సాయీ! నీ మహిమ
సాయీ! నీ మహిమాతిశయమ్మును
సన్నుతి జేసి తరింపగా
వేయిముఖమ్ముల శేషుడు కూడ
చాలడంటె మరి నా తరమా? || సాయీ ||
షిరిడీవాసా! చిన్మయరూపా!
కరుణాసాగర! వరదాతా!
భక్తజనులు నీ పాదపద్మములు
స్మరించుచుందురు నిరంతరం
మాయామోహము నశింపజేసి
ఉద్ధరించెదవు దయామూర్తివై ........... || సాయీ ||
మానవజన్మము నెత్తి నరులకు
మోక్షమార్గమును చూపించితివి
సర్వకాల సర్వావస్థలలో
సంస్కరించెదవు క్షమామూర్తివై ......... || సాయీ ||
నీటితోడ వెలిగించి దీపములు
జ్ఞానకాంతులను వెదజల్లితివి
నిన్ను నమ్మి నీ దరికి జేరగా
మన్నించెదవు యోగిరాజువై ............ || సాయీ ||
ఓం సాయి! శ్రీ సాయి! జయజయ సాయి!
ఓం సాయి! శ్రీ సాయి! జయజయ సాయి! ........
శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - ఉన్నతి, స్వాతి, సుభాష్, శంకరయ్య.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/cdcec89f-23a3-4468-880c-1593c212124e/Sai---Saayee-nee-mahima
కందుల వరప్రసాద్ గారి వ్యాఖ్య .....
రిప్లయితొలగించండిగురువు గారూ,
సాయిపాటలు చాలా బాగున్నవి, సిడి రూపమున విడుదల చేయండి. మాకుటుంబ సభ్యులకు మా మిత్రులకు అందరికి వినిపించగలుగుటకు అవకాశము దొరకును. నా రెండవ కుమారుని పేరు " కందుల సాయిరామ్" . ఆ సాయి మహిమను అందరికి తెలియజేతుము.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ఆ పాటలు క్యాసెట్లుగా పదేళ్ళ క్రితమే విడుదలయ్యాయి. సిడిగా విడుదల కాలేదు. మీరు esnips నుండి ఆ పాటలను డౌన్ లోడ్ చేసికొని సిడి తయారు చేసికొండి. డౌన్ లోడ్ కాకుంటే మీ చిరునామా నాకు మెయిల్ పెట్టండి. ఆ పాటల mp3 సిడిని మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను.