9, ఆగస్టు 2012, గురువారం

దత్తపది - 24

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
శివునకు అలంకారాలైన
చంద్ర - నాగ - గంగ - భస్మ
పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
శ్రీకృష్ణుని స్తుతిస్తూ పద్యం వ్రాయండి.
కవిమిత్రుల పూరణలు

1. గోలి హనుమచ్ఛాస్త్రి
నాగ శయన! కంసాంతక! నల్లనయ్య!
చంద్ర కాంతుల మించెడు చల్లనయ్య!
భస్మ మాయెను నా పాప పంకిలమ్ము
బాలకృష్ణ! నే మునుగంగ భక్తి లోన.
 
  

*     *     *     *     *
2. పండిత నేమాని
యదుకులాంభోధి చంద్ర! దేవాధిదేవ!
భక్తి చెలగంగ నీ పదాబ్జములు గొలుతు
నందనందనా! గతివీవె నాకు కృష్ణ!
భస్మ మొనరింపుమా హృత్స్థ వైరితతిని.

*     *     *     *     *
3. లక్ష్మీదేవి
ముడివేసి ముడిచిన ముత్యంపు దండయో
          శశిధరు తలపైని చంద్రవంక!
మెడలోన ధరియించు మెరుపుల హారాలు..
          నాగరాజుల బోలు నగలు గాదె!
భక్తిలో మునుగంగ పరమాత్ముడొక్కడే,
          పోతన్న జూపించె ముక్తి పథము.
మేనిపూతగ జేరి మెండు మరకలయ్యె
          భస్మరేఖల వంటి వనుచు తెలిపి..
భక్తి గలిగి, మంచి భావన పెంచుచు,
దైవ కృపకు పాత్రత బడయంగ,
విష్ణు శివుల మధ్య వేఱు భావము జూప
బోకుమనుచు మనకు బోధ చేసె.
*     *     *     *     *
4. సుబ్బారావు

ంద్రింబు బోలు ప్రన్నుడ
నాగ శయనుడు విష్ణువు యాగ భోక్త
గంగ పుత్రున కిష్టుడు కైటభారి

 భస్మ ధారుని చెలికాడు భవ్య మూర్తి
*     *     *     *     *
5. చంద్రమౌళి
పంచమాత్రాగణయుక్త చౌపది -
పరమాత్ముడే విష్ణు చంద్రసోదరివిభుడు
వరనాగశయనుఢే కృష్ణుడతడు
సురులు మునులెల్ల వర మడుగంగ శిష్టులను
కరుణించె రిపుల ్ముగ
జేసి
(దీనికి నేమాని వారి పద్యానుకృతి)
సరసిజాక్షుడు చంద్రసోదరికి విభుడు
నాగశయనుండు శౌరి జనార్దనుండు
సురలు వరమడుగంగ కృష్ణుడయి వెలసి
భస్మ మొనరించె దానవ వ్రాతములను.
*     *     *     *     *
6. సహదేవుడు
సూర్యచంద్రనేత్ర! శుభనామ! భవనాశ!
సాగరమునఁదేలు నాగశయన!
నీదు పాదగంగ నాదు జీవనగంగ
పద్మనాభ! స్మరణ వదల నెపుడు.
*     *     *     *     *
7. గుండు మధుసూదన్
యదు కులాబ్ధి చంద్ర! యవనారి! గోపాల!
పాద జనిత గంగ! వాసుదేవ!
నగధర! వ్రజ మోహనా! గరుడ గమన!
శౌరి! పద్మనాభ! స్మర జనయిత!
*     *     *     *     *
8. కమనీయం
యదుకులాబ్ధిచంద్ర! యమునాతటవిహారి!
నందగోపబాల! నాగశయన!
భస్మధారిమిత్ర! భక్తిలోమునుగంగ
మాకు మోక్ష మిచ్చు మావిభుడవు. 

21 కామెంట్‌లు:

  1. naaga shayana pEruku nallanayya
    chandra kaaMtula miMcheDu challanayya
    bhasma maayenu maa paapa paMkilammu
    baala krushNuda munugaMga bhakti lOna.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ దత్తపది చాలా బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం.. నా సవరణతో మీ పద్యాన్ని పైన చూడండి....

    రిప్లయితొలగించండి
  3. యదుకులాంభోధి చంద్ర! దేవాధిదేవ!
    భక్తి చెలగంగ నీ పదాబ్జములు గొలుతు
    నందనందనా! గతివీవె నాకు కృష్ణ!
    భస్మ మొనరింపుమా హృత్స్థ వైరితతిని

    రిప్లయితొలగించండి
  4. ముడివేసి ముడిచిన ముత్యంపు దండయో....
    శశిధరు తలపైని చంద్రవంక!
    మెడలోన ధరియించు మెరుపుల హారాలు..
    నాగభూషణు బోలు నగలు గాదె!
    భక్తిలో మునుగంగ పరమాత్ముడొక్కడే,
    పోతన్న జూపించె ముక్తి పథము.
    వంటి పూతగ జేరి మంటి మఱకలయ్యె
    భస్మరేఖల వంటి వనుచు తెలిపి..

    భక్తి గలిగి, మంచి భావన పెంచుచు,
    దైవ కృపకు పాత్రత బడయంగ,
    విష్ణు శివుల మధ్య వేఱు భావము జూప
    బోకుమనుచు మనకు బోధ చేసె.

    రిప్లయితొలగించండి
  5. చంద్ర బింబము బోలిన నంద గాడు
    నాగ శయనుడు విష్ణువు యాగ భోక్త
    గంగ పుత్రుని కిష్టుడు కన్న గాడు
    భస్మ ధారుని చెలి కాడు భవ్య మూర్తి

    రిప్లయితొలగించండి
  6. పరమాత్ముడే విష్ణు చంద్రసోదరివిభుడు
    వరనాగశయనుఢే కృష్ణుడతడు
    సురులుమునులెల్ల వరమడుగంగ శిష్టులను
    కరుణించె రిపులభస్మంబుజేసి

    ఇది పంచమాత్రాగణయుక్త చౌపది.

    రిప్లయితొలగించండి
  7. శివమాధవేకత్వమును ధ్వనించే లక్షీదేవిగారి దత్తపదపూరణ భావం మననీయం.

    రిప్లయితొలగించండి
  8. ఈ రోజు మిత్రుల పద్యములు చాలా భక్తిభావముతో నలరారుచున్నవి.
    అందరికీ అభినందనలు.

    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు వేగముగ స్పందించేరు. పద్యము చాల బాగున్నది. శ్రీ శంకరయ్య గారు కొద్దిగా మార్పులు చేసేరు. భక్తిలో మునుగంగా హాయిగా నుంటుంది కదా. స్వస్తి.

    2. మీ హరి హర సామాన్య భక్తి వైభవము అభినందనీయము.
    -- నాగభూషణు బోలు కి బదులుగా నాగరాజుల బోలు అనుచో, మరియు
    -- వంటిపూత (ఒడలిపూత) అనే పాదమునకు బదులుగా : మేనిపూతగ జేరి మెండు మరకలయ్యె అంటే బాగుంటుంది.
    స్వస్తి.

    3. శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము బాగున్నది. చంద్రబింబము బోలిన నందగాడు. ప్రాసయతి వేసేరనుకొంటాను. యతిని సరిచేయాలి. ఇందుబింబంబునుం బోలు నందగాడు అంటే సరి. కన్నగాడు అనే ప్రయోగము బాగులేదు. కైటభారి అనండి.
    స్వస్తి.

    4.శ్రీ చంద్రమోహన్ గారు. మీ పద్యము బాగున్నది. అయితే ఏ ఛందస్సో తెలియుటలేదు. తేటగీతిలో ఈ విధముగా మార్చేను.
    సరసిజాక్షుడు చంద్రసోదరికి విభుడు
    నాగశయనుండు శౌరి జనార్దనుండు
    సురలు వరమడుగంగ కృష్ణుడయి వెలసి
    భస్మ మొనరించె దానవ వ్రాతములను.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా ఛంద్రమౌళి గారు:
    మీ పద్యము పంచమాత్రల చౌపది అని మీరు వ్రాయుటను ముందుగా గమనించలేదు. పొరపాటే. బాగున్నది మీ పద్యము.

    రిప్లయితొలగించండి
  10. సూర్యచంద్రనేత్రశుభనామ భవనాశ
    నాగశయనపద్మనయనదేవ
    నీదుపాదగంగనాదుజీవనగంగ
    పద్మనాభ స్మరింతుబాగుఁజూడు

    రిప్లయితొలగించండి
  11. అయ్యా,
    మీ సవరణలు చక్కగా నున్నవి. ధన్యవాదములు. ఆ విధముగా మార్చి ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి పూరణము......

    యదు కులాబ్ధి చంద్ర! యవనారి! గోపాల!
    పాద జనిత గంగ! వాసుదేవ!
    నగధర! వ్రజ మోహనా! గరుడ గమన!
    శౌరి! పద్మనాభ! స్మర జనయిత!

    రిప్లయితొలగించండి
  13. సహదేవుడు గారూ,
    మీ పద్యం నాల్గవపాదంలో గణదోషం. నా సవరణను పైన చూడండి.

    రిప్లయితొలగించండి
  14. నిజానికీ ఉదయమే పోతన మహాశయులు వ్రాసిన ఇలాంటి పద్యాన్ని, భావాన్ని నా బ్లాగులో ఉంచి వచ్చిచూస్తే, అలాంటి ప్రశ్ననే ఇచ్చారు గురువుగారు. ఆ పద్యపు స్ఫూర్తితోనే ఇది వ్రాశాను.

    గురువు గారు,
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా శ్రీ సహదేవుడు గారూ! అభినందనలు.
    మీ పద్యము చాల బాగున్నది. 1వ పాదములో సూర్య చంద్ర నేత్ర అన్నారు. 2వ పాదములో పద్మనయన అన్నారు. ఏదో ఒకటి ఉంచితేనే బాగుంటుంది కదా. ఆలోచించండి. స్వస్తి.

    శ్రీ మధుసూదన్ గారూ! అభినందనలు. మీ పద్యము చాల బాగున్నది. 3వ పాదములో యతి తప్పినది. నగధర! వ్రజమోహనా! గరుడ గమన! "న"కి "గ"కి యతి వేసేరు. సరిగా మీరు గమనించలేదు. మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని వారూ,
    నా కోరికను మన్నించి మిత్రుల పూరణల, పద్యాల గుణదోష విచారణ చేస్తున్నందుకు కృతజ్ఞుడను. ధన్యవాదాలు.
    మధుసూదన్ గారి పద్యంలో న - నా లకు యతి కూర్చారు.అది ఆటవెలది.

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యులకు, శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు. ఉదయం నెట్ సరిగా పని చేయలేదు.కార్యాలయమునకు వెళ్ళు హడావుడి లో అలా వ్రాశాను. 'నాగ శయనుడా అని వ్రాద్దామనుకున్నాను. ఇంకా మెరుగైన సవరణ చేసిన మాస్టారు గారికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  18. గురువర్యులిరువురకు వందనములు.తమరి సవరణ,సూచనలకు ధన్యవాదములు.
    సవరించిన పద్యం:

    సూర్య చంద్ర నేత్ర! శుభనామ!భవనాశ!
    సాగరమునఁదేలు నాగశయన!
    నీదు పాద గంగ నాదుజీవనగంగ!
    పద్మనాభ! స్మరణ వదల నెపుడు

    రిప్లయితొలగించండి
  19. యదుకులాబ్ధిచంద్ర
    యమునాతటవిహారి
    నందగోపబాల
    నాగశయన
    భస్మధారిమిత్ర
    భక్తిలోమునుగంగ
    మాకుమోక్షమిచ్చుమహితాత్ముడవునీవు.










    యదుకులాబ్ధిచంద్ర
    యమునాతటవిహారి
    నందగోపబాల
    నాగశయన
    భస్మధారిమిత్ర
    భక్తిలోమునుగంగ
    మాకుమోక్షమిచ్చుమహితాత్ముడవునీవు.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా డా. కమనీయం గారు! నమస్కృతులు.
    మీ పద్యములో భావము ధారాశుద్ధి చాలా బాగున్నవి. అభినందనలు. 4వ పాదములో కూడా చివరి 2 ఇంద్ర గణములు వేసేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. మమస్తే,పండితనేమానిగారూ,మీసవరణకుధన్యవాదాలు.సరిగాచూసుకోలేదు.తప్పే.నాల్గవపాదాన్నీలాసవరిస్తున్నాను.మాకుమోక్షమివ్వు
    మహిమతోడ.దీనికితోడుకంప్యూటర్తోసమస్యలుకూడా
    ఉన్నాయి.-కమనీయం.

    రిప్లయితొలగించండి