నిషిద్ధాక్షరి
వసంత్ కిశోర్ గారి కోరికపై
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
చెప్పిన పాఠం
అష్టావధానంలో 4వ ప్రక్రియ నిషిద్ధాక్షరి. ఇది అవధానికి ఒక అగ్ని పరీక్ష వంటిది. పృఛ్ఛకుడు ఏదేని ఒక విషయము గూర్చి పద్యమును చెప్పమనును. సాధారణముగా కంద పద్యమునే వాడుతారు. ఇందులో (1) ప్రత్యక్షర నిషేధము; (2) వర్గ నిషేధము; (3) ఏకాక్షర నిషేధము అని ఉండును. ప్రత్యక్షర నిషేధములో అవధాని ఒక పద్యమును ప్రారంభించి మొదటి అక్షరమును చెప్పును. పృఛ్ఛకుడు 2వ అక్షరము ఫలానాది వాడరాదు అనును. అప్పుడు ఆవిధముగా 2వ అక్షరమును చెప్పును. పిదప 3వ అక్షరమును పృఛ్ఛకుడు నిషేధించును. అవధాని 3వ అక్షరమును చెప్పును. ఈ విధముగా పృఛ్ఛకుడు అన్ని అక్షరములను నిషేధిస్తూ ఉండగా అవధాని సరియైన అక్షరములను ఎంచుకొని పద్యమును అర్థవంతముగా పూర్తి చేయును. (2) వర్గ నిషేధములో పృఛ్ఛకుడు ఏదో ఒక వర్గమును వాడరాదు అని చెప్పును (ఉదా: క వర్గము కూడదు, లేక చ వర్గము కూడదు, ..) (3) ఏకాక్షర నిషేధములో ఏదో ఒక అక్షరము పద్యము మొత్తము మీద వాడరాదు అనును. నా అనుభవము: మందార పూవు పై పద్యము చెప్పవలెను - మ అను అక్షరమును వాడరాదు. నా పద్యమును చూడండి:శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
చెప్పిన పాఠం
తొలి వేల్పు చెట్టు పూవది
బలె బలె ఎర్రనగు రంగు బాగగు తేనెన్
గలిగిన విరి, వేల్పుల సిగ
లలరించుచు పూజలందు నద్భుత రీతిన్.
శ్రీ పండిత నేమాని గారూ,
రిప్లయితొలగించండిమంచి పాఠము చెప్పినందులకు ధన్యవాదములండీ. నాదొక చిన్న సందేహము. "నిషిద్ధాక్షరి" కి "నిషేధాక్షరికి" ఎమైన తేడా వుందా??
పండిత నేమాని వారి వ్యాఖ్య ...
రిప్లయితొలగించండిఅయ్యా! నిషిద్ధాక్షరి.
ఆష్టావధానములోని ఒక జటిలమైన ప్రక్రియ నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి అని వాడుటే ఒప్పు అనుకుంటాను.
గురువుగారూ అవధాన ప్రక్రియను అవధానిగారు స్వానుభవంతో వివరించటం మా అదృష్టము. గురువుగారూ యతి, ప్రాస అక్షరాలను పృచ్ఛకుడు నిషేధింపకూడదుకదా?
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిరెండూ ఒకటే నండీ, గురువు గారు చెప్పినట్టు నిషిద్ధాక్షరి ఎక్కువ వాడుక లో ఉన్నది.
శ్రీపతిశాస్త్రి గారూ,
అవునండీ, యతి ప్రాస స్థానములలో నిషేదించరు.
భైరవభట్ల వారి బ్లాగు లో - గరికపాటి వారి అవధానమ్ యొక్క ఆడియో ఉన్నది - వీలైనచో చూడండి[ :) వినండి] : http://telugupadyam.blogspot.com/2009/01/blog-post_17.html
పండితనేమాని వారు - వారి పుటలో అవధానము అని అంశం పెట్టినారు కానీ ఇంకా వివరములు ప్రకటించలేదు.
నమస్కారములు.
రిప్లయితొలగించండిరెండు మూడు సార్లు పండితులు " నాగఫణి శర్మ గారి " అవధాములో " నిషిద్దాక్షరీ " చూసాను .చాలా ఇంట్రస్ట్ గా ఉంటుంది. కాక పొతే నాకు పూర్తి గా అర్ధం కాలేదు. ఇప్పుడు గురువులు. శ్రీ పండితుల వారు చాలా వివరం గా తెలియ జెప్పారు. ధన్య వాదములు. పద్యం చాలా చాలా బాగుంది . " తోలి వేల్పు చెట్టు పూవది " ఎంత బాగుందో ! సరస్వతీ పుత్రుల సాంగత్యం వలన నా జన్మ ధన్య మైంది .
అబ్బో ! చాలా రంజుగా నున్నది !
రిప్లయితొలగించండినిషిద్ధంలో మళ్ళీ మూడు రకములు !
పూర్వం ఎప్పుడో ఎవరిదో
"అచ్ఛాంధ్ర నిర్గద్య నిరోష్ఠ్య రామాయణం " చదివాను !
ఒక్కముక్క అర్థమైతే ఒట్టు !
అబ్బ ! పూర్వ కవులు ఎన్నెన్ని ప్రయోగాలు చేశారు !
తెలుగు సాహిత్యాన్ని ఎంతెంత ఎత్తులకు తీసుకెళ్ళారు !
మన తరానికి , అష్టావధానం చేసినా చెయ్యక పోయినా
కనీసం అదంటూ ఒకటుందనైనా తెలుసు !
రాబోయే తరాల పరిస్థితి ఏమిటో !
అయినా నా పిచ్చిగాని మృతభాషల లిస్టులో
మొదటి రెండు మూదు స్థానాల్లోనే ఉందట తెలుగు !
శ్రమ కోర్చి మంచి పాఠం చెప్పిన నేమాని వారికి దానిని
ఓపికగా మాకందించిన శంకరార్యులకూశత సహస్త్ర ధన్యవాదములు !
నిషేధమైన అక్షర నియమమును పాటించు ప్రక్రియ ఐనందున నిషిద్ధాక్షరి. నిషేధాక్షరము అనునది అక్షరమునకు, నిషిద్ధాక్షరి అన్నది ప్రక్రియకు ప్రయుక్తమగు సరియైన పదాలు అని నా అభిప్రాయము.
రిప్లయితొలగించండిఆర్యా! నాకొక చిన్న వివరణ కావాలి.
రిప్లయితొలగించండినిషిద్ధాక్షరము కేవలము హల్లేనా లేక అచ్చుతో కూడిన హల్లా? కొన్ని చోట్ల అవధానాల్లో కొందరు అవధానులు కేవలము అచ్చును గ్రహించి అది మార్చి ఉన్న హల్లునే ప్రయోగిందడం గమనించాను.
వివరణ కోరుతున్నాను.
పండిత నేమాని వారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిSir, I am furnishing hereunder my explanation on some points raised by Sri Ch.Ramakrishna Rao garu and others.
అయ్యా!
(1) నిషిద్ధాక్షరిలో హల్లే ప్రాధాన్యము. అలాగే సందర్భానుసారముగా విడిగా నున్న అచ్చులను నిషేధించ వలసి యుంటుంది, ఉదా: ఇక్కడ "అ" నిషేధము, లేక "ఇ" నిషేధము అనవచ్చును.
(2) నేను చేసిన అష్టావధానములు మొత్తము 25. 1987 నుండి 1999 మధ్యలో చేసేను. ఆ అవధానముల రికార్డులు ఉంచలేదు. కొన్ని కొన్ని జ్ఞాపకము ఉన్న విషయములు అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాను.
(3) నా పేరన ఉన్న బ్లాగులు మా అబ్బాయికే ఆపరేటు చేయుట వచ్చు. మా అబ్బాయి యూ కే లో ఉంటున్నాడు. చాల బిజిగా ఉంటాడు. ఏవో నా రామాయణము మరి కొన్ని శతకములు బ్లాగులో ఉంచేడు.