16, అక్టోబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -494 (మా కేనుంగులు సాటియే)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
మా కేనుంగులు సాటియే యనుచు దో
మల్ పల్కుటల్ చిత్రమే?
ఈ సమస్యను పంపిన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారికి
ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

 1. కీకారణ్యపు శోభలున్, నెమలులున్, క్రేంకారముల్ కాన,మీ
  రాకాచంద్రుని యందముల్ పెరుగు నాలావణ్యముల్ చూచుచో-
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్! చిత్రమే
  లా? కాయంబున రక్తమంతటిని చాలా పీల్చుచున్నప్పుడున్.

  సంతృప్తి గాలేదు. మరొక పూరణ చేయుటకు ప్రయత్నించెదను.

  రిప్లయితొలగించండి
 2. శ్రీకాళీశుని గొల్వ వచ్చు.ఘనతన్ శ్రీవిఘ్ననాధాననం
  బై కోర్కెల్ కడతేర్చవచ్చు నయినన్ బై నుండి తొండంబుతో
  లోకంబందు గ్రహింపనేరవు కరుల్ లోనుండు రక్తం బికన్!
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే?

  రిప్లయితొలగించండి
 3. భీకరాకారమైన ఏనుగును చెఱసాలలో ( బోనులో ) వేస్తాము కానీ, చిన్న దోమకు భయపడి తామె చెఱసాలలో ( దోమతెరలో ) వుంటాము కదా. ఆ భావనతో..........

  కీకారణ్యములందువిచ్చలవిడిన్ కేళీ సలాపంబులన్,
  ఆకాశాంతమె హద్దుగాగ చెలగున్,యాభీకరాకారమున్
  ఆకారాగృహమందు వేయరె జనుల్? యాశిక్ష తామందరే?
  మాకేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే?

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి పూరణ .....

  లోకేశింగని ప్రేలడే మహిషుడున్ క్రోధంపుటాంధ్యంబుతో
  కాకుత్స్థుంగని పంక్తికంఠుడును ప్రాగల్భ్యంబులన్ బల్కడే
  లోకంబందున నైజమిద్ది గన నల్పుల్ దంభముల్ సూపుటల్
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే?

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారి వ్యాఖ్య .....

  సంపత్కుమార్ శాస్త్రి గారికి!
  మీ పూరణను చూచి ఈ సూచనలు చేస్తున్నాను.
  (1) మొదటి పాదము అంతములో పొల్లు (న్) ఉన్నది. దాని తర్వాత అచ్చు వేయుట వలన వ్యాకరణము సంగతి ఎలాగ ఉన్నా గమనము దెబ్బ తింటుంది. ఇలాగే 2వ పాదము చివర కూడా ఉన్నది. 3వ పాదములో జనుల్ తర్వాత యాశిక్ష -- యడాగమము రాదు.
  పొల్లు అక్షరము తర్వాత అచ్చు వాడుటను వీలైనంత మట్టుకు మానుట మంచిది.

  రిప్లయితొలగించండి
 6. మాకూ యున్నవి నాల్గు కాళ్ళు కరమున్, మాకెక్కువీ రెక్కలే !
  తోకా డించుచు గాలిలో నెగురుచున్ తొండమ్ముతో రక్తమే
  పీకల్దాకను పీల్చి పీల్చి జనులన్ భీతిల్లగా జేయునే?
  మా కేనుంగులు సాటియే? యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే !

  రిప్లయితొలగించండి
 7. శ్రీ పండిత నేమాని గారూ,

  వ్యాకరణోచితమైన సవరణలు సూచించినందులకు ధన్యవాదములు. ఇకమీదట జాగ్రత్త పడుతాను.

  రిప్లయితొలగించండి
 8. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  అర్భకులైన కుశలవులు శ్రీరాముని యాగాశ్వమును
  బంధించినప్పటి సంగతి :
  (గెలిచినప్పటి సంగతి కాదు సుమా)

  01)
  _________________________________________

  సాకేతాపుర నాథుయొక్క పవనా - జానేయమున్ బట్టి , యా
  లోకోద్ధారుని , యుద్ధమున్ గెలువ, నా - లోకించి ,శ్లాఘించదే
  లోకంబంతయు మాదు ప్రఙ్ఞ గని; నా - లోడించినన్ సైన్యమున్ !
  సాకారంబగు మాదు జన్మ మనియా - సామ్రాణి బంధించిరే !
  మా కేనుంగులు సాటియే యనుచు దో - మల్ పల్కుటల్ చిత్రమే!!!
  _________________________________________

  రిప్లయితొలగించండి
 9. ఆ కాలచ్చట దీసి హస్తి యిట మోపం బట్టు కాలంబులో
  లోకంబంతయు చుట్టు దోమ యన నాలోచించుడీ తిండికై
  యా కుల్మోపులు నేన్గు దోమ చినుకంతాశించు రక్తంబనన్
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్! చిత్రమే

  రిప్లయితొలగించండి
 10. పండిత నేమాని వారి వ్యాఖ్య ....

  అయ్యా! శుభాశీస్సులు - శ్యామలీయం గారూ!
  మీ పూరణ మొదటి పాదములో యతి సరి కాదు.
  మిగిలిన విషములన్నియును బాగుగనే ఉన్నవి.

  రిప్లయితొలగించండి
 11. పండిత నేమాని వారి వ్యాఖ్య .....

  ayyaa! mana blaagula mitrulaMdariki SubhaaSeessulu.
  మనోగతము
  సవరణలు చేయుడంచు సూచనలొసంగు
  చుంటి కొందరకేనిది "ఒప్పొ - తప్పొ -
  సాహసమొ కాని - యెల్లరు సహృదయమున
  చేకొనెదరంచు నెంచి యాశీస్సులిడుదు

  రిప్లయితొలగించండి
 12. పండితులవారికి నమస్సులు
  అయ్యా! మీరు పరిశీలించి సవరణలు చెప్పటం మాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం.
  కరుణతో మీరు ఈ పని కొనసాగించగలరని విన్నపం.

  రిప్లయితొలగించండి
 13. ప్రాకారంబులు,మేడ మిద్దెలును,ఆపై తాటిలోగిళ్ళలో
  నేకాలంబులనైన మాకు గలవే, యేచిన్నయడ్డంకులున్
  మాకింకెవ్వరుగారు పోటి,దిరుగన్,మావల్లనే "డెంగ్యు" యున్
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే?

  రిప్లయితొలగించండి
 14. చిన్న సవరణతో....

  మాకున్ గల్గెను నాల్గు కాళ్ళు కరమున్, మాకెక్కువీ రెక్కలే !
  ఏ కాలంబున గాలిలో నెగురుచున్ తొండమ్ముతో రక్తమున్
  పీకల్దాకను పీల్చి పీల్చి జనులన్ భీతిల్లగా జేయునే?
  మా కేనుంగులు సాటియే? యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే !

  రిప్లయితొలగించండి
 15. శ్రీ కృష్ణుండధికమ్ము జేసి పలుకన్ సిగ్గౌను భావించగ-
  న్నాకౌంతేయుల, వారలెందు సరి మా కానుడు నీనాడునున్?
  మా కాల్గోటికి గూడ పోలరుగదా మామా! ప్రలాపంబులా ?
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే!

  'కాల్గోరు' ప్రయోగం సమంజసమౌనో కాదో గురువులే చెప్పాలి.

  రిప్లయితొలగించండి
 16. శ్రీగురుభ్యోనమ:

  చీకాకుల్ కలిగించుచూ ఘనతలన్ జెప్పంగగా నేర్చిరే
  మాకంటెన్ ఘనులెవ్వరంచు మదిలో మాత్సర్యముల్ కల్గగా
  ఈకాలుష్యపు భావముల్ దెలుపగా నీ పోలికే యొప్పగున్
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే!

  మాకంటే గొప్ప వారు లేరు (ఉన్నారని తెలిసినా వారంటే మనసులో ఈర్ష్య) అని గొప్పలు చెప్పుకునే వారి విషయంగా చెప్పవలినపుడు ఈవిధంగా చెప్పవచ్చును అనే భావంతో వ్రాశాను.

  రిప్లయితొలగించండి
 17. పండిత వర్యుల పూరణలు , మిత్రుల పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి.

  లోకంబున్ బ్రజ తల్లడిల్ల భయమున్, లుప్తంబు కారుణ్యుతన్
  రాకేందున్ గబళించ నెంచి వెడలా రక్షస్సు భావంబు నీ
  రాకాసుల్ భువిఁ ద్రోచి హింస పథమున్, రాజ్యంబులన్ గాంచిరే !
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే !

  రిప్లయితొలగించండి
 18. పండిత వర్యుల పూరణలు , మిత్రుల పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి.

  లోకంబున్ బ్రజ తల్లడిల్ల భయమున్, లుప్తంబు కారుణ్యతన్
  రాకేందున్ గబళించ నెంచి వెడలా రక్షస్సు భావంబు నీ
  రాకాసుల్ భువిఁ ద్రోచి హింస పథమున్, రాజ్యంబులన్ గాంచిరే !
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్ చిత్రమే !

  రిప్లయితొలగించండి
 19. నా పూరణ మొదటి పాదములో యతి సరి కాదు. నిజమే. 'ఆ కాలచ్చట దీసి హస్తి యిట మోపం బట్టు కాలంబులో' అన్న మొదటి పాదాన్ని కొంచెం మార్చి వ్రాస్తే సరిపోతుంది.

  పూర్తి పద్యం పరిష్కరించి వ్రాయగా:

  ఆ కా లచ్చట దీసి హస్తి యిటు నేయం బట్టు కాలంబులో
  లోకంబంతయు చుట్టు దోమ యన నాలోచించుడీ తిండికై
  యా కుల్మోపులు నేన్గు దోమ చినుకంతాశించు రక్తంబనన్
  మా కేనుంగులు సాటియే యనుచు దోమల్ పల్కుటల్! చిత్రమే

  రిప్లయితొలగించండి
 20. కవిమిత్రులకు నమస్కారం!
  వారాంతపు సమస్యాపూరణ కదా! మీ పూరణలపై స్పందించడానికి నాకు కొద్దిగా సమయం కావాలి. ఆలస్యానికి మన్నించండి.

  రిప్లయితొలగించండి
 21. అర్భకులైన కుశలవులు శ్రీరాముని యాగాశ్వమును
  బంధించినప్పటి సంగతి :
  (గెలిచినప్పటి సంగతి కాదు సుమా)

  01అ)
  _________________________________________

  సాకేతాపుర నాథుయొక్క పవనా - జానేయమున్ బట్టి , యా
  లోకోద్ధారుని,యుద్ధమున్ గెలువ, నా - లోకించి శ్లాఘించదే
  లోకంబంతయు మాదు విక్రమము నా - లోడించినన్ సైన్యమున్ !
  సాకారంబగు మాదు జన్మ మనియా - సామ్రాణి బంధించిరే !
  మా కేనుంగులు సాటియే యనుచు దో - మల్ పల్కుటల్ చిత్రమే!!!
  _________________________________________

  రిప్లయితొలగించండి
 22. **********************************************************************
  మందాకిని గారూ,
  పద్యమైతే సలక్షణంగా ఉంది. సంతృప్తికరంగా లేదు, మరో ప్రయత్నం చేస్తానన్నారు కాని చేయలేదు. అయినా అభినందనలు.
  **********************************************************************
  రామకృష్ణారావు గారూ,
  మీ పూరణం అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మంచి విషయాన్ని ఎన్నుకున్నారు. పూరణకు. బాగుంది. అభినందనలు.
  పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారా?
  ‘కేళీసలాపంబులన్’ అన్నారు. సలాపం అంటే ‘సముద్రంలో ముత్యాలచిప్ప లేరడం’ అని అర్థం. సల్లాపం అంటే పరస్పర సంభాషణ. మీ రక్కడ ‘కేళీ విలాసంబుతో / నాకాశాంతమె హద్దుగా చెలఁగుఁ గాదా భీకరాకారమై / యా కారాగృహమందు ...’ అంటే సరి!
  **********************************************************************
  పండిత నేమాని వారూ,
  సర్వోత్తమమైన పూరణ మీది. అభినందనలు, ధన్యవాదాలు.

  తెలిసి తెలియక చేయు తప్పుల పొడఁ గని
  హెచ్చరిక చేసి సవరణ లివి యటంచు
  సత్పథమ్మున నడపించు సహృదయుఁడవు
  మా నమస్సులు గొనుము నేమాని సుకవి!!
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘భీతిల్లగా జేయునే’ అనేది ‘భీతిల్లగా జేతుమే’ అంటే బాగుంటుందని నా సూచన.
  **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  చక్కని విషయాన్ని ఎన్నుకున్నారు పూరణకు. అభినందనలు.
  ‘సాకేతపురం’ను ‘సాకేతాపురం’ అన్నారు. అక్కడ ‘సాకేతాధిపుడైన రాము ... ’ అందామా?
  **********************************************************************
  ‘శ్యామలీయం’ గారూ,
  సవరించిన మీ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  మంద పీతాంబర్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘మిద్దెలును ఆపై’ అన్నచోట ‘మిద్దెలవి యాపై’ అంటే అచ్చు వచ్చిన దోషం తొలగిపోతుంది.
  **********************************************************************
  మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది, అభినందనలు.
  ‘మా కానాడు’ అనేది టైపాటు వల్ల ‘మా కానుడు’ అని ఉంది.
  ‘కాల్గోరు’ సాధుప్రయోగమే.
  **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  ‘కలిగించుచూ’ అన్నదాన్ని ‘కలిగించుచున్’ అంటే సరి!
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘వెడలా’ వెడలన్ అయితే ..?
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 23. గురువుగారూ తప్పును సరిగా దిద్దినందుకు కృతఙ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 24. శాకాహారము మెక్కి మెక్కి బలుపౌ సంగ్రామముల్ జేయుచున్
  శోకమ్మొందుచు కాలుబట్ట ఝషమే శోషించి యల్లాడెనే...
  చీకాకుల్ పడజేసి పీల్చగలమే శ్రీకాంతు రక్తమ్మునే...
  మా కేనుంగులు సాటియే యనుచు దో
  మల్ పల్కుటల్ చిత్రమే?

  రిప్లయితొలగించండి