16, అక్టోబర్ 2011, ఆదివారం

నా పాటలు - (సాయి పాట - 3)

సాయికి మా వందనం

గోదావరీతీర షిరిడిపురములో
విలసిల్లు సాయికి మా వందనం - కరుణ
కురిపించు సాయికి మా వందనం
కాపాడు సాయికి మా వందనం - జనుల
పాలించు సాయికి మా వందనం .................... || గోదావరీ ||

అఖిలాండకోటి బ్రహ్మాండవిభుడుగా
భాసించు బాబాకు మా వందనం - కష్ట
ముల బాపు బాబాకు మా వందనం
వరము లిచ్చు బాబాకు మా వందనం - సుఖము
లను గూర్చు బాబాకు మా వందనం ............. || గోదావరీ ||

అజ్ఞానమును బాపి జ్ఞానము నొసగే
సౌజన్యమూర్తికి మా వందనం - మూడు
లోకాల కర్తకు మా వందనం
పాపాల హర్తకు మా వందనం - పంచ
భూతాల భర్తకు మా వందనం ..................... || గోదావరీ ||

భక్తులందరి హృదయ మందిరములలో
నెలకొన్న పాదునకు మా వందనం - వేద
వేదాంత విదునకు మా వందనం
జ్ఞానసంపదునకు మా వందనం - ప్రణవ
సన్మంత్రనాదునకు మా వందనం ............... || గోదావరీ ||

శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - హేమ కళ్యాణి.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/706a7362-4d12-438d-ade1-c84b0e66d6f9/Sai---Godavaritheera

4 కామెంట్‌లు:

 1. మాస్టారు గారూ ! మీ ' సాయి వందనముల' గీతము వందవిధముల వందనీయముగా నున్నది.

  రిప్లయితొలగించండి
 2. పండిత నేమాని వారి వ్యాఖ్య .....

  ayyaa! SubhaaSeessulu.
  సాయి పాటలు - పూల బాటలు

  పాటల నెంతయు తీయని
  మాటలనే పేర్చి కూర్చి మానస వికచ
  ద్ధాటకమర్పించితివే
  సాటి కలరె మీకు కంది శంకర సుకవీ!

  రిప్లయితొలగించండి
 3. గురువుగారు నమస్కారం .మీరు వ్రాసిన సాయి పాటలు ఈ రోజు వరకు ఎలా వినాలో తెలియలేదు ,నేడు విన్నాను చాలా మనోహరంగా ఉన్నాయి పాడిన వారు కర్ణ ప్రేయంగా పాడారు .సంగీతం చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పండిత నేమాని గారూ,
  మంద పీతాంబర్ గారూ,
  ................... ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి