25, అక్టోబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 504 (నరకునకు సత్యభామ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
నరకునకు సత్యభామ సోదరి యగునఁట!

23 కామెంట్‌లు:

 1. శ్రీగురుభ్యోనమ:

  ధరణి రూపము తనదైన తల్లి యయ్యె
  నరకునకు సత్యభామ, సోదరి యగునఁట
  కృష్ణునకు కృష్ణ కోమలి కృపను పొంది
  రామునకు సోదరుండయ్యె లక్ష్మణుండు

  రిప్లయితొలగించండి
 2. నరకుని సమక్షం
  నారాయణుడె కునికితే
  నరకునికి సత్యభామ
  నారయణీయమైనది !

  రిప్లయితొలగించండి
 3. నరకుని సమక్షం
  నారాయణుడే కునికితే
  నారయణీయమైనది
  నరకునికి సత్యభామ

  రిప్లయితొలగించండి
 4. తల్లి మృత్యువాయె నదెట్టి దానవునకు?
  దేవదేవి యా శ్రీదేవి దివిని విడచి
  ధరణికయ్యెను బంధువు దానదెటుల?
  నరకునకు; సత్యభామ సోదరి యగునఁట.

  నరకాసురుడు దానవుడు/ రాక్షసుడు/దనుజుడు వీరిలో ఏ సంతతికి చెందినవాడో గురువులు తెలుపగలరు.

  రిప్లయితొలగించండి
 5. సవరించిన పద్యం ఇదిగో. ముందు వేసిన పద్యం ఎలా తొలగించాలో నాకు తెలియటంలేదు. శ్రీ శంకరయాగారూ, మీకు తెలిసినట్లైన ఆ పద్యాన్ని తీసెయ్యండి దయచేసి.

  ధరణిపుత్రుడై జనియించె నరకుడంద్రు
  ధరణిజయె మరుజన్మ వైదర్భికాగ
  సత్యభామయు రుక్మిణీ సవతులయిన
  నరకునకు సత్యభామ సోదరియగునట.


  నరకాసురుడు ధరణీ సుతుడేనని చిన్నప్పుడెప్పుడో విన్నట్టు గుర్తు.
  అది నిజమైతే పై పద్యం ఓకే, కాకుంటే పెద్దలు మన్నించాలి. ఇంతకంటే మరో ఐడియా తట్టలేదు.


  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 6. గోలి హనుచచ్ఛాస్త్రి గారి పూరణ ....

  ధరణియే సత్య నరకుఁడు తనయుఁ డనఁగ
  తల్లితో ననె కాన్వెంటు పిల్లఁ డొకఁడు
  నరకునకు సత్యభామ ‘SO'దరి యగు నట
  ‘MAMMI’యైనను ‘KILL'జేసె మనసులేక/

  రిప్లయితొలగించండి
 7. పై పద్యములో కూడా తొలిపాదములో పొరపాటు జరిగినట్టుంది.
  ధరణి పుత్రుడు అనే ప్రయోగం సాధువు కాదనిపిస్తోంది. కనుక ఆ పద్యాన్ని మళ్ళీ మారుస్తునాను ఇలా

  నరకుడుయె పుట్టె పుత్రుడై ధరణికంద్రు
  ధరణిజయె మరుజన్మ వైదర్భికాగ
  సత్యభామయు రుక్మిణీ సవతులయిన
  నరకునకు సత్యభామ సోదరియగును.

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 8. శ్రీపతి శాస్త్రి గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ పంపారు. బాగుంది. అభినందనలు.
  *
  జిలేబి గారూ,
  స్పందించినందుక సంతోషం. మీ భావాన్ని ఛందోబద్ధం చేసే ప్రయత్నం చేస్తాను.
  *
  మందాకిని గారూ,
  ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  చక్కని తర్కంతో మంచి పూరణ ఇచ్చారు. అభినందనలు.
  ‘ధరణిపుత్రుడు, ధరణీపుత్రుడు’ రెండూ సాధురూపాలే!
  ‘నరకుడు + ఎ’ ఇక్కడ సంధి నిత్యం. ‘నరకుడె’ అవుతుంది. అందువల్ల ‘నరకుడే పుట్టె’ అంటే సరి!
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  కాన్వెంటు చదువుల మీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. ఈ జగంబంతయును నొక్కటే కుటుంబ
  మనెడు భావంబుతో గనుమయ్య! వినుము
  పృథివి జనులెల్ల దేవుని బిడ్డలగుట
  నరకునకు సత్యభామ సోదరి యగునట

  రిప్లయితొలగించండి
 10. హూణవిద్యలు మాత్రమే యెఱిగి దూర
  దేశ వాసియై బిడ్డలు తెలియ నడుగ
  చిక్కి దీపావళీకథ చెప్పెనెట్లు?
  నరకునకు సత్యభామ సోదరియగునట.

  రిప్లయితొలగించండి
 11. పండిత నేమాని వారూ,
  ‘జగమంత కుటుంబం నాది’ అంటారు. బాగుంది. మంచి సమర్థనతో కూడన పూరణ. అభినందనలు.
  *
  ‘శ్యామలీయం’ గారూ,
  పురాణ జ్ఞానం లేనివాళ్ళు స్వదేశంలోను ఉన్నారు. చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. India is my Country all Indians are my brothers and Sisters...

  power poyetlu undi so

  telugulo vrayaleka pothunnanu sorry

  universal sodrathva bhavam

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శ్యామలీయంగారి పద్యములోని తొలిపాదం నాలో అనుమానం కలుగచేస్తోంది. అదేమిటంటే, యతి గానీ ప్రాసయతిగానీ కుదిరేయా అని.

  హూణవిద్యలు మాత్రమే యెఱిగి దూర

  "హూ", "యె" తో గానీ లేద "ణ, "ఱ" తో గానీ యతిగా జతకడతాయా??

  వారు పొరబడి ఉంటారని నేను అనుకోను.

  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 14. అందరికీ నమస్కారం !
  ఇది నా పూరణ ,

  నరకవధయనునొక వీధినాటకమున
  దనుజపాత్రధారికి పినతండ్రి ,సత్య
  భామ యైననటినిగన్న వాడు గాన
  నరకునకు సత్యభామసోదరియగునట

  రిప్లయితొలగించండి
 15. శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారి పూరణ ఒక క్రొత్త ఒరవడి కి నాంది. సరదాకే ఐనా ప్రయోగం బావుంది.

  రిప్లయితొలగించండి
 16. ‘ఎందుకో .. ఏమో’
  కాని మీరు ఏం చెప్పదలచుకున్నారో బోధపడలేదు.
  *
  కామేశ్వర శర్మ గారూ,
  నిజమే. అక్కడ యతి తప్పింది.
  ‘హూణవిద్యలనే నేర్చి యొకఁడు దూర ....’ అంటే సరి!
  *
  కళ్యాణ్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. మాస్టరు గారూ ! సాంకేతిక లోపము వలన నేను పోస్ట్ చేయలేక మీకు మెయిల్ చేశాను. వెంటనే ప్రచురించినందులకు, పూరణ నచ్చినందులకు ధన్యవాదములు.
  పీతాంబర్ గారూ ! ధన్యవాదములు.
  ' సో ' దరి అంటే దగ్గరి ( బంధువు) తల్లి అయినాకూడా చంపినది అని కాన్వెంట్ పిల్లాడి వ్యాఖ్యానము. సరదాగా పూరించాను. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 18. బుడుగు తల్లితో చెప్పెను " బడిని నేడు
  నరకునకు సత్య భామ యే వరుస యనిరి "
  చెప్పె సీగాన పెసునాంబ చిత్రముగను
  " నరకునకు సత్యభామసోదరియగునట "

  రిప్లయితొలగించండి
 19. గురువుగారూ ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 20. వింటిని మును నేనే పట్ట వింటి నిలను
  విజయమును తధ్యము నందు వీరునకును
  సవ్యసాచికిన్, బన్నుగ, సారధి యనె
  నరకునకు; సత్యభామ సోదరి యగునట.


  దండాన్వయము:
  (పన్నుగ) సారధియనె నరకునకు -వింటిని మును నేనే ,వింటిపట్టనిలను
  విజయమునుతధ్యమునందు వీరునకును సవ్యసాచికిన్ (పన్నుగ) సత్యభామ సోదరి యగునట.


  2)
  కోలకోలకు చెవిగూబ, గుండెలదర
  శరములనడిమి త్వరపడి సారధియనె
  నరకునకు, సత్యభామసోదరియగునట
  సవ్యసాచికి,న్నేడొప్పు సత్యమిద్ది.

  రిప్లయితొలగించండి
 21. క్షీరసాగర కన్యకు చెల్లెలగును
  పుడమి,నరకుడా దేవికి పుత్రుడగుట
  ధరణిసుతకు రుక్మిణి యవతారమెకద
  సత్యభామయు రుక్మిణి సవతులగుట
  నరకునకు సత్యభామ సోదరి యగునట.

  రిప్లయితొలగించండి
 22. **********************************************************************
  మిస్సన్న గారూ,
  ముళ్ళపూడి వారు మీలో పరకాయ ప్రవేశం చేసారా? అద్భుతమైన పూరణ. అభినందనలు.
  **********************************************************************
  ఊకదంపుడు గారూ,
  దండాన్వయం ఇచ్చినా మొదటి పూరణ కాస్త నారికేళ పాక మయింది.
  రెండవపూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  ‘కమనీయం’ గారూ,
  సమస్యను సమర్థిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  **********************************************************************

  రిప్లయితొలగించండి