్షరము వచ్చినది
    ------------
    కోదండ విచ్చెసెను కి
    ష్కిందకు లక్ష్మణుని తోడ క్రీడన వాలిన్
    క్రిందకు గూల్చ గలిగె నా
    నందము సుగ్రీవునకు సునందుని సేవల్|

    రిప్లయితొలగించండి
  12. నాకొక సందేహం. పెద్దలు తీర్చగలరని అడుగుతునాను.

    ర, మ అనే అక్షరములు నిషిద్ధం కదా మరి వాటితో వచ్చే సమ్యుక్తాక్షరాలను వాడవచ్చునా??
    ఉదాహరణకు: వరప్రసాదుగారి పద్యములో లక్ష్మణుడు లో మకారమూ, క్రీడ, క్రింద మరియు సుగ్రీవుడు అనే పదాలలో ర కారమూ క(వి)నిపిస్తునాయి. అలా చెయ్యవచ్చునా??

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! ర మ లతో కూడిన ఏ సంయుక్తాక్షరమునూ వాడ రాదు

    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! వరప్రసాద్ గారూ!
    కంద పద్యములో ప్రాస నియమము గూర్చి మీకు సరి అయిన అవగాహన లేదేమో. కోదండ అనే పదములో ద ప్రాస ఉండగా, మిగిలిన పాదాలలో అనుస్వారముతో (సున్నతో) కూడిన ద ప్రాస వేసేరు. అందుకే ప్రాస భంగము జరిగినది. శంకరయ్య గారు ప్రాస నియమము గూర్చి ఒక పాఠము చెప్పాలేమో.
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  15. శ్రీ పండిత నేమాని గారూ,

    మరి వట్రసుడి వాడవచ్చా?? ( నేను నా పద్యములో హృన్నివాస అని వాడినాను, కానీ అది రకారోచ్చారణమవుతుంది కాదా?? నేను వ్రాసినది సముచితమేనా?? సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్థన ).

    రిప్లయితొలగించండి
  16. నాకూ పూరణ చేయుచున్నపుడు ఇదే సందేహము కల్గినది. అయినా పొరబాటు చేశాను.
    నా పూరణలో తండ్రికై అనుటకు బదులుగా యొద్దికన్ అని ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను. గురువు గారు గమనించగలరు.
    గురువు గారు,
    మీరు ఎంతో ఓపికగా ఇన్ని పూరణలు పరిశీలిస్తున్నారు. మరలా రెండవ పూరణ అంటూ మిమ్మల్ని శ్రమ పెట్టటం .... ఒక్కొక్కసారి మాత్రం ఒక మంచి భావన చెప్పకుండా ఉండలేక పూరణ చేస్తుంటాను. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! సంపత్కుమార్ శాస్త్రి గారూ!
    మీ యమకాలంకార ప్రయత్నము బాగుంది.
    ఋ కారము (వట్రసుడి) వాడుట తప్పుకాదు. మీరు దనుజకులభవుండు అని రావణాసురుని గూర్చి వాడేరు. రావణుడు దనుజ కులము వాడు కాడు. రాక్షస కులము వాడు. అసురులు - దనుజులు, దైత్యులు, రాక్షసులు అని 3 రకములు. రావణుడు మొదలైన వారు రాక్షసులు. దనువు సంతతి వారు దానవులు(దనుజులు), దితి సంతతివారు దైత్యులు(దితిజులు).

    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  18. **********************************************************************
    మందాకిని గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    ‘తండ్రికై’ అన్నచోట ‘యప్పకై, యయ్యకై’ అంటే సరిపోతుంది కదా!
    ‘కష్టత లన్నియు’ అనడమూ బాగాలేదు. ‘కష్టశతంబుల’ అంటే బాగుంటుందని నా సలహా. మూడవ పాదం చివర ‘నిల్చె’కాకుండా ‘నిల్పె’ ఉండాలనుకుంటాను.
    ఇక పూరణలను చదివి సమీక్షించడం, సవరణలను చేయడం నేను శ్రమగా కాక బాధ్యతగా నిర్వహిస్తున్నానని గమనించ మనవి.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    వట్రువసుడి ప్రయోగం దోషం కాదు.
    ‘దనుజకుల భవుండు’ అన్వయం ముదుకు వెళ్తే రామునికి వర్తిస్తుంది. ముందున్న విశేషణాలు ఇక్కడ అన్వయిస్తే రావణుడికి చెందుతాయి. ఆ ప్రమాదం కలుగకుండా ‘దనుజకుల భవుడగు’ అంటే సరి!
    **********************************************************************
    వరప్రసాద్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని సవరణలకు లొంగని లోపాలున్నాయి.
    ప్రాసదోషం గురించి నేమాని వారు చెప్పారు కదా! వ్యాకరణ విరుద్ధమైన శబ్దప్రయోగం, నిషిద్ధాక్షరి నియమాన్ని ఉల్లంఘింస్తూ ‘ర, క్ష్మ, క్రీ, క్రిం, గ్రీ’ అక్షరాల ప్రయోగం ఉన్నాయి.
    సవరించిన పద్యంలోను దోషాలున్నాయి.
    మరో ప్రయత్నం చేయండి. విజయీభవ!
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘నెలకూనాతాల్పు’ అన్నచో ‘నా’ దోషమే. ‘నెలకూననుతాల్పు’ అనండి. అదే పాదంలో చివర ‘గూల్చిన్’? అది ‘గూల్చెన్’కు టైపాటా?
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    మిత్రుల సందేహనివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. శ్రమ అనుకోకుండా ‘ప్రాసమైత్రి’ పాఠం మీరే చెప్పకూడదూ! మీకు వీలు కాకుంటే నా కెలగూ తప్పదనుకోండి.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని వారూ,
    అసురుల భేదాలను గురించి మీరు ఇంతకు ముందు కూడా ప్రస్తావించారు. అయితే ఈ సూక్ష్మభేదాన్ని ఇప్పుడు ఎవరూ పాటించడం లేదనుకుంటా. వాటిని పర్యాయపదాలుగానే భావిస్తున్నారు.
    ఆచార్య జి. ఎన్. రెడ్డి గారి ‘పర్యాయపద నిఘంటువు’ అసురుడు, దనుజుడు, దైత్యుడు, రాక్షసుడు పర్యాయపదాలు గానే చెపుతున్నది. జనబాహుళ్యంలోను ఇదే అభిప్రాయం ఉంది.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారు,
    సంతోషమండి. యయ్యకై అన్నమాట బాగుంది. కష్టత నిఘంటువులో ఉన్నప్పటికీ, కష్టశతంబుల అన్న మాట అందంగా ఉంది. ఇక కష్టాలు పడి కూడా సత్యసంధతనున్ / లో నిలిచాడు అని చెప్దామనుకున్నాను. సరే సత్యసంధత ను నిలిపాడు అన్నది కూడా బాగుంది.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  21. ధన్యోస్మి గురువు గారూ. నేను మొదటగా "దనుజకులవిభుండు" అని వ్రాసి తరువాత అన్వయలోపము సిద్ధిస్తుందేమోనని "దనుజకులభవుండు" అని వ్రాసినాను. తుదకు నేననుకున్న అన్వయలోపమే కలిగినది. సరిదిద్దుకొంటాను.

    సవరణకు ధన్యవాదములు.

    శ్రీ నేమాని గురువర్యా!

    శంకరార్యులు చెప్పినట్లుగా దనుజులు అంటె రాక్షసులు అనే అర్థము మాత్రమే ఉందనుకొన్నాను. మీరు, వీలు చూసుకొని దనుజులు, రాక్షసులు, దైత్యులు లకు భేదములను వివరించగలిగితే నేర్చుకొంటామని మనవి చేస్తున్నాను.

    మీకు కలిగిన శ్రమకు క్షంతవ్యుడిని.

    రిప్లయితొలగించండి
  22. అయ్యా! శంకరయ్య గారూ!
    నా వద్ద సరియైన లక్షణ గ్రంథము లేదు. నాకు జ్ఞాపకము ఉన్న విషయాలు మాత్రము చెప్పితే పాఠము సంపూర్ణము కాదు. అధ్యాపకునిగా అనుభవము శూన్యము. తప్పదు అంటే ఒక పుస్తకము కొని చెప్పాలి. ఈ క్రింది కొన్ని నియమములు చూడండి:
    (1) ప్రాస అక్షరము దాని ముందు అక్షరము కూడా గణనలోకి తీసుకోవలెను.
    (2) పద్యములోని తొలి అక్షరము హ్రస్వము అయితే నాలుగు పాదములలో తొలి అక్షరము హ్రస్వమే ఉండాలి.
    (3) తొలి అక్షరము దీర్ఘము అయితే 4 పాదాలలో దీర్ఘమే ఉండాలి.
    (4) ప్రాస అక్షరము ఏ హల్లు ఐనా 4 పాదాలలో అదే హల్లు ఉండాలి. ఆ హల్లు పై అచ్చు ఏదైన ఫరవా లేదు;
    (5) ప్రాస అక్షరము సున్నతో కూడి ఉంటే 4 పాదాలలో సున్నతో కూడియే ఉండాలి.
    ప్రాస యతికి కూడా ఇవే నియమములు పాటించాలి.
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  23. శ్రీ శంకరయ్యగారూ
    నమస్కారం

    కూల్చిన్ అనేది మీరన్నట్టుగా టైపాటే.
    ఇక "నెలకూనాతాల్పు" లో "నా" దోషమన్నారు. గ్రహించేను, కానీ నా మనసుకో అనుమానం కలుగుతోంది. కాస్త వివరించండి.

    గద-గదాధారి(దా దీర్ఘమయింది)
    మురళి- మురళీధరుడు(ళీ దీర్ఘం), వంశి-వంశీధర్(శీ దీర్ఘం)
    వీణ- వీణాధరి లేక వీణాధారి(ణా దీర్ఘం)

    పైన ఉదహరించినటువంటివి ఇంకా చాలా పదాలు ఉన్నాయికదా, అదే పద్ధతిలో నెలకూనను దాల్చువాడు నెలకూనాతాల్పు అని వ్రాసేను.

    గద, వీణ, మురళి వంటివి జీవములేనివి అనుకుంటే, నెలకూనకు జీవము ఉన్నది అనుకోవాలి కనుక అది భిన్నంగా ప్రయోగించాలా.

    అలాగే చక్రము ధరించినవాడు చక్రధారి గానీ చక్రాధారి లేదా చక్రాధరి కాలేదు. అదే పద్ధతిలో గిరిని ధరించినవాడు గిరిధారి అయ్యేడు.

    ఎప్పుడు దీర్ఘం వస్తుందో ఎప్పుడురాదో??!!

    దయచేసి ఈ సూక్షంపై కాస్త వివరణ ఇవ్వండి.

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  24. ఇనకుల తిలకుడు నిలబడి
    జనకుని సుత జూచి విల్లు చప్పున లేపన్
    గణగణ కదలెను గంటలు
    కన నితడేయగును నీదు కాంతుండనుచున్.

    రిప్లయితొలగించండి
  25. జనకుని సాక్షిగ ఘనుడౌ
    యినకుల తిలకుండుదృoచె నీశుని ధనువున్,
    జనులెల్ల జూచు చుండగ
    వనజాక్షిని బెండ్లి యాడె వైభవ లీలన్!!!

    ఇది నిషిద్దాక్షరిలో నా తొలి ప్రయత్నం.

    రిప్లయితొలగించండి
  26. భూజాతాపతియై యయోధ్యవిభుఁడై బొంకాడ బోనంచు దా
    నే, జీవించగ నాడు వచ్చెఘనుఁడా దైవాంశసంభూతుడే,
    జైజైపాతక నాశకా గుణనిధీ సాకేత దేశాధిపా-
    జేజేలంచును, జోతలందుకొను సౌశీల్యుండు శిష్టుండహో!

    రిప్లయితొలగించండి
  27. **********************************************************************
    పండిత నేమాని గారూ,
    ప్రాసను గురించిన ప్రాథమికజ్ఞానాన్ని అందజేసినందుకు ధన్యవాదాలు. నేనే ప్రాసమైత్రి గురించి తొందరలోనే ఒక పాఠం పెడతాను.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీరు చెప్పినవన్నీ సంస్కృత ఉదాహరణలు. కాని నెలకూనతాల్పు తెలుగుసమాసం. ఇక్కడ నెలకూనా తాల్పు అనరాదు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అయితే మీరు ప్రయోగించిన ‘దృంచె’ తప్పు. అది ‘ద్రుంచె’ అప్పుడు నిషిద్ధాక్షరి నియమాన్ని ఉల్లఘించినట్లవుతున్నది. అక్కడ ‘తునిచె’ అంటే సరి!
    **********************************************************************
    మందాకిని గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  28. వరప్రసాద్ గారి పూరణ .....

