20, అక్టోబర్ 2011, గురువారం

నా పాటలు - (సాయి పాట - 7)

సాయి మంత్రం

షిరిడీపురమే చిన్మయధామం
సాయి నామమే శుభమంత్రం
సాయి నామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం
|| షిరిడీ ||
ఆర్తు లందరికి అభయము నిచ్చి
ఆదరించు సద్గురు మంత్రం .....................
|| షిరిడీ ||

భవరోగమ్ముల భరతం పట్టే
వైద్యశిఖామణి ఘనమంత్రం
సాయి నామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం
|| భవ ||
గురువుల గురువై అజ్ఞానమ్మును
తరిమికొట్టు సద్గురుమంత్రం ....................
|| షిరిడీ ||

అరిషడ్వర్గము లంతముచేసి
ఆదుకొనే తారకమంత్రం
సాయినామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం
|| అరి ||
పాపాలను విచ్ఛిన్నం చేసి
పాలించే పావనమంత్రం ..........................
|| షిరిడీ ||

సర్వదేవతా స్వరూపుడైన
సాయిని చూపే సన్మంత్రం
సాయి నామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం
|| సర్వ ||
చిత్తశాంతి చేకూర్చి జన్మమును
తరింపజేసే చిన్మంత్రం ...........................
|| షిరిడీ ||

శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - సుభాష్, స్వాతి, బృందం.

ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/2dde5bd0-7840-4a24-8ccc-4c0281fd5a34/Sai---Shiridi-purame

3 కామెంట్‌లు:

 1. శ్రీ శంకరయ్యగారూ
  నమస్తే
  మీ పాటలను ప్రతిరోజూ వింటునాను
  సంగీత సాహిత్యాలు రెండూ మధురంగా ఉన్నాయి.

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 2. నమస్కారములు
  పాటలు చాలా బాగున్నాయి .ఎన్ని సార్లు విన్నా వినాలనే అనిపిస్తోంది .

  రిప్లయితొలగించండి
 3. కామేశ్వర శర్మ గారూ,
  రాజేశ్వరి అక్కయ్యా,
  ................. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి