15, అక్టోబర్ 2011, శనివారం

సమస్యా పూరణం -493 (పరమపావనమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పరమపావనమ్ము పరుల సొమ్ము.
ఈ సమస్యను పంపిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

63 కామెంట్‌లు:

  1. పరులు పావనులని భక్తితో మది నెంచి,
    పరమపావనమ్ము పరుల సొమ్ము,
    తాక రాదటంచు తలపోయు సుజ్ఞాని.
    కంది శంకరయ్య కనిన నిజము.

    రిప్లయితొలగించండి
  2. చింతా రామకృష్ణారావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    అయితే అది ‘శంకరయ్య + కనిన నిజమా’ లేక ‘శంకరయ్యకు + అనిన నిజమా’?

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    చింతావారిది చక్కని పూరణ !

    01)
    _________________________________

    పాలు వెన్నల గొని - బాలగోపాలుండు
    పంచి పెట్టె తోటి - బాలకులకు !
    పరమ పావను యొక్క - బాల్య చేష్టల గన
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  4. కిశొర్ జీ పావను యొక్క ? యడాగమము గూడదు !

    రిప్లయితొలగించండి
  5. కిశోర్ జీ మీరు కరక్టే యొక్క రైటే !

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు
    మూర్తీజీ ! ధన్యవాదములు
    అయినా అక్కడ గణ భంగం జరిగినట్టుంది

    రిప్లయితొలగించండి
  7. 01అ)
    _________________________________

    పాలు వెన్నల గొని - బాలగోపాలుండు
    పంచి పెట్టె తోటి - బాలకులకు !
    పరుల బ్రోచు వాని - బాల్య చేష్టల గన
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  8. కిశోర్ జీ మన్నించండి ! నా పూరణ ;

    కనుల విందుఁ జేయుఁ గష్టార్జితం బైనఁ
    గుడువ గుణము నరుగుఁ గుక్షి యందు
    దొంగతనము గొఱకు దొరతన మేలరా
    పరమ పావనమ్ము పరుల సొమ్ము !

    రిప్లయితొలగించండి
  9. రావణాసురుడు :

    02)
    _________________________________

    పార్వతీశు వలన - వరములు కడు బొంది
    పరమ సాధ్వి యైన - పడతి బట్టె !
    పరుని భార్య మీద- వ్యామోహ మెందుకో ?
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  10. మూర్తీజీ ! దొంగ సొమ్ము అరగదంటారా ! బావుంది !
    అరగదంటూనే పరమ పావన మంటున్నారు !
    అయితే అరగాలే మరి !!!

    రిప్లయితొలగించండి
  11. చంద్రశేఖర్:
    ఉత్తమము స్వార్జితము పితృదత్త మికను
    మధ్యమము స్త్రీధనమధమ మారి, పరమ
    పావనమ్ము పరుల సొమ్ము భారకమది
    దాని తాకవలదెటు పో ధన్యజీవి!

    రిప్లయితొలగించండి
  12. సర్వప్రథములు హనుమచ్చాస్త్రి గారేరి ఈ రోజు ?

    రిప్లయితొలగించండి
  13. పరుల సొమ్ము లెపుడు పాములను గుణము
    పరమపావనమ్ము. పరుల సొమ్ము
    నాశ పడకు మంచు నార్యులయినవారు
    తెలుపుచుంద్రు. మనకు తెలియవలెను.

    హనుమచ్ఛాస్త్రి గారు విద్యుత్కోత వలన ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  14. రారాజు :

    03)
    _________________________________

    పాచికలను వాడి - పడతికి భంగము
    పాడు బుద్ధి జేత - ప్రభువు జేసె !
    పడతి బ్రోచె కృష్ణ - పరమాత్ము డంతట !
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________
    భంగము = అవమానము

    రిప్లయితొలగించండి
  15. ముళ్ళ కంపలు, గులకరాళ్ళు.... వీటిని కూడా ఆస్వాదించ్చచ్చండీ...! విశ్వశ్రేయః కావ్యం అన్నారుగా..! అదే బాటలో... సాహిత్యలోకానికి హితవు పలికేందుకు.. "ముళ్ళ కంపలు", "గులకరాళ్ళు" ....
    రోజుకొకటి సిద్ధమవుతున్నాయ్..
    చదివి మీ అభిప్రాయాన్ని అందించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  16. 04)
    _________________________________

    పాత మాట వినిన - ఫణము చేకూరునా ?
    మంద బుద్ధి విడుము - మందగమన !
    పాపములను జేయ - పైకము లభియించు
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  17. నేటి నేతలు :

    05)
    _________________________________

    పరుల దోచు కొన్న - ప్రభువులు గావచ్చు
    పరమ సత్యమిదియె - పాపులార !
    అందినంత దోచి - అందలా లెక్కండి
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  18. భక్తి గుడిని గట్టె భద్రాద్రి పై భక్త
    రామదాసు మిగుల రక్తి తోడ
    విలువ బెరసి వెలసె వెచ్చమ్ము నయ్యది
    పరమ పావనమ్ము , పరుల సొమ్ము !!!

    రిప్లయితొలగించండి
  19. ఇంద్రుడు :

    06)
    _________________________________

    భాషము వలె కూసి - పడతిని జేరెను
    పరుల పడతి గూడు - పశువు వాడు !
    ప్రభువు వేల్పులకును - పాపాలనే జేయు !
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________
    భాషము = కోడి

    రిప్లయితొలగించండి
  20. కిశోర్ జీ నిజమే స్వాహా చేసాక జఠరమునకు తేడా యేమిటి ?

    తనది కాని యెడల తన్మయము నొసంగు
    ధరణి యందు నిజము నరయ గాను
    పాప భీతి యేలొ స్వాహాకు నర్పింప
    పరమ పావనమ్ము పరుల సొమ్ము !

    రిప్లయితొలగించండి
  21. విలువ బెరసి = విలువ పెరిగి, విలువ కలిగి

    రిప్లయితొలగించండి
  22. రైలు ప్రయాణము :

    07)
    _________________________________

    పగటి వేళలందు - పయనించు వేళలో
    మత్తునిచ్చి నిన్ను - చిత్తు జేసి
    పరుపు , పెట్టె , బేడ(పర్సు) - పట్టుకు పోదురు !
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  23. చిన్న తనములో తిన్న
    దొంగ జామపళ్ళు, మామిడి కాయల రుచే వేరు !

    08)
    _________________________________

    బాలకులను గూడి - పరుల తోటల లోని
    పళ్ళు , కాయలు దినిన - పరవశమ్ము
    కలుగు మిగుల మనకు !- కాదందురా యేమి ?
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  24. ప్రజల పొట్ట గొట్టి పలు కోట్లు గడియించి -
    కొంత సొమ్ము దీసి గుడికి బెట్ట,
    దేవుని దయ మీకు దొరుకునే ? కాబోదు
    పరమ పావనమ్ము పరుల సొమ్ము !

    రిప్లయితొలగించండి
  25. టైగర్ రాముడు(అన్నగారు) :

    09)
    _________________________________

    తోట కూర నాడె - దొంగిల వలదని
    తల్లి జెప్ప కున్న - తనయు డంత
    దొరుకు వరకు దొంగ - తనముల నేజేయు !
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  26. నిగమశర్మ :
    10)
    _________________________________

    అక్క ముక్కు పుడక - నొక్క దానిని గాక
    భార్య, తల్లి నగలు - పట్టు కెళ్ళి
    పాడు జూద మాడి - పాపాత్ముడయ్యెను
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  27. ఇచట కొల్లగొట్టి యెచటకో తరలింప
    స్విస్సు సంస్థ లందు స్థిరము నొందె
    పరుని వెంటఁ జనెడు భాగీరథి యనంగ
    పరమ పావనమ్ము పరుల సొమ్ము !

    రిప్లయితొలగించండి
  28. చిన్న సవరణతో నా మాట :

    11)
    _________________________________

    పరుల సొమ్ము దోచి - పలలము దినినంత
    పాప మంటు కొనును - వంచకుండ !
    పవలు రేలు, కష్ట - బడినచో ఫలమొచ్చు
    పరమ పాతకమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  29. మూర్తీజీ ! దొరికేనా ! మారుస్తున్నా !

    నిగమశర్మ :

    10అ)
    _________________________________

    అక్క ముక్కు పుడక - నొక్క దానిని గాక
    తల్లి ,యాలి నగలు - కొల్ల గొట్టి
    పాడు జూద మాడి - పాపాత్ముడయ్యెను
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  30. 12)
    _________________________________

    పాప మన్న తీపి - పలలము కడు ప్రీతి
    పరుని పడతి వలపు - పరమ తీపి
    పరుల హింస బెట్టు - పాపాత్ములకు నిల
    పరమ పావనమ్ము - పరుల సొమ్ము !
    _________________________________

    రిప్లయితొలగించండి
  31. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, అక్టోబర్ 15, 2011 12:14:00 PM

    తల్లి, దండ్రి, గురువు, దైవంబు చరణముల్
    పరమ పావనమ్ము, పరులసొమ్ము
    కాశపడిన జీవికానందమేగతి
    గలుగు? జీవితమున వెలుగు సున్న.

    రిప్లయితొలగించండి
  32. ఒక రాజకీయ నాయకుని స్వగతము:

    ప్రజల సొమ్ము మనకు పరమాన్న సమమగున్
    ప్రభుత బొక్కసమ్ము పాడి యావు
    కనికరమ్ము మనము కాశిలో వదలిన
    పరమ పావనమ్ము పరులసొమ్ము

    రిప్లయితొలగించండి
  33. చంద్ర శేఖర్ గారూ ! మీ తలపులోనున్నండులకు ధన్యవాదములు. మందాకిని గారూ ! మీరు చెప్పినది నిజమే. మాకు ఉ.7AM నుండి 10AM వరకు విద్యుత్ కోత.ఆపై కార్యాలయమునకు వెళ్తాను.ఈరోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో చూసి పూరించు చున్నాను. ధన్యవాదములు.


    పాల కడలి పైన పవళించు హరి జూడ
    బాల కృష్ణు డాయె పాలు దోచె
    పడక వీడి వచ్చె పడకనా అట పాలు
    పరమ పావనమ్ము, పరులసొమ్ము

    రిప్లయితొలగించండి
  34. **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    ఇప్పటికి చేరిన మీ పూరణలు ద్వాదశాదిత్యుల్లాగా ప్రకాశిస్తున్నవి పన్నెండు. ఇది టైపు చేయడం ముగించే సరికి ఇంకెన్ని వస్తాయో? ఇక ఒక్కొక్కటి చూద్దాం ...
    మొదటి పూరణలో గోపాలుని బాల్యచేష్టలను ప్రస్తావించారు. అభినందన!
    రెండవ పూరణలో రావణుని పరకాంతా వ్యామోహాన్ని ఖండించారు. భేష్!
    మూడవ పూరణ కొద్దిగా తికమకగా ఉంది. దుర్యోధనుడికి పరులసొమ్ము (భార్య) అయిన ద్రౌపది పావనురాలనా? ధర్మరాజు రాజ్యమా? ఎలా అనుకున్న చక్కగా ఉంది. కవారం!
    నాల్గవ పూరణలో పాపకర్మతో పావనమైన పరుల సొమ్ము దక్కించుకోవాలన్నారు. కోనియాట!
    ఐదవ పూరణలో నేటి నేతల లక్ష్యాన్ని చక్కగా వివరించారు. సెహబాస్!
    ఆరవ పూరణలో అహల్యను కోరుకున్న ఇంద్రుని నిందించారు. ధిషణ!
    ఏడవ పూరణలో రైలు దొంగలు పరుల సొమ్మును ఎంత ‘పావనం’ గా భావించి దోచుకొంటారో చెప్పారు. పొగడిక!
    ఎనిమిదవ పూరణలో దొంగజామపళ్లు తిన్న అనుభూతిని గుర్తుకు తెచ్చారు. ప్రశంస.
    పై పూరణ చదువుతున్నప్పుడే ‘తోటకూర నాడే చెప్పక పోయావా?’ అన్నది గుర్తుకొచ్చించి. దానిని తొమ్మిదవ పూరణలో దించారు. బాగుంది. మెఱమెచ్చు!
    పదవ పూరణలో నిగమశర్మ ప్రస్తావన తెచ్చారు. చక్కగా ఉంది. శ్లాఘం!
    పదకొండవ పూరణ బాగుంది. సన్నుతి! కాని ‘ఇక్కడ’ దొరికారు మీరు నాకు :-) ‘ఫలము + వచ్చు = ? అక్కడ ‘ఫలమబ్బు’ అంటే సరి!
    పన్నెండవ పూరణ పై పూరణ లన్నింటికి ‘కంక్లూడింగ్’ పూరణలా ఉందే. బాగుంది. శస్తి!
    అన్నింటికీ కలిపి మిమ్మల్ని మహదానందంగా అభినందిస్తున్నాను.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  35. **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నాయి. ముఖ్యంగా రామదాసును ప్రస్తావించినదీ, స్వాహాకు అర్పించడానికి పాపభీతి ఎందుకన్న పూరణ, స్విస్ బ్యాంకులకు తరలుతున్న డబ్బును స్థానభ్రంశం పొంది భగీరథుణ్ణి అనుసరించి గంగతో పోల్చడం చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    ఆటవెలది సమస్యకు తేటగీతి పూరణ. అద్భుతం! ఒక సుభాషితంలా భాసిస్తున్నది. అభినందనలు.
    ‘అధమ మారి’ ?
    **********************************************************************
    మందాకిని గారూ,
    చక్కని విరుపుతో నీతిపద్యంగా మంచి పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    పూరణలో మీ నైపుణ్య ‘వెలుగు మిన్న’. చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    మీ పూరణ లెస్సన్నా! అభినందనలు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పాలకడిలిలో పవళించే వాణ్ణి పాలదొంగను చేసారు. బాగుంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  36. కష్టపడిన ఫలము -కడు స్వల్పమైనను
    అమృతతుల్యమగును-అన్య ధనము
    దొంగిలింప జూడ -దురితమ్ము కల్గును
    పరమ పావనమ్ము -పరుల సొమ్ము.

    రిప్లయితొలగించండి
  37. తన తల్లి పాలను త్రాగుచు, చాలక
    ........పూతన చన్నులఁ జేత బట్టె
    రేపల్లె యందున లేబ్రాయమందున
    ........తరుణుల వస్త్రముల్ తస్కరించె
    వలదని వారింప వర్జింపకెయె త్రాగె
    ........విన్నపాలు వినక వెన్న పాలు
    చిన నాటి హితుడు కుచేలుడు తెచ్చిన
    ........అటుకులు విడువక నారగించె

    చేది వరునిఁ గొట్టి చేడియఁ దెచ్చెను
    మణిని కోరి తాను మాట పడెను
    వింత కాదె చూడనెంత వారలకైన
    పరమపావనమ్ము పరుల సొమ్ము

    రిప్లయితొలగించండి
  38. **********************************************************************
    `కమనీయం’ గారూ,
    నీతి బోధకమైన మీ పూరణ వేమన పద్యాన్ని తలపింప జేసింది. చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    జిగురు సత్యనారాయణ గారూ,

    సీసపద్యమందు చిత్రమ్ముగ పరుల
    సొమ్ముఁ గొనిన కృష్ణు సుద్దు లనుచు
    సరసముగను జిగురు సత్యనారాయణ
    చెప్పినాఁడ వెన్నొ మెప్పు లివిగొ.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  39. **********************************************************************
    వసంత కిశోర్ గారూ,

    పదియు రెండు గాఁగ బాగైన పూరణల్
    జేసినాఁడ వయ్య వాసికెక్క;
    సంతసించితిని వసంత కిశోర! నీ
    పద్యసుమము లిడె సువాసనలను.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,

    వ్రాసినాఁడవయ్య వైవిధ్య భరితమై
    ముదము గూర్చునట్టి పూరణములు
    నాల్గు; గన్నవరపు నరసింహమూర్తి! నీ
    మేటి ప్రతిభ నిపుడు మెచ్చినాఁడ.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  40. పరమ పావనమ్ము పరులసొమ్ములరక్ష
    పరుల హింస తగని పాతకమ్ము
    ఉత్తమమ్ముసుమ్ము నుర్విజనులసేవ
    నమ్ము,సేవ జేయ రమ్ము లెమ్ము!!!

    రిప్లయితొలగించండి
  41. కల్ల లందు దేలు కల్లోల జగతిలో
    పరమ ప్రీతి గొలుపు పాప మనదు
    కలిమి దొరికి నంత కన్నంత తిన్నంత
    పరమ పావనమ్ము పరుల సొమ్ము . !

    రిప్లయితొలగించండి
  42. మాస్టారూ,
    ధన్యవాదాలు. మారి అంటే నానార్థాలున్నాయి గదా-మారణము, మసూచిరోగము; ఒక మాండలీకంలో చెప్పాలంటే పిండుకు తినే రాక్షసి. కన్నడ భాషలో ఒక సామెత వుంది - "మనెగె మారి, ఊరిగె ఉపకారి". అంటే ఇంట్లో అందరిని చంపుకుతింటుంది, ఊరి వాళ్లకి మాత్రం గొప్ప ఉపకారం చేస్తుంది. ఆ బాషాజ్ఞానం కొంత సహకరించింది. మొదట "...స్త్రీధనమధమ మదియె..." అని వ్రాశాను. కానీ అఖండ యతి పడిందని మార్చి "...స్త్రీధనమధమ మారి..." అని మార్చాను.

    రిప్లయితొలగించండి
  43. శ్రీపతిశాస్త్రిశనివారం, అక్టోబర్ 15, 2011 8:19:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    ఆస్తి విషయమందు అద్వైతమే మేలు
    పరమ పావనమ్ము! పరుల సొమ్ము,
    తనదు సొమ్ము లన్న తర్కమే లేదిక
    దొరలవోలె ధనము దోచుకొనగ

    రిప్లయితొలగించండి
  44. శ్రీపతిశాస్త్రిశనివారం, అక్టోబర్ 15, 2011 8:34:00 PM

    జిగురు సత్యనారాయణగారూ మీపూరణ చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  45. **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    ప్రబోధాత్మకంగా ఉంది మీ పూరణ. ప్రశస్తం! అభినందనలు.
    **********************************************************************
    రాజేశ్వరక్కయ్యా,
    చక్కని పూరణ చేసారు. ధన్యవాదాలు!
    **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    అధమము + ఆరి అని పదచ్ఛేదం చేసాను. అది ‘మారి’ అయితే ‘అధమ’ శబ్దం ప్రత్యయం ఏది? పదం అసంపూర్ణంగా మిగిలి పోతున్నది కదా! అన్వయం?
    **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    సొమ్ము విషయంలో మీరు ప్రతిపాదించిన అద్వైతం ఈ ‘శంకరాచార్యులకు’ బాగా నచ్చింది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  46. మన తెలుగు - చంద్రశేఖర్శనివారం, అక్టోబర్ 15, 2011 10:30:00 PM

    మాస్టారూ, "అధమపురుష" లాగ "అధమ మారి" (నీచమైన మారి) అనే అన్వయం తో ప్రయోగించాను. ఒకవేళ సంస్కృత, ఆంధ్ర పదాల కలయిక తప్పైతే, అడ్డు వస్తే రెండో పాదం "మధ్యమము స్త్రీధనమధమ మదియె, పరమ" అని వుంచితేనే బాగుంటుందనిపిస్తోంది. పరిశీలించగలరు.
    ధన్యవాదాలతో,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  47. గురువుగారూ ధన్యవాదములండి. మీ ఆరోగ్యవిషయంలో శ్రద్ధ వహించ వలసినదిగా ప్రార్థన. మీ దయవలన ఎందరో సాహిత్యాభిమానుల తో పరిచయ భాగ్యం కలిగింది. వసంతకిశోర్ గారు, నరసింహమూర్తిగారు,
    చంద్రసేఖర్ గారు ,మిస్సన్నగారు, మందాకినిగారు, రాజేశ్వరి అక్కయ్యగారు, హనుమచ్చాస్త్రిగారు మొదలైన కవిమిత్రులందరి రసవత్తరమైన వ్యాఖలు,మీరు, పండిత నేమానిగారు, చింతా రామకృష్ణారావుగారు వంటి పండితోత్తముల సూచనలతో బ్లాగు ఎంతో సుందరమైన కవితావనముగా రూపుదిద్దుకొంటున్నది. మీ అందరి ఆశీస్సులతో
    నేను సైతము కొన్ని మంచి పద్యాలు వ్రాయగలిగినాను. మావంటి వారికి మార్గదర్శకులుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించవలసినదిగా పార్వతీపరమేశ్వరులను ప్రార్థిస్తున్నాను. మీ ఆశీస్సులనాసిస్తూ
    నమస్కారములతో
    శ్రీపతిశాస్త్రి

    రిప్లయితొలగించండి
  48. పాపమద్ది నరుడ! పండనంతవరకు
    పరమ పావనమ్ము పరుల సొమ్ము
    పండినంతటమరి పాపమె,తెలియురా
    పరమ పావకమ్ము(?) పరుల సొమ్ము.

    రిప్లయితొలగించండి
  49. శంకరార్యా !
    శాపవిమోచనం కలుగుటకు "నామది కోరిక తీరెగా "
    అని పాడుతూ, జలకాలాడుతున్న రాజసులోచన
    వేషంలో నున్న నాగేశ్వర్రావు మీద కురిసిన
    అమృతజలంలా వుంది మీ అభినందన వెల్లువ !
    ద్వాదశ శత ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  50. శంకరార్యా !
    శాపవిమోచనం కలుగుటకు "నామది కోరిక తీరెగా "
    అని పాడుతూ జలకాలాడుతున్న రాజసులోచన
    వేషంలో నున్న నాగేశ్వర్రావు మీద కురిసిన
    అమృతజలంలా వుంది మీ అభినందన వెల్లువ !
    ద్వాదశ శత ధన్యవాదములు !

    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    జీ ఎస్ జీ ! సీసం చక్కగా నున్నది !

    శ్రీపతి శాస్త్రిగారూ ! "అద్వైత ప్రభోదం " వ్వావ్ !

    రిప్లయితొలగించండి
  51. **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    నా అభిప్రాయమే తప్పు. మీరు చెప్పిందే సరైనది. మార్చవలసిన అవసరం లేదు.
    **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    నా కెంతో ఇష్టమైన ‘సువర్ణసుందరి’ని ప్రస్తావించారు. నేను ఎక్కువసార్లు చూసిన చిత్రాల్లో దానిదే మొదటిస్థానం. ఇప్పటికి ఎన్ని సార్లు చూసానో? ఇంట్లో దాని సిడి ఉంది.
    అది మీరు పేర్కొన్నట్టు ‘నామది కోరిక తీరెగా’ కాదు. ‘నానోము పండె నీనాడే, కోరిక తీరెగా నేటికి’
    ధన్యవాదాలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  52. శంకరార్యా ! చూసి చాలా కాలమైనది ! అద్భుతమైన సినిమా !
    మీకిష్టమనే ముచ్చటించాను !

    రిప్లయితొలగించండి
  53. జిగురు వారి పూరణ మనోహరంగా ఉండి సమస్యకు నూరు పాళ్ళు న్యాయం చేసింది .అభినందనలు

    రిప్లయితొలగించండి
  54. గురువు గారికి , అభినందించిన కవి మిత్రులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  55. శంకరార్యా!శంకరయ్య కనిన నిజము అన్నది మీ రే విధంగా గ్రహించినా యోగ్యంగానే ఉంటుందండి.

    రిప్లయితొలగించండి