2, అక్టోబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -479 (మాయ జేయు ఘనుండె)

కవి మిత్రులారా,
ఈరోజు గాంధీజయంతి!
ఆ అహింసామూర్తికి వందనాలు!

ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మాయ జేయు ఘనుండె గాంధేయవాది.

29 కామెంట్‌లు:

 1. హింసలో నారి తేరిన కంస విభుల,
  అక్రమార్జన పరులన వక్రమముగ
  వంకరల్ సరిజేసి యే వంక లేని
  మాయ జేయు ఘనుండె గాంధేయవాది.

  రిప్లయితొలగించండి
 2. మాస్టారూ,
  మీ ఫోటో మార్చారు. సైడ్ యాంగిల్లో కుర్రాడిలా వున్నారు:-)

  రిప్లయితొలగించండి
 3. హింస కంసుల మనసును హంస జేసి
  హత్య బుద్ధుల మాన్పించి సత్య మహిమ
  చెప్పి శాంతిని కలిగించి చెడును చెరిపి
  మాయ జేయు ఘనుండె గాంధేయవాది.

  రిప్లయితొలగించండి
 4. అయ్యా! చిన్న సందేహము.
  గాంధీయ శబ్దమా లేక గాంధేయ శబ్దమా? ఏది సాధువు?
  Pandita Nemani

  రిప్లయితొలగించండి
 5. నేమాని వారూ,
  వాస్తవానికి గాంధీయ శబ్దమే సాధువు. కాని జనబాహుళ్యంలో, పత్రికలలో, వార్తామాధ్యమాలలో ‘గాంధేయ’ శబ్దమే రూఢియై యున్నది. ఎంతగా అంటే సమస్య ఇచ్చే సమయంలో (మీరు చెప్పేంతవరకు) గాంధీయశబ్దం నా ఆలోచనకే రాలేదు.
  సూచనకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. మన దేశ ప్రియనేత మాన్యుడు, మహాత్మా గాంధి, సత్యాగ్రహం
  బను భద్రాయుధమూని దీక్షగొని పోరాడెన్ బ్రిటిష్ వారితో
  జనబాహుళ్యపు మానసాంబుజములన్ చైతన్యమున్ నింపె దె
  చ్చెను స్వాతంత్ర్యము మాతృదేశమునకున్ జేజేలివే వానికిన్
  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 7. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....

  బానిసత్వము తొలగె నీ వారసత్వ
  రాజకీయము లేతెంచి ప్రబల మయ్యె
  రామ రాజ్యము వెలుగొంద ప్రజల నడత
  మాయ జేయు ఘనుండె గాంధీయవాది !

  రిప్లయితొలగించండి
 8. ఖద్దరు ధరియించి జనులన్ హద్దుమీరి
  మాయ జేయు ఘనుండె గాంధేయవాది
  సోనియా, చిదంబరమగు బో నిజమ్ము
  "గాంధి" యెరుగు వాదమ్ములు గాదు సుమ్మి!

  రిప్లయితొలగించండి
 9. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, అక్టోబర్ 02, 2011 11:20:00 AM

  అన్నా హజారే గారిని ఉటంకిస్తూ.......

  సరళ భాషణ జేయుచు సాత్వికముగ,
  పట్టుదలతోటి నిరశన వ్రతము జేసి
  నేతలవినీతిసాజ్య్య నివహములను
  మాయజేయు ఘనుండె గాంధేయవాది.

  రిప్లయితొలగించండి
 10. గాంధి పుట్టిన నేలలో గలరునేడు
  దేశ సంపద మ్రింగెడు వేశ గాండ్రు
  సత్య మునకెల్ల మసిబూసి సకల సిరుల
  మాయజేయు ఘనుండె గాంధేయవాది!!!

  రిప్లయితొలగించండి
 11. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, అక్టోబర్ 02, 2011 1:25:00 PM

  దూకుడు సినిమా చూసి ఫోటో మార్చారా గురువు గారూ?? మీ క్రొత్త ఫోటో బ్లాగుకే కొత్త వన్నెలు తెచ్చినట్లుగా వుంది. అభివాదములు.

  రిప్లయితొలగించండి
 12. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, అక్టోబర్ 02, 2011 1:27:00 PM

  అన్నా హజారే గారిని ఉటంకిస్తూ.......

  సరళ భాషణ జేయుచు సాత్వికముగ,
  పట్టుదలతోటి నిరశన వ్రతము జేసి
  నేతలవినీతి సామ్రాజ్య నివహములను
  మాయజేయు ఘనుండె గాంధేయవాది.

