26, అక్టోబర్ 2011, బుధవారం

శుభాకాంక్షలు!


కవిమిత్రులకు
బ్లాగు వీక్షకులకు
తెలుగువారి కందరికీ
దీపావళి శుభాకాంక్షలు!

ప్రమిద దేహమ్మునకు గుర్తు, ప్రజ్వరిల్లు
జ్యోతియే యాత్మ, యందులో సద్వివేక
భూతమౌ జ్ఞానతైలమ్ము పోసినపుడె
లోకకళ్యాణకాంతులు ప్రాకు దిశల!

క్రమము దప్పక వచ్చెడి కవివరులకు
నప్పుడప్పుడు కనిపించు నతిథులకునుఁ
గలుఁగ సుఖసంపదలు శుభాకాంక్ష లిప్పు
డందఁజేయుచున్నది ‘శంకరాభరణము’

22 కామెంట్‌లు:

  1. మాస్టారూ, ధన్యవాదాలు. మీకు మీ కుటుంబ సభ్యులకు, బ్లాగు కవి మిత్రులకు వారి వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యులకు, కవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకందరికీ దీపావళి శుభాకాంక్షలు.

    నరకుము మాలో పాపము
    నరకుము దుర్బుద్ధి, చింత, నరకుము లేమిన్
    నరకిన దీపావళియే
    నరకాంతక కృష్ణ ! నిన్ను నమ్మితి మదిలో !

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    గురువులకు , పుజ్యులకు ,బ్లాగు సోదరులకు ,సోదరి మందాకిని గారికి అందరికీ " దీపావళి శుభా కాంక్షలు "

    రిప్లయితొలగించండి
  4. శ్రీపతిశాస్త్రిబుధవారం, అక్టోబర్ 26, 2011 7:41:00 AM

    గురువుగారికి,కవిమిత్రులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! మీ దీపావళి సందేశ పద్యము 2వ పాదములో "బాలల్మ్ - అహో" కి బదులుగ 'బాలల్ - బళా' అంటే సుగమనము అవుతుంది.
    సన్యాసిరావు
    (TO: Sri Missanna garu)

    రిప్లయితొలగించండి
  6. బాలసుబ్రహ్మణ్యంబుధవారం, అక్టోబర్ 26, 2011 7:47:00 AM

    గురువు గారికీ, సాహితీ మిత్రులకీ దీపావళి శుభాకాంక్షలు
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం, మణిమేఖల & లలితా రమ్య (బెంగళూరు)

    రిప్లయితొలగించండి
  7. గురువులకు, పెద్దలకు, కవిమిత్రులకు, తెలుగు పద్యాభిమానులకు
    దీపావళి శుభాకాంక్షలు.

    దివిటీల్ దాలిచి నిల్చినార లరుగో ధృత్యున్నతోత్సాహులై
    బవరంబందు సిపాయిలట్లు వరుసన్ బాలల్ బళా! చూడ, రే-
    బవళుల్, పూనిక,వెల్గుపూల తరులన్ పాతించి పోషింతు మీ
    యవనిన్ శాంతి చివుళ్ళు వేయ నన సాయం సంధ్య దీపావళిన్!

    రిప్లయితొలగించండి
  8. మాలో చింతల బాపి ధైర్యగుణ మిమ్మా! ధర్మ దీపావళీ!
    మాలో దుఃఖము మాన్ పి సంతసము నిమ్మా దివ్య దీపావళీ!
    మాలో జాడ్యము డుల్చి చేతనము నిమ్మా భవ్య దీపావళీ!
    మాలో మౌఢ్యము ద్రుంచి విద్యలిడుమమ్మా! జ్ఞాన దీపావళీ!
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  9. గురువు శ్రీశంకరయ్య గారికి మరియు కవిమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  10. మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
    సిరికి లోకాన పూజలు జరుగు వేళ
    చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
    ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
    భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, అక్టోబర్ 26, 2011 3:26:00 PM

    శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ చింతా రామకృష్ణారావుగారికి, శ్రీ పండిత నేమాని గారికి, మరియు ఇతర కవిమిత్రులకు, మరియు బ్లాగువీక్షకులకందరికిని దీపావళీ పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  13. (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రాజేశ్వరక్కయ్యా,
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    మిస్సన్న గారూ,
    పండిత నేమాని గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    శ్రీఅదిభట్ల కామేశ్వర శర్మ గారూ
    ..................................................... ధన్యవాదాలు!
    మీ అందరి సహకారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ..
    మీ
    కంది శంకరయ్య.

    రిప్లయితొలగించండి
  14. ‘రాకుమార’ గారూ,
    ధన్యవాదాలు.
    ‘శంకరాభరణం’ మీకు ఆనందంగా స్వాగతం పలుకుతున్నది.
    సలక్షణంగా చక్కని ధారతో మంచి పద్యం వ్రాసారు. బ్లాగులో సమస్యలు పూరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  15. ‘రాకుమార’ గారూ,
    మీ పద్యంలో చివర ‘దివిలె’ ....? ‘దివ్వె’కు టైపాటా?

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులకు పండితవర్యులకు పెద్దలకు మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  17. శంకరయ్య గారూ!
    "దీపావళి" కి పర్యాయంగా నేను చిన్నప్పటినుంచి వింటున్న, నా చుట్టు పక్కల వాళ్లంతా అంటున్న మాట "దివిలె"

    రిప్లయితొలగించండి
  18. పల్లెటూళ్ళలో ' దీపావళి ' ని ' దివిలి ' గా పిలవడం వాడుకలో ఉంది.

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్య గారు మొదలుగాగల కవికులమునకంతటికీ దీపావళీ శుభాకాంక్షలు !!!

    రిప్లయితొలగించండి
  20. **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    **********************************************************************
    రాకుమార గారూ,
    మిస్సన్న గారూ,
    మన్నించాలి. ఎంత మూఢమతిని! మా ప్రాంతంలో పల్లెల్లో దీపావళిని ‘దివిలి’ అంటారు. నాకు గుర్తుకు రాలేదు. పల్లెలతో సంపర్కం తగ్గి కొన్ని పదాలను పూర్తిగా మరిచేపోయాను. మరిచిపోయిన పదాన్ని గుర్తు చేసారు. ధన్యవాదాలు.
    **********************************************************************
    డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి