17, అక్టోబర్ 2011, సోమవారం

నా పాటలు - (సాయి పాట - 4)

మాయలకు లొంగకుండ

మాయలకు లొంగకుండ భక్తి మీరగా
సాయి భజన చేయరండు సుజనులారా || మాయలకు ||
వందనాలు చేయండి సేవించండి || వందనాలు ||
అందరికీ దిక్కు కదా సాయిబాబా ..................................... || మాయలకు ||

ప్రతినగరం ప్రతిగ్రామం వాడవాడలా
సాయినాథ మందిరాలు విలసిల్లాలి || ప్రతినగరం ||
ప్రతి ఒక్కరి హృదయంలో సద్గురు సాయి || ప్రతి ఒక్కరి||
నెలకొని చూపించాలి మోక్షమార్గము ............................... || మాయలకు ||

తల్లి తండ్రి హితుడు గురువు దైవమాతడే
సుఖసంపద లిచ్చి మనల బ్రోచునాతడే || తల్లి తండ్రి ||
సర్వదేవ వందనాలు పొందునాతడే || సర్వదేవ ||
సర్వమత జనమ్ముల శరణ్యుడాతడే ................................ || మాయలకు ||

అతని రూపు మనకన్నుల దివ్యజ్యోతి
కర్ణరసాయన మాతని జ్ఞానబోధనం || అతని ||
సుధామధుర మతని నామ మగును జిహ్వకు || సుధా ||
అతడే మన పతి గతి యని స్తుతులు చేయరా ................... || మాయలకు ||

ఓం సాయి! శ్రీ సాయి! జయజయ సాయి! || ఓం సాయి ||
జయజయ సాయీ! జయజయ సాయీ!
శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగి.
గానం - హేమ కళ్యాణి.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/f7a39ed9-68db-405a-a311-295be431a0fb/Sai---Maayalaku

5 కామెంట్‌లు:

 1. ఈ పాట కూడా చాలా మధురంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 2. పాటతో పాటు సంగీతం గానం కూడా మధురంగా వున్నవి.

  రిప్లయితొలగించండి
 3. **********************************************************************
  నరసింహ మూర్తి గారూ,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ధన్యవాదాలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 4. సాయి పాటలు అత్యంత మనోహరం గా ఉన్నాయి. వ్రాయ గలిగిన పుణ్యాత్ములు .ధన్యులు .

  రిప్లయితొలగించండి