  రిప్లయితొలగించండి
 13. గురువుగారికి ప్రణమిల్లి
  -------------------
  నేటి రాజకీయ నాయకులే కాదు , ప్రజలు కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు

  తే : మాయ జేయగా మన్నించి వేయు ఓటు,
  ధన మివ్వ మానప్రాణ , తనువు నిచ్చు
  నట్టి యల్ప సంతోషులు అవని నుండ,
  మాయ జేయ ఘనుండె గాంధేయ వాది |

  రిప్లయితొలగించండి
 14. **********************************************************************
  మిస్సన్న గారూ,
  ‘వంక లేని మాయ’ ... బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  పండిత నేమాని వారూ,
  మహాత్ముని గురించి మనోహరమైన పద్యం చెప్పి అందరికీ ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  **********************************************************************
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  అన్నా హజారేను ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  ‘పట్టుదలతోటి’ని ‘పట్టుదలతోడ’ అంటే బాగుంటుంది.
  అన్నట్టు ఆ సినిమా చూడలేదు. మొన్న మా యింట్లో మా అబ్బాయి తీసిన ఫోటో అది. నచ్చినందుకు ధన్యవాదాలు.
  **********************************************************************
  వరప్రసాద్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  రెండవ పాదంలో గణదోషం. ‘ధనమివ్వ’ను ‘ధనము నివ్వ’ అని మార్చితే సరి!
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 15. శంకరార్యా ! ధన్యవాదములు.
  సంపత్ కుమార్ శాస్త్రి గారు చెప్పినట్లు మీ క్రొత్త ఫోటో బ్లాగుకే కొత్త వన్నెలు తెచ్చినట్లుగా వుంది.

  రిప్లయితొలగించండి
 16. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ ....

  మాయయే విశ్వమెల్లను, మానసంబు
  మాయ, పాలించునది మాయ, మాయ యందె
  పుట్టుటయు, గిట్టుటయు గాన మాయ లందు
  మాయ జేయు ఘనుండె గాంధీయవాది

  రిప్లయితొలగించండి
 17. గమనించారో లేదో ... నేను మిస్సన్న గారి ‘ఫోజు’ను కాపీ కొట్టాను. :-)

  రిప్లయితొలగించండి
 18. నీతి నియమము లన్నను భీతి లేదు
  పాప పుణ్యము లన్నది పాత మాట
  రెచ్చి పోయెను దురితము హెచ్చు గాను
  మాయ జేయు ఘనుండె గాంధేయ వాది !

  రిప్లయితొలగించండి
 19. రాజేశ్వరి గారూ "నీతి నియమము లన్నను భీతి లేదు" పూరణ "గాంధేయవాది" మీద సూటిగా సూక్ష్మంగా బాగుంది.

  రిప్లయితొలగించండి
 20. **********************************************************************
  రాజేశ్వరక్కయ్యా,
  మంచి పూరణ. అభినందనలు.
  **********************************************************************
  లక్కరాజు శివరామ కృష్ణారావు గారూ,
  ధన్యవాదాలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 21. శ్రీ లక్కరాజు వారికి , శ్రీ కంది శంకరయ్య గారికి , అందరికీ ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 22. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నేటి గాంధీయ వాది :

  01)
  _________________________________

  "మమ్ము నమ్మిన మీకొచ్చు - మంచి యనుచు"
  మాయ మాటలు చెప్పెడి - మంత్రుల గన
  మహిని గాంధీకి యర్థమే - మారి పోవ
  మంచిగా దోచెడి ఘనుడె - మంత్రి గాగ
  మాయ జేయు ఘనుండె గాం - ధీయ వాది !
  _________________________________

  రిప్లయితొలగించండి
 23. ఏది ఏమైనా మనమూ మనమూ ఒకటే గురువుగారూ!

  రిప్లయితొలగించండి
 24. మిస్సన్న గారూ,
  కానీ .. మీ నవ్వును ‘కాపీ’ కొట్టలేక పోయాను. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నాకు నవ్వెలా వస్తుంది?

  రిప్లయితొలగించండి
 25. gandhi raajiv gandhi
  indiramma suthudavayya
  gandhi vamshiyuda
  pillalaku aadarshanga
  niliche o rajeevayya

  రిప్లయితొలగించండి
 26. అజ్ఞాత, ఆనంది గారలకు,
  ఇద్దరూ ఒకరేనా? వేరు వేరా?
  నా బ్లాగును వీక్షించి స్పందించినందులు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 27. చాలా బాగున్నాయి టపాలు

  రిప్లయితొలగించండి