    కదలె నడవికి దన కాంత జానకితోడ
    నడవియందు జింక నడచిపోవ
    విల్లు బట్టి వెదకె విజ్ఞత విడిచి జా
    నకిని గోలుపోయె నాడు తాను.

    రిప్లయితొలగించండి
  29. శ్రీ శంకరయ్యగారూ
    వివరణకు ధన్యవాదం

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  30. వరప్రసాద్ గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, అక్టోబర్ 21, 2011 8:23:00 PM

    ఏ కావ్యానికి నాది కావ్య ఘనతల్ యేతెంచె ? నే నాయకుం
    డే కాలానికి నైన బూజ్యుడయి సాహిత్యాన భాసిల్లు ? సు
    శ్లోకుండాతడొకండె యేడు గడ యంచు న్నేను భావించి యా
    సాకేతాధిపు గొల్తు నెల్లపుడు విశ్వాస ప్రభూత స్థితిన్

    రిప్లయితొలగించండి
  32. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారు,
    "నెల కూన" తెలుగు పదము.
    మీరు ఉదాహరించిన గదా, మురళీ, వంశీ, వీణా - సంస్కృత శబ్దములు మరియు ఇవి ధీర్ఘాంతములైన శబ్దములు. వీటిని తత్సమ శబ్దములుగా స్వీకరించినప్పుడు ధీర్ఘాంతము హ్రస్వము అవుతుంది. కాని సంస్కృత సమాసముగా స్వీకరించినప్పుడు ధీర్ఘము ఉండి తీరవలెను.
    కాని తెలుగు సమాసములో లేని ధీర్ఘమును పెట్ట లేము.

    అలాగే సంస్కృతములో చక్ర, గిరి హ్రస్వాంతములు, కావున సమాసము చేసినప్పుడు ధీర్ఘము రాదు.

    నకు తెలిసి సంస్కృతములో ఎది ధీర్ఘాంతమో, హ్రస్వాంతమో తెలుసుకోవటానికి సూత్రమేమి లేదనుకుంటా.

    పెద్దలు ఎమయినా ఉంటే తెలియ జేయ గలరు. నేను తప్పుగా ఎమైనా చెప్పి ఉంటే సరి దిద్దగలరని ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  33. నేను టైపు చేసేలోపె గురువు గారు సమాధానము ఇచ్చారు.

    రిప్లయితొలగించండి
  34. లక్కాకుల వెంకట రాజారావు గారూ,

    అద్భుతమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
    ‘ఘనతల్ + ఏతెంచె’ ఇక్కడ యడాగమం రాదు. ‘ఆదికావ్యయశమే యేతెంచె’ అందాం.

    రిప్లయితొలగించండి
  35. అయ్యా! రాజారావు గారి పూరణ 4వ పాదములో విశ్వాసప్రభూత స్థితిన్ అనే పదములో రకారము ఉన్నది గదా. అదొక్కటి మార్చితే పద్యము చాల బాగుంటుంది.
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  36. శంకరార్యా ! ధన్యవాదములు.
    ర,మ రహితంగా రామునిపై రమ్య మైన పద్యములు వ్రాసిన మిత్రులకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  37. శ్రీ జిగురు సత్యనారాయణగారూ నమోన్నమః

    వివరం చెప్పినందులకు ధన్యవాదం. ఎందుకో ఈ విషయం లోతులకు వెళ్ళాలనిపిస్తోంది. అష్టావధాని రాంభట్ల ఏమైనా అంటే బాగుణ్ణు దీని గురించి.

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  38. శ్రీగురుభ్యోనమ:

    నిషిద్ధాక్షరి ననుసరించి శ్రీరాముని కీర్తించిన కవిమిత్రులందరికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  39. కౌసల్యాతనయుండును,
    భూసతితనయాధవుండు,భువనాఖిలసం
    వాసగణవందితుండును,
    దాసావనబద్ధుడు నను దయతోఁ గనడే!

    రిప్లయితొలగించండి
  40. జనకుని యింటికేగి కడు చక్కని సీతను గెల్చు వానికిన్
    జనకుని పల్కు దాల్చి నిజ జానకితో వని కేగు వానికిన్
    జనులను స్వంత బిడ్డలుగ సాకుచు పాలనఁ జేయు వానికిన్
    జననుత కౌసలేయునకు సజ్జన శీలికి కోటి వందనాల్!!

    రిప్లయితొలగించండి
  41. ఫాలనయనుని విల్లుని పట్టియెత్తి
    భగ్నమునుజేసి మెప్పించి భానుకులుడు
    జానకీపతి యాయెను జనకవిభుని
    కన్యకామణి జేపట్టి ఘనత గాంచె.

    రిప్లయితొలగించండి
  42. తాపసులు పొగడునా ఘన
    తాపసినద్భుత కృతులను ధన్యత పొందన్
    పాప దహనఫల బీజో
    ద్దీపితపద జానకీపతి నిట భజింతున్.

    రిప్లయితొలగించండి
  43. ఉనికి నిడె బాలయ యోధ్యలందు (పుట్టుక, గుప్త స్వరూప శక్తి)
    కలిసె కానన కిష్కింధ కాండలందు (ఎందరినో, జటాయువు, శబరి, సుగ్రీవుడు...)
    కనియె కపిసీతఁ సుందర కాండ యందు
    సిద్ధి నిచ్చెరా వణునకు యుద్ధ కాండ
    జయ జయ జానకీపతి జయ జగపతి!

    రిప్లయితొలగించండి
  44. పండితనేమాని మహాశయా! దనుజులు, దానవులు, రాక్షసులు వేరు వేరని నా చిన్నప్పుడు పురాణ ప్రవచనంలో విన్నాను. మరలా మీరు ఉటంకించారు. సంతోషం. నిఘంటువు చూస్తే అన్నీ ఒకటిగానే వుంటాయి. కాలంతో పాటు వచ్చే మార్పేమో!
    మాష్టార్లూ,
    ఇకపోతే ప్రాస నియమాలలో (3) వ దానికి ఇది కూడా కలుపుకుంటే - "తొలి అక్షరం గురువు అయితే, 4 పాదాలలో గురువే వుండాలి అంటేఇక్కడ ప్రాసాక్షరం సంయుతాక్షరం గానీ, ద్విత్వాక్షరం అయినప్పుడు వచ్చే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని."
    మరి నా సందేహం - ప్రాసాక్షరం సంయుతాక్షరమైతే వృత్తాలలో 4 పాదాలలోనూ అదే సంయుతాక్షరమే వుండాలి కదా? అలాగే ద్విత్వాక్షరమైతే అదే ద్విత్వాక్షరం, అంతేనా?

    రిప్లయితొలగించండి
  45. కవిమిత్రులకు, పండితులకు మనవి:
    ఆదౌ తపోవనాది గమనం హత్వామృగం కాంచనమ్|
    వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణమ్|
    వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనమ్|
    పశ్చాద్రావణ కుంభకర్ణ హననం త్వేతద్ధి రామాయణమ్||
    ఈ ఏకశ్లోకాత్మక రామాయణాన్ని చక్కటి పద్యరూపంలో చెప్పమని.

