17, అక్టోబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం -496 (దొరకని దొరలును)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!
ఈ సమస్యను పంపిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

  1. దొరకొని దోచును దొంగలు
    దొరికిన ప్రతివారి, పైన దొరకును; చూడన్
    దొరలలో దొంగలు దొరుకరు
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    రిప్లయితొలగించండి
  2. శాస్రి గారూ మూడవ పాదము మొదటి గణము ?

    రిప్లయితొలగించండి
  3. దొరతనమను ముసుగులలో
    దొరకని దొరలును, దొరికిన దొంగలునొకటే,
    చెరనుం జేరక తప్పదు
    పరిపాలకులకును పట్టు పడినను, వినుమా!

    రిప్లయితొలగించండి
  4. ఎరకున్ జిక్కవె ఝషములు
    ధర నాయువు మిగిలి యున్న దక్కవు గొన్నిన్ !
    చెరఁ జిక్కి ,చిక్క కుందురు
    దొరకని దొరలును దొరికిన దొంగలు నొకటే !( గప్ చిప్ !!!)

    రిప్లయితొలగించండి
  5. కరముల నిండుగ దోచియు
    కరిపురమున ముట్ట జెప్ప గష్టము గొంతన్
    గరశృంఖలములు దప్పునొ
    దొరకని దొరలును దొరికిన దొంగలు నొకటా ?

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    దొరకము నెవరికి యనుకొని
    మరుగుగ దోచెడి ప్రభువులు - మరణము పిదపన్
    పరమాత్ము యధికరణమున
    దొరకని దొరలును,దొరికిన - దొంగలునొకటే!
    _________________________________
    అధికరణము = న్యాయస్థానము

    రిప్లయితొలగించండి
  7. దొరికిన వాడే దొంగని
    దొరకని పెదబాబులంత దొరలని తలచే
    తెరగది మరుగై నేడున్
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    రిప్లయితొలగించండి
  8. పరసొమ్ముకాశపడి దా
    పరికంబిసుమంతలేక బరితెగి దోచన్,
    హరి జెప్పు తీర్పునందున
    దొరకని దొరలును దొరికిన దొంగలు నొకటే.

    ( శ్రీ హరి జెప్పే తీర్పులో దొంగ అయిన ప్రతివాడికి శిక్ష పడుతుంది అనే అర్థములో...... )

    రిప్లయితొలగించండి
  9. గురువు గారికి నమస్కారములతో
    --------------
    దొరికిన దొంగల శిక్షిం
    పరు, సూత్రాలెల్ల నేడు బరులకుమాత్రం|
    దొరతనమున దోచుకొనిన,
    దొరకని దొరలును , దొరికిన దొంగలు నొకటే|

    రిప్లయితొలగించండి
  10. దొరకని చిదంబరుండా
    దొరికిన రాజా కనిమొళి దొంగలుగారే
    చెరనున్న గాలి ఛీపో,
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    రిప్లయితొలగించండి
  11. వసంత కిశోర్ గారు 'దొరకము నెవరికి' యన్నారు గాని, అక్కడ నుగాగమం లేదు. దొరకము + ఎవరికి = దొరకమెవరికి.
    పైగా 'ఎవరికి యనుకొని' యన్నది కూడా సాధువుగా తోచదు. ఎవరికిన్ + అనుకొని = ఎవరికి ననుకొని.

    రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి ఫూరణ బాగుంది. మూడవ పాదం 'తెరగది మరుగై నేడున్' అనటం కన్నా 'తెరగది మరుగై నేడో' అనో 'తెరగది మరుగై నప్పుడు' అంటే మరింత బాగుంటుందేమో! చివరి గణంలో రకరకాల ప్రయోగాలకు అవుకాశం ఉన్నది యీ పాదంలో.

    సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణలో పరసొమ్ము అనే ప్రయోగం సరికాదు. సంస్కృతాంధ్రపదాలకు సమాసం చేయలేమిలా.

    రిప్లయితొలగించండి
  12. దొరుకక కొందరు దొంగలు
    దొరలై భూలోక మందు తిరుగ యముండున్
    పొరపడునే మరి వానికి
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    రిప్లయితొలగించండి
  13. నిన్నటి నా పూరణ సద్గురువులైన మిమ్మల్నుద్దేశించి వ్రాసిందే ,ఎందులకో సద్గురువులైన మీ దృష్టి దానిపై పడనట్లుంది పూరణలో ఏదో అపరాధం జరిగినట్లే ఉంది.

    రిప్లయితొలగించండి
  14. క్షమించాలి. మంద పీతాంబర్ గారు యెవరిని ఉద్దేశించి 'మిమ్మల్నుద్దేశించి వ్రాసిందే' అన్నది స్పష్టంగా లేదు.

    రిప్లయితొలగించండి
  15. దొరికిన వారే దొంగలు
    దొరకక తప్పించు కొన్న దొంగలు దొరలే ,
    దొరికినను దొరకకున్నను
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    రిప్లయితొలగించండి
  16. శ్యామలియం గారు నమస్కారం .మీరన్నది నిజమే .నా వ్యాఖ్య గురువు గారైన శ్రీ కంది శంకరయ్య గారిని ఉద్దేశించింది .

    రిప్లయితొలగించండి
  17. నరసామాన్యుడుదొంగౌఁ
    దొరికినచోగాని,నేటిదుస్థితినఁ,గనన్
    నరులునృపులఁజోరులవలె
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    రిప్లయితొలగించండి
  18. మూర్తి గారూ! ' దొరలలొ ' వ్రాద్దా మనుకున్నాను సరిచేయుచున్నాను. ధన్యవాదములు.

    దొరకొని దోచును దొంగలు
    దొరికిన ప్రతివారి, పిదప దొరకును; చూడన్
    దొరుకరు దొరలన్ దొంగలు
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    రిప్లయితొలగించండి
  19. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....

    చెరకేగు దొంగ దొరికిన
    దొరయౌ నాదొంగవాడె దొరకకయున్నన్
    పరికించి చూడ తెలియును
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే

    రిప్లయితొలగించండి
  20. నా పూరణ ....

    దొరకక దోచెడి వారలు
    దొరలే! మఱి దొరికి శిక్షతో దాదాలై
    వర నాయకులైపోదురు;
    దొరకని దొరలును దొరికిన దొంగలు నొకటే!

    రిప్లయితొలగించండి
  21. మరి యొక పూరణము:
    దొర యెవడు దొంగ యెవడని
    పరమాత్ముం డెఱుగు గాక పదుగురిలో నే
    ర్పరులై మెలగెడు నెడలం
    దొరకని దొరలును దొరికిన దొంగలు నొకటే!

    ఇంకొంకటి:
    దొరకిన వాడే చోరుడు
    దొరకెడు నందాక వాడు దొరబాబే శ్రీ
    హరి యెఱుగు నెవ్వడెవడని
    దొరకని దొరలును దొరికిన దొంగలు నొకటే

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతిశాస్త్రిసోమవారం, అక్టోబర్ 17, 2011 7:48:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    చెరసాలల గృహ శోభలు
    పరమాన్నపు భోజనములు, భద్రత లెల్ల
    న్నరయగ సమకూర్చంగా
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    జైళ్ళలోనె అన్ని సౌసర్యాలు సమకూర్చుచూ వారి రక్షణకొరకే కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుంటే దొర ఐనా దొంగైనా ఒకటే

    రిప్లయితొలగించండి
  23. శ్రీపతిశాస్త్రిసోమవారం, అక్టోబర్ 17, 2011 8:36:00 PM

    శ్యామలీయంగారు ధన్యవాదములు. మీ 3 పూరణలూ ముచ్చటగా వున్నాయి.

    రిప్లయితొలగించండి
  24. శ్రీపతిశాస్త్రిసోమవారం, అక్టోబర్ 17, 2011 8:44:00 PM

    గురువుగారూ చెరసాల అనివ్రాసినాను. "చెఱశాల", "చెఱసాల" వీటిలో ఏది సరియైనదో తెలుప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  25. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని క్రిందివిధంగా మార్చితే బాగుంటుందనిపించింది.
    దొరకొని దోచెదరు లటులు
    దొరికిన ప్రతివారి, పిదప దొరకెదరు గనన్..."
    **********************************************************************
    మందాకిని గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘కొన్నిన్’ అనడమే బాగా లేదు. అక్కడ ‘ధర నాయువు మిగిలి కొన్ని దక్కవు చేతన్’ అందాం.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్యను గమనించారు కదా! మొదటి పాదాన్ని ఇలా మార్చితే బాగుంటుంది. ‘దొరకము కద యెవరి కనుచు’
    అన్నట్టు మీ కోరికపై ‘యడాగమం’ పాఠం ప్రారంభించాను. చూసారా?
    **********************************************************************
    రాంభట్ల పార్వతీశ్వర శర్మ (సీనియర్) గారూ,
    నమస్కృతులు!
    అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘పరసొమ్ము’ను ‘పెరసొమ్ము’గా మార్చండి.
    **********************************************************************
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    రెండవ పాదం చివర ‘మాత్రం’ అని అనుస్వారంతో వ్యావహారిక పదాన్ని వేసారు. అక్కడ ‘నేడు పరులకె గదరా’ అందాం.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  26. **********************************************************************
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    ముందుగా మీరు మిత్రుల పూరణలను శ్రద్ధగా చదివి గుణదోష విచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు.
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  27. **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ‘చెఱసాల’ సరియైనది.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  28. గురువుగారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. శ్యామలీయం గారూ ! ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  30. కొరతేమి కలదు మనకని
    దొరికిన దరి దొరికి నంత దోచుకు తినగన్ !
    చె ఱలందు చెలఁగు సుఖములు
    దొరకని దొరలును దొరికిన దొంగలు నొకటే !

    రిప్లయితొలగించండి
  31. పొరుగిండ్లను దూరును మీ
    చిరు నగవుల చిన్నివాడు చిలిపి! యశోదా!
    దొరకెడు వరకే ! ఆపై,
    దొరకని దొరలును దొరికిన దొంగలు నొకటే !

    రిప్లయితొలగించండి
  32. **********************************************************************
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    దొరికీ దొరకని దొంగ కృష్ణుని గురించి మనోహరమైన పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  33. మిస్సన్న గారి స్ఫూర్తితో ....

    దొరికినచో చిరునవ్వుల
    మురిపించును వెన్నదొంగ; పొలతుల దొరయై
    దొరకక మనముల దోచును;
    దొరకని దొరలును దొరికిన దొంగలు నొకటే!

    రిప్లయితొలగించండి
  34. ఆర్యా !
    నా పూరణ ఇది ,
    తరుణము చిక్కిన, తప్పక
    మరుగొని యవినీతిగతి నమాత్యులు నడువన్,
    పరధన చోరత్వంబున ,
    దొరకని దొరలును, దొరికిన దొంగలు,నొకటే !

    రిప్లయితొలగించండి
  35. గురువుగారూ ధన్యవాదాలు.
    మీ పూరణ మరింత మనోహరంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  36. పరాన్చిఖాని వ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాన్పశ్యతి నాన్తరాత్మన్ |
    కశ్చిద్ధీరాః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షుః అమృతత్వమిఛ్ఛన్ ||



    పరమాత్మయె దొరకని దొర;
    దొర నేననుచున్ దిరెగెడి దొంగది మనసే
    దొరకును వెదకగ వెదకగ;
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    రిప్లయితొలగించండి
  37. తరుగవ గుడిలో సొమ్ములు
    త్వరపడి పోలీసులకట తండుకొనంగా
    పరుగిడ నోటిని వేలిడి
    దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే!

    రిప్లయితొలగించండి