26, అక్టోబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 505 (దీపావళి పోరు సలిపె)


కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
దీపావళి శుభాకాంక్షలు!
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దీపావళి పోరు సలిపె తిమిరముతోడన్.

19 కామెంట్‌లు:

  1. దీపముఁ దానై వెలుగుచు
    చూపుల వెన్నెల గురియుచు చుక్కల తోడన్
    మాపటి రాజుని గానని
    దీపావళి , పోరు సలిపె తిమిరము తోడన్.

    రిప్లయితొలగించండి
  2. వ్యాపించుచుండగా బహు
    రూపమ్ముల నీ జగత్తులో తిమిరంబై
    పాపావళి, జ్ఞానాద్భుత
    దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  3. దీపము సుజ్ఞానమె గన.
    కోపాదులు తిమిర గుణపు గుర్తులు కనగా.
    దీపింపగ నాత్మద్యుతి
    దీపావళి పోరు సలిపె తిమిరముతోడన్.

    రిప్లయితొలగించండి
  4. శంకరాభరణ నిర్వాహకమిత్రులకు, పాఠక మిత్రులకు, యావద్భారతీయులకు, యావదాంధ్ర జనావళికి దీపావణి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. దీపపు వెలుగులు జగతిని
    పాపపు చీకట్లు తొలగి భాసిల్ల దగున్ !
    రేపటి వెలుగుల కొరకని
    దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్ !

    రిప్లయితొలగించండి
  6. దీపమ! నేనలసితి నిక
    రేపే తెంచంగలాడ, రేయిని వెలుగుం
    జూపవె జీవుల కన రవి
    దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్ !

    రిప్లయితొలగించండి
  7. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, అక్టోబర్ 26, 2011 9:25:00 AM

    కోపావేశము తోడను,
    బాపపు బను లందు మనసు పడుటలు తోడన్ ,
    రేపటి బతుకుల తోడను,
    దీపావళి పోరు సలిపె దిమిరము తోడన్

    శుభాకాంక్షలు

    అరవయ్యో పడి దాటియు
    మరి మరి బడి పిల్ల లట్లు మారాడక మా
    గురువుల బెత్తపు ఝడుపుల
    దెరలెడి సఖులార !శుభము దీపావళికిన్

    అరవయ్యో పడి దాటియు
    నురవడి సుంతయును దగ్గ కుజ్జ్వల మతులై
    కరకుగ బడి జెప్పు బుధులు !
    తిరముగ శుభమయ్య మీకు దీపానళికిన్

    రిప్లయితొలగించండి
  8. దీపములేదని నింగిని
    దీపములై వెలుగు చుండె తీరుగ తారల్
    పాపము ధర దీనింగని
    దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్ !

    రిప్లయితొలగించండి
  9. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ .....

    గోపాలు డలసిపోవగ
    చాపముగొని సత్య పోరు సలుపుచునుండన్
    బాప నిశాచరులను తా
    దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్

    రిప్లయితొలగించండి
  10. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, అక్టోబర్ 26, 2011 3:26:00 PM

    శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ చింతా రామకృష్ణారావుగారికి, శ్రీ పండిత నేమాని గారికి, మరియు ఇతర కవిమిత్రులకు, మరియు బ్లాగువీక్షకులకందరికిని దీపావళీ పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీపతిశాస్త్రిబుధవారం, అక్టోబర్ 26, 2011 3:34:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    పాపపు జీకటిబాపగ,
    తాపసివలె దీక్షబూని ధైర్యమునిడుచున్
    దీపములన్నియునొకటై
    దీపావళి పోరుసలిపె తిమిరముతోడన్.

    రిప్లయితొలగించండి
  12. కోపము కామము లోభము
    మాపగ లేని మద మోహ మాత్సర్యముల్
    పాపపు తిమరములవ్వగ
    దీపావళి పోరుసలిపె తిమిరముతోడన్!!

    రిప్లయితొలగించండి
  13. దీపము వెలిగించుము చెలి
    పాపపు తిమిర ములను బాపుట కొరకై !
    దీపము తానుగ కరుగుచు
    దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్ !

    రిప్లయితొలగించండి
  14. దీపపు ప్రాధాన్యంబుయు
    నీపండుగకుపరమార్ధమెంచకనున్నన్
    లోపంబెవ్వరిదంచును
    దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్ !

    రిప్లయితొలగించండి
  15. లోపలి సద్గుణ దీపము
    కోపాలను రూపుమాపు, కుమతుల మదిలో
    దీపాల వెలుగు నింపగ
    దీపావళి పోరు సలిపె తిమిరము తోడన్!!!

    రిప్లయితొలగించండి
  16. **********************************************************************
    మందాకిని గారూ,
    ‘మాపటి రాజును గానని దీపావళి’ చక్కని ప్రయోగం. మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని గారూ,
    ‘జ్ఞానాద్భుత దీపావళి’ని ఆవిష్కరించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    చింతా రామకృష్ణారావు గారూ,
    ఆత్మద్యుతితో అజ్ఞానపు తిమిరముతో పోరుచేయుమన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    అందరికీ శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు.
    **********************************************************************
    రాజేశ్వరక్కయ్యా,
    రేపటి వెలుగులను కోరిన మీ మొదటి పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. రెండవపాదంలో గణదోషం. ‘పాపపు తిమిరములను’ అన్నచోట ‘పాపపు తిమిరముల నెల్ల’ అంటే సరి!
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    రవి తన పనిని దీపాలకు అప్పగించినట్లు చేసిన మీ పూరణ వైవిధ్యంగా ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    రేపటి బ్రతుకులకై పోరును తెలిపిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    లక్కాకుల రాజారా
    విక్కరణిన్ శుభముఁ గోరితే మిత్రులకున్
    చక్కగ గురులకు, పద్యము
    లొక్కొక్కటి మధురిమ నిడి యొప్పెన్ మిగులన్.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    తారలతో పోటీపడి పోరుసలిపే దీపావళిని గురించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    జిగురు సత్యనారాయణ గారూ,
    అరిషడ్వర్గంతో పోరాటాన్ని తెలిపిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    పండుగ పరమార్థాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని కొన్ని చిన్నచిన్న దోషాలు ...‘ప్రాధాన్యంబుయు / నీపండుగకు’ .. ? ఇక్కడ ‘ప్రాధాన్యతగల / యీ పండుగకు’ అంటే ఎలా ఉంటుంది?
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    కుమతుల మదిలో సద్గుణదీపాలను వెలిగించాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  17. పాపారాయుడు త్రాగగ
    దీపమ్ముకు దుడ్డులేక తిండికి గూడన్
    చీపురు కాల్చిన మంటను
    దీపావళి పోరు సలిపె తిమిరముతోడన్

    రిప్లయితొలగించండి