19, అక్టోబర్ 2011, బుధవారం

నా పాటలు - (సాయి పాట - 6)

దీపస్తంభం

తీరం తెలియని సముద్రయానంలో
దారిని చూపే దీపస్తంభంలా
భవసాగరమును తరింపజేసెడివై
బాబా కథలే దారిని చూపునులే
బాబా కథలే గమ్యం చేర్చునులే

అమృతధారలను మించే మధురిమతో
అగ్నిత్రయమును మించు పవిత్రతతో
చెవుల సోకి హృదయానికి చేరునులే
జీవితముల శోభిల్లగ జేయునులే
బాబా కథలే కాంతిని నింపునులే ...........
|| తీరం ||

తనువు మీది అభిమానం తొలగించి
ద్వంద్వభావ గర్వాలను నిర్జించి
జ్ఞానకాంతులను మదిలో నింపునులే
సర్వపాప సంఘాలను చంపునులే
బాబా కథలే నీతులు నేర్పునులే ...........
|| తీరం ||

అధిక మోహమును స్వార్థము నడగించి
ఆత్మను సాక్షాత్కర మ్మొనరించి
గురుభక్తిని మన ఎదలో నింపునులే
పరమాత్ముని సన్నిధికే చేర్చునులే
బాబా కథలే మోక్షము నిచ్చునులే ........
|| తీరం ||

శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - హేమ కళ్యాణి.

ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/315a55d2-ace7-445d-9f7c-2a4f4c4aad16/Sai---Teeram-teliyani

3 కామెంట్‌లు:

 1. నమస్కారములు [ గురువులు గనుక ]
  దారిని చూపే " దీపస్తంభం లాంటి " అమృత తుల్య మైన సాయి పాటలు " మీరొక్కరే కాదు అనుమతిస్తే మేమందరం కుడా పాడుకో వచ్చును . మా కందరికీ అందించి నందుకు ధన్య వాదములు.

  రిప్లయితొలగించండి
 2. అక్కయ్యా,
  నా పాటలు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు.
  దేవుని పాటలకు ‘కాపీరైట్’ ఉండకూడదు. అవి సార్వజనీనం. ఎవరైనా పాడుకోవచ్చు. నా పాటలను భజనకూటమిలోనో, వైయక్తికంగానో పాడుకుంటే అంతకంటే అదృష్టం నా కేముంటుంది?

  రిప్లయితొలగించండి
 3. చాలా సంతోషం తమ్ముడూ ! ఇక్కడ మాఇంటి దగ్గర ఒక పది కుటుంబాలు కలసి బాబా భజనలు అందరి ఇళ్ళల్లోను [ ఒక్కొక్క నెల ఒకరింట్లో ] చేస్తాము. సుమారు ౭౦,౮౦ మంది కనీసం ఉంటారు .అప్పుడు అందరు భజన పాటలే పాడతారు. మా చిన బాబు కుడా పాడతాడు . అందుకని అడిగాను . అక్కడ హైదరాబాడులో కుడా ఇదే పధ్ధతి. మా పిల్లలు ౧౦ దేళ్ళ వయసు నుంచీ బాబా భక్తులే. ఈ పాటలు ఎన్ని ఉంటే అంత సంతోషం .ధన్య వాదములు

  రిప్లయితొలగించండి