సుబ్రహ్మణ్య స్తోత్రము
(నాగుల చవితి పర్వదిన శుభాకాంక్షలతో ...)
(నాగుల చవితి పర్వదిన శుభాకాంక్షలతో ...)
వందే సుబ్రహ్మణ్యం
వందే సేనాన్య మఖిల భక్త శరణ్యమ్ |
వందే బుధాగ్రగణ్యం
వందే నాగార్చితం శివాతనయ మహమ్ ||
వందే సేనాన్య మఖిల భక్త శరణ్యమ్ |
వందే బుధాగ్రగణ్యం
వందే నాగార్చితం శివాతనయ మహమ్ ||
వందే తారకహారిం
వందే శక్రాది దేవ వందిత చరణమ్ |
వందే రుద్రాత్మభవం
వందే షాణ్మాతురం శివాతనయ మహమ్ ||
వందే శక్రాది దేవ వందిత చరణమ్ |
వందే రుద్రాత్మభవం
వందే షాణ్మాతురం శివాతనయ మహమ్ ||
వందే వల్లీ సహితం
వందే కరుణాకరం శుభప్రదమూర్తిమ్ |
వందే మయూరవాహం
వందే వరదం గుహం శివాతనయ మహమ్ ||
వందే కరుణాకరం శుభప్రదమూర్తిమ్ |
వందే మయూరవాహం
వందే వరదం గుహం శివాతనయ మహమ్ ||
వందే వీరవరేణ్యం
వందే వందారు భక్త వర సురభూజమ్ |
వందే భవభయ హారిం
వందే గణపానుజం శివాతనయ మహమ్ ||
వందే వందారు భక్త వర సురభూజమ్ |
వందే భవభయ హారిం
వందే గణపానుజం శివాతనయ మహమ్ ||
వందే శరవణజనితం
వందే జ్ఞాన ప్రభా విభాసుర మమలమ్ |
వందే పరమానందం
వందే ముక్తిప్రదం శివాతనయ మహమ్ ||
వందే జ్ఞాన ప్రభా విభాసుర మమలమ్ |
వందే పరమానందం
వందే ముక్తిప్రదం శివాతనయ మహమ్ ||
వందే కుమారదేవం
వందే గాంగేయ మగ్నిభవ మమరనుతమ్ |
వందే వరశక్తిధరం
వందే మంగళకరం శివాతనయ మహమ్ ||
వందే గాంగేయ మగ్నిభవ మమరనుతమ్ |
వందే వరశక్తిధరం
వందే మంగళకరం శివాతనయ మహమ్ ||
వందే సుందర రూపం
వందే వేదాంత రమ్య వనసంచారిమ్ |
వందే సురదళనాథం
వందే జ్ఞానప్రదం శివాతనయ మహమ్ ||
వందే వేదాంత రమ్య వనసంచారిమ్ |
వందే సురదళనాథం
వందే జ్ఞానప్రదం శివాతనయ మహమ్ ||
వందే భవ్య చరిత్రం
వందే శుభగాత్ర మబ్జపత్ర సునేత్రమ్ |
వందే పరమ పవిత్రం
వందే వల్లీప్రియం శివాతనయ మహమ్ ||
వందే శుభగాత్ర మబ్జపత్ర సునేత్రమ్ |
వందే పరమ పవిత్రం
వందే వల్లీప్రియం శివాతనయ మహమ్ ||
రచన - శ్రీ పండిత నేమాని రామజోగి సన్యసి రావు గారు.
నాగుల చవితి పర్వదిన సందర్భంగా మాచే సుబ్రహ్మణ్య స్తోత్రమును చదివింప జేసిన శ్రీ పండిత నేమాని గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని మహాశయా!
రిప్లయితొలగించండివందే...శివాతనయమహమ్ - అనే మకుటంతో చక్కని స్తోత్రాన్ని అందించినందులకు ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
పండిత నేమాని వంటి విద్వత్కవులు మన బ్లాగుకు లభించడం మన పూర్వసుకృతం ... భగవత్కృప! వారికి బ్లాగు మిత్రులందరి పక్షాన ధన్యవాదాలు.
సుబ్రహ్మణ్య స్వామి అనగా నాగదేవత గా (కులదైవంగా) పూజించటం తెలుసును. అలాగే మధురైలో మీనాక్షి గుడిలో కూడా నాగదేవత విగ్రహరూపంలో ఉన్న దైవాన్ని ఇదే పేరుతో ఒక మందిరం ఉన్నది.
రిప్లయితొలగించండికానీ సుబ్రహ్మణ్యుడు అనే పేరుతో కుమారస్వామి చాలా ప్రసిద్ధుడు అని తెలుసును.
పెద్దలు ఈ విషయంలో మరింత విశదీకరించగలిగితే కొంచెం నాకు స్పష్టత కలుగుతుందని ఆశిస్తున్నాను.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలున్నాయని చెబుతారు. నిజానికి యీ ఆరునూ శరీరంలోని షట్చక్రాలకు ప్రతీకలు. సుబ్రహ్మణ్యతత్వం కుండలినికి ప్రతీక. కుండలి అంటే పాము అనే అర్ధంకూడా ఉంది. ఈ కుండలిని మూలాధారంలో సర్పంలాగా చుట్టుకొని ఉంటుంది. యోగసాధకులు దానిని ప్రచోదనంచేసి సహస్రారంచేర్చి పరబ్రహ్మ స్వరూపంతో అనుసంధానం చేస్తారు. అదీ విషయం.
