కవిమిత్రు లందరికి నరకచతుర్దశి శుభాకాంక్షలు!
శ్రీకృష్ణ నవరత్నములు
(శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు సేకరించిన ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)
సీ.శ్రీకృష్ణ నవరత్నములు
(శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు సేకరించిన ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)
నరకబాణాసుర మురజరాసంధాది
పాపులచేఁ జాల బాధలఁ బడి
భూదేవి విన్నపంబులు సేయ క్షీరాబ్ధిశాయి దయాళుఁడై జగతిమీఁద
యాదవవంశంబునందుఁ దా వసుదేవుసూనుఁడై జన్మించి సురలు మెచ్చ
ధరణిభారముఁ బాపి దనుజులఁ బరిమార్చిధర్మంబు నిలిపి యధర్మ మడఁచె
ఆ.వె.అట్టి దేవదేవు నాదినారాయణుఁ
బుండరీకనయను భుజగశయనుఁ
గమలనాభుఁ గొలిచి కల్మషంబుల నెల్లఁ
దోలువాఁడ ముక్తి నేలువాఁడ. ................................................... (1)
సీ.
పురుడు వెళ్ళనినాఁడె పూతనఁ బరిమార్చె
శకటాసురునిఁ గొట్టెఁ జరణహతిని
బడద్రొబ్బె మద్దులు బకునిఁ గీటడఁగించెదావాగ్ని ద్రావి వత్సకునిఁ గూల్చె
గోవర్ధనం బెత్తి గోవుల రక్షించెఁగాళీయనాగంబు గర్వ మడఁచె
ధేనుకాసురుఁ బట్టి తిత్తొల్చె మహిపుత్త్రుఁదునిమి రక్కసునిఁ దుత్తుమురు సేసె
గీ.వెలయు వనమెల్లఁ బెఱికిపో వీచె లీల
వత్సవాతూలు నాతృణావర్తుఁ గెడపె
సురుచిరాంగుండు గోపాలసుందరుండు
దనుజదమనుండు గేవల దైవ మెట్లు? .........................................(2)
సీ.
గోపాలకులతోడ గోవులఁ గాచె నా
కాళింది తటమునఁ గమలభవుఁడు
వత్సముల్ గొనిపోవ వాని రూపము దాల్చివనజేశునకుఁ దల వంగఁ జేసె
బాల్యంబునాఁడు గోపాలకులును దాను వెన్నలు పాలును వెజ్జి యాడె
చేడెలతో జలక్రీడ లాడఁగఁ జొచ్చియందఱ చీరలు నపహరించె
ఆ.రహిఁ బదాఱువేల రాజకన్యకలను
నన్ని రూపులగుచు ననుభవించె
రాసకేళిఁ గూడె రామల నెల్లను
గృష్ణు మహిమ లెన్నఁ గేవలంబె. .............................................. (3)
సీ.
వెలయ నక్రూరుకు విశ్వరూపము సూపె
వలువకై చాఁకలివానిఁ బంపె
మఱి కుబ్జఁ జక్కనిమానిసిగాఁ జేసెఁ బుష్పలావి కొసంగె భూరిమహిమ
కంసుని ధేనువుల్ ఖండించి వైచెను
గువలయాపీడంబు పొవ రడంచెరూఢిని గంసుని రూప మణఁచె
గీ.కంసుతండ్రిని బట్టంబు గట్టి కాచె
దేవకీదేవి దైన్యంబు త్రెంచి వైచెఁ
గేలిమై శిశుపాలునిఁ గీటడంచె
భక్తవత్సలు శ్రీకృష్ణుఁ బ్రస్తుతింతు. ............................................ (4)
సీ.
అరయ నిర్వదియొక్క యక్షౌహిణులతోడ
నిర్వదియొక్కమా ఱేఁగుదెంచె
మధురపై విడిసిన మత్తు జరాసంధుదునిమించె భీముచే దురమునందుఁ
గాలయవనుఁ డుగ్రగతి నెత్తిరా వానిముచికుందుచే మృతిఁ బొందఁజేసె
ఆ శమంతకరత్న మరుదారఁగాఁ దెచ్చెజాంబవంతుని గెల్చె జాంబవతిని
ఆ.వేడ్క బెండ్లియాడె వెడలించె నపనింద
జగతి కెల్ల మేలు సంఘటించె
తెగి సృగాల వాసుదేవునిఁ దెగటార్చె
గృష్ణుఁ డితఁడు సర్వజిష్ణుఁ డితఁడు. .......................................... (5)
సీ.
బదరికా వనములోఁ బరగు ఘంటాకర్ణుఁ
డిచ్చఁ గొల్చిన మోక్ష మిచ్చె నండ్రు
కైలాసగిరిమీఁదఁ గాలకంధరముఖవిబుధ సంస్తుతులచే వెలయు నండ్రు
గురువు తన్ వేఁడిన గురురక్షణార్థమై చచ్చినసుతునిఁ దెచ్చిచ్చె నండ్రు
దుర్యోధనాదులు ద్రుపదనందన వల్వలొలువంగ నక్షయ మొసఁగె నండ్రు
ఆ. వె.కామగమన మగుచుఁ గడునొప్పు సౌంభకా
ఖ్యానపురము జలధిఁ గలపె నండ్రు
చరిత పుణ్యధనుఁడు భరితగోవర్ధన
కంధరుండు లోకసుందరుండు. ................................................ (6)
సీ.
సమరంబులో జరాసంధాదులను ద్రోలి
ప్రేమతో రుక్మిణిం బెండ్లియాడె
మురదానవునిఁ గూల్చి నరకునిఁ బరిమార్చిదివ్యకుండలములు దెచ్చుకొనియె
విబుధకన్యలఁ బదార్వేలను విడిపించిదయఁ జూచి మణిపర్వతంబు దెచ్చె
సురలోకమున కేఁగి సురపతి నోడించిసురభూరుహము దెచ్చె సురలు మెచ్చఁ
ఆ. వె.బౌండ్ర వాసుదేవు బంధుయుక్తంబుగాఁ
ద్రుంచి కాశిరాజు త్రుళ్లడంచె
వాసుదేవు మహిమ వర్ణింప శక్యమే
ఫాలనేత్రుకయిన బ్రహ్మ కయిన. ............................................. (7)
సీ.
పరగ బాణాసురుపై నేఁగి యాతని
శోణితపుర మెల్లఁ జూఱలాడె
ఆపురిఁ గాల్చి త్రేతాగ్నులు చల్లార్చిపురపాశములు ద్రెంచి మురునిఁ గూల్చె
బాణాసురుని వేయుబాహులుఁ దెగనేసిచండిక వేడినఁ జంపకునికి
శివుఁడు దాఁ గోపించి శీతజ్వరము వైవవైష్ణవజ్వరమును వైచె నతఁడు
గీ.జృంభకాస్త్రంబుచే సోలఁ జేసె శివునిఁ
బ్రేమతో ననిరుద్ధునిఁ బెండ్లిచేసెఁ
గరుణ బాణునిఁ బట్టంబు గట్టె నితఁడు
మూఁడుముర్తుల కవ్వలిమూర్తి యితఁడు. .................................... (8)
సీ.
పాండుతనూజుల పక్షమై నొగలెక్కి
రెండు సేనలయందు నిండియున్న
బంధుజనంబుల బావల మఱఁదులనన్నదమ్ములఁ జూచి యనికిఁ దొడఁగి
యనుకంపఁ జేసిన యార్తుని బోధించిపార్థుకు విశ్వరూపంబు సూపె
నచ్చటఁ బదునెన్మి దక్షౌహిణులతోడభీష్మాదియోధుల పీఁచ మడఁచె
ఆ. వె.ధరను మఱియుఁ బుట్టి దనుజులఁ బరిమార్చె
భూమిభార మెల్లఁ బుచ్చివైచె
నాదిదేవుఁ డయిన యా కృష్ణుఁ బ్రార్థించు
నట్టివారు ముక్తు లయినవారు. ................................................... (9)
మానవ రూపంబెత్తిన
రిప్లయితొలగించండియానవనీతంపు చోరు నవనీ భర్తన్
ఈ నవరత్నంబులతో
మానవు డెవరైన గొలువ మాన్యుండగులే !
నవరత్నంబుల రాసులైన సరియౌనా నీకు? విశ్వంభరా!
రిప్లయితొలగించండినవదీప్తుల్ గల భక్తి భావమయ సూనంబుల్ సమర్పించుచున్
నవ నీలాంబుద రమ్య గాత్ర! నిను నానందస్వరూపున్ కృపా
ర్ణవ! సేవించిన వారిలో నలరవే జ్ఞానాఢ్య దీపావళుల్ ?
నేమాని సన్యాసి రావు
నరక చతుర్దశి నాడు శ్రీకృష్ణస్తుతి నవరత్నాలను అందించినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికవి ఎవరో గానీ పద్య నవరత్నాలలో భాగవతాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
రిప్లయితొలగించండినవరత్నములివి! కాంచన
కవన మణుల్! కృష్ణ మూర్తి ఘన భుజ కీర్తుల్!
దవన పరీమళముల్! భా-
గవతుల కిల వీనులకును కమ్మని విందుల్!