********************************************************************** పండిత నేమాని వారూ, పాత్రతో పాత్రధారి అన్నట్టుగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ********************************************************************** చింతా రామకష్ణారావు గారూ, ‘త్వమేవాహమ్’ను చక్కగా పూరణలో స్ఫురింపజేసారు. చక్కని పూరణ. అభినందనలు. ********************************************************************** శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘లోకేశ్వరుడా’ అనడానికి షిఫ్ట్ నొక్కడంలో పొరపాటుతో ‘లోకేస్వరుడా’ అయింది. ‘కానం జాలను లీలను’ అన్నచోట ‘కాన నయితి నీ లీలను’ అంటే ఇంకా బాగుంటుందేమో? ********************************************************************** మందాకిని గారూ, ‘వారు వీరయ్యే’ సామెతతో మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘గుణము లేనో’ ...? ********************************************************************** శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, ‘న’కారావృత్తి గల వృత్త్యనుప్రాసతో మీ పూరణ కర్ణపేయంగా ఉంది. ఇంతకీ మీరూ, మీ మనుమడూ ఒక్కటే అంటారు. బాగుంది. అభినందనలు. ********************************************************************** రాజేశ్వరక్కయ్యా, చక్కని పూరణ. బాగుంది. అభినందనలు. అజ్ఞాత గారి సూచన గమనించారా? అక్కడ ‘నన్నును నిన్నున్’ అంటే సరి! ********************************************************************** అజ్ఞాత గారూ, ధన్యవాదాలు. ********************************************************************** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. ********************************************************************** లక్కాకుల వెంకట రాజారావు గారూ, చక్కని పూరణ. అభినందనలు. ********************************************************************** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మనోహరమైన పూరణ. అభినందనలు. పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారా? అక్కడ ‘రసనాగ్రమందు నిటు లుండనిచో’ అంటే సరి! ********************************************************************** జిగురు సత్యనారాయణ గారూ, మీ ‘నాదోపాసన’ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ********************************************************************** మిస్సన్న గారూ, గోపిక నోటనో, రాధ నోటనో నేనే నీవని పలికించిన మీ పూరణ సుందరంగా ఉంది. అభినందనలు. **********************************************************************
మిస్సన్న గారూ’ అక్కడ సందిగ్ధత ఉంది. వైదర్భి అన్నట్లూ అర్థం చేసికొనవచ్చు. గోపికో, రాధికో "నీకై పుట్టినదానిని కానా? నన్ను నీలో ఐక్యం చేసికొనడానికి వైదర్భి వంటి దానను కానా?" అని ప్రశ్నించినట్లు భావించాను. అవునా? కాదా?
నా పద్యములో దోషమును తెలిపి సవరణకు అవకాశమిచ్చిన నేమాని వారికి ధన్యవాదములు. వ్యతిరేక పదమునకు చివర ద్రుతము రాకూడదంటారా ? మాస్టరు గారూ! చక్కని సవరణకు ధన్యవాదములు. మీ సూచన, సవరణతో...
ఓ నలువ రాణి ! నీవే ఈ నా రసనాగ్ర మందు నిటులుం డనిచో నే నలలే నొక్క పదము నేనే నీ వైతి నేమొ ?నీవే నేనో ?
గురువుగారూ, టైపాటును సవరించి, మంచి సవరణ సూచించినారు.ధన్యవాదములు.
గురుత్రయం {శ్రీ కంది శంకరయ్యగారు, పండిత నేమానిగారు, శ్రీ చింతా రామకృష్ణారావుగారు} ఏ విషయమైననూ, ఏ సంధర్భమైననూ చక్కని పద్యములను వ్రాయగల విద్వన్మూర్తులు. గురుత్రయమునకు నా సాష్టాంగ నమస్కారములు.
ఇతర కవిమిత్రులందరూ చక్కని పూరణలు చేస్తున్నారు. అందరికీ వందనములు. అభినందనలు. నేడు గోలి హనుమచ్ఛాస్త్రిగారి పద్యము నాకు బాగా నచ్చినది.
గురువు గారూ ధన్యవాదములు. అంత సుళువుగా బ్రహ్మము చిక్కదు గాని అంతటా పరమాత్ముడిని చూడటానికి ప్రయత్నము చేస్తే జీవితములో క్లేశములు తొలుగుతాయి గదా !
మిత్రులు చక్కని పూరణలు చేసారు. శ్రీ పీతాంబరుల వారి పూరణ అందముగా ఉంది. రాజేశ్వరి అక్కయ్య గారి పూరణ చాలా బాగుంది. గోళానికి మరో ప్రక్క ఉండి పద్యాలు వ్రాసే టప్పుడు దర్పణ న్యాయముగా మాకు కుడి యెడమలు తారు మారవుతాయి. అవి మార్చే టప్పుడు నుగామ యడాగమములు కూడా తారు మారవుతాయి. పద్యాలు,వ్యాఖ్యలు ' క్రమ్మరించే ' శక్తి నాకు వసంత కిశోర్ గారి శాపము వలన పోయింది.
గురువుగారు, ధన్యవాదములు. ఏమో/ ఎందుకో/ ఏలనోఅనే పదాలకు సమానార్థంగా పాత పుస్తకాలలో ఈ వాడకం కనిపించటం గుర్తుంది. ఏమో ఇప్పుడిలా గుణము మారిందేలనో అని భావము. మిస్సన్న గారి పూరణకు మీ అన్వయం మరింత అందాన్ని చేకూర్చింది. నేనూ అవాక్కయ్యాను. ఇంత చక్కగా వ్యాఖ్యానించారు
********************************************************************** మంద పితాంబర్ గారూ, ‘ఏమో?’ అన్నీ ప్రశ్నలతో ‘సాటి లేనిదేమో?’ అన్నట్లు చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. ********************************************************************** ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ, వివరణ ఇవ్వకుంటే మీ పూరణ నారికేళపాకమే అయేది. బాగుంది. అభినందనలు. ********************************************************************** ‘జిలేబి’ గారూ, వచనకవితలో మీ పూరణ బాగుంది. అభినందనలు. అయితే ప్రస్తుతానికి వచనకవితలకు మన బ్లాగులో స్థానం లేదు. మీ భావాన్ని నాకు చేతనైనంతలో కందపద్యంలో కుదించాను.... నేనన నేనే, మఱి నీ వో నీవే యనెడి బుద్ధి నుడిగితిని, భవాం భోనిధి దాటించు ప్రభూ! నేనే నీ వైతినేమొ? నీవే నేనో? **********************************************************************
‘శ్యామలీయం’ గారూ, మీరు ప్రాస విషయంలో పొరబడ్డారు. బహుశా మీరు సమస్య ‘నీవే నేనైతివేమొ నేనే నీవో’ అనుకున్నారు కాబోలు. అయినా మీ పూరణ ప్రశంసనీయం. అభినందనలు. నా సవరణ .... నే నట, నీ వట, వేఱట! నే నిటు నీ వటుల నుండి నిన్నెఱుఁగు విధం బే నెటు భావింపఁగలను? నేనే నీ వైతి నేమొ నీవే నేనో!
అవును. ధన్యవాదాలు శంకరయ్యగారు. హడావుడిగా యే పనీ చేయరాదనటాని కిదో మంచి దృష్టాంతం. టీ బ్రేక్ లో మీ సమస్యను చూసి చివరి పాదం సరిగా గమనించకుండానే ఉన్న నాలుగు నిముషాల్లో గబగబలాడితే యిలాగయ్యింది. దాంతో సమస్యలో పదాలను అటనిటుగా గ్రహించి పూర్తి చేసాను. మీ సవరణ బాగుంది. (భావింపఁగలను కన్నా భావింపఁగనగు అంటే యింకా సొగసుగా ఉంటుందా?)
నానా పాత్రల దాల్చెడు
రిప్లయితొలగించండినీ నాటకరంగమందు నేమగునొకదా!
ఈ నా వేషము గనుచో
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
శ్రీనాధ!మదిని నిలిచితొ!
రిప్లయితొలగించండినేనే నీ మదిని కలనొ? నీకును నాకున్
నేనెన్న లేదు భేదము.
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండినేనున్నానని యనుచున్
లోనన్ నివసించునట్టి లోకేస్వరుడా
కానంజాలను లీలను
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
ఈనాటికి మారె గుణము
రిప్లయితొలగించండిలేనో! నెలలాఱగు మఱి లెక్కకు నయ్యెన్.
నానాథునితో నందును
నేనే నీవైతినేమొ? నీవే నేనో!
ఆఱు నెలల సావాసముతో వారు వీరవుతారు అనే సామెత ఉందికదా!
మానాన్న నామమిదియని
రిప్లయితొలగించండినీనాన్నయె నాదుపేరు నీకునుబెట్టన్
నానీ నాకనిపించెను
నేనే నీవైతినేమో నీవే నేనో
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
ఏ నాటి బంధమో యిది
రిప్లయితొలగించండినానాటికి కలత పరచె నిన్నూ నన్నున్ !
నేనే నీవని దలచితి
నేనే నీవైతినేమొ ! నీవే నేనో !
రాజేశ్వరక్కాయ్యా, పూరణ చాలాబాగుంది
రిప్లయితొలగించండిరెండవపాదములో "నన్నూ నిన్నున్" అని ఉంటే యతి మైత్రి సరిపడి ఇంకా బాగా ఉండేది.
నరకారు వధ తరువాత శ్రీకృష్ణుడు సత్యభామతో చిలిపిగా అంటున్నాడు........
రిప్లయితొలగించండిఈ నరకారురవధకై,
పూనికతో యుద్ధమందు పోరాడిన నీ
జాణతనంబును మెచ్చితి,
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
ప్రాణములో ప్రాణమయిన
రిప్లయితొలగించండిమానిని తో మగడు మురిసె మదన వివశతన్
'మేనొకటే గన నయ్యెడి
నేనే నీ వైతి నేమొ ?నీవే నేనో ?'
నా విష్ణుః పృధివీ పతిహి.. అలాగే సరస్వతీ స్వరూపం కానివారు అవధానములు చేయలేరు.అలాంటి ' పుంభావ సరస్వతి' మనసులో మాట.
రిప్లయితొలగించండిఓ నలువ రాణి నీవే
ఈ నా రసనాగ్ర మందు నివ్విధి లేక
న్నేనలలే నొక్క పదము
నేనే నీ వైతి నేమొ ?నీవే నేనో ?
నా పూరణలో "నెలలాఱును మఱి లెక్కకు నయ్యెన్." అని గమనించగలరు.
రిప్లయితొలగించండిప్రాణము నీవని, ప్రాణమె
రిప్లయితొలగించండిగానమని, నిగమ విహార! గాన లహరిలో
గానోపాసనఁ జేసిన
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
నేనీ ధరపై నీకై
రిప్లయితొలగించండియీ నా తనువున్ ధరించి తేమో కృష్ణా!
కానో వైదర్భిని మరి
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యములో 2వ పాదము చివర లేక (వ్యతిరేక పదము) తరువాత ద్రుతము (న్) రాదు.
పరిశీలించండి.
పండిత నేమాని
మిత్రులారా! సుందరకాండను ఒక్క పద్యములో సంగ్రహముగా చెప్పేను తిలకించండి:
రిప్లయితొలగించండివనధి దరించి, లంక నలువంకలు చుట్టి, సమీరసూతి సీ
తనుగని, బాపి శోకమును, ధైర్యము గూర్చి, వనమ్ము డుల్చి, య
క్షుని బరిమార్చి, రావణుడు కుందుచునుండగ లంక గాల్చి, వే
జని రఘు రామచంద్రునకు జానకి సేమము దెల్పె నొప్పుగా
ప్రతి మంగళవారము నాడు చదువుకొన వచ్చును.
**********************************************************************
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
పాత్రతో పాత్రధారి అన్నట్టుగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
**********************************************************************
చింతా రామకష్ణారావు గారూ,
‘త్వమేవాహమ్’ను చక్కగా పూరణలో స్ఫురింపజేసారు. చక్కని పూరణ. అభినందనలు.
**********************************************************************
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘లోకేశ్వరుడా’ అనడానికి షిఫ్ట్ నొక్కడంలో పొరపాటుతో ‘లోకేస్వరుడా’ అయింది.
‘కానం జాలను లీలను’ అన్నచోట ‘కాన నయితి నీ లీలను’ అంటే ఇంకా బాగుంటుందేమో?
**********************************************************************
మందాకిని గారూ,
‘వారు వీరయ్యే’ సామెతతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘గుణము లేనో’ ...?
**********************************************************************
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
‘న’కారావృత్తి గల వృత్త్యనుప్రాసతో మీ పూరణ కర్ణపేయంగా ఉంది. ఇంతకీ మీరూ, మీ మనుమడూ ఒక్కటే అంటారు. బాగుంది. అభినందనలు.
**********************************************************************
రాజేశ్వరక్కయ్యా,
చక్కని పూరణ. బాగుంది. అభినందనలు.
అజ్ఞాత గారి సూచన గమనించారా? అక్కడ ‘నన్నును నిన్నున్’ అంటే సరి!
**********************************************************************
అజ్ఞాత గారూ,
ధన్యవాదాలు.
**********************************************************************
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
**********************************************************************
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
**********************************************************************
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.
పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారా? అక్కడ ‘రసనాగ్రమందు నిటు లుండనిచో’ అంటే సరి!
**********************************************************************
జిగురు సత్యనారాయణ గారూ,
మీ ‘నాదోపాసన’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
**********************************************************************
మిస్సన్న గారూ,
గోపిక నోటనో, రాధ నోటనో నేనే నీవని పలికించిన మీ పూరణ సుందరంగా ఉంది. అభినందనలు.
**********************************************************************
" కుడి ఎడమైతే " పొరబా టైంది
రిప్లయితొలగించండిసూచించిన సోదరులకు ధన్య వాదములు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఆ మాటలు వైదర్భివి. మీరు గమనించినట్లు లేదు.
మిస్సన్న గారూ’
రిప్లయితొలగించండిఅక్కడ సందిగ్ధత ఉంది.
వైదర్భి అన్నట్లూ అర్థం చేసికొనవచ్చు.
గోపికో, రాధికో "నీకై పుట్టినదానిని కానా? నన్ను నీలో ఐక్యం చేసికొనడానికి వైదర్భి వంటి దానను కానా?" అని ప్రశ్నించినట్లు భావించాను.
అవునా? కాదా?
నా పద్యములో దోషమును తెలిపి సవరణకు అవకాశమిచ్చిన నేమాని వారికి ధన్యవాదములు. వ్యతిరేక పదమునకు చివర ద్రుతము
రిప్లయితొలగించండిరాకూడదంటారా ?
మాస్టరు గారూ! చక్కని సవరణకు ధన్యవాదములు.
మీ సూచన, సవరణతో...
ఓ నలువ రాణి ! నీవే
ఈ నా రసనాగ్ర మందు నిటులుం డనిచో
నే నలలే నొక్క పదము
నేనే నీ వైతి నేమొ ?నీవే నేనో ?
గురువుగారూ ధన్యవాదాలు. ఇంకేమంటాను?
రిప్లయితొలగించండిఅవాక్కయాను.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని వారి ఆధ్యాత్మిక రామాయణమును చదివాను !
రిప్లయితొలగించండికానగ బ్రహ్మము నంతట
నే నామము దనది గాదొ యేదియు నౌనో ?
తానే దనువుల మసలగ
నేనే నీవైతి నేమొ నీవే నేనో !
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండినామరూపముల కందనివాడూ, అన్ని నామాలూ, రూపాలూ తానే యైన సర్వాంతర్యామిని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
నే నెవరో ? నీవెవరో ?
రిప్లయితొలగించండినేనై నాలోననున్న నేస్తంబెవరో ?
నే నెఱుగన్నేరనుగా !
నేనే నీవైతి నేమొ ? నీవే నేనో ?
గురువుగారూ, టైపాటును సవరించి, మంచి సవరణ సూచించినారు.ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురుత్రయం {శ్రీ కంది శంకరయ్యగారు, పండిత నేమానిగారు, శ్రీ చింతా రామకృష్ణారావుగారు} ఏ విషయమైననూ, ఏ సంధర్భమైననూ చక్కని పద్యములను వ్రాయగల విద్వన్మూర్తులు. గురుత్రయమునకు నా సాష్టాంగ నమస్కారములు.
ఇతర కవిమిత్రులందరూ చక్కని పూరణలు చేస్తున్నారు. అందరికీ వందనములు. అభినందనలు.
నేడు గోలి హనుమచ్ఛాస్త్రిగారి పద్యము నాకు బాగా నచ్చినది.
గురువు గారూ ధన్యవాదములు. అంత సుళువుగా బ్రహ్మము చిక్కదు గాని అంతటా పరమాత్ముడిని చూడటానికి ప్రయత్నము చేస్తే జీవితములో క్లేశములు తొలుగుతాయి గదా !
రిప్లయితొలగించండిమిత్రులు చక్కని పూరణలు చేసారు. శ్రీ పీతాంబరుల వారి పూరణ అందముగా ఉంది.
రాజేశ్వరి అక్కయ్య గారి పూరణ చాలా బాగుంది.
గోళానికి మరో ప్రక్క ఉండి పద్యాలు వ్రాసే టప్పుడు దర్పణ న్యాయముగా మాకు కుడి యెడమలు తారు మారవుతాయి. అవి మార్చే టప్పుడు నుగామ యడాగమములు కూడా తారు మారవుతాయి.
పద్యాలు,వ్యాఖ్యలు ' క్రమ్మరించే ' శక్తి నాకు వసంత కిశోర్ గారి శాపము వలన పోయింది.
గురువుగారూ అన్యదా భావించరని ఆశిస్తూ, చిన్న విన్నపము
రిప్లయితొలగించండిమీసవరణప్రకారము "కాన నయితి నీ లీలను" అన్నపుడు
శ్రీ శ్యామలీయంగారు చెప్పినట్లు కందం నడక మారుతుంది
"కానగ నైతిని లీలను" అంటే నడక బాగుంటందేమో. గురువుగారు మన్నించాలి.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినడక సంగతి వదిలేయండి. మీ సవరణా బాగుంది.
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదములు. ఏమో/ ఎందుకో/ ఏలనోఅనే పదాలకు సమానార్థంగా పాత పుస్తకాలలో ఈ వాడకం కనిపించటం గుర్తుంది. ఏమో ఇప్పుడిలా గుణము మారిందేలనో అని భావము.
మిస్సన్న గారి పూరణకు మీ అన్వయం మరింత అందాన్ని చేకూర్చింది. నేనూ అవాక్కయ్యాను. ఇంత చక్కగా వ్యాఖ్యానించారు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీరాముడు “నీకు నాకూ గల సంబంధం ఎటువంటిదో చెప్పు హనుమా!”
రిప్లయితొలగించండిఅన్నప్పుడు హనుమ శ్రీ రామునితో:
నేనీ దేహమున నడియ
నీనే నొక జీవకళను నీదగు సృష్టిన్
నేనాత్మదృష్టిఁ గనినన్
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
మనవి: అడియ=సేవకుడు; ఆడియను+ఈ నేను+ఒక=అడియనీనేనొక.
నేను నేనే నీవు నీవే
రిప్లయితొలగించండిఅనుకున్న నాకు ఓ ప్రత్యూషలో చమక్కు మంది
సింధూ దాట నావ నీవె అని
ఆ పై నేస్తమా ,
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
శ్రీపతి శాస్త్రి గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండి**********************************************************************
రిప్లయితొలగించండిమంద పితాంబర్ గారూ,
‘ఏమో?’ అన్నీ ప్రశ్నలతో ‘సాటి లేనిదేమో?’ అన్నట్లు చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
**********************************************************************
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
వివరణ ఇవ్వకుంటే మీ పూరణ నారికేళపాకమే అయేది. బాగుంది. అభినందనలు.
