********************************************************************** మందాకిని గారూ, స్వర్ణకంకణాన్ని చూపి బాటసారిని పిలుస్తున్న ముదుసలి పులి కథ గుర్తుకు వచ్చింది మీ పూరణ చూసాక. ఆ సందర్భానికి సరిగా సరిపోతుంది మీ పద్యం. ఒక్క మాటలో ఆమాటను ప్రస్తావించి ఉంటే పూరణకు పూర్ణత వచ్చేది. చక్కని పద్యం చెప్పిన మీకు నా అభినందనలు. ఎంత ముదిమి ఐనా, లావు తగ్గినా ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించి పులి పూరి మేయదు కదా! ********************************************************************** పండిత నేమాని గారూ, సత్పురుషుడుగా మారిన మారీచుని వృత్తాంతంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు. ********************************************************************** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వాల్మీకి వృత్తాంతంతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు. పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారా? ఆ పాదాన్ని క్రింది విధంగా సవరిస్తే గణయతిదోషాలు తొలగిపోతాయి. ‘కీకారణ్యమునన్ వనేచరుఁడు, సాకేతాధిపున్ మంత్రమే ’ ********************************************************************** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, గోవు సత్యనిష్టను మెచ్చుకున్న శార్దూలం కథను ప్రస్తావిస్తూ చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు. అయితే ఆ కథలో పులు గోవును చంపక వదలివేసిందే కాని తాను మాంసాహారాన్ని వర్జిస్తా ననలేదు కదా! ********************************************************************** శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, మీరు మందాకిని గారి బాటను వదిలి, సంపత్ కుమార్ శాస్త్రి గారి బాట పట్టారు. మంచి పూరణ. అభినందనలు. సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణకు నా వ్యాఖ్య మీకూ వర్తిస్తుంది. **********************************************************************
గురువుగారు, ధన్యవాదములు. సమస్య మెచ్చిందనే కానీ , మేసిందని కాదు కాబట్టి నేనూ మేసిందని చెప్పలేదు. శాకాహారులకు బాధ లేదు, ముసలి వయసులో కూడా వీళ్ళకు అని మెచ్చిందని చెప్పాను. గడ్డి మేయదు కాబట్టే భజన చేస్తూ కూచుందని చెప్పానండి. శర్మగారు, ధన్యవాదములు.
గుడులు కూల్చి , కొండల్ని త్రవ్వేసి, గనులన్నీ దోచేసి లారీలతో మనుషుల్ని తొక్కించి, చంపించి,విర్రవీగి నేడు జైలులో తీవ్రమైన నిరాశా నిస్పృహల నడుమ పురాణ గ్రంధ పారాయణం చేస్తున్న జనార్ధన రెడ్డి :
01) ________________________________________
లోకాతీతమనంగ పెక్కు విధముల్ - లూటీలు జేసెన్ గదా నాకేదీ యెదురంచు,నిక్కి గనులన్ ! - నాగారి నేతే సదా ! నాకేలా చెఱ యంచు నే ,డధముడై - నైరాశ్యముండాయెగా(నైరాశ్యమున్ బొందెగా) శాకాహారము మెచ్చె, హింస విడిచెన్ - శార్దూల మాశ్చర్యమే! ________________________________________ నాగారి నేత = కొండల్ని త్రవ్వేవాళ్ళకు బాస్ = జనార్ధన రెడ్డి నాగారి నేత = గరుత్మంతుని ప్రభువు = జనార్థనుడు
గురువుగారు,
రిప్లయితొలగించండిపోయిన వారం రాజహంస మీ అనునయ వాక్యాల/సవరణలకోసం ఎదురుచూస్తోంది.
అంతలోనే ఈ వేళ శార్దూలములో శార్దూలమును పంపించేశారా? :-)
ఏ కాలమ్మున నైనఁ జిక్కు నిదిగో ! యే బాధ లేదంచు నా
రిప్లయితొలగించండిశాకాహారము మెచ్చె. హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే
లా?కాయంబున శక్తి తగ్గె. ముదిమిన్ లావెంత మాత్రమ్ము? రా
మా! కోర్కెల్ నశియించె నామములనే మౌనంబుగాదల్చెనే.
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ ....
రిప్లయితొలగించండిశ్రీకాకుత్స్థుని ధాటికిన్ జడిసి మారీచుండు పర్వెత్తి యెం
తేకంపించుచునుండ నారదుడు భీతిన్ బాపి బోధింపగా
శ్రీకాంతుండని రామునిన్ గొలిచె మారీచుండు సద్యోగియై
శాకాహారము మెచ్చె హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే
చీకాకుల్ పలువెట్టి కొట్టి జనులన్ చేపట్టుచున్ ద్రవ్యమున్
రిప్లయితొలగించండికీకారణ్యము నందు బోయ వాడు, సాకేతాధిపున్ మంత్రమే
శ్రీ కారంబుగ జెప్ప నారదుడు, తా చెల్వొందె వాల్మీకిగా
శాకాహారము మెచ్చె హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే!
నాకాయంబును నిల్ప దుర్జనుడనై నానావిధంబైన జీ
రిప్లయితొలగించండివాకారంబుల జంపితిన్! వలదికన్ భ్రష్టుండ గానంచు తా
శాకాహారము మెచ్చి హింస విడిచెన్. శార్దూల, మాశ్చర్యమే?
శాకాహారగు గోవునున్ విడిచెనే సత్యంబుకున్ సైపుచున్. ( సత్యనిష్ఠ వృత్తాంతము )
శ్రీ పండిత నేమాని గారూ, గోలి హనుమచ్చాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతంగా చెప్పారండి. అభినందన వందనములు.
పండిత నేమాని గారి వ్యాఖ్య ...
రిప్లయితొలగించండిశ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యములో:
2వ పాదము : గణభంగము మరియు యతి సరిపోదు.
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....
రిప్లయితొలగించండిఆకొన్నాడవొ, రాకబోదునని నీకారటమున్ కల్గెనో,
నీకాహారముకాగ వచ్చితినిదే నేనన్న గోమాతలో
సాకారమ్ముగ సత్యమూర్తినిగనన్ సద్భావనల్ తోచగన్,
శాకాహారము మెచ్చె, హింస విడిచెన్, శార్ధూలమాశ్చర్యమే
మందాకిని గారికి నా అభినందనలు తెలుప ప్రార్ధన. వారు ఎన్నుకున్న విషయమే నేనుకూడా అనుకున్నాను, వారు నాకంటే ముందున్న కారణాన వేరే విషయం తీసుకున్నాను
**********************************************************************
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
స్వర్ణకంకణాన్ని చూపి బాటసారిని పిలుస్తున్న ముదుసలి పులి కథ గుర్తుకు వచ్చింది మీ పూరణ చూసాక. ఆ సందర్భానికి సరిగా సరిపోతుంది మీ పద్యం. ఒక్క మాటలో ఆమాటను ప్రస్తావించి ఉంటే పూరణకు పూర్ణత వచ్చేది. చక్కని పద్యం చెప్పిన మీకు నా అభినందనలు.
ఎంత ముదిమి ఐనా, లావు తగ్గినా ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించి పులి పూరి మేయదు కదా!
**********************************************************************
పండిత నేమాని గారూ,
సత్పురుషుడుగా మారిన మారీచుని వృత్తాంతంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
**********************************************************************
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వాల్మీకి వృత్తాంతంతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారా? ఆ పాదాన్ని క్రింది విధంగా సవరిస్తే గణయతిదోషాలు తొలగిపోతాయి.
‘కీకారణ్యమునన్ వనేచరుఁడు, సాకేతాధిపున్ మంత్రమే ’
**********************************************************************
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
గోవు సత్యనిష్టను మెచ్చుకున్న శార్దూలం కథను ప్రస్తావిస్తూ చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
అయితే ఆ కథలో పులు గోవును చంపక వదలివేసిందే కాని తాను మాంసాహారాన్ని వర్జిస్తా ననలేదు కదా!
**********************************************************************
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీరు మందాకిని గారి బాటను వదిలి, సంపత్ కుమార్ శాస్త్రి గారి బాట పట్టారు. మంచి పూరణ. అభినందనలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణకు నా వ్యాఖ్య మీకూ వర్తిస్తుంది.
**********************************************************************
గురువుగారు, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసమస్య మెచ్చిందనే కానీ , మేసిందని కాదు కాబట్టి నేనూ మేసిందని చెప్పలేదు. శాకాహారులకు బాధ లేదు, ముసలి వయసులో కూడా వీళ్ళకు అని మెచ్చిందని చెప్పాను. గడ్డి మేయదు కాబట్టే భజన చేస్తూ కూచుందని చెప్పానండి.
శర్మగారు, ధన్యవాదములు.
చక్కని సవరణ చూపిన మాస్టారు గారికి, దోషము దిద్దుకొను అవకాశము కల్పించిన శ్రీ నేమాని వారికీ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసంపత్ గారికి ధన్యవాదములు.
చిన్న సవరణతో...
చీకాకుల్ పలువెట్టి కొట్టి జనులన్ చేపట్టుచున్ ద్రవ్యమున్
కీకారణ్యమునుండు చోరునకు సాకేతాధిపున్ మంత్రమే
శ్రీ కారంబుగ జెప్ప నారదుడు, తా చెల్వొందె వాల్మీకిగా
శాకాహారము మెచ్చె హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
గుడులు కూల్చి , కొండల్ని త్రవ్వేసి, గనులన్నీ దోచేసి
లారీలతో మనుషుల్ని తొక్కించి, చంపించి,విర్రవీగి
నేడు జైలులో తీవ్రమైన నిరాశా నిస్పృహల నడుమ
పురాణ గ్రంధ పారాయణం చేస్తున్న జనార్ధన రెడ్డి :
01)
________________________________________
లోకాతీతమనంగ పెక్కు విధముల్ - లూటీలు జేసెన్ గదా
నాకేదీ యెదురంచు,నిక్కి గనులన్ ! - నాగారి నేతే సదా !
నాకేలా చెఱ యంచు నే ,డధముడై - నైరాశ్యముండాయెగా(నైరాశ్యమున్ బొందెగా)
శాకాహారము మెచ్చె, హింస విడిచెన్ - శార్దూల మాశ్చర్యమే!
________________________________________
నాగారి నేత = కొండల్ని త్రవ్వేవాళ్ళకు బాస్ = జనార్ధన రెడ్డి
నాగారి నేత = గరుత్మంతుని ప్రభువు = జనార్థనుడు
శ్రీగురుభ్యోనం:
రిప్లయితొలగించండిఆకణ్వాశ్రమ ప్రాంతమందు మదిలో నాహ్లాదముప్పొంగగా
నే కల్లోలములేక జంతు తతులే నిశ్చింతగా తృప్తిగా
నాకంబందు వసించునట్లు మెలుగన్ నవ్య ప్రపంచంబునన్
శాకాహారము మెచ్చె హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే
**********************************************************************
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
యుక్తమైన పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
తృతీయపాదాంతంలో ‘నైరాశ్యమున్ బొందెగా’ అనడమే బాగుంటుంది.
**********************************************************************
శ్రీపతి శాస్త్రి గారూ,
ఆహ్లాదకరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
**********************************************************************
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండివసంత మహోదయుని బాటలోనే .............
రిప్లయితొలగించండి" చీకాకుల్ పలు తెచ్చె నాకు నకటా సీబీ అ యీతీరున-
న్నేకాకిన్ చెఱసాల లోన నిక నాకీశుండె దిక్కిత్తరిన్
కాకేమున్నది? " యంచు నెంచి తలచెన్ ' గాలీ ' శ్వరున్ దీనుడై
శాకాహారము మెచ్చె హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే?
బాకాలూదుచు గోవు హంతకులనున్ పట్టించి ధట్టించగా
రిప్లయితొలగించండిచీకాకుల్ భరియించ లేక తురకే చెక్కించి గడ్డమ్ములన్
మోకాల్ బట్టుచు మోడి సేనకునుభల్ మ్రొక్కంగ నన్పించెనే:
"శాకాహారము మెచ్చె హింస విడిచెన్ శార్దూల మాశ్చర్యమే!"