    రిప్లయితొలగించండి
  46. **********************************************************************
    రాజారావు గారూ,
    ‘ప్రభూత’ శబ్దప్రయోగంతో నిషిద్ధాక్షరి నియమోల్లంఘన జరిగింది. అక్కడ ‘విశ్వాసైకసద్వృత్తితోన్’ అందాం.
    **********************************************************************
    ఊకదంపుడు గారూ.
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    జిగురు సత్యనారాయణ గారూ,
    మనోహరమైన మీ పూరణకు ‘కోటి వందనాల్’
    **********************************************************************
    ‘కమనీయం’ గారూ.
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘విల్లుని’ అనేది ‘విల్లును’కు టైపాటనుకుంటాను.
    **********************************************************************
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మీ మొదటి పూరణ చాలా బాగుంది. ‘పాపదహన ఫల బీజోద్దీపితఫల పద జానకీపతి’ అద్భుతంగా ఉంది.
    రెండవపూరణ కూడా బాగుంది. కాని ‘రావణ’ శబ్దప్రయోగంతో నియమోల్లంఘన జరిగింది. ‘సిద్ధి లంకేశునకు నిడె’ అంటే సరి!
    ప్రాస పాఠంలో మీవంతు సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    ఇక మీరిచ్చిన ఏకశ్లోకి రామాయణానికి ఎవరైన కవిమిత్రులు స్పందిస్తారో చూడాలి!
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  47. అయ్యా!
    ఏక శ్లోకీ రామాయణమునకు మా తెలుగు అనువాద ప్రయత్నమును చూడండి.
    వనికేగెన్ రఘునేత, కూల్చె మృగమున్, వైదేహినిన్ దొంగిలిం
    చెను లంకేశుడు, వాని డాసి మరణించెన్ పక్షి, సుగ్రీవు మై
    త్రిని బొందెన్, ఘన సేతువున్ నిలిపి వార్ధిన్ దాటె, జంపెన్ దశా
    స్యుని, రామాయణ మిట్టులొప్పు జగతిన్ శ్రోతృప్రమోదమ్ముగా

    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  48. పండిత నేమాని వారూ,
    పఠితృ శ్రోతృ ప్రమోదాన్ని కూర్చే మీ పద్యం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  49. పండితశ్రీ నేమాని మహాశయా! అద్భుతం. శతకోటి ధన్యవాదాలు. మంచి పద్యం అందించారు.

    రిప్లయితొలగించండి
  50. కమనీయం గారు,
    మీ పూరణలో రెండు చోట్ల మకారము వచ్చింది. భగ్నము, మణి.

    రిప్లయితొలగించండి
  51. కవిమిత్రుల రామనామం రాకుండా రామాయణం వీనుల విందుగా సాగింది.

    రిప్లయితొలగించండి
  52. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    *సీ*

    శివుని విల్లును చెండి - సీతను పెండ్లాడి
    జగతిని గాపాడు - జలజ నాభు
    అయ్య యాఙ్ఞను దాల్చి - యడవుల కేగిన
    అన్య భావన లేని - యచ్యుతునకు
    అనుజు డడిగినంత - నత్యంత దయజూపి
    చెప్పుల నిడినట్టి - చిద్విలాసు
    దనుజుల దండించి - దశకంఠునే గూల్చి
    ప్రజలను గాచిన - భాను కులుని

    తే*గీ

    భాగ్య దేవత యితడని - ప్రజలు పొగడ
    ప్రజల పాలించు నత్యంత - సుజను డైన
    పుణ్యవంతుడు, నేలను - పుట్టినట్టి
    లక్ష్మణన్నకు జోతలు - లక్ష లిడుదు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  53. మన తెలుగు - చంద్రశేఖర్శనివారం, అక్టోబర్ 22, 2011 4:56:00 PM

    వసంతమహోదయా! సీసం అదిరింది, ర కార, మ కారాలు లేకుండా అద్భుతంగా. ఒక్కటే ఒక్కటి - తేటగీతి చివరలో "లక్ష్మణ" లో మ కారం వచ్చింది.

    రిప్లయితొలగించండి
  54. చంద్ర శేఖరా ! ధన్యవాదములు !
    ఇప్పుడు చూడండి !
    01)
    _________________________________

    *సీ*

    శివుని విల్లును చెండి - సీతను పెండ్లాడి
    జగతిని గాపాడు - జలజ నాభు
    అయ్య యాఙ్ఞను దాల్చి - యడవుల కేగిన
    అన్య భావన లేని - యచ్యుతునకు
    అనుజు డడిగినంత - నత్యంత దయజూపి
    చెప్పుల నిడినట్టి - చిద్విలాసు
    దనుజుల దండించి - దశకంఠునే గూల్చి
    ప్రజలను గాచిన - భాను కులుని

    తే*గీ

    భాగ్య దేవత యితడని - ప్రజలు పొగడ
    ప్రజల పాలించు నత్యంత - సుజను డైన
    పుణ్యవంతుడు, నేలను - పుట్టినట్టి
    లచ్చి మగనికి జోతలు - లక్ష లిడుదు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  55. విద్యాసాగర్ అందవోలుశనివారం, అక్టోబర్ 22, 2011 5:39:00 PM

    పండిత నేమాని వారి 'నిషిద్ధాక్షరి' గురించిన వ్యాసం లో నిషిద్దాఖరి మూడు రకాలని వివరించారు.
    అందులో, 'ఏకాక్షర నిషిద్దాక్షరి' ఒకటి. మరి, రెండక్షరాలను నిషేధించటం కూడా కలదా?
    రెండవది, 'ర' నిషేధించినప్పుడు, 'ప్రజ' 'మైత్రి' అనే పదాలు వాడవచ్చునా? ఇది కేవలం సందేహము మాత్రమే.
    పద్యం పంపకుండా ప్రశ్నలు వేస్తున్నానను కోకండి.
    నా అజ్ఞానాన్ని మన్నించ గలరు.
    అందరి పద్యాలలో వారి పాండితీ ప్రకర్ష వ్యక్తమవుతోంది.
    వసంత కిశోర్ గారూ, మీ సీస పద్యం చాలా బావుంది, సవరణలో 'మ' వచ్చింది. గమనించ గలరు.

    రిప్లయితొలగించండి
  56. **********************************************************************
    మందాకిని గారూ,
    నిజమే, ‘కమనీయం’ గారి పూరణలో నియమోల్లంఘన జరిగింది. రెండు కాదు, మూడు చోట్ల (మెప్పించి). నేను గమనించలేదు. ధన్యవాదాలు.
    ‘భగ్నమునుజేసి మెప్పించి’ అన్నచోట ‘భగ్నత నొసంగి యొప్పుంచి’ అనీ, ‘కన్యకామణి’ అన్నచోట ‘కన్యకామణి’ అన్నచోట ‘కన్యకను సీతఁ’ అంటే సరి!
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    మీ సీసం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    సవరించిన తర్వాత కూడ రెండు చోట్ల నియమోల్లంఘన జరిగింది. ‘ప్రజల, లచ్చిమగనికి’ అన్నచోట్ల.
    సీసం నాల్గవపాదం ఉత్తరార్ధంలో ‘ప్రజలను గాచిన భానుకులుని’ అన్నచోట ‘జనులను గాచిన సవితృకులుని’ అనీ, ‘లచ్చిమగనికి’ అన్నచోట ‘లచ్చిగేస్తుకు’ అనీ అంటే సరి!
    **********************************************************************
    అందవోలు విద్యాసాగర్ గారూ,
    బహుకాలదర్శవం. సంతోషం!
    ‘ర’ను నిషేధించినప్పుడు ‘ప్రజ, మైత్రి’ అని సంయుక్తాక్షరంగా కూడా ఉపయోగించరాదు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  57. ఆర్యా! చిన్న సవరణ.
    (5) ప్రాస అక్షరము సున్నతో కూడి ఉంటే 4 పాదాలలో సున్నతో కూడియే ఉండాలి.
    అని అన్నారు.
    సున్నతో కూడి ఉంటే కాదు. అనుస్వార పూర్వకమైతే. అనుస్వార పూర్వకముగానే ఆ ప్రాసాక్షరం అన్నిపాదాలలోను ఉండాలి అని నియమం అనుకొంటున్నానండి.

    రిప్లయితొలగించండి
  58. విద్యాసాగర్ గారూ ! ధన్యవాదములు !
    శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  59. 01అ)
    _________________________________

    శివుని విల్లును చెండి - సీతను పెండ్లాడి
    జగతిని గాపాడు - జలజ నాభు
    అయ్య యాఙ్ఞను దాల్చి - యడవుల కేగిన
    అన్య భావన లేని - యచ్యుతునకు
    అనుజు డడిగినంత - నత్యంత దయజూపి
    చెప్పుల నిడినట్టి - చిద్విలాసు
    దనుజుల దండించి - దశకంఠునే గూల్చి
    లోకంబులను గాచు - లోకనాథు

    తే*గీ

    భాగ్య దేవత యితడని - పలుక జనులు
    జనుల పాలించు నత్యంత - శక్తియుతుని
    పుణ్యవంతుని, నేలను - పుట్టినట్టి
    లచ్చి గేస్తుకు జోతలు - లక్ష లిడుదు !
    _________________________________

    రిప్లయితొలగించండి