5, అక్టోబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం -483 (దుర్గాభర్గులను గొలువ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్!
ఈ సమస్యను పంపిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !

  01)
  _________________________________

  స్వర్గము సంప్రాప్తించును
  దుర్గా భర్గులను కొలువ ! - దురితము లంటున్
  భర్గుని మార్గము విడిచిన
  దుర్గుణముల పాల బడిన - దుష్టుల కెపుడున్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 2. వసంత కిశోర్ గారూ,

  మ్రొక్కిన దుర్గాభర్గులఁ
  జిక్కును స్వర్గం బటంచు శీఘ్రముగా నీ
  వెక్కించితి వీ బ్లాగునఁ
  జక్కని పూరణ మిదియె వసంత కిశోరా!

  రిప్లయితొలగించండి
 3. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....

  వర్గము లారు నశించును
  దుర్గా భర్గులను గొలువ ! దురితము లంటున్
  వర్గముల జనుల జెండుచు
  నిర్గుణ బ్రహ్మమ్ము పైన నిందలు మోపన్ !

  రిప్లయితొలగించండి
 4. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,

  అరిషడ్వర్గము లడఁగును
  గిరిజాభవులఁ గొలువ నని గెలిచితె మనముల్
  నరసింహ మూర్తి! నీదగు
  వర పూరణ మెచ్చినాఁడ; బాగున్నదయా!

  రిప్లయితొలగించండి
 5. శంకరార్యా ! ధన్యవాదములు !

  మూర్తీజీ ! బావుంది !

  రిప్లయితొలగించండి
 6. 02)
  _________________________________

  దుర్గమము గాదు మోక్షము
  దుర్గా భర్గులను కొలువ! - దురితము లంటున్
  దుర్గను దూషించిన చో
  దుర్గేశుని పదములంటి - దురపిల్లనిచో !
  _________________________________

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ ....

  దుర్గతులెల్ల నశించును
  దుర్గా భర్గులను గొలువ, దురితము లొదవున్
  దుర్గేశుల నిందించిన,
  నార్గురు శత్రువుల నణుపనానందదమౌ

  రిప్లయితొలగించండి
 8. కరెంటు పోయింది. నా యుపియస్ రెండు మూడు నిమిషాలే పనిచేస్తుంది. పునర్దర్శనం సాయంత్రానికి ....

  రిప్లయితొలగించండి
 9. 03)
  _________________________________

  వర్గము లెల్ల నశించును
  దుర్గా భర్గులను కొలువ! - దురితము లంటున్
  మార్గము మృగ్యము స్వర్గపు
  సర్గుని,దుర్గను సతతము - స్మరియింపనిచో !
  _________________________________
  వర్గములు = అరిషడ్వర్గములు

  రిప్లయితొలగించండి
 10. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ....

  గురువు గారూ ధన్య వాదములు. కిశోర్ జీ కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 11. దుర్గతి మతులిటు పలుకగ
  "దుర్గా భర్గులను కొలువ" - దురితము లంటున్!
  మార్గము గనుగొని "శరణని"
  దుర్గా భర్గులను కొలువ - దోషము తొలగున్!!

  రిప్లయితొలగించండి
 12. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, అక్టోబర్ 05, 2011 4:00:00 PM

  స్వర్గప్రాప్తి లభించును,
  దుర్గా భర్గులను గొలువ,దురితములంటున్
  దుర్గను కొలువకనరిష
  డ్వర్గములను చేరదీయ, భావింపంగన్.

  రిప్లయితొలగించండి
 13. స్వర్గమ్మగుజీవితములు
  దుర్గా భర్గులను గొలువ!!! దురితములంటు
  న్మార్గమధర్మమ్మైనను,
  వర్గాలుగమార్చి జనుల వైరముబెంచన్!

  రిప్లయితొలగించండి
 14. దుర్గతి తొలగును భక్తిన్
  దుర్గాభర్గులను గొలువ;; దురితము లంటు
  న్మార్గము గానక నిల స
  న్మార్గుల దూషించిన, శివమయమీ జగమే!
  ----
  నాల్గవ పాదం ఇంకో రకంగా కూడా వ్రాయవచ్చని పించింది.
  దుర్గతి తొలగును భక్తిన్
  దుర్గాభర్గులను గొలువ;; దురితము లంటు
  న్మార్గము గానక నిల స
  న్మార్గుల దూషించిన, శివమహిమలఁ గనుమా !

  రిప్లయితొలగించండి
 15. శ్రీపతిశాస్త్రిబుధవారం, అక్టోబర్ 05, 2011 6:47:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  దుర్గుణములు నసియించును
  దుర్గా భర్గులను గొలువ, దురితములంటున్
  వర్గములుగ విడి పోవుచు
  నిర్గుణులై హింస జేయునెవ్వరికైనన్

  శఒకరాభరణము, ఆంధ్రామృతము బ్లాగుల అభిమానులందరికి (6-10-2011) విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 16. విజయ దశమి సందర్భంగా గురువులు పండిత నేమాని వారికీ, మిత్రులు శంకరయ్య గారికీ, సహృదయ కవివరులందరికీ, నా శుభాకాంక్షలు.

  ఈ సమస్యకు నా పూరణము.

  దుర్గా భర్గుల గని సన్
  మార్గంబున గొలివ శుభము. నయ దూరపు దు
  ర్మార్గంబున చరియించుచు
  దుర్గా భర్గులను కొలువ దురితములంటున్.

  రిప్లయితొలగించండి
 17. **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  మీ మిగిలిన రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  **********************************************************************
  పండిత నేమాని గారూ,
  మీ పూరణ సర్వోత్తమంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  చంద్రశేఖర్ గారూ,
  రెండు రకాలుగా చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  మీకు కూడా ‘దసరా శుభాకాంక్షలు!
  **********************************************************************
  చింతా రామకృష్ణారావు గారూ,
  మనోహరమైన పూరణ. అభినందనలు.
  ధన్యవాదాలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు!
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 18. స్వర్గ ప్రాప్తికి చక్కని
  మార్గముమా భవుల సేవ మరువకు మనసా!
  దుర్గుణముల త్యజియింపక
  దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్!

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ,

  ఇస్సీ! దుర్గుణములను త
  మస్సునఁ బడి చెడక నా యుమాధవుఁ గొలువన్
  లెస్స యగు ననుచుఁ బలికిన
  మిస్సన్నా! పూరణమును మెచ్చితి నయ్యా!

  రిప్లయితొలగించండి
 20. ఓ విజయదశమికి అనంగుడు - పెండ్లాముతో: [ చేతిలో ఇవి ఉంటే మళ్లా ఏమి అల్లరి చెస్తానో, వాళ్లని కొలవటానికి ఈ బాణాలు పక్కనబెట్టి వస్తాను అంటే:- ]

  నిర్గుణమీకాయంబే
  నిర్గుణమాకాదుమనసు;నిలు,వచ్చెద,నీ
  మార్గణములనువిడువకనె
  దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్!

  రిప్లయితొలగించండి
 21. ఊకదంపుడు గారూ,

  అలరువిలుకాఁడు రతితోఁ
  బలికిన విధ మనుచు మీదు ప్రజ్ఞ స్ఫురింపన్
  బలికిన పూరణ భేషని
  తల నూపెద నిపుడె ‘ఊఁకదంపుడు’ గారూ!

  రిప్లయితొలగించండి
 22. ఊకదంపుడు గారూ,
  ‘మార్గణములను విడువకనె’ నడక కుంటుతున్నట్లుంది. ముందు గణదోషం అనుకున్నా. ‘మార్గణములనే విడువక’ లేదా ‘మార్గణముల విడువకనే’ అంటే ఒక ‘ఊపు’ వస్తున్నది కదా! ఏమంటారు?

  రిప్లయితొలగించండి
 23. శంకరార్యా ! ధన్యవాదములు !

  మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి
 24. భర్గుని పూజించిన యెడ
  స్వర్గము లభియించు ననుట స్వప్నము నందౌ !
  దుర్గతులు దొలగ నందున
  దుర్గా భర్గులను గొలువ దురితము లంటున్ !

  సోదరు లందరికీ [ సోదరి మందాకిని గారికీ ] విజయ దశమి శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 25. గురువు గారూ,ధ్యనవాదములు ..
  "మార్గణములనే విడువక" - బావుందండీ.

  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 26. గీర్గణమేనిన్ నవ విధ
  మార్గంబుల భక్తి నెంచు; మానుచు దానిన్
  నిర్గమ గతి వర్తిలుచున్
  దుర్గా భర్గులను గొలువ దురితము లంటున్!!

  రిప్లయితొలగించండి
 27. **********************************************************************
  రాజేశ్వరక్కయ్యా,
  మీ పూరణను ఆలస్యంగా చూసాను. మన్నించాలి.
  పద్యం నిర్దోషంగా ఉంది. సంతోషం. అభినందనలు.
  **********************************************************************
  "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  **********************************************************************

  రిప్లయితొలగించండి
 28. స్వర్గమునకు పలువిధముల
  మార్గములన్నియును వెదకి
  మార్కెటు ధరలన్
  ముర్గీ బిరియాని నొసగి
  దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్!

  రిప్లయితొలగించండి
 29. స్వర్గీయుల తలచుకొనుచు
  దర్గాలో మ్రొక్కి మ్రొక్కి దండములిడుచున్
  ముర్గిని చంపుచు తినుచున్
  దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్!

  రిప్లయితొలగించండి