14, అక్టోబర్ 2011, శుక్రవారం

చిరంజీవులు

చిరంజీవి సప్తకం
మిత్రులకు మనవి:
ఈ శ్లోకం నిత్య స్మరణీయం. ఈ చిరంజీవులను నిత్యం స్మరించుకొంటే ఆయురారోగ్యాలు వృద్ధి పొందుతాయని పెద్దల వచనం!
అశ్వత్థామ బలిర్వ్యాసో
హనుమాంశ్చ విభీషణ:|
కృప: పరశురామశ్చ
సప్తైతే చిరజీవిన:||

దీనికి పండిత నేమాని రామజోగి సన్యాసిరావు వారి అనువాదం ....
తే.గీ.
అల చిరాయు లశ్వత్థామ, బలియు, వ్యాసు
డును, హనుమయు, విభీషణుడును, కృపుడును,
పరశురాముండు నను బేళ్ళ బరగు వారు
వారిని దలంచినంత సత్ఫలము లొదవు

నా అనువాదం ...
కం.
ఒలయఁగ నశ్వత్థామయు
బలి వ్యాసుఁడు పవనసుతుఁడు పరశుధరుండున్
వెలయ విభీషణుఁడు కృపుఁడు
నిల చిరజీవులు; స్మరింప నెసఁగు శుభంబుల్.

ఈ శ్లోకాన్ని ప్రస్తావించిన చంద్రశేఖర్ గారికి,
చక్కని అనువాదం చేసిన పండిత నేమాని వారికి,
ధన్యవాదాలు.

10 కామెంట్‌లు:

  1. అల నశ్వత్థామయు , బలి ,
    వెలయగ వ్యాసుడు , హనుమ , విభీషణుడు , కృపుం
    డెలమి పరశు రాముడు వీ
    ర లేడుగురు సర్వదా చిరంజీవులె పో !

    లేఖినీ చాపల్యం ఆపుకోలేక రచించిన పద్యం ! విజ్ఞులు మన్నింతురు గాక !!! ( తలిస్తే శుభప్రదం అన్నది బుద్ధిపూర్వకం గానే వర్జితం ! )

    రిప్లయితొలగించండి
  2. మంచి శ్లోకాన్ని అందించిన చంద్రశేఖర్ గారికి , అనువదించి మాకందిం చిన గురువులు పండిత నేమాని వారికి , మాతో చదివిం చ గలిగిన శంకరయ్య గారికి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  3. నిత్య స్మరణీయమైన చిరంజీవుల శ్లోకాన్ని తెనిగించిన శ్రీ నేమనివారికి, శంకరార్యులకు, విష్ణు నందన్ గారికి నమస్సులు.
    అనువాదమునకు సాహసిస్తున్నాను. తప్పులుంటే మన్నించండి.

    బలి, యశ్వత్థామయు, మరి
    ఇల వ్యాసుడు, హనుమ, కృపుడు, ఎన్నగ చేతన్
    బలమున్న పరశు రాముం,
    డెలమి విభీషణుడు నేడ్గు రే చిర జీవుల్ !

    రిప్లయితొలగించండి
  4. అనువాదకులందరికీ వందనములు !
    అనువాదకులందరికీ వందనములు !
    కాని వీళ్ళు మాత్రమే చిరంజీవులెందుకయ్యారో ?

    రిప్లయితొలగించండి
  5. **********************************************************************
    గోలి హనమచ్ఛాస్త్రి గారూ,
    మీ సాహసం ప్రశంసనీయం. అనువాదం చక్కగా సాగింది. అభినందనలు, ధన్యవాదాలు.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    నాకు కొద్దిగా వ్యవధి ఇస్తే ఒక్కొక్కరు ఎలా చిరంజీవు లయ్యారో ఆ కథనాలను తెలియజేస్తాను. ఈలోగా మిత్రులు లెవరైనా ముందుకు వస్తే సంతోషం!
    ‘పూర్వగాథాలహరి’ కృపుడు చిరంజీవి అన్నది కాని వివరాలు ఇవ్వలేదు. మరోచోట వెదకాలి.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! ధన్యవాదములు !
    మీ వివరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాం !

    రిప్లయితొలగించండి
  7. వ్యాసుడు, కృపుడును, బలియును,
    భాసురముగ ద్రోణ సుతుడు, భృగుసూనుండున్,
    ఆ సుధి హనుమ, విభీషణు
    లీ సృష్టి చిరాయు లగుదు రేయుగ మైనన్.

    రిప్లయితొలగించండి