**********************************************************************
‘జిలేబి’ గారూ,
వచనకవితలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
అయితే ప్రస్తుతానికి వచనకవితలకు మన బ్లాగులో స్థానం లేదు. మీ భావాన్ని నాకు చేతనైనంతలో కందపద్యంలో కుదించాను....
నేనన నేనే, మఱి నీ
వో నీవే యనెడి బుద్ధి నుడిగితిని, భవాం
భోనిధి దాటించు ప్రభూ!
నేనే నీ వైతినేమొ? నీవే నేనో?
**********************************************************************
అందరికీ నమస్కారం !
రిప్లయితొలగించండిఇది నా పూరణ !
నీ నామధ్యాన సుధా
పానంబున మది నిలుపగ పావన రామా !
'నీ' 'నా' భేదము మరిచితి
నేనే నీవైతినేమొ నీవే నేనో
కళ్యాణ్ గారూ,
రిప్లయితొలగించండిమీకు పద్యరచనాకళ కరతలామలక మయింది. మీరు సమధికోత్సాహంతో పద్యాలు వ్యాయండి. చక్కని ధారతో చేయితిరిగిన కవిలాగా మంచి పూరణ చేసారు. అభినందనలు.
ఇప్పటికే చాలా చాలా పూరణలు వచ్చాయి. చాలా బాగున్నాయి కూడా. అయనా, యేదో నాకు తోచిన రీతిని వ్రాయాలని కండూతి. ఇది గమనించండి:
రిప్లయితొలగించండినీ వట, నే నట, వే రట!
నీ వటు నే నిటుల నుండి నిన్నెరుగుట నే
భావించుట యట! కుదరదె,
నేనే నీ వైతి నేమొ నీవే నేనో!
‘శ్యామలీయం’ గారూ,
రిప్లయితొలగించండిమీరు ప్రాస విషయంలో పొరబడ్డారు. బహుశా మీరు సమస్య ‘నీవే నేనైతివేమొ నేనే నీవో’ అనుకున్నారు కాబోలు. అయినా మీ పూరణ ప్రశంసనీయం. అభినందనలు.
నా సవరణ ....
నే నట, నీ వట, వేఱట!
నే నిటు నీ వటుల నుండి నిన్నెఱుఁగు విధం
బే నెటు భావింపఁగలను?
నేనే నీ వైతి నేమొ నీవే నేనో!
అవును. ధన్యవాదాలు శంకరయ్యగారు. హడావుడిగా యే పనీ చేయరాదనటాని కిదో మంచి దృష్టాంతం. టీ బ్రేక్ లో మీ సమస్యను చూసి చివరి పాదం సరిగా గమనించకుండానే ఉన్న నాలుగు నిముషాల్లో గబగబలాడితే యిలాగయ్యింది. దాంతో సమస్యలో పదాలను అటనిటుగా గ్రహించి పూర్తి చేసాను. మీ సవరణ బాగుంది. (భావింపఁగలను కన్నా భావింపఁగనగు అంటే యింకా సొగసుగా ఉంటుందా?)
రిప్లయితొలగించండివేణీ సంగమము:
రిప్లయితొలగించండికానంగ నిన్ను నేవడి
పూనిపయనమైతినిపుడుపొంగుచునుంటిన్,
కోనలడవులసాక్షిగ
నేనే నీ వైతి నేమొ నీవే నేనో!
తాత మనుమరాలు మోనాలి తో:
రిప్లయితొలగించండినేనే నేర్పితి చదువులు
మోనాలీ! చిన్ననాడు;
ముఖపుస్తకమున్
నేనే నేర్చితి నీకడ;
నేనే నీవైతినేమొ? నీవే నేనో?
ముఖపుస్తకము = facebook
ఆ నాటి నాదు కూటిని
రిప్లయితొలగించండినా నోటిని నుండి లాగి నగితివి జగనూ!
పోనీలే! క్షవరమ్మున
నేనే నీవైతినేమొ? నీవే నేనో?