రిప్లయితొలగించండిhttp://te.wikipedia.org/wiki/సుబ్రహ్మణ్య_అష్టకం చూడండి.
నేమాని వారి సంసృత స్కంధాష్టకం కందాల్లో చాలా అందంగా ఉంది. తెలుగు పధ్ధతిలో యతి ప్రాసలు పాటించారు కూడా. నిజానికి సంస్కృతంలో యతిప్రాసల నియమాలు లేవు. అదీగాక, సంస్కృతంలో ఆర్యా వృత్తం మన కందానికి మూలంగా తోస్తుంది. అన్నట్లు తెలుగులో కందానికి శివకవులు చాలా ప్రచారం తీసుకు వచ్చారు.
అన్నట్లు మా యింటి యిలవేలుపు శ్ర్రీ సుబ్రహ్మణ్య స్వామియే. మా పితామహులు కీ.శే. సుబ్బారావుగారు శ్ర్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వరం వలన జన్మించినట్లు ఐతిహ్యం.
‘శ్యామలీయం’ గారూ,
రిప్లయితొలగించండిమంచి విషయాలు తెలిపారు. ధన్యవాదాలు.
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మీకు అన్ని శుభాలను కలిగించుగాక!
పండిత నేమాని గారి వ్యాఖ్య ......
రిప్లయితొలగించండిఅయ్యా! శ్యామలీయం గారికి హృదయకపూర్వక అభినందనలు.
సుబ్రహ్మణ్య తత్త్వము గూర్చి మంచి విషయాలు చెప్పేరు.
ఆరు మొగమ్ముల వేలుపు
వారికి యిలవేల్పు భక్తవరదుడు ప్రేమన్
వారి కొసగుచున్ శాశ్వత
భూరి శుభోన్నత తతులను బ్రోచు నిరతమున్
కవిమిత్రులకు అభివాదాలు.
రిప్లయితొలగించండినా శ్యామలీయం బ్లాగులో కేవలం ఆధ్యాత్మిక కవిత్వం మాత్రమే వ్రాస్తున్నాను యింతవరకూ. వచనంగా వ్రాసింది లేదు. శ్రీ సుబ్రహ్మణ్యులను గూర్చి వ్రాయాలని హఠాత్సంకల్పం కలిగింది. అలా వ్రాయాలనుకోవటం నిస్సందేహంగా మహాసాహసమే. అయనా వ్రాసాను అంతా స్వామి కటాక్షం వలన కుదురుతుందన్న నమ్మకంతో.
ఈనాటి నా బ్లాగులో " శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యనగా శుధ్ధ పరబ్రహ్మమే. " అన్న వ్యాసం చదువగలదని ఆశిస్తున్నాను. లింక్:
http://syamaliyam.blogspot.com/2011/10/blog-post_31.html
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినమస్కారములు.
రిప్లయితొలగించండిగురు తుల్యులు ,పూజ్యులు ,శ్రీ పండిత నేమానివారి సుబ్రహ్మణ్య స్తోత్రం . చాలా బాగుంది. చిన్నప్పుడు బట్టీ పట్టినవి కొన్ని " లిం గాష్టంకం ,అన్నపుర్నాష్టకం , కొన్ని గుర్తు ఉన్నాయి. ఒక చిన్న మనవి " ఆది దేవ నమస్తుభ్యం " ఇది మర్చి పోయాను బహుశా " " ఇది సూర్యాష్టకం " అనుకుంటాను .తమకి తీరిక ఉన్నప్పుడు ఇక్కడ ఉంచ గలరు. ధన్య వాదములు.
రాజేశ్వరక్కయ్యా,
రిప్లయితొలగించండిసూర్యాష్టకం గూగుల్ లో వెదికితే ఎన్నో లింకులు. బహుశా మీకు ఆడియో కూడా దొరకవచ్చు. అయినా మీ కోసం ...
శ్రీసూర్యాష్టకం
ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే |1|
సప్తాశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |2|
లోహితం రధమారూఢం సర్వలోక హితేరతం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |3|
త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |4|
బృంహితం తేజసాంపృధ్వి వాయురాకాశ మేవ చ
ప్రభూస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం |5|
బంధూక పుష్పసంకాశం హారకుండల భూషితమ్
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |6|
విశ్వేశం విశ్వాధారం మహాతేజః ప్రదీపనమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం |7|
శ్రీవిష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం |8|
మా ఈ సుబ్రహ్మణ్య స్తోత్రము గురించి స్పందించిన -- శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రి చంద్రశేఖర్ గారికి, శ్రీ శ్యామలీయం గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి, ప్రోత్సాహకులు శ్రీ కంది శంకరయ్య గారికి, మరియు మన బ్లాగు మిత్రులందరికి శుభాభినందనలు. పండిత నేమాని
రిప్లయితొలగించండివందే సేనాన్యమా ? లేక వందే సేనానిమా ???
రిప్లయితొలగించండినమస్కారములు.
రిప్లయితొలగించండివెంటనే స్పందించి " సూర్యాష్టకం " వ్రాసి నందులకు ధన్య వాదములు.