యడాగమం - 3
‘యడాగమం’ ఉదాహరణలు ఒకేచోట .....(అ)
మా + అమ్మ = మా యమ్మ
మీ + ఇల్లు = మీ యిల్లు
మా + ఊరు = మా యూరు
రావా + ఇటు = రావా యిటు
అదియే + ఇది = అదియే యిది.
(ఆ)
అమ్మ + ఇచ్చెను = అమ్మ యిచ్చెను
అక్క + ఎక్కడ = అక్క యెక్కడ.
దూత + ఇతఁడు = దూత యితఁడు
హరి + ఎక్కడ = హరి యెక్కడ
చెలువుఁడ + ఇందము = చెలువుఁడ యిందము
రామ + ఇటురా = రామ యిటురా
మిత్రమ + ఏమంటివి = మిత్రమ యేమంటివి
(ఇ)
మేన + అల్లుఁడు = మేనల్లుఁడు; మేనయల్లుఁడు.
పుట్టిన + ఇల్లు = పిట్టినిల్లు; పుట్టినయిల్లు.
చూడక + ఉండెను = చూడకుండెను; చూడకయుండెను.
(ఈ)
ఏమి + అంటివి = ఏమంటివి, ఏమి యంటివి.
మఱి + ఏమి = మఱేమి, మఱి యేమి.
అది + ఎక్కడ = అదెక్కడ, అది యెక్కడ.
అవి + ఎవరివి = అవెవరివి, అవి యెవరివి.
ఇది + ఏమిటి = ఇదేమిటి, ఇది యేమిటి.
ఇవి + అతనివి = ఇవతనివి, ఇవి యతనివి.
ఏది + ఎక్కడ = ఏదెక్కడ, ఏది యెక్కడ.
ఏవి + అవి = ఏవవి, ఏవి యవి.
(ఉ)
ఏమీ + అంటివి = ఏమీ యంటివి
(ఊ)
వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు, వచ్చిరి యప్పుడు.
వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమి యిప్పుడు.
(ఋ)
వచ్చి + ఇచ్చెను = వచ్చి యిచ్చెను
చూచి + ఏడ్చెను = చూచి యేడ్చెను.
పోయి + ఉండెను = పోయి యుండెను.
తిని + ఏమనెను = తిని యేమనెను.
(ౠ)
ఏమి + ఏమి = ఏమేమి, ఏమి యేమి
(ఎ)
ఏగి + ఏగి = ఏగి యేగి
(ఏ)
నా + అది = నాది, నా యది
నా + అవి = నావి, నా యవి
మాస్టరు గారూ ! యడాగమం గురించి ఏదో అనుకున్నాను. యింత ఉన్నదన్న మాట. సోదాహరణ వివరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువు గారూ, నమస్కారములు. ఆంగ్ల భాష కేముందండీ , ఏ టాము,డిక్కీ,హారీ యైనా నేర్చేసుకోవచ్చు.తెలుగు నేర్చిన వాడిదే సత్తా !
రిప్లయితొలగించండిశంకరార్యా ! శ్రమ దీసుకొని మా కందిస్తున్న పాఠాలకు
రిప్లయితొలగించండిధన్యవాదములు !
గురువుగారూ,
రిప్లయితొలగించండిఒక చిన్న సందేహము. యడాగమములో మీరు ఇస్తున్న ఉదాహరణలలో అక్క + ఎక్కడ = అక్క యెక్కడ అని వ్రాసినారు. అది అక్కెక్కడ అని కూడ అవుతుంది కదా. ఇది సంధి వైకల్పికము అని అంటారనుకుంటాను. కానీ అది ఇకారసంధికి మాత్రమే అని నా భావన. అక్క + ఎక్కడ అనె ఈ సంధి లో ఇది అకార సంధి అవుతుంది కదా. దయచేసి వివరించగలరు.
మాస్టారూ,
రిప్లయితొలగించండిమీపాఠం అదిరింది. కదళీపాకం. తెలుగు కొంచెం వచ్చనుకొన్నాను ఇన్నాళ్ళూ.ఏమీ రాదని తెలిసిపోయింది. ఒక్క యడాగమము నేర్చుకోవటానికే ఇంత వుందంటే, మిగిలింది ఇంకాయెంత వుందీ, యేమా కథ! డా.మూర్తి మిత్రులు చెప్పినట్లు టామ్, డిక్, హ్యారీ లాంటివారలకు ఇంగ్లీషే సరి, నాలాంటి జానపదులకు ఏదీ రాదు. "తెలుసుకోలేనివాడికి చెప్పినా తెలియదు" అనే కృష్ణ పాండవీయం డైలాగు గుర్తుకొస్తోంది.
ధన్యవాదాలతో,
చంద్రశేఖర్
గురువుగారూ యడాగమం మీద సమగ్రమైన పాఠం చెప